ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలిసి వీడియో రికార్డింగ్‌  | Akbar Attack on Ex Wife at Himayat Nagar Pizza Hut Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రియుడితో పిజ్జాహట్‌కు.. మొదటి భార్యతో కలిసి వీడియో రికార్డింగ్‌ 

Published Wed, Jan 19 2022 7:37 AM | Last Updated on Fri, Jan 21 2022 2:39 PM

Akbar Attack on Ex Wife at Himayat Nagar Pizza Hut Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌(హిమాయత్‌నగర్‌): విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్న భార్యపై మోజు తగ్గలేదు. వెంటపడుతూ వేధిస్తుండటంతో..గతంలో ఒకసారి ఊచలు కూడా లెక్కపెట్టాడు. అయినా బుద్ధిమారలేదు. మరో మారు మాజీ భార్యపై దాడి చేసి జైలు కెళ్లాడు.. చందులాల్‌ బారాదరికి చెందిన ఎండీ అక్బర్‌. అందరూ చూస్తుండగా మొదటి భార్యపై దాడికి పాల్పడిన సంఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.

అక్బర్, హబీబా 9ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే హబీబా కంటే ముందే అక్బర్‌ అనీజ్‌ ఫాతిమా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం అక్బర్‌ హబీబా కలిసి ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నారు. అయితే ఆమెపై మోజు తగ్గక ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వెంబడించేవాడు అక్బర్‌. గతంలో రాంగోపాల్‌పేట పీఎస్‌ పరిధిలో హబీబాపై దాడి చేయగా..రెండు రోజుల పాటు జైలుకు వెళ్లొచ్చాడు.

చదవండి: (వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్‌.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్‌)

కొద్దిరోజులుగా ఆ కేసును వాపస్‌ తీసుకోమని వెంటపడుతున్నాడు. మంగళవారం హబీబా తనకు కాబోయే భర్తతో హిమాయత్‌నగర్‌లోని పిజ్జాహట్‌కు వచ్చింది. అక్కడికి వచ్చిన అక్బర్‌ తన మొదటి భార్య అనీజా ఫాతిమాతో హబీబా వీడియో తీయించాడు. తన వీడియో ఎందుకు తీస్తున్నారంటూ హబీబా అడగడంతో అందరూ చూస్తుండగా అక్బర్‌ ఆమెపై దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అక్బర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు అడ్మిన్‌ ఎస్సై సంధ్య తెలిపారు.    

చదవండి: (మిసెస్‌ ఇండియా తెలంగాణగా ఇందూ అగర్వాల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement