ఇప్పటి వరకు మనం రూ. 1,2,5,10, 20 కాయిన్స్ చూశాం. వాటిని వినియోగించాం. అయితే త్వరలో భారత మార్కెట్‌లో రూ.100 నాణేలు విడుదల కానున్నాయి. ఈ కొత్త కాయిన్ వినియోగంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రధాని మోదీ 2014 అక్టోబర్ 3న ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల చివరి ఆదివారంలో ఆల్ ఇండియా రేడియలో మోదీ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 99 కార్యక్రమాలు పూర్తికాగా.. 100వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 నాణేలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో రూ.100 కాయిన్ విడుదలపై కేంద్ర ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ వంద రూపాయిల నాణెం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారైంది. ఈ విలువైన నాణెం కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 ఎపిసోడ్ మన్‌కీ బాత్ కార్యక్రమంలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
రూ.100 కాయిన్‌ను వినియోగించుకోవచ్చా?
ఏప్రిల్ 30న జరిగే మన్‌కీ బాత్ 100 ఏపీసోడ్ సందర్భంగా రూ.100 కాయిన్‌ను కేంద్రం విడుదల చేయనుంది. విడుదల అనంతరం దీనిని సాధారణ కాయిన్‌లాగా వినియోగించేందుకు వీలు లేదు. కేవలం ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఉపయోగించుకునే వెసలు బాటు కల్పించింది కేంద్రం.
రూ.100 కాయిన్ ప్రత్యేకతలు
కేంద్రం ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన మేరకు.. రూ.1, 2,10,20 నాణెల కంటే విభిన్నంగా ఉండనుంది. కాయిన్ 44 మిల్లీమీటర్ డయారీ మీటర్‌లో గుండ్రంగా ఉంటుంది. ఇందులో 35 గ్రాముల ఇనుము, వెండి 50శాతం,రాగి 40 శాతం, నికెల్ 5శాతం, జింక్ శాతం కలిగి ఉంటుంది. వీటితో పాటు అశోక స్తంభము ముద్ర, మధ్యలో సత్యమేవ జయతే, దేవనగరి భాషలో భారత్ అనే పదాలు కనిపిస్తాయి. ఎడమవైపు ఇంగ్లీష్‌లో ఇండియా అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అదనంగా కాయిన్ మీద రూపాయి చిహ్నం "₹" 100 సంఖ్య ఉండగా.. నాణెం వెనుక భాగంలో మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లోగో, దానిపై '2023' అని రాయబడి ఉంటుంది.
చదవండి👉 ట్విటర్ యూజర్లకు శుభవార్త!
Comments
Please login to add a commentAdd a comment