Coin
-
రామ్‌ల్లా వెండి నాణెం విడుదల.. ధర ఎంతంటే..
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యాక రామ్‌లల్లాను దర్శించుకునేందుకు వేలాదిగా భకులు తరలివస్తున్నారు. వీరు ఇక్కడి వస్తువులను కొనుగోలు చేసి, తమతో పాటు తీసుకువెళుతున్నారు. అయోధ్యకు వచ్చి రామ్‌లల్లా దర్శనం చేసుకోలేని వారు ఆన్లైన్లో ప్రసాదాన్ని తెప్పించుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం 50 గ్రాముల అయోధ్య రామాలయ వెండి నాణేలను ప్రజలకు విక్రయించేందుకు విడుదల చేసింది. ఈ నాణెం ధర రూ. 5,860. 50 గ్రాముల బరువున్న ఈ నాణెం 999 స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. దీన్ని ఎస్‌పీఎంసీఐసీఎల్‌ఐ వెబ్సైట్ నుండి ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. ఈ నాణెంలో ఒక వైపు రామ్ లల్లా విగ్రహం, మరొక వైపు రామాలయ దృశ్యం కనిపిస్తాయి. ఆలయంలోని రామ్‌లల్లా విగ్రహాన్ని శిల్పి అరుణ్ యోగి రాజ్ రూపొందించారు. దీనిని ఇంటిలోని పూజా మందిరంలో ఉంచవచ్చని, లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చని ట్రస్ట్ తెలిపింది. ప్రధాని మోదీ గత జనవరి 22న అయోధ్య రామాలయంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యకమం జరగుతుండగా ఆర్మీ హెలికాప్టర్లు ఆలయంపై పూలవర్షం కురిపించాయి. ఆరోజు మొదలుకొని అయోధ్యలో సందడి కొనసాగుతోంది. -
శ్రీరాముని గుర్తుగా అక్బర్ ఏం చేశాడు?
ఆదర్శ పురుషునిగా పేరొందిన శ్రీరామునిపై మొఘల్ చక్రవర్తి అక్బర్ తన భక్తిని చాటుకున్నాడని చరిత్ర చెబుతోంది. శ్రీరాముని నాణాన్ని రూపొందించడమే కాకుండా పర్షియన్ భాషలోకి రామాయణాన్ని అనువదింపజేశాడు. మొఘలుల కాలంలో అక్బర్ చక్రవర్తిపై రాముని ప్రభావం అధికంగా ఉంది. నాటికాలంలో అక్బర్ ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీ ప్యాలెస్‌లో ఎర్ర ఇసుకరాయిపై శ్రీరాముని ఆస్థానం చెక్కించాడు. అక్బర్ తల్లి హమీదా బాను బేగం ఉండే మరియమ్ మహల్లో ఒక స్తంభంపై శ్రీరాముని ఆస్థానంతోపాటు, హనుమంతుని చిత్రం కనిపిస్తుంది. అక్బర్ తల్లి హమీదా బాను బేగం రామాయణ, మహాభారత ఇతిహాసాలను అమితంగా ఇష్టపడేవారని అందుకే ఆమె నివాసభవనంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుని చిత్రాలు కనిపిస్తాయని మాజీ ఏఎస్ఐ డైరెక్టర్, పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ కేకే ముహమ్మద్ తెలిపారు. తన తల్లి ఆసక్తిని గమనించిన అక్బర్ రామాయణం, మహాభారతాలను పర్షియన్ భాషలోకి అనువదింపజేశారని చరిత్ర చెబుతోంది. అక్బర్ తల్లి నివాస భవనంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్న పెయింటింగ్ కూడా కనిపిస్తుంది. -
బొమ్మా? బొరుసా? నిర్ణయించండిలా..!
క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా గెలుస్తుందా లేదా? వర్షం వస్తుందా రాదా? పేకలో జోకర్ మనకే పడుతుందా? అన్నీ అనుమానాలే! ఏమో.. కచ్చితంగా కావచ్చు.. కాకపోవచ్చు. కానీ దాన్ని తేల్చుకోవాలంటే కాయిన్‌ను పైకి వేసి ఏదో ఓ వైపు ఎంచుకుంటాం.. ఫలితం మనకు అనుకూలంగా వస్తే కొంత ఆనందాన్ని పొందుతుంటాం. అయితే కాయిన్ పైకి వేసినపుడు ఫలితం మనకూ, పోటీదారులకు అనుకూలంగా వచ్చే అవకాశం సమానంగా ఉంటుందని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ అది తప్పని కొన్ని పరిశోధనలు తేలుస్తున్నాయి. ఆమ్స్ట్రడమ్లో 48 మంది పరిశోధకులు 46 వివిధ కాయిన్లతో చేసిన ప్రయోగం సారాశం ప్రకారం..గాలిలో ఎగరేసిన కాయిన్‌పై బొమ్మా-బొరుసులు రావడానికి 50-50ఛాన్స్ ఉండదు. కాయిన్‌లోని బొమ్మని పైకి ఉంచి టాస్ వేస్తే అది గాల్లోకి వెళ్లి కిందకు చేరి తిరిగి బొమ్మపడే అవకాశం 51శాతం ఉందని తేలింది. దాదాపు 3లక్షల 50వేల సార్లు కాయిన్ గాల్లో ఎగరేసి ఈ ప్రయోగాన్ని చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. (ఇదీ చదవండి: అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా) ఇదిలా ఉండగా.. స్లాక్మార్కెట్లో పెట్టుబడులు అంతర్జాతీయ బౌగోళిక వ్యవహారాలు, కంపెనీ వ్యాపార స్వరూపం, అది విడుదల చేసేఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు యాజమాన్యం తీసుకుంటున్న అనేక అంశాలపై ఆధారపడి పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. గాల్లోకి విసిరిన కాయిన్ ఫలితం మనకు అనుకూలంగా రావొచ్చు..రాకపోవచ్చు. అదేవిధంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారి పెట్టుబడులకు రాబడులు రావొచ్చు..రాకపోవచ్చు. కంపెనీ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని పెట్టుబడులు పెడితే ఫలితం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
ప్రపంచంలోనే ఖరీదైన కాయిన్.. కిలోలకొద్దీ బంగారం, వజ్రాలు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!
