
ససరాం: దేశ సరిహద్దుకు లోపల, వెలుపలా రక్షణ సన్నద్ధత, సామర్థ్యం విషయంలో భారత్‌కు తిరుగులేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పునరుద్ఘాటించారు. బాలాకోట్‌లో ఉగ్రస్థావరంపై వైమానిక దాడులు, పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంపై సర్జికల్ దాడులే భారత సత్తాకు సాక్ష్యాలన్నారు.
బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినపుడు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని తెల్సి మోదీ వెంటనే రష్యా, ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులతో ఒక్కటే మాట చెప్పారు. అంతే. నాలుగు గంటలపాటు యుద్ధం స్తంభించింది. విద్యార్థులను వెనక్కి తెచ్చేశాం. మోదీ ఘనత చూసి ప్రపంచమే నోరెళ్లబెట్టింది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment