lecturer post
-
టాస్ వేసి.. పోస్టింగ్!
చండీగఢ్: పోస్టింగ్ విషయమై ఇద్దరు లెక్చరర్ల మధ్య తలెత్తిన పోటీని మంత్రి నాణెం టాస్ వేసి పరిష్కరించడంపై వివాదానికి దారి తీసింది. పంజాబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లెక్చరర్ల పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో 37 మంది ఎంపికయ్యారు. సాంకేతిక విద్యా మంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్ని సమక్షంలో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు వారందరినీ సోమవారం పిలిపించారు. అయితే, ఇద్దరు లెక్చరర్ల విషయంలో వివాదం ఏర్పడింది. ఈ ఇద్దరూ పటియాలాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలనే కోరుకున్నారు. అన్ని విషయాల్లోనూ ఇద్దరూ సమానంగా ఉండటంతో ఈ సమస్య పరిష్కార బాధ్యతను మంత్రి చన్ని తీసుకున్నారు. నాణెం టాస్ వేసి బొమ్మా బొరుసూ ప్రకారం ఒక్కరిని ఆ పోస్టుకు ఎంపికచేశారు. అయితే, ఈ వ్యవహారం మొత్తం మీడియాలో రావటంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వెంటనే చన్నిని మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశాయి. -
చదువుల తల్లి ముద్దుబిడ్డ
కాసుల తల్లి కటాక్షం లేకున్నా.. చదువుల తల్లి ముద్దుబిడ్డగా ఎదిగాడు. ఉన్నత విద్య అభ్యసనకు ఆర్థిక స్థోమత లేకున్నా.. చిన్నాచితక పనులు చేసుకుంటూ పీజీ వరకు చదువుకున్నాడు. బోధనా వృత్తిలో స్థిర పడాలనుకుని నిర్ణయించుకుని అందుకోసం అహర్నిశం శ్రమించాడు. డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్టిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ సాధించి విజయకేతనాన్ని ఎగురవేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులపై కొందరు నమ్మకం లేకుండా మాట్లాడుతున్న ప్రస్తుత రోజుల్లో అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అనూహ్య స్థానాలకు ఎదిగిన మారుమూల గ్రామానికి చెందిన ఓ నిరుపేద విజయగాథ ఇది. వివరాల్లోకి వెళితే.. తనకల్లు: తనకల్లు మండలం ఎర్రబల్లికి చెందిన ఆదిరెడ్డి, గిరిజమ్మ దంపతులకు మూడు ఎకరాల పొలం ఉంది. కరువు ప్రాంతం కావడంతో నీటి వనరులు లేక పంట సాగుకు చాలా ఇబ్బంది పడుతున్న నిరుపేద రైతు దంపతులకు మహేశ్వరరెడ్డి, మంజునాథరెడ్డి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పిల్లలు తమలా ఇబ్బందులు పడకుండా ఉండాలని భావించిన తల్లిదండ్రులు.. వారికి చదువులు చెప్పించాలని భావించారు. ప్రాథమిక విద్యాభ్యాసం గ్రామంలోని మండల పరి షత్ ప్రాథమిక పాఠశాలల్లో పూర్తి చేసుకున్న మంజునాథరెడ్డి.. తర్వాత పదో తరగతి వరకు చిత్తూరు జిల్లా మొలకలచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాడు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదో తరగతిలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై.. అక్కడే ఇంటర్మీడియట్ చ దుకున్నాడు. అనంతరం కదిరిలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 2005–08లో యూ జీ, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎంఎస్సీ., పూర్తి చేశాడు. ఆ సమయంలో బోధనావృత్తిపై మక్కువ పెంచుకున్న అతను 2011–12లో బీఎడ్., పరీక్షలో రాష్ట్రస్థాయిలో పదో ర్యాంక్‌తో మెరిసాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హత పట్టుదలతో చదువుల్లో రాణించిన మహేశ్వరరెడ్డి... ఈ మూడేళ్ల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నాలుగు ఉద్యోగాలకు అర్హత సాధించారు. బోధనావృత్తిపై ఉన్న మక్కువతో ఆయా ఉద్యోగాల్లో చేరేందుకు అతను విముఖత చూపించారు. సీఎస్ఐఆర్లో ఉద్యోగాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో 39వ ర్యాంక్‌ని సాధించారు. 2016లో ఎఫ్‌సీఐలో ఉద్యోగాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షల్లో జోనల్ స్థాయిలో మూడో ర్యాంక్‌ను పొందారు. ఓసీ అభ్యర్థులకు ప్రభుత్వ కొలువులు దక్కవనే ఆత్మనూన్యతతో నలిగిపోతున్న పలువురికి ఆదర్శంగా నిలుస్తూ నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించినా.. బాధ్యతలు స్వీకరించకుండా లెక్చరర్ కావాలనే తపనతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆయూష్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (చెన్నై)గా విధుల్లో చేరారు. డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో (వృక్షశాస్త్రం) మూడో ర్యాంక్ సాధించి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ ఫలితాలు శనివారం వెలువడ్డాయి. బోధనావృత్తిలో కొనసాగే అవకాశం దక్కడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందంటూ మంజునాథరెడ్డి పేర్కొన్నారు. -
అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి : హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్లో డిప్యూటేషన్‌పై పనిచేసేందుకు పలు సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు దరఖాస్తులు బీఈడీ కళాశాలలో సమర్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ల యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న స్కూల్‌అసిస్టెంట్లు అర్హులని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలిలా ఉన్నాయి. ఫిలాసఫీ 1, సైకాలజీ 1, సోషియాలజీ 1, ఫిజికల్సైన్స్ 1, బయోలాజికల్ సైన్స్ 1, మ్యాథమెటిక్స్ 2, సోషల్‌సైన్స్ 1, తెలుగు 1, ఇంగ్లిష్ 2, కంప్యూటర్ ఎడ్యూకేషన్ 1, ఫిజికల్ డైరెక్టర్ 1, ఆర్ట్ ఎడ్యూకేషన్ 1 ఉన్నాయి. ఆయా సబ్జెక్టుల్లో పీజీ ఎంఈడీలో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలని వివరించారు. సదరు ఉన్నత పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ ఆమోదంతో రేషనలైజేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.