పంజాబ్ సాంకేతిక విద్యా మంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్ని
చండీగఢ్: పోస్టింగ్ విషయమై ఇద్దరు లెక్చరర్ల మధ్య తలెత్తిన పోటీని మంత్రి నాణెం టాస్ వేసి పరిష్కరించడంపై వివాదానికి దారి తీసింది. పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెక్చరర్ల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో 37 మంది ఎంపికయ్యారు. సాంకేతిక విద్యా మంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్ని సమక్షంలో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు వారందరినీ సోమవారం పిలిపించారు.
అయితే, ఇద్దరు లెక్చరర్ల విషయంలో వివాదం ఏర్పడింది. ఈ ఇద్దరూ పటియాలాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలనే కోరుకున్నారు. అన్ని విషయాల్లోనూ ఇద్దరూ సమానంగా ఉండటంతో ఈ సమస్య పరిష్కార బాధ్యతను మంత్రి చన్ని తీసుకున్నారు. నాణెం టాస్ వేసి బొమ్మా బొరుసూ ప్రకారం ఒక్కరిని ఆ పోస్టుకు ఎంపికచేశారు. అయితే, ఈ వ్యవహారం మొత్తం మీడియాలో రావటంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వెంటనే చన్నిని మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment