ఇజ్రాయిల్ లో అరుదైన బంగారు నాణెం.. | Israeli hiker finds rare, 2,000-year-old gold coin | Sakshi
Sakshi News home page

ఇజ్రాయిల్ లో అరుదైన బంగారు నాణెం..

Published Mon, Mar 14 2016 6:32 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

ఇజ్రాయిల్ లో అరుదైన బంగారు నాణెం.. - Sakshi

ఇజ్రాయిల్ లో అరుదైన బంగారు నాణెం..

రెండు వేల వత్సరాలనాటి పురాతన బంగారు నాణేన్ని ఇజ్రాయిల్ పురాతత్వ అధికారులు గుర్తించారు. ఓ పాదచారికి దొరికిన ఆ బంగారు నాణెం క్రీస్తు శకం 107 సంవత్సరం నాటిదిగా చెప్తున్నారు. ఇటువంటి పురాతన బంగారు నాణేల్లో ఇప్పటివరకు ఉన్నవాటిలో ఈ నాణెం రెండవదిగా అధికారులు వెల్లడించారు.

ఇజ్రాయిల్ తూర్పు గలిలయ ప్రాంతంలో ఇటీవల వాకింగ్ కు వెళ్ళిన లౌరీ రిమోన్ కు ఓ బంగారు నాణెం మెరుస్తూ కనిపించిందట. అయితే ఆమె దొరికిన ఆ నాణేన్ని  దాచి పెట్టుకోకుండా  ప్రభుత్వాన్నికి స్వచ్ఛందంగా  అప్పగించిందట. ఈ అరుదైన నాణేన్ని అత్యంత పురాతన నాణెంగా గుర్తించిన పురాతత్వ అధికారులు.. రిమోన్ కు ప్రశంసా పత్రాన్ని అందించి సత్కరించారు.

ఇంతకు ముందే ఉన్న మొదటి బంగారు నాణెం లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.  క్రీస్తు శకం 107 సంవత్సరంనాటి ఈ నాణెంపై రోమన్ సామ్రాజ్యపు మొదటి చక్రవర్తి ఆగస్గస్ చిత్రం ముద్రించి ఉన్నట్లుగా  పురాతత్వ శాఖ అధికారులు గుర్తించారు.  రోమన్ పాలకులను గౌరవించడంలో భాగంగా ముద్రించే నాణేల వరుసలో ఈ నాణెం ముద్రించబడిందని పురాతత్వశాఖ అధికారి డానాల్డ్ టి ఏరియల్ చెప్పారు. ఈ నాణెం రోమన్ సైనికులకు చెల్లించిన జీతంలోనిది అయి ఉండొచ్చిని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement