ఏసీబీ వలలో చిప్పగిరి ఎమ్మార్వో | Chippagiri MRO in ACB net | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో చిప్పగిరి ఎమ్మార్వో

Published Tue, Sep 29 2015 11:06 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Chippagiri MRO in ACB net

కర్నూలు :  ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఎమ్మార్వో అక్బర్ ఏసీబీ అధికారులకు రెడ్ హాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన కర్నూలులో మంగళవారం చోటు చేసుకుంది. జిల్లాలోని చిప్పగిరి ఎమ్మార్వోగా అక్బర్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే తనకు రావాల్సిన బకాయిలు ఇప్పించ వలసిందిగా వ్యక్తి ... ఎమ్మార్వోను ఆశ్రయించారు.

అందుకు సదరు వ్యక్తిని అక్బర్ రూ. 7 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వల పన్ని ఎమ్మార్వోను అరెస్ట్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement