Hikers In Glacier National Park Come Face-to-face With Grizzly Bear - Sakshi
Sakshi News home page

ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు

Published Sat, Jul 15 2023 7:45 AM | Last Updated on Sat, Jul 15 2023 11:10 AM

hikers in glacier national park come face to face with grizzly bear - Sakshi

ఇటీవల అమెరికాలోనిలోని మోంటానాలో గల గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఒక పెద్ద ఎలుగుబంటి ఎదురుపడటంతో వారు నిలువునా వణికిపోయారు. అప్పుడు వారికి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఉదంతాన్ని వీడియోలో బంధించారు. వన్యప్రాణుల స్వభావానికి  ఆ ఎలుగుబంటి ప్రవర్తించిన తీరు ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. పర్యాటకులు అవుట్‌డోర్‌లో చేసే అన్వేషణల వల్ల కలిగే ప్రమాదాలను గుర్తు చేసేలా ఈ వీడియో ఉంది.

స్టీవ్ ఫ్రాంక్లిన్.. ఆ ఎలుగుబంటి హిడెన్ లేక్ ట్రయిల్‌లో హైకర్ల వైపుగా ఇరుకైన మార్గంలో కొండ నుంచి దిగుతున్న వీడియోను బంధించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆ ఎలుగుబంటి సియెహ్ బెండ్ సమీపంలోని వాలు పైభాగంలో ఉన్న చెట్ల మధ్య కనిపించింది. కాలిబాట నిటారుగా రాతితో ఉండటాన్ని వీడియోలో గమనించవచ్చు. దీని వలన హైకర్లు పక్కకు వెళ్లినా ఎలుగుబంటిని తప్పించుకోలేకపోయారు. అయితే ఆ ఎలుగుబంటికి దూరంగా ఆ హైకర్‌లు మెల్లగా సమీపంలోని కాలిబాట నుంచి వెళ్లడం వీడియోలో చూడవచ్చు. ఆ గ్రిజ్లీ మీ వెనుకే ఉందంటూ హైకర్‌లను ఎవరో హెచ్చరించడం వీడియోలో వినిపిస్తుంది. దాని నుంచి తప్పించుకునేందుకు కాలిబాటలో నడవడం శ్రేయస్కరంగా అనిపించిదని ‍ఫ్రాంక్లిన్‌ పేర్కొన్నారు.

నేషనల్ పార్క్ సర్వీస్ (ఎన్‌సీఎస్‌) తెలిపిన వివరాల ప్రకారం గ్లేసియర్ నేషనల్ పార్క్‌లో సుమారు వెయ్యి గ్రిజ్లీ, నల్ల ఎలుగుబంట్లు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు మనుషులపై దాడులు చేస్తుంటాయి. ఎలుగుబంట్లు మనుషుల విషయంలో హింసాత్మకంగా ఉంటాయని స్పష్టంగా చెప్పలేనప్పటికీ, ఎలుగుబంట్లు ఎదురైనప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను నేషనల్ పార్క్ సర్వీస్ సూచించింది. 

గ్లేసియర్ నేషనల్ పార్క్‌లోని హైకర్‌లను సమీపిస్తున్న గ్రిజ్లీ ఎలుగుబంటి దృశ్యాలు  పర్యాటకుల మదిలో నిలిచిపోతాయి. ఈ ఎలుగుబంటి తమ జాతులను, వాటి ఆవాసాలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సంఘటన హైలైట్ చేస్తుంది. వన్యప్రాణులు ఎదురుపడినప్పుడు ఎదురయ్యే అనుభవం, వాటిని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోకు లెక్కకు మించిన వ్యూస్‌వస్తుండగా, కామెంట్లు కూడా అదే రీతిన వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: మహిళ ఆర్తనాదాలపై ఫిర్యాదు.. సంఘటనా స్థలంలో డంగైన పోలీసులు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement