బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న కేసులో ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న కేసులో ఓ వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. యాకుత్పురా ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికను ఆమె తల్లి, బావ కలిసి బలవంతంగా వేర్వేరు ప్రాంతాలకు పంపుతూ ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఆమె గురువారం తెల్లవారుజామున ఎలాగోలా ఇంట్లోంచి తప్పించుకుని పారిపోయి వివిధ రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటూ చివరకు పీయూసీఎల్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆశ్రయం పొందింది. బాలిక బావ అక్బర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు ఫలక్నూమాలో అదుపులోకి తీసుకున్నారు.