
అక్బర్ చరిత్ర కారుడే.. కానీ
ప్రతాప్ నగర్: మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన అక్బర్ కంటే మహరాణా ప్రతాప్ గొప్పవ్యక్తి అని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. అయితే చరిత్ర కారులు మాత్రం అక్బర్ ను మహోన్నత వ్యక్తిగా చిత్రీకరించడాన్ని మాత్రం తాను ఏమీ తప్పుబట్టడం లేదన్నారు. కాగా, అక్బర్ కంటే రాణా ప్రతాప్ గొప్ప వ్యక్తి అని తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు. ఆదివారం రాజస్థాన్ లోని ప్రతాప్ ఘర్ లో రాణా ప్రతాప్ విగ్రహావిష్కరణలో్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ నాథ్ పై విధంగా స్పందించారు. హల్దీ ఘాట్ యుద్ధంలో అక్బర్ చేతిలో మేవర్ చక్రవర్తి రాణా ప్రతాప్ ఓటమి పాలైన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అక్బర్-రాణాల చరిత్ర సరి చేయాలని రాజ్ నాథ్ పేర్కొన్నారు. రాణా ప్రతాప్ ప్రజల్లో అపారమైన ఘోరవాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. ఉన్నతమైన వ్యక్తిగా నిలిచిపోయాడన్నారు. తదుపరి తరాలకు మహరాణా ప్రతాప్ జీవితం ఆదర్శం కావాలని రాజ్ నాథ్ తెలిపారు.