ameena
-
ఉర్దూ మీడియంలో చదివి.. 'నీట్' టాపర్‌గా..!
‘నీట్’ ఎగ్జామ్‌లో ఆలిండియా టాప్ ర్యాంకర్‌గా నిలవడం సామాన్యం కాదు. ముంబైలో ఓ బేకరి వర్కర్ కుమార్తె అయిన అమీనా ఆరిఫ్ పది వరకూ ఉర్దూ మీడియంలో చదివింది. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంతో ఇబ్బంది పడింది. అయినా నీట్ 2024లో 720 కి 720 తెచ్చుకుని టాప్ ర్యాంకర్‌గా నిలిచింది. ఆమె స్ఫూర్తిదాయక కథనం...‘మెహనత్ కర్నా హై... మోటివేట్ రెహనా హై (కష్టపడాలి... ప్రేరణతో ఉండాలి) అని చెప్పింది అమీనా ఆరిఫ్ తన విజయం గురించి. వైద్యవిద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్’లో 2024 సంవత్సరానికి 720 మార్కులకు 720 మార్కులతో టాప్ 1 ర్యాంకు సాధించింది అమీనా. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది పరీక్ష రాస్తే వారిలో 67 మందికి టాప్ 1 ర్యాంకు వచ్చింది. వారిలో 14 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరిలో మిగిలిన వారితో పోల్చితే అమీనా గెలుపు కాస్త భిన్నమైనది. ఎందుకంటే 10వ తరగతి వరకూ ఆమె ఉర్దూ మీడియంలో చదివింది.బేకరి వర్కర్ కుమార్తె..ముంబై పశ్చిమ శివార్లలో ఉండే జోగేశ్వరి ప్రాంతం అమీనాది. తండ్రి బేకరీలో పని చేస్తాడు. అక్కడ ఉన్న మద్నీ హైస్కూల్ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో పేరు గడించింది. ఉర్దూ మీడియంలో బోధన సాగే ఆ స్కూల్లోనే అమీనా పది వరకు చదివింది. ఆ తర్వాత పార్లెలోని మితిబాయి కాలేజీలో బైపీసీలో చేరింది. ‘అంతవరకూ ఉర్దూ మీడియంలో చదవడం వల్ల బైపీసీ ఇంగ్లిష్ మీడియం చదవడం కష్టమైంది. ఇంగ్లిష్‌లో నా వెనుకంజ నా చదువునే వెనక్కు నెట్టకూడదని గట్టిగా కష్టపడ్డాను’ అని తెలిపింది అమీనా. ఆమెకు ఇంటర్లో 95 శాతం మార్కులు వచ్చాయి.మళ్లీ ప్రయత్నించి..‘అమ్మా నాన్నా నన్ను బాగా చదువుకోమని ప్రోత్సహించారు. లాక్డౌన్ వల్ల మొదటిసారి నీట్ రాసినప్పుడు నాకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చేంత ర్యాంక్ రాలేదు. నిస్పృహ చెందకుండా ప్రయత్నించాను. ఈసారి కోచింగ్ తీసుకున్నాను. ఆరు గంటలు కోచింగ్, ఇంట్లో మరో నాలుగైదు గంటలు సెల్ఫ్ స్టడీ... ఇలా సాగింది నా కృషి.కోచింగ్ సెంటర్లో మాక్ టెస్ట్‌లు రాసేటప్పుడు 700 మార్కులకు తరచూ 620 వచ్చేవి. అప్పుడే అనుకున్నాను... కచ్చితంగా 700 దాటుతానని ముందే అనుకున్నాను’ అని తెలిపింది అమీనా. ఆమెకు వచ్చిన ర్యాంక్‌కు దేశంలోని ఏ మెడికల్ కాలేజీలో అయినా సీట్ వస్తుంది కానీ అమీనా మాత్రం ఢిల్లీ ఎయిమ్స్‌లో చదవాలనుకుంటోంది. -
ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. శోకసంద్రంలో మమ్ముట్టి కుటుంబం!
ప్రముఖ సీనియర్ నటుడు, మలయాళం స్టార్ మమ్ముట్టి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి అమీనా(70) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుకూ తుదిశ్వాస విడిచారు. కాగా.. అమీనాకు జిబిన్ సలీం, జూలీ, జూబీ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇటీవలే మమ్ముట్టి తన 72వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ) అయితే ఈ ఏడాదిలోనే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే. వరుస విషాదాలతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం ప్రకటించారు. కాగా.. ప్రస్తుతం మమ్ముట్టి 'బ్రహ్మయుగం' అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. (ఇది చదవండి: ఆ రెండు చిత్రాలనే నమ్ముకున్న రకుల్.. ఈసారైన కలిసొచ్చేనా?) -
భార్య ఉండగానే రెండోపెళ్లి
వరంగల్: భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకొని ఓ ప్రబుద్ధుడు దుబాయ్ వెళ్లడంతో అతడి ఇంటి ఎదుట మొదటి భార్య న్యాయం కావాలంటూ ధర్నా చేపట్టిన సంఘటన వరంగల్ ఎల్బీనగర్లో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ కాకాజీకాలనీకి చెందిన అమీనా అనే యువతికి వరంగల్ ఎల్బీనగర్కు చెందిన నజీంతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో అమీనా తండ్రి జహీర్‌ఖాన్ సుమారు రూ.10లక్షల వరకు కట్న కానుకలు అల్లుడు నజీంకు ముట్టజెప్పారు. పెళ్లయిన తర్వాత అమీనాను దుబాయ్‌కు తీసుకుపోయిన నజీం అదనపు కట్నం కావాలంటూ తరచూ వేధించేవాడు. అమీనా తల్లిదండ్రులు ఫోన్ చేసిన ప్రతీసారి తాను వ్యాపారం చేసేందుకు రూ.10 లక్షలు కట్నం, 20 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేసేవాడు. చివరకు కొన్ని రోజుల క్రితం వరంగల్‌కు తీసుకొచ్చి అమీనాను తల్లిగారింట్లో వదిలేశాడు. దుబాయ్‌కి వెళ్లిన నజీద్ ఫోన్ చేసిన ప్రతిసారి అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురానికి తీసుకుపోతానని అనేవాడు. నజీద్ తల్లి దండ్రులు సైతం కట్నం వేధింపులకు గురిచేసే వారు. ఇటీవల తనకు రెండో పెళ్లి అయినట్లు నజీద్ అమీనాకు వాట్సాప్ పోస్ట్ చేశాడు. ఈ విషయంపై నజీద్ అమ్మానాన్నలను ప్రశ్నించగా అవును .. నా కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడు.. ఏం చేస్తావో చేసుకో పో అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో అమీనా కుటుంబ సభ్యులు శనివారం నజీం ఇంటి ఎదుట టెంట్ వేసి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. వీరికి మహిళా సంఘాలు, ముస్లిం మహిళలు సంఘీభావం వ్యక్తం చేయడమే కాకుండా రెండో పెళ్లి చేసుకున్న నజీంను దుబాయ్ నుంచి రప్పించి అమీనాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నజీంకు రెండో పెళ్లి చేసిన అమీనా అత్తమామలను అరెస్టు చేసి న్యాయం చేయాలని మైనార్టీ మహిళా నాయకురాలు రహిమున్నీసా పోలీసుల ను కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అమీనా మామ అజహర్‌పై దాడికి ప్రయత్నించగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎలాంటి గొడవలు కాకుండా భద్రత ఏర్పాటు చేశారు. బాధితురాలికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధితులు ఫిర్యాదు చేయనందున కేసు ఫైల్ కాలేదని ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపారు. -
విద్యార్థిని దారుణ హత్య: నిందితుడి అరెస్ట్
-
విద్యార్థిని దారుణ హత్య: నిందితుడి అరెస్ట్
రంగారెడ్డి: గండిపేటలోని ఓ ఫాంహౌస్ సమీపంలో దారుణ హత్యకు గురైన యువతి కేసులో 24 గంటల్లోపే పోలీసులు పురోగతి సాధించారు. ఆదివారం హత్యకు గురైన విద్యార్థినిని అమీనాగా గుర్తించారు. ఫలక్‌నుమాలో అమీనా 9వ తరగతి చదువుకుంటోంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అమీనాను బైక్ పై తీసుకువెళ్లిన వ్యక్తిని ఫలక్‌నుమాలో నివాసముంటున్న అక్బర్‌గా గుర్తించారు. (చదవండి: గొంతుకోసి, రాళ్లతో కొట్టి యువతి హత్య) యువతి చేతులు, కాళ్లు కట్టేసి దుండగులు రాళ్లతో కొట్టి చంపిన విషయం తెలిసిందే. డబ్బుకోసమే అమీనాను హత్య చేశానని అక్బర్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. మొదటగా డబ్బు కోసమే అమీనాను బెదించానని, డబ్బులు ఇవ్వకపోవడంతో బ్లేడుతో దాడి చేశానని చెప్పాడు. గాయపడ్డ అమీనా తనను ఆస్పత్రికి తీసుకెళ్తే డబ్బులు ఇస్తానందని తెలిపాడు. ఆసుపత్రి తీసుకెళ్తానని చెప్పి..మార్గమధ్యలో హత్య చేసినట్టు అక్బర్ చెప్పాడు. -
సిరాజ్ ఫేస్బుక్ ద్వారానే అమీనా లింకు!
* ఐసిస్ సానుభూతిపరురాలి వివరాలు తెలిసిందిలా.. * ఇంకా ఆ బాటలోకి వెళ్లలేదని చెబుతున్న నిఘా వర్గాలు * సిరాజుద్దీన్‌ను ఐసిస్‌వైపు ఆకర్షించింది నిక్కీ జోసెఫ్ * ఇతడి లోకల్ కాంటాక్ట్‌పై లోతుగా సాగుతున్న దర్యాప్తు సాక్షి, హైదరాబాద్: నగరంలోని టోలిచౌకిలో ఓ ఇంట్లో పని చేయడానికి వచ్చిన కెన్యా జాతీయురