
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎన్‌ఆర్‌ఐలు అరుదైన కానుకను ఇచ్చారు. కేసీఆర్ ముఖచిత్రం, టీఆర్ఎస్ గుర్తు కారుతో నాణేలను ముద్రించి ఆయన పై అభిమానాన్ని చాటుకుంది కేసీఆర్ అండ్ తెరాస సపోర్టర్స్ అఫ్ యూకే. టీఆర్‌ఎస్ 17వ ప్లీనరీ సందర్భంగా లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కేసీఆర్ తెరాస సపోర్టర్స్ ఆఫ్ యూకే అధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, కోర్ కమిటీ సభ్యులు కేసీఆర్‌పై అభిమానంతో నాణేలను ముద్రించి ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించారు. కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో ఈ నాణేలను తయారుచేపించామని, అది కూడా కేసీఆర్‌తో ఆవిష్కరించడం తమ అదృష్టం అని కోర్ కమిటీ సభ్యులు సురేష్ గోపతి పేర్కొన్నారు.
ప్రగతి భవన్లో కేసీఆర్‌తో విందు తరువాత జరిగిన సమావేశంలో ఎన్ఆర్ఐలను పేరు పేరున బాగోగుగులు అడిగితెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని కోర్ కమిటీ సభ్యులు భాస్కర్ మొట్ట తెలిపారు. ఎన్ఆర్ఐలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని కేసీఆర్ మాట ఇవ్వడం, దానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడంపై కోర్ కమిటీ సభ్యులు శివ కుమార్ గౌడ్, శ్రీధర్ నీలా హర్షం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో ఎన్అర్ఐల మద్దతు పూర్తిగా ఉంటుందని సిక్కా చంద్రశేఖర్ అన్నారు. కేసీఆర్ దిశా నిర్ధేశంలో ఎన్‌ఆర్‌ఐల కార్యచరణ ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment