
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త నాణేన్ని ప్రవేశపెట్టనుంది. శ్రీ గురు గోవింద్ సింగ్ 350వ జయంతి వార్షికోత్సవం సందర్భంగా రూ.350 నాణేన్ని విడుదల చేయనుంది. నోట్ల రద్దు తరువాత పెద్ద నాణేలను తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.350 నాణేలను తీసుకురానుంది. ఈ మేరకు ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ కొత్త రూ.350 నాణెం స్పెషికేషన్స్ పై అంచనాలు ఇలా ఉన్నాయి. 44 మిల్లీమీటర్ల చుట్టుకొలత సిల్వర్ మిశ్రమ లోహాలు 50 శాతం, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, జింక్ లోహాల మిశ్రమంతో దీన్ని రూపొందించింది. ముందు భాగంలో అశోక స్తంభం, మధ్యలో "సత్యమేవ జయతే" నినాదాన్ని పొందుపర్చగా, ఎడమవైపున దేవనాగరి లిపిలో "భారత్", వెనుక భాగంలో ఇండియా అని ఆంగ్లంలో ఉంటుంది.
అలాగే నాణెం వెనుక దేవనాగరి లిపిలోని "శ్రీ గురు గోబింద్ సింగ్‌జీ 350వ ప్రకాశ ఉత్సవ్’’ అని కాయిన్‌కి పైభాగాన, దిగువన ఆంగ్లంలో "తఖ్త్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్ -1666-2016" చిత్రాన్ని అమర్చినట్టు తెలుస్తోంది. నాణెం బరువు సుమారు 35.35 గ్రాములు ఉంటుందని అంచనా. ఎంత విలువ మేరకు ఈ నాణేలను విడుదల చేస్తోంది స్పష్టం చేయలేదు. కానీ పరిమితంగానే వీటిని తీసుకొస్తున్నట్టు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment