బొమ్మా? బొరుసా? నిర్ణయించండిలా..! | Head Or Tail We Decide | Sakshi
Sakshi News home page

బొమ్మా? బొరుసా? నిర్ణయించండిలా..!

Published Mon, Oct 23 2023 4:40 PM | Last Updated on Mon, Oct 23 2023 6:28 PM

Head Or Tail We Decide - Sakshi

క్రికెట్‌ మ్యాచ్‌లో ఇండియా గెలుస్తుందా లేదా? వర్షం వస్తుందా రాదా? పేకలో జోకర్‌ మనకే పడుతుందా? అన్నీ అనుమానాలే! ఏమో..  కచ్చితంగా కావచ్చు.. కాకపోవచ్చు. కానీ దాన్ని తేల్చుకోవాలంటే కాయిన్‌ను పైకి వేసి ఏదో ఓ వైపు ఎంచుకుంటాం.. ఫలితం మనకు అనుకూలంగా వస్తే కొంత ఆనందాన్ని పొందుతుంటాం. అయితే కాయిన్‌ పైకి వేసినపుడు ఫలితం మనకూ, పోటీదారులకు అనుకూలంగా వచ్చే అవకాశం సమానంగా ఉంటుందని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ అది తప్పని కొన్ని పరిశోధనలు తేలుస్తున్నాయి.

ఆమ్‌స్ట్రడమ్‌లో 48 మంది పరిశోధకులు 46 వివిధ కాయిన్‌లతో చేసిన ‍ప్రయోగం సారాశం ప్రకారం..గాలిలో ఎగరేసిన కాయిన్‌పై బొమ్మా-బొరుసులు రావడానికి 50-50ఛాన్స్‌ ఉండదు. కాయిన్‌లోని బొమ్మని పైకి ఉంచి టాస్‌ వేస్తే అది గాల్లోకి వెళ్లి కిందకు చేరి తిరిగి బొమ్మపడే అవకాశం 51శాతం ఉందని తేలింది. దాదాపు 3లక్షల 50వేల సార్లు కాయిన్‌ గాల్లో ఎగరేసి ఈ ప్రయోగాన్ని చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

(ఇదీ చదవండి: అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా)

ఇదిలా ఉండగా.. స్లాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు అంతర్జాతీయ బౌగోళిక వ్యవహారాలు, కంపెనీ వ్యాపార స్వరూపం, అది విడుదల చేసేఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు యాజమాన్యం తీసుకుంటున్న అనేక అంశాలపై ఆధారపడి పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. గాల్లోకి విసిరిన కాయిన్‌ ఫలితం మనకు అనుకూలంగా రావొచ్చు..రాకపోవచ్చు. అదేవిధంగా కొత్తగా మార్కెట్‌లోకి వచ్చేవారి పెట్టుబడులకు రాబడులు రావొచ్చు..రాకపోవచ్చు. కంపెనీ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని పెట్టుబడులు పెడితే ఫలితం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement