సేకరించిన నాణెంతో రవిశంకర్‌రెడ్డి, తాంతియాతోపే 200 జయంతిని పురస్కరించుకొని కోల్‌కతా మింట్ విడుదల చేసిన నాణెం
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కానీ, విశాఖ నగరంలోని రెడ్డి కంచరపాలెం వాసి బసవ రవిశంకర్‌రెడ్డికి మాత్రం చాలా అభిరుచులున్నాయి. వాటన్నిటినీ పట్టుదలతో సాధించుకున్న ఘనత ఆయనది. రవిశంకర్‌రెడ్డి విదేశీ కాయిన్స్, కరెన్సీతో పాటు పురావస్తువులను కూడా భద్రపరచడంలో దిట్ట. 1957 నుంచి భారతదేశంలో వాడే ద్విచక్రవాహనాలు ఆయ న వద్ద ఉన్నాయి. అరుదైన భారతీయ నాణాలు, నోట్లను సేకరించడమే కాకుండా 122 దేశాల విదేశీ కరెన్సీ, డాలర్లతో పాటు 67 దేశాల స్టాంపులు సేకరిచారు రవి. చదివింది డిప్లమో అయినా తన మెదడకు పదునుపెట్టి కువైట్, అబుదబీ దేశాల్లో పనిచేసిన అనుభవంతో తయారు చేసిన రిమోట్‌తో అరకిలోమీటరు దూరం నుంచే ఇంట్లో లైట్లు వేయడం ఆపడం చేస్తుంటారు. ఇది ఆయన సొంతంగా తయారు చేసుకున్నదే. 1957 నుంచి 24 ద్విచక్రవాహనాలు జా వా, లాంబ్రెట్టా, మినీ రాజ్‌దూత్ ఇలా పాత వాహనాలను సేకరించి భద్రపరిచారు.
తాజాగా.. రూ.200 నాణెం..విశాఖకు..
రూ.200 నాణెం విశాఖకు వచ్చింది. ఈ కాయిన్‌ను రవిశంకర్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. అరుదైన వస్తువులు సేకరించడంలోనూ, రూపొందించడంలోనూ ఆయన దిట్ట. ఇప్పటివరకు భారతీయ నాణాలు, నోట్లతో పాటు 122 దేశాల విదేశీ కరెన్సీ, డాలర్లు, 67 దేశాల స్టాంపులు సేకరించారు. ఏడాది కిందట రూ.500 నాణేం సేకరించిన రవిశంకర్‌రెడ్డి..తాజాగా రూ.200 నాణేం సొంత చేసుకున్నారు. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు తాంతియాతోపి(1814–1859) 200వ జయంతిని పురస్కరించుకొని కోల్‌కతా మింట్ ఇటీవల విడుదల చేసిన రూ.200 కాయిన్‌ను రవిశంకర్‌రెడ్డి తొలిసారిగా రూ.2,374కు కొనుగోలు చేశారు. ఈ కాయిన్‌ను ఆరు నెలల కిందటే బుక్ చేసుకున్నారు. కాయిన్‌ను ముందుగా విశాఖ నుంచి దక్కించుకున్నారు రవిశంకర్. గతంలో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.150, రూ.500 వంటి ఎన్నో కాయిన్స్ సొంతం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment