
అది లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమన్న రాజ్‌నాథ్ సింగ్
జౌన్‌పూర్ (యూపీ): Pakistan Occupied Kashmir)పాక్ ఆక్రమిత కశ్మీర్ మన దేశపు కిరీటంలో రత్నం లాంటిదని, అది లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని రక్షణ మంత్రి (Rajnath Singh)రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. (Jammu Kashmir)జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంపొందించే కుట్రను పాకిస్తాన్ కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు.
జౌన్‌పూర్ జిల్లా నిజాముద్దీన్ పూర్ గ్రామంలో బీజేపీ సీనియర్ నేత జగత్ నారాయణ్ దూబే ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ అక్కడ విలేకరులతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్.. ఆ దేశానికి ఉగ్రవాదాన్ని, భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగించే విదేశీ భూభాగం తప్ప మరేమీ కాదన్నారు. అక్కడ ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ ప్యాడ్లను కూల్చివేయాలని, లేదంటే తగిన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు.
పాక్ నేత అన్వర్ ఉల్‌హక్ భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రక్షణ మంత్రి మండిపడ్డారు. మత ప్రాతిపదికన భారత్‌కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు పాక్ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, ప్రస్తుతం అత్యధికంగా 5జీని ఉపయోగిస్తున్న భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.