గండిపేటలోని ఓ ఫాంహౌస్ సమీపంలో దారుణ హత్యకు గురైన యువతి కేసులో 24 గంటల్లోపే పోలీసులు పురోగతి సాధించారు. ఆదివారం హత్యకు గురైన విద్యార్థినిని అమీనాగా గుర్తించారు. ఫలక్‌నుమాలో అమీనా 9వ తరగతి చదువుకుంటోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అమీనాను బైక్ పై తీసుకువెళ్లిన వ్యక్తిని ఫలక్‌నుమాలో నివాసముంటున్న అక్బర్గా గుర్తించారు.