Coin business
-
బొమ్మా? బొరుసా? నిర్ణయించండిలా..!
క్రికెట్ మ్యాచ్‌లో ఇండియా గెలుస్తుందా లేదా? వర్షం వస్తుందా రాదా? పేకలో జోకర్ మనకే పడుతుందా? అన్నీ అనుమానాలే! ఏమో.. కచ్చితంగా కావచ్చు.. కాకపోవచ్చు. కానీ దాన్ని తేల్చుకోవాలంటే కాయిన్‌ను పైకి వేసి ఏదో ఓ వైపు ఎంచుకుంటాం.. ఫలితం మనకు అనుకూలంగా వస్తే కొంత ఆనందాన్ని పొందుతుంటాం. అయితే కాయిన్ పైకి వేసినపుడు ఫలితం మనకూ, పోటీదారులకు అనుకూలంగా వచ్చే అవకాశం సమానంగా ఉంటుందని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ అది తప్పని కొన్ని పరిశోధనలు తేలుస్తున్నాయి. ఆమ్స్ట్రడమ్లో 48 మంది పరిశోధకులు 46 వివిధ కాయిన్లతో చేసిన ప్రయోగం సారాశం ప్రకారం..గాలిలో ఎగరేసిన కాయిన్‌పై బొమ్మా-బొరుసులు రావడానికి 50-50ఛాన్స్ ఉండదు. కాయిన్‌లోని బొమ్మని పైకి ఉంచి టాస్ వేస్తే అది గాల్లోకి వెళ్లి కిందకు చేరి తిరిగి బొమ్మపడే అవకాశం 51శాతం ఉందని తేలింది. దాదాపు 3లక్షల 50వేల సార్లు కాయిన్ గాల్లో ఎగరేసి ఈ ప్రయోగాన్ని చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. (ఇదీ చదవండి: అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా) ఇదిలా ఉండగా.. స్లాక్మార్కెట్లో పెట్టుబడులు అంతర్జాతీయ బౌగోళిక వ్యవహారాలు, కంపెనీ వ్యాపార స్వరూపం, అది విడుదల చేసేఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు యాజమాన్యం తీసుకుంటున్న అనేక అంశాలపై ఆధారపడి పెరగడం లేదా తగ్గడం ఉంటుంది. గాల్లోకి విసిరిన కాయిన్ ఫలితం మనకు అనుకూలంగా రావొచ్చు..రాకపోవచ్చు. అదేవిధంగా కొత్తగా మార్కెట్లోకి వచ్చేవారి పెట్టుబడులకు రాబడులు రావొచ్చు..రాకపోవచ్చు. కంపెనీ గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని పెట్టుబడులు పెడితే ఫలితం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
పుష్కరాల్లో 'చిల్లర' వ్యాపారం
రాజమండ్రి : గోదావరి పుష్కరాల్లో చిల్లర వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతిరోజు వివిధ జిల్లాల నుంచి లక్షల్లో తరలివస్తోన్న భక్తులు ఘాట్ల వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే వీరికి పూజలు, గోదావరిలో నాణేలు వేసే ఆచారం కోసం పెద్ద ఎత్తున చిల్లర అవసరమవుతోంది. దీంతో ఈ అవకాశాన్ని వ్యాపారంగా మలచుకుని పెద్ద ఎత్తున లాభాలు సంపాదిస్తున్నారు కొందరు వ్యాపారులు. వంద రూపాయలకు పది రూపాయలు కమీషన్ తీసుకుని భక్తులు అడిగిన చిల్లర ఇస్తున్నారు. కొందరు ఘాట్ల వద్ద ఈ చిల్లర వ్యాపారం చేస్తుంటే మరికొందరు బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీపంలో నాణేలు కమీషన్ ప్రాతిపదికపై అందిస్తున్నారు. అటు ప్రభుత్వరంగసంస్థ బ్యాంకులు సైతం భక్తులకు దగ్గరవడానికి నాణేలు అందిస్తున్నారు.రిజర్వ్‌బ్యాంక్ నుంచి ఆర్డర్లు రప్పించి రోజుకు రూ.2లక్షల వరకు సరఫరా చేస్తున్నాయి. ఒక్క బ్యాంకులే పుష్కరాలు ముగిసేలోగా రూ.40లక్షల వరకు చిల్లర నాణేలు భక్తులు అందించనున్నాయి.అటు ప్రైవేటు వ్యాపారులు అనధికారికంగా స్టాళ్లు ఏర్పాటు చేసుకుని చిల్లర వ్యాపారం చేస్తున్నాయి. యాత్రికులకు ఈ సౌలభ్యం గురించి తెలియకపోయినా ఘాట్ల వద్ద తమ మనుషులను నియమించుకుని ఈ తరహా వ్యాపారం చేస్తున్నాయి. ఈ విధంగా ప్రైవేటు చిల్లర వ్యాపారులు ఇప్పటివరకు రూ.5 లక్షల వరకు వ్యాపారం చేశారని అంచనా. పుష్కరాలు ముగిసే సరికి చిల్లర నాణేలను సుమారుగా రూ.20లక్షలకుపైగా సరఫరా చేయాలని అంచనా వేసుకున్నారు.