![Four years old Child Died After Swallowing Five Rupees Coin In Nalgonda - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/6/5-rupees-coin.jpg.webp?itok=Ucvr2ilJ)
నల్గొండ (భూదాన్‌పోచంపల్లి) : ఐదు రూపాయల నాణెం ఓ చిన్నారి ప్రాణం తీసింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో చిన్నకుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు కాయిన్ మింగగా, అది గొంతులో ఇరుక్కొంది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స చేసి కాయిన్ తొలగించారు.
అనంతరం ఇంటికి పంపించారు. అయితే, సోమవారం చైత్ర తీవ్ర అస్వస్థతకు గురై శ్వాసతీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా వెంటనే తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ఐదు రూపాయల కాయిన్ గొంతులో ఇరుక్కోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ అయి చిన్నారి మృతి చెందిందని స్థానికులు పేర్కొంటున్నారు. కంటికి రెప్పలా సాకుకొంటున్న చిన్నారి అర్థాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం పెను విషాదంలో అలుముకొంది.
Comments
Please login to add a commentAdd a comment