hiker
-
అగ్ని పర్వతం విస్పోటనం.. 11 మంది పర్వతారోహకులు మృతి
జకర్తా: ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. ఈ ఘటనలో దాదాపు 11 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సుమత్రా ద్వీపంలో 2,891 మీటర్ల (9,484 అడుగులు) ఎత్తున్న మౌంట్ మెరాపి అగ్ని పర్వతం ఆదివారం విస్పోటనం చెందింది. ఈ ఘటనతో చుట్టుపక్కల కిలోమీటర్ల మేర బూడిద మేఘాలు కమ్మేశాయి. పేలుడుతో దాదాపు 3,000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మిందిని అధికారులు తెలిపారు. "అగ్ని పర్వతం విస్పోటనం జరిగిన సమయంలో దాదాపు 75 మంది పర్వతారోహకులు అక్కడ ఉన్నారు. 49 మంది పర్వతం నుంచి కిందికి దిగివచ్చారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించాం. 11 మంది మృతి చెందారు. 12 మంది ఆచూకీ తెలియలేదు." అని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారాంతంలో పర్వతారోహకులు ట్రెక్కింగ్ చేసే సమయంలో అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దీంతో ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. -
ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు
ఇటీవల అమెరికాలోనిలోని మోంటానాలో గల గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురుపడటంతో వారు నిలువునా వణికిపోయారు. అప్పుడు వారికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఉదంతాన్ని వీడియోలో బంధించారు. వన్యప్రాణుల స్వభావానికి ఆ ఎలుగుబంటి ప్రవర్తించిన తీరు ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. పర్యాటకులు అవుట్‌డోర్‌లో చేసే అన్వేషణల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తు చేసేలా ఈ వీడియో ఉంది. స్టీవ్ ఫ్రాంక్లిన్.. ఆ ఎలుగుబంటి హిడెన్ లేక్ ట్రయిల్‌లో హైకర్ల వైపుగా ఇరుకైన మార్గంలో కొండ నుంచి దిగుతున్న వీడియోను బంధించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆ ఎలుగుబంటి సియెహ్ బెండ్ సమీపంలోని వాలు పైభాగంలో ఉన్న చెట్ల మధ్య కనిపించింది. కాలిబాట నిటారుగా రాతితో ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు. దీని వలన హైకర్లు పక్కకు వెళ్లినా ఎలుగుబంటిని తప్పించుకోలేకపోయారు. అయితే ఆ ఎలుగుబంటికి దూరంగా ఆ హైకర్లు మెల్లగా సమీపంలోని కాలిబాట నుంచి వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఆ గ్రిజ్లీ మీ వెనుకే ఉందంటూ హైకర్లను ఎవరో హెచ్చరించడం వీడియోలో వినిపిస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు కాలిబాటలో నడవడం శ్రేయస్కరంగా అనిపించిదని ఫ్రాంక్లిన్ పేర్కొన్నారు. నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్సీఎస్) తెలిపిన వివరాల ప్రకారం గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో సుమారు వెయ్యి గ్రిజ్లీ, నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మనుషులపై దాడులు చేస్తుంటాయి. ఎలుగుబంట్లు మనుషుల విషయంలో హింసాత్మకంగా ఉంటాయని స్పష్టంగా చెప్పలేనప్పటికీ, ఎలుగుబంట్లు ఎదురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను నేషనల్ పార్క్ సర్వీస్ సూచించింది. గ్లేసియర్ నేషనల్ పార్క్‌లోని హైకర్లను సమీపిస్తున్న గ్రిజ్లీ ఎలుగుబంటి దృశ్యాలు పర్యాటకుల మదిలో నిలిచిపోతాయి. ఈ ఎలుగుబంటి తమ జాతులను, వాటి ఆవాసాలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు ఎదురయ్యే అనుభవం, వాటిని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోకు లెక్కకు మించిన వ్యూస్వస్తుండగా, కామెంట్లు కూడా అదే రీతిన వస్తున్నాయి. ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు! -
ఆశ్చర్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు!
వాషింగ్టన్: అద్బుతమైన దృశ్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికిన సంఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మంచు కొండ పర్యటనకు వెళ్లిన వ్యక్తి.. అక్కడి మంచులో కూరుకుపోవడంతో అతడిని రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. కానీ 45 నిమిషాల తర్వాత అతడి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించడంతో అతడు మృత్యుంజయుడు అయ్యాడు. ఇంతకి ఆ అదృష్టవంతుడు ఎవరంటే అమెరికాకు చెందిన మైఖేల్ నాపిన్క్సి. 45 ఏళ్ల వయసున్న అతడు కాలినడకన దేశ పర్యటన చేస్తుంటాడు. ఈ క్రమంలో గతవారం తన స్నేహితుడితో కలిసి అమెరికాలోని మౌంట్ రైనర్ నేషనల్ పార్క్‌లోని మంచుకొండకు కాలినడకన పర్యటనకు వెళ్లాడు. నాపిన్క్సి, అతడి స్నేహితుడు చెరో దిక్కున పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నాపిన్క్సి ఓ చోట మంచులో కూరుకుపోయాడు. అయితే వీరిద్దరూ తిరిగి కలుసుకునే చోటును ముందే నిర్ణయించుకున్నారు. (చదవండి: వైరల్: మరీ ఇంత పిరికి పులిని చూడలేదు) సాయంత్రమైనా నాపిన్క్సి తాము అనుకున్న చోటికి తిరిగి రాకపోవడం అతడి స్నేహితుడు సహాయక బృందానికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం హెలికాప్టర్‌తో గాలింపు చర్యల చేపట్టింది. ఈ క్రమంలో కొద్ది సమయానికి నాపిన్క్సిని గుర్తించి రక్షించిన టీం హుటాహుటిన స్థానిక హాస్పిటల్‌కు తరలించింది. అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పటికి పల్స్ మాత్రం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడిని రక్షించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించారు. సీపీఆర్ చేసి అతడిలోని అధిక కార్బోరియల్ మెమ్బేన్ ఆక్సిజనేషన్(ఇసీఎంఓ) యంత్రంతో చికిత్స అందించామని ఆస్పత్రి వైద్యులు జెనెల్లా బదులక్ స్థానిక మీడియాతో పేర్కొన్నారు. ఈ ఇసీఎంఓ శరీరం నుంచి రక్తాన్ని గుండెకు పంప్ చేసి కార్భన్ డై ఆక్సైడ్‌ను తొలిగిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో దాదాపు 45 నిమిషాల తర్వాత నాపిన్స్కి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించిందని, ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. (చదవండి: రామాయణ, భారతాలపై ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు) -
ఇజ్రాయిల్ లో అరుదైన బంగారు నాణెం..
రెండు వేల వత్సరాలనాటి పురాతన బంగారు నాణేన్ని ఇజ్రాయిల్ పురాతత్వ అధికారులు గుర్తించారు. ఓ పాదచారికి దొరికిన ఆ బంగారు నాణెం క్రీస్తు శకం 107 సంవత్సరం నాటిదిగా చెప్తున్నారు. ఇటువంటి పురాతన బంగారు నాణేల్లో ఇప్పటివరకు ఉన్నవాటిలో ఈ నాణెం రెండవదిగా అధికారులు వెల్లడించారు. ఇజ్రాయిల్ తూర్పు గలిలయ ప్రాంతంలో ఇటీవల వాకింగ్ కు వెళ్ళిన లౌరీ రిమోన్ కు ఓ బంగారు నాణెం మెరుస్తూ కనిపించిందట. అయితే ఆమె దొరికిన ఆ నాణేన్ని దాచి పెట్టుకోకుండా ప్రభుత్వాన్నికి స్వచ్ఛందంగా అప్పగించిందట. ఈ అరుదైన నాణేన్ని అత్యంత పురాతన నాణెంగా గుర్తించిన పురాతత్వ అధికారులు.. రిమోన్ కు ప్రశంసా పత్రాన్ని అందించి సత్కరించారు. ఇంతకు ముందే ఉన్న మొదటి బంగారు నాణెం లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్రీస్తు శకం 107 సంవత్సరంనాటి ఈ నాణెంపై రోమన్ సామ్రాజ్యపు మొదటి చక్రవర్తి ఆగస్గస్ చిత్రం ముద్రించి ఉన్నట్లుగా పురాతత్వ శాఖ అధికారులు గుర్తించారు. రోమన్ పాలకులను గౌరవించడంలో భాగంగా ముద్రించే నాణేల వరుసలో ఈ నాణెం ముద్రించబడిందని పురాతత్వశాఖ అధికారి డానాల్డ్ టి ఏరియల్ చెప్పారు. ఈ నాణెం రోమన్ సైనికులకు చెల్లించిన జీతంలోనిది అయి ఉండొచ్చిని భావిస్తున్నారు.