World's Most Expensive Coin: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాయిన్‌ను బ్రిటన్‌లో ఆవిష్కరించారు. దివంగత క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth 2) గౌరవార్థం ఈ నాణేన్ని రూపొందించారు. ఇది అన్ని కాలాలలో అత్యంత విలువైనదని భావిస్తున్నారు. దాదాపు 4 కిలోల బంగారం (Gold), 6,400 కంటే ఎక్కువ వజ్రాలతో (Diamonds) తయారు చేసిన ఈ నాణెం విలువ సుమారు 23 మిలియన్ డాలర్లు (రూ.192 కోట్లు) అని సీఎన్ఎన్ వార్తా సంస్థ నివేదించింది. (Birmingham bankrupt: బ్రిటన్‌లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!) లగ్జరీ లైఫ్ స్టైల్ బ్రాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన ఈ నాణేన్ని క్వీన్ ఎలిజబెత్-2 మొదటి వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. కామన్వెల్త్ దేశాల్లోని హస్తకళాకారులు 16 నెలలపాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. దీన్ని మరింత ఘనంగా రూపొంచాలనుకున్నా వజ్రాల కొరత కారణంగా సాధ్యం కాలేదు. స్కై న్యూస్ ప్రకారం.. 9.6 అంగుళాల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన ఈ నాణెం బాస్కెట్‌బాల్ పరిమాణంలో ఉంది. దీనిపై ప్రఖ్యాత పోర్ట్రెయిట్ కళాకారులు మేరీ గిల్లిక్, ఆర్నాల్డ్ మచిన్, రాఫెల్ మక్లౌఫ్, ఇయాన్ ర్యాంక్-బ్రాడ్లీలు దివంగత చక్రవర్తి చిత్రాలను తీర్చిదిద్దారు. దీని మధ్య భాగంలో అమర్చిన నాణెం 2 పౌండ్లపైగా బరువుంటుంది. చుట్టూ ఉన్న చిన్న నాణేలు ఒక్కొక్కటి ఒక ఔన్స్ బరువు కలిగి ఉంటాయి. నాణెం అంచుల్లో క్వీన్ సూక్తులను ముద్రించారు. 2021 జూన్ లో సోథెబైస్ న్యూయార్క్‌లో 18.9 మిలియన్ డాలర్లు పలికిన అరుదైన 1933 యూఎస్ "డబుల్ ఈగిల్" నాణెమే ఇప్పటి వరకు వేలంలో విక్రయించిన అత్యంత ఖరీదైనది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్ట్‌లో నమోదైంది. Introducing The Crown – a once in a lifetime tribute to The Queen An extraordinary tribute coin created to commemorate the enduring legacy of Her Majesty Queen Elizabeth II. We invite you to view the piece and the making of in more detail on our website. pic.twitter.com/SiZXjfvjPB — The East India Company (@TheEastIndia) September 7, 2023 -
చిరస్మరణీయుడు
సాక్షి, న్యూఢిల్లీ: తన అసాధారణ వ్యక్తిత్వంతో దివంగత ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. రామాయణ, మహాభారతంలోని పాత్రలకు ప్రాణం పోసి భారతీయ సినిమా, సంస్కృతిని సుసంపన్నం చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్‌పై రూపొందించిన రూ.100 స్మారక నాణెంను ఆమె విడుదల చేసి మాట్లాడారు. రిక్షా దిగి నేలకు నమస్కారం.. ‘ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం ముద్రించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముందుకు తీసుకెళ్లారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు. ఓ గొప్ప వారసత్వానికి ఆమె వారసురాలు. ఎన్టీఆర్ తెలుగు సహా పలు భారతీయ భాషల్లో తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఎన్టీఆర్ గురించి నా దృష్టికి వచ్చిన ఓ ఘటనను గుర్తు చేసుకుంటున్నా. 70వ దశకంలో ఓ పెద్దావిడ తన కుమార్తెను చూసేందుకు మద్రాసు వెళ్లారు. అనంతరం మనవరాలితో కలసి రిక్షాలో వెళ్తుండగా ఓ వీధిలో జనం గుమి గూడటాన్ని చూశారు. ఆ వీధిలో ఎన్టీఆర్ ఉంటారని మనవరాలు చెప్పడంలో ఆమె వెంటనే రిక్షా దిగి భూమికి నమస్కరించారు. ఎన్టీఆర్ గురించి ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. సామాన్యుల బాధను కూడా ఆయన తన నటనతో తెలియజేశారు. మనుషులంతా ఒక్కటే సినిమా ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం సందేశాన్ని చాటి చెప్పారు. నటుడు, ప్రజా సేవకుడు, నాయకుడు ఇలా అన్నింటా ఆయన ప్రజాదరణ పొందారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు నేటికీ గుర్తుంటాయి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. అన్ని తరాలకు ఆదర్శ హీరో: పురందేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్ ఒక్క తరానికి మాత్రమే కాకుండా అన్ని తరాలకు ఆదర్శ హీరో అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెప్పారు. సినీ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక ముద్రతోపాటు మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. నేటి నుంచి మూడు చోట్ల విక్రయాలు ఎన్టీఆర్ స్మారక నాణెం మంగళవారం నుంచి హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని మింట్ అధికారులు తెలిపారు. ఓ వ్యక్తి స్మారకార్ధం నాణెం హైదరాబాద్‌లో రూపొందించడం ఇదే తొలిసారని హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు చెప్పారు. నాణెం తయారీలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ వినియోగించామన్నారు. రూ.100 నాణెం అయినప్పటికీ దీని ధర రూ.3,500 నుంచి రూ.4,850 వరకు ఉండవచ్చన్నారు. ప్యాకింగ్ మెటిరియల్‌ను బట్టి ధర వేర్వేరుగా ఉంటుందన్నారు. స్మారక నాణెం కాబట్టి చెలామణీలో ఉండదని స్పష్టం చేశారు. తొలి విడతలో 12 వేల నాణేలను రూపొందించామని, 50 వేల నాణేల వరకు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్, చర్లపల్లి మింట్, మింట్ మ్యూజియం వద్ద విక్రయాలు నిర్వహిస్తామని తెలిపారు. జీవిత విశేషాలతో వీడియో.. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన 20 నిమిషాల వీడియోను రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ప్రదర్శించారు. స్మారక నాణెం విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, నందమూరి కుటుంబ సభ్యులు, ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని, సీఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అసలు విలన్ పురంధరేశ్వరి: లక్ష్మీపార్వతి
సాక్షి, అమరావతి: దివంగత నందమూరి తారకరామారావు పేరు మీద 100 రూపాయల స్మారక నాణేం విడుదల కార్యక్రమంపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఆహ్వానం అందించకపోవంపై ఇదివరకే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి, ప్రధాని, ఆర్థిక మంత్రికి సైతం లేఖ రాశారు. ఈ క్రమంలో ఇవాళ్టి కార్యక్రమంపై తాజాగా ఆమె అసంతృప్తి లేఖను విడుదల చేశారు. అంతేకాదు ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపైనా ఆమె ఆగ్రహాం వ్యక్తం చేస్తూ.. మీడియా ముందుకు వచ్చారు. ‘‘ఎన్టీఆర్ పేరుతో వంద రూపాయిల నాణం విడుదల చేయడం సంతోషంగా ఉంది. కానీ, నాకు ఆహ్వానం అందించకపోవడం, నన్ను పిలవకపోవడం బాధగా అనిపిస్తోంది. రాష్ట్రపతికి, ప్రధానికి, ఆర్థికమంత్రి కి లేఖ రాశాను.ప్రభుత్వమే నిర్వహిస్తే భార్యగా నన్ను పిలవకపోడం తప్పు. ఇన్విటేషన్ చూస్తే ప్రైవేటు ఫంక్షన్ కి రాష్ట్రపతి గెస్ట్ గా వెళ్తున్నట్టు ఉంది. ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపవడం అన్యాయం. ఆయన ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారు. భార్యగా నాణెం అందుకోడానికి అర్హత నాకే ఉంది.. వీళ్లకు లేదు. ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు వెళ్లారు?’’ అని సూటిగా నిలదీశారామె. పురంధేశ్వరిపై ధ్వజం ఇక నుంచి తన పోరాటం పురంధేశ్వరిపైనేనని లక్ష్మీ పార్వతి ప్రకటించారు. ‘‘ఎన్టీఆర్ కి అర్ధాంగిగా నన్ను ఆహ్వానించకపోవడం దుర్మార్గం. తండ్రికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులా కుటుంబ సభ్యులగా చెలామణీ అవుతారా?. పురంధేశ్వరి ఎంతో దుర్మార్గురాలు. నా వల్ల మీకు జరిగిన నష్టం ఏమిటి. ఎన్టీఆర్ కొడుకులు అమాయకులు. కూతుళ్లు పురందేశ్వరి, భువనేశ్వరులే దుర్మార్గులు. పురంధేశ్వరి చంద్రబాబుతో కలిసి కుట్ర చేస్తోంది. పురంధేశ్వరి తిరిగిన ప్రతీనియోజకవర్గంలో తిరుగుతా. ఒక్క సీటు కూడా ప్రచారం చేస్తా. వీళ్ళ గురించి ntr ఏమన్నారో ప్రజలకు వివరిస్తా. ఎన్నాళ్ళు వీళ్ళ నుండి అవమానాలు పడుతూ ఉండాలి. పురంధరేశ్వరి కి నేను ఏమి అడ్డం వచ్చాను.. అయన కష్టాల్లో ఉంటే పురంధరేశ్వరి వచ్చిందా..?. నన్నెందుకు చులకన చేస్తున్నారు.. నన్ను చులకన చేస్తే NTR ను చేసినట్టే. NTR ను చంద్రబాబు బయటకి వెన్నుపోటు కు ఇంటర్నల్ గా పురంధరేశ్వరి ప్రధాన కారకురాలు. పురంధేశ్వరి రాజకీయాల్లోకి వద్దు అన్నారని NTR పై కుట్ర చేసింది. తండ్రిపై కోపంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. కేంద్ర మంత్రిగా ఉండి అవినీతి చేసింది పురంధరేశ్వరి. ‘‘నాకు జరిగిన అవమానం నీకు ఏదో ఒక రోజు వస్తుంది. ఈరోజు నుంచి నా పోరాటం నీమీదే’’ అని పురందేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి కుట్రలు.. నాకు జరిగిన అవమానం నా భర్త ఎన్టీఆర్‌కు అవమానంగా భావిస్తాను. NTR నన్ను వివాహం చేసుకున్నారో లేదో.. అయన పిల్లలు సమాధానం చెప్పాలి. నన్ను పిలవకుండా పురంధరేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారు. NTR భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా.?. NTR తో వివాహం అయినట్టు ఫోటోలు, వార్తా కధనాలు ఉన్నాయి. సాక్షాత్తు ntr అనేకసార్లు బహిరంగంగా చెప్పారు. నన్ను పెళ్ళి చేసుకోలేదని అని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. NTR యుగ పురుషుడు అంటున్నారు.. పెళ్లి చేసుకోకపోతే యుగ పురుషుడు అవుతాడా..?. ఇంతకాలం ntr కుటుంబంపై అభిమానంతో సైలెంట్ గా ఉన్నాను. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టను.. చంద్రబాబు, పురంధరేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతా. వచ్చే ఎన్నికల తరువాత వీళ్ళు రాజకీయాల్లో ఉండకుండా చేస్తా. పురంధేశ్వరి టీడీపీ ఏజెంట్ ఎన్నికల సమయంలో ntr ను వాడుకుంటున్నారు. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుంది. భువనేశ్వరి, పురంధరేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు.. మళ్లీ పురంధేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారు. కానీ, నాకంటే ఎక్కువ అవమానానికి పురంధరేశ్వరి గురవుతారు. ఎన్టీఆర్‌కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారు. పురంధేశ్వరి బిజెపి లో ఉంటూ టిడిపికి పనిచేయడమేంటి?. బిజెపికి చెబుతున్నా...పురందేశ్వరి టిడిపి ఏజెంట్ గా పనిచేస్తోంది...పురందేశ్వరి కుట్రలు అర్ధం చేసుకోవాలని బీజేపీని కోరుతున్నా. జూనియర్‌ను బాబుతో కలపాలని.. జూ ఎన్టీఆర్ కు ఆహ్వానం ఇచ్చారో లేదో నాకు తెలీదు. జూ ఎన్టీఆర్ వస్తే అక్కడ చంద్రబాబు, జూ ఎన్టీఆర్ ను కలపాలని ప్రయత్నం చేసింది. ప్రభుత్వ ఇన్విటేషన్ అయితే జూ ఎన్టీఆర్ హాజరు అయ్యేవారు. ప్రైవేటు ఫంక్షన్ కనుకే జూ ఎన్టీఆర్ హాజరుకాలేదు. పురంధరేశ్వరి కుట్రను బీజేపీ తెలుసుకోవాలని మరోసారి కోరుతున్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ పురంధరేశ్వరి చదువుతుంది. సీఎం వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా భయంకర కుట్రలు చేస్తున్నారు. నేను రాసిన లేఖలను సమాధానం రాలేదు. అందుకే ఢిల్లీ వెళ్తాను.. ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్ లను కలుస్తా అని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. -
ఎన్టీఆర్ రూ. 100 స్మారక నాణేం విడుదల
సాక్షి, ఢిల్లీ: తెలుగు చలన చిత్ర పరిశ్రమ నట దిగ్గజం, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. దివంగత నందమూరి తారకరామారావు పేరిట రూ.100 స్మారణ నాణేం విడుదల అయ్యింది. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని.. సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవల గుర్తింపుగా నాణేం విడుదల చేశారు. ఎన్టీఆర్ వంద రూపాయల స్మారక నాణెం విడుదల చేసిన అనంతరం రాష్ట్రపతి దౌపది ముర్ము మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్‌గారు రామాయణ ,మహాభారతాలకు అనేక పాత్రలలో ఎన్టీఆర్ జీవించారు. మనుషులంతా ఒక్కటే అనే సందేశాన్ని తమ సినిమాల్లో ఇచ్చారు. రాజకీయాలలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ఆహ్వానం ఉన్నప్పటికీ సినిమా షూటింగ్ కారణంగా మనవడు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారు. -
మీకు రూ.75 కాయిన్ కావాలా అయితే సింపుల్ గా ఇలాచేయండి..!
-
రూ 75 నాణెం వచ్చేస్తుంది
-
రూ.75 నాణెం విడుదల.. కొత్త కాయిన్ ఇలా పొందండి..
Rs 75 coin: భారత పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (మే 28) 75 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ కాయిన్‌ను విడుదల గురించి మొదటగా గురువారం (మే 25) విడుదల చేసిన నోటిఫికేషన్లో కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా 75 రూపాయల స్మారక నాణేన్ని టంకశాలలో తయారు చేస్తున్నట్లు తెలిపింది. కొత్త కాయిన్ ఎక్కడ లభిస్తుంది? ప్రత్యేక సందర్భాల్లో వివిధ డినామినేషన్లలో విడుదల చేసే కాయిన్లు, స్మారక నాణేలు నేరుగా చలామణిలోకి రావు. ఇవి చలామణి కోసం ఉద్దేశించినవి కావు. ఈ స్మారక నాణేలు కావాలంటే సెక్యూరిటీస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ దానికి సంబంధించి పేర్కొన్న ధరను చెల్లించి ఆ కాయిన్లు పొందవచ్చు. అటువంటి నాణేలు కేవలం సేకరించదగినవిగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వాటి విలువ వాటి ముఖ విలువకు సమానంగా ఉండకపోవచ్చు. వాటిని వెండి లేదా బంగారం వంటి విలువైన లోహాలతో తయారు చేస్తారు. తాజా విడుదల చేసిన రూ.75 స్మారక నాణెంలో కూడా 50 శాతం వెండి లోహం ఉంది. 2018లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం 100 రూపాయల స్మారక నాణాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. సెక్యూరిటీస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) వెబ్సైట్లో రూ.5,717కు అందుబాటులో ఉంది. ఈ నాణెంలో 50 శాతం వెండి, మిగిలినవి ఇతర లోహాలు ఉన్నాయి. ప్రముఖ వ్యక్తులకు నివాళులు అర్పించడం, ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించడం లేదా కీలకమైన చారిత్రక సంఘటనలకు గుర్తుకు దేశంలో 1960ల నుంచి స్మారక నాణేలను విడుదల చూస్తున్నారు. Hon'ble Prime Minister Shri @narendramodi releases the commemorative Rs 75 coin in the new Parliament during the inauguration ceremony. #MyParliamentMyPride pic.twitter.com/BpFmPTS5sT — NSitharamanOffice (@nsitharamanoffc) May 28, 2023 ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్ డెడ్‌లైన్: ఖాతాదారులకు బ్యాంకుల అలర్ట్.. -
రూ 75 నాణెం విడుదల చేయనున్న కేంద్రం
-
పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా..
ఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మే 28వ తేదీన (ఆదివారం) ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభిస్తారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణను సంతరింపజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ భావించింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ. 75 ప్రత్యేక నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ప్రతిబింబించేలానూ ఈ నాణేం ఉండనుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నాణేనికి ఒక వైపు నాలుగు సింహాల అశోక స్థూపం.. క్రింద సత్యమేవ జయతే అని ఉండనుంది. అలాగే.. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అని, కుడి వైపున ఆంగ్లంలో భారత్ అనే పదం చేర్చారు. నాణేనికి రెండో వైపు పార్లమెంట్ బొమ్మతో పాటు ఎగువ అంచున దేవనాగరి లిపిలో సంసద్ సంకుల్ అని, దిగువన ఆంగ్లంలో పార్లమెంట్ కాంప్లెక్స్ అనే పదాలు రాసి ఉంటాయి. 44 మిల్లీమీటర్ల వ్యాసంతో వృత్తాకారంలో ఉండబోయే నాణేం.. 50% వెండి, 40% రాగి, 5% నికెల్ మరియు 5% జింక్‌తో తయారు చేశారు. Ministry of Finance to launch a special Rs 75 coin to commemorate the inauguration of the new Parliament building on 28th May. pic.twitter.com/NWnj3NFGai — ANI (@ANI) May 26, 2023 -
రూ.100 కాయిన్ విడుదల చేయనున్న కేంద్రం.. మనం వినియోగించవచ్చా?
ఇప్పటి వరకు మనం రూ. 1,2,5,10, 20 కాయిన్స్ చూశాం. వాటిని వినియోగించాం. అయితే త్వరలో భారత మార్కెట్లో రూ.100 నాణేలు విడుదల కానున్నాయి. ఈ కొత్త కాయిన్ వినియోగంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రధాని మోదీ 2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల చివరి ఆదివారంలో ఆల్ ఇండియా రేడియలో మోదీ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 99 కార్యక్రమాలు పూర్తికాగా.. 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 నాణేలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రూ.100 కాయిన్ విడుదలపై కేంద్ర ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ వంద రూపాయిల నాణెం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారైంది. ఈ విలువైన నాణెం కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 ఎపిసోడ్ మన్‌కీ బాత్ కార్యక్రమంలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. రూ.100 కాయిన్‌ను వినియోగించుకోవచ్చా? ఏప్రిల్ 30న జరిగే మన్‌కీ బాత్ 100 ఏపీసోడ్ సందర్భంగా రూ.100 కాయిన్‌ను కేంద్రం విడుదల చేయనుంది. విడుదల అనంతరం దీనిని సాధారణ కాయిన్లాగా వినియోగించేందుకు వీలు లేదు. కేవలం ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఉపయోగించుకునే వెసలు బాటు కల్పించింది కేంద్రం. రూ.100 కాయిన్ ప్రత్యేకతలు కేంద్రం ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన మేరకు.. రూ.1, 2,10,20 నాణెల కంటే విభిన్నంగా ఉండనుంది. కాయిన్ 44 మిల్లీమీటర్ డయారీ మీటర్లో గుండ్రంగా ఉంటుంది. ఇందులో 35 గ్రాముల ఇనుము, వెండి 50శాతం,రాగి 40 శాతం, నికెల్ 5శాతం, జింక్ శాతం కలిగి ఉంటుంది. వీటితో పాటు అశోక స్తంభము ముద్ర, మధ్యలో సత్యమేవ జయతే, దేవనగరి భాషలో భారత్ అనే పదాలు కనిపిస్తాయి. ఎడమవైపు ఇంగ్లీష్‌లో ఇండియా అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అదనంగా కాయిన్ మీద రూపాయి చిహ్నం "₹" 100 సంఖ్య ఉండగా.. నాణెం వెనుక భాగంలో మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లోగో, దానిపై '2023' అని రాయబడి ఉంటుంది. చదవండి👉 ట్విటర్ యూజర్లకు శుభవార్త! -
చిన్నారి ఉసురుతీసిన ఐదు రూపాయల కాయిన్..
నల్గొండ (భూదాన్‌పోచంపల్లి) : ఐదు రూపాయల నాణెం ఓ చిన్నారి ప్రాణం తీసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో చిన్నకుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు కాయిన్ మింగగా, అది గొంతులో ఇరుక్కొంది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స చేసి కాయిన్ తొలగించారు. అనంతరం ఇంటికి పంపించారు. అయితే, సోమవారం చైత్ర తీవ్ర అస్వస్థతకు గురై శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా వెంటనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ అయి చిన్నారి మృతి చెందిందని స్థానికులు పేర్కొంటున్నారు. కంటికి రెప్పలా సాకుకొంటున్న చిన్నారి అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం పెను విషాదంలో అలుముకొంది. -
రూ. వెయ్యి కాయిన్ వచ్చిందోచ్..! 40 గ్రాముల వెండితో చేసి..
సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్): పట్టణానికి చెందిన రుద్రంగి గంగాధర్ అనే వ్యక్తి ఆర్బీఐ ద్వారా వెయ్యి రూపాయల కాయిన్ తెప్పించుకున్నాడు. పూరీజగన్నాథ రథయాత్రకు వెయ్యి ఏళ్ళు అయిన సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల పూరీ జగన్నాథుని చిత్రంతో కాయిన్‌ను విడుదల చేసింది. వివిధ రకాల కాలాలకు సంబంధించిన కాయిన్లు, నోట్లు సేకరించే అలవాటు గంగాధర్‌కు ఎప్పటి నుంచో ఉంది. 300 ఏళ్ల నుంచి చలామణిలో ఉన్న కాయిన్లను ఆయన సేకరించారు. ఇందులో భాగంగానే రూ. 8 వేల విలువ చేసే డీడీని ఆర్బీఐ పేరిట చెల్లించి ఆన్లైన్లో వెయ్యి రూపాయల కాయిన్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో 40 గ్రాముల వెండితో తయారు చేసిన కాయిన్ పంపారు. -
శ్వేత దేశపు నాణేంపై నల్ల జాతి మ(తె)గువ
వర్ణ వివక్షకు కేరాఫ్ అయిన అగ్రరాజ్యంలో.. ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి ఓ నల్ల జాతి మగువ ముఖచిత్రంతో అమెరికన్ కాయిన్ విడుదల చేశారు. అమెరికన్ ఉమెన్ క్వార్టర్స్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్రో-అమెరికన్ రైటర్ మయా అంజెలు ముఖచిత్రంతో కాయిన్‌ను విడుదల చేశారు. ఏడేళ్ల వయసులో తల్లి ప్రియుడి చేతిలో అఘాయిత్యానికి గురై.. చావు దెబ్బలు తింది మయా అంజెలు. చివరికి బంధువుల చొరవతో ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారి.. ఆరేళ్లపాటు మూగదానిగా ఉండిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి బయటపడేందుకు ఆ చిన్నవయసు నుంచే అక్షరాల్ని ఆశ్రయించింది. కాలక్రమంలో ఆఫ్రో-అమెరికన్ రచయితగా, జాతి-వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలిగా మయా అంజెలుకు ఒక పేరు దక్కింది. ఉద్వేగంగా సాగే ఆమె రచనలు ప్రముఖులెందరినో ప్రభావితం చేశాయి కూడా. ఆమె ఆత్మకథ I Know Why the Caged Bird Sings ద్వారా ఎన్నో సమస్యల గురించి చర్చించారామె. 1993లో బిల్‌క్లింటన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్వయంగా కవిత వినిపించి.. ఆ అరుదైన గౌరవం అందుకున్న తొలి బ్లాక్ లేడీగా గౌరవం అందుకుంది. తన జీవిత కాలంలో 30కి పైగా అత్యున్నత డాక్టరేట్లు అందుకున్న మయా అంజెలు.. 2010లో అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా ‘స్వేచ్ఛా’ మెడల్‌ను సైతం స్వీకరించింది. 2014లో 86 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది. మయా అంజెలుతో పాటు చైనా సంతతికి చెందిన హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్, అమెరికా తొలి మహిళా వ్యోమగామి సాలీ రైడ్ ముఖ చిత్రాల మీదుగా కూడా కాయిన్స్ రిలీజ్ చేసింది అమెరికా మింట్. -
ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కొని
మైసూరు: కాయిన్ గొంతులో ఇరుక్కుని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలుకాలో ఆయరహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. తాలూకాలోని ఆయురహళ్లి గ్రామానికి చెందిన ఖుషీ (4) తన అవ్వ ఇంటి వద్ద ఆడుకుంటూ తన చేతిలో ఉన్న ఐదు రూపాయల కాయిన్‌ను నోటిలో పెట్టుకుంది. అది పొరపాటును గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. చిన్నారిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. చదవండి: ప్రియుడితో సహజీవనం.. చివరికి ఏం జరిగిందంటే? చదవండి: వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు -
చాక్లెట్ అనుకుని గణేశ్ విగ్రహాన్ని మింగేసింది..
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): చాక్లెట్ అనుకుందో ఏమో ఓ చిన్నారి చిన్నపాటి గణేశ్ విగ్రహాన్ని మింగేసింది. తల్లిదండ్రులు అప్రమత్తం కావడంతో ఆ చిన్నారి ప్రాణపాయం నుంచి తప్పించుకుంది. బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ ప్రాంతంలో ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో చిన్నపాటి వినాయక విగ్రహం కనిపించకపోవడంతో అనుమానం తలెత్తింది. వెంటనే తమ మూడేళ్ల చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎక్సరే తీసి పొట్టలో లోహపు విగ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఎండోస్కోపి ద్వారా చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేకుండా విగ్రహాన్ని బయటికి తీశారు. తల్లిని తరిమేసిన కసాయి మండ్య: ఆస్తి కోసం తన రెండో కుమారుడు దౌర్జన్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని కేఆర్ పేట తాలూకా ఆనేగోళ గ్రామానికి చెందిన కమలమ్మ మీడియా ముందు మొరపెట్టుకుంది. తన భర్త బతికుండగా రెండో కుమారుడు మంజునాథ్‌కు ఇంటి ముందు ఉన్న స్థలాన్ని రాసిచ్చాడని, అయినా ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూడా ఇవ్వాలని దౌర్జన్యం చేసి తనను గెంటేశాడని బోరున విలపించింది. -
ఇది 1950లో వచ్చిన చార్ అణా!
జహీరాబాద్: 1950లో 1/4 నాణెం (చార్ అణా) మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నాణేన్ని మార్కెట్లోకి విడుదల చేశారని, ప్రస్తుతం ఈ నాణేనికి 70 ఏళ్లు నిండాయని దీన్ని సేకరించిన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి చెందిన సంతోష్ కైలాశ్ చెబుతున్నాడు. ఇదే తరువాత కాలంలో పావలా (25 పైసలు)గా రూపాంతరం చెందిందట. ఈయనకు అరుదైన నోట్లు, నాణేలు సేకరించడం హాబీ. చదవండి: సికింద్రాబాద్ ఓ మంచి జ్ఞాపకం.. -
నాన్న ఇచ్చిన నాణెం: కోట్లు కురిపించింది!
మిచిగాన్: లాటరీ గెలుచుకోవాలన్నది ఎంతోమంది కల. జీవితంలో ఒక్కసారైనా దాన్ని గెలుచుకుంటే చాలనుకునేవారు కోట్లల్లో ఉంటారు. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఒక్కసారేంటి, రెండుసార్లు లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అమెరికాలోని మిచిగాన్కు చెందిన మార్క్ క్లార్క్ అనే వ్యక్తి 2017లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా ఆ లాటరీ టికెట్‌ను పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి కానుకగా ఇచ్చిన నాణెంతో గీకి చూడగా ఆ నంబర్ లాటరీ గెలుచుకుంది. దీంతో అక్షరాలా నాలుగు మిలియన్ డాలర్లు(30 కోట్ల రూపాయలు) అతడి సొంతమైంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు సోమవారం ధృవీకరించారు. కాగా అతడు లాటరీ గెలుపొందండం ఇది రెండోసారి కావడం విశేషం. ఇక క్లార్క్ ముందు లాటరీ నిర్వాహకులు రెండు ఆప్షన్లు ప్రవేశపెట్టారు. (చెత్తలో పడేసిన టికెట్.. జీవితాన్నే మార్చేసింది) దీర్ఘ కాలంలో 4 మిలియన్ డాలర్లు తీసుకుంటారా? లేదా తక్షణమే 2.5 మిలియన్ డాలర్లు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. దీనికి అతడు డబ్బులు అందుకోడానికి ఎక్కువ కాలం వేచి చూడలేనంటూ 2.5 మిలియన్ డాలర్లు (18,95,18,750 కోట్ల రూపాయలు) అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ.. "నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా.. కానీ నేను మళ్లీ లాటరీ గెలిచానంటే అందుకు ఈ నాణెం కారణమని భావిస్తున్నా. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఇప్పుడు దశ తిరిగిపోయినట్లు అనిపిస్తోంది" అని పేర్కొన్నాడు. (ఇదీ లక్ అంటే: కోట్లు గెలుచుకున్నాడు!) -
నాణెం మింగిన విద్యార్థిని
అనంతపురం ,గార్లదిన్నె: నోటిలో పెట్టుకున్న రెండు ఐదు రూపాయల నాణేన్ని ఓ విద్యార్థిని పొరపాటున మింగేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 108 సిబ్బంది జయరాజు, శీనానాయక్ తెలిపిన మేరకు... కనంపల్లికి చెందిన తులసి అనే ఐదో తరగతి విద్యార్థిని ఆదివారం ఐదు రూపాయల నాణేన్ని నోటిలో పెట్టుకుని అనుకోకుండా మింగేసింది. సోమవారం కడుపు నొప్పి రావడంతో అప్పుడు తాను మింగిన నాణెం గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు హుటాహుటిన 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అనంతరం తల్లిదండ్రులు పాపకు అరటిపండు తినిపించడంతో మలవిసర్జనలో నాణెం బయటకు వచ్చేసింది. -
వాజ్‌పేయి స్మారకార్థం వంద నాణెం విడుదల చేసిన కేంద్రం
-
వారికి అధికారమే ఆక్సిజన్
న్యూఢిల్లీ /ఖుర్దా(ఒడిశా): కొందరికి రాజకీయ అధికారం ఆక్సిజన్ లాంటిదనీ, అది లేకుండా వాళ్లు బతకలేరని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. విపక్షాలను ఉద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి తన జీవితాంతం విలువలకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. వాజ్‌పేయి 94వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖచిత్రం ఉన్న రూ.100 స్మారక నాణేన్ని మోదీ ఆవిష్కరించారు. వాజ్‌పేయి జీవితం ప్రజలకు అంకితం.. ‘కొందరు వ్యక్తులకు రాజకీయం ఆక్సిజన్‌గా మారింది. అది లేకుంటే వాళ్లు బతకలేరు. కానీ దివంగత వాజ్‌పేయి తన జీవితంలో ఎక్కువకాలం విపక్షంలోనే గడిపారు. కానీ ఆయన ఎప్పుడూ దేశం కోసమే మాట్లాడారు. పార్టీ సిద్ధాంతాల విషయంలో రాజీ పడలేదు. జీవితంలో ప్రతీ క్షణాన్ని ప్రజల సంక్షేమం కోసమే ఆయన వెచ్చించారు. వ్యక్తిగతంగా, పార్టీ కంటే కూడా వాజ్‌పేయి దేశానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన జన్‌సంఘ్‌ను ఏర్పాటు చేశారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయన తన సహచరులతో కలిసి జనతా పార్టీలో చేరారు. అక్కడ కూడా ‘అధికారంలో ఉండటమా? లేకపోతే సిద్ధాంతాలను కాపాడుకోవడమా?’ అన్న ప్రశ్న ఉదయించినప్పుడు ప్రభుత్వం నుంచి బయటికొచ్చి బీజేపీని స్థాపించారు. ఒక్కో ఇటుక పేర్చినట్లు ఆయన పార్టీని నిర్మించారు. ఆయనవల్లే ఈరోజు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది’ అని తెలిపారు. ఒడిశాలో అవినీతి భూతం.. ఒడిశాను అవినీతి భూతం పట్టిపీడిస్తోందనీ, రాష్ట్రంలో కమీషన్లు–వాటాల సంస్కృతి యథేచ్ఛగా సాగుతోందని ప్రధాని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఒడిశాకు భారీగా నిధులు ఇస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం అసమర్థత, అవినీతి కారణంగా రాష్ట్రం ఇంకా వెనుకబడే ఉందని వ్యాఖ్యానించారు. ఒడిశాలో ఐఐటీ–భువనేశ్వర్ నూతన క్యాంపస్‌ను ఆవిష్కరించిన మోదీ, దాదాపు రూ.14,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ..‘కేంద్రం భారీగా నిధులిస్తున్నా, రాష్ట్రం వెనుకపడే ఉంది. స్వచ్ఛభారత్‌లో దేశం 97 శాతం పరిశుభ్రతను సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడమే లేదు. బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా మారడంలో ఒడిశా వెనుకబడింది’ అని అన్నారు. పారాదీప్–హైదరాబాద్ పైప్‌లైన్‌కు శంకుస్థాపన.. ఒడిశాలోని పారాదీప్–తెలంగాణలోని హైదరాబాద్‌ల మధ్య రూ.3,800 కోట్లతో గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు, అలాగే జార్ఖండ్‌లోని అంగుల్–బొకారో ప్రాంతాల మధ్య రూ.3,437 కోట్ల వ్యయంతో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. పారాదీప్–హైదరాబాద్‌ల మధ్య 1,200 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ పైప్‌లైన్ కారణంగా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు లబ్ధి పొందనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా బరంపురం, విశాఖ, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాల్లో డెలివరీ కమ్ పంపింగ్ స్టేషన్లు నిర్మిస్తారు. -
వాజ్‌పేయి చిత్రంతో రూ.100 నాణెం విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్‌లో మరణించిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గౌరవార్ధం ఆయన చిత్రంతో రూపొందిన రూ 100 నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు. వాజ్‌పేయి జయంతోత్సవానికి ఒక రోజు ముందు ఈ నాణేలను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. వాజ్‌పేయి జయంతిని బీజేపీ సుపరిపాలన దినంగా వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వాజ్‌పేయి ఫోటోతో కూడిన రూ వంద నాణేల విడుదల కార్యక్రమంలో ప్రధానితో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, అరుణ్ జైట్లీ పాల్గొన్నారు.వాజ్‌పేయి ఈ ఏడాది ఆగస్ట్ 16న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వాజ్‌పేయి 1998-2004లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. వాజ్‌పేయి 1996లో కొంత కాలం, 1998-2004 మధ్య రెండు సార్లు దేశ ప్రధాని బాధ్యతలు నిర్వర్తించారు. -
కొత్త 100 రూపాయల నాణెం త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త వందరూపాయల నాణెం త్వరలో చలామణి లోకి రాబోతోంది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖచిత్రంతో కొత్త 100 రూపాయల నాణెంను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ నాణెం 35 గ్రాముల బరువు ఉంటుంది. నాణెం వెనుక వైపు వాజ్‌పేయ్ ముఖచిత్రం వుంటుంది. అలాగే ఈ చిత్రానికి దిగువన దేవనాగరి లిపి, ఆంగ్లం భాషలో శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి, 1924- 2018 అని ముద్రించి ఉంటుంది. మరొకవైపు నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ , సత్యమేవ జయతే(దేవనాగరి లిపి, ఆంగ్లంలో) , ఒకవైపు భారత్, మరోవైపు ఇండియా అని, దీనికిందనే 100 ముద్రించి ఉంటుందని చెప్పింది.