నాణెం మింగిన విద్యార్థిని | School Student Swallowed Five Rupees Coin in Anantapur | Sakshi
Sakshi News home page

నాణెం మింగిన విద్యార్థిని

Published Tue, Sep 10 2019 8:10 AM | Last Updated on Tue, Sep 10 2019 8:10 AM

School Student Swallowed Five Rupees Coin in Anantapur - Sakshi

అనంతపురం ,గార్లదిన్నె: నోటిలో పెట్టుకున్న రెండు ఐదు రూపాయల నాణేన్ని ఓ విద్యార్థిని పొరపాటున మింగేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 108 సిబ్బంది జయరాజు, శీనానాయక్‌ తెలిపిన మేరకు... కనంపల్లికి చెందిన తులసి అనే ఐదో తరగతి విద్యార్థిని ఆదివారం ఐదు రూపాయల నాణేన్ని నోటిలో పెట్టుకుని అనుకోకుండా మింగేసింది. సోమవారం కడుపు నొప్పి రావడంతో అప్పుడు తాను మింగిన నాణెం గురించి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు హుటాహుటిన 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అనంతరం తల్లిదండ్రులు పాపకు అరటిపండు తినిపించడంతో మలవిసర్జనలో నాణెం బయటకు వచ్చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement