![Modi releases commemorative coin to honour Atal Bihari Vajpayee - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/24/vajpayee.jpg.webp?itok=oA9tkZdZ)
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆగస్ట్‌లో మరణించిన మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి గౌరవార్ధం ఆయన చిత్రంతో రూపొందిన రూ 100 నాణేన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు. వాజ్‌పేయి జయంతోత్సవానికి ఒక రోజు ముందు ఈ నాణేలను ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. వాజ్‌పేయి జయంతిని బీజేపీ సుపరిపాలన దినంగా వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా వాజ్‌పేయి ఫోటోతో కూడిన రూ వంద నాణేల విడుదల కార్యక్రమంలో ప్రధానితో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, అరుణ్ జైట్లీ పాల్గొన్నారు.వాజ్‌పేయి ఈ ఏడాది ఆగస్ట్ 16న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వాజ్‌పేయి 1998-2004లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. వాజ్‌పేయి 1996లో కొంత కాలం, 1998-2004 మధ్య రెండు సార్లు దేశ ప్రధాని బాధ్యతలు నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment