padukas
-
నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడింది. ఈలోపు శ్రీరామ పాదుకా యాత్రలో భాగంగా దేశ వ్యాప్తంగా రాముడు నడిచిన మార్గాలమీదుగా పూజలందుకుంటూ శ్రీరామ పాదుకలు మంగళవారం అయోధ్యకు చేరుకోనున్నాయి. 9 కిలోల బరువున్న ఈ పాదుకల కోసం 8 కిలోల వెండి వాడారు. కిలో బంగారంతో పాదుకలకు తాపడం చేశారు. హైదరాబాద్కు చెందిన అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి ఈ పాదుకలను తయారు చేయించారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఈ పాదుకలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు. -
నేడు నగరానికి వాసవీమాత పాదుకలు
అనంతపురం కల్చరల్ : వైశ్య పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్ట కానున్న వాసవీమాత పాదుకలు శనివారం నగరానికి వస్తాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోపా మచ్చా నరసింహులు తెలిపారు. శుక్రవారం అమ్మవారి శాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శనివారం ఉదయం 8 గంటలకు అమ్మవారి పాదులను రాజురోడ్డులోని వైశ్య హాస్టల్ నుంచి కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకు వస్తామన్నారు. అనంతరం రెండు టన్నుల బరువుతో తయారైన పంచలోహ విగ్రహానికి ఆలయంలో క్షీరాభిషేకాలు జరుగుతాయన్నారు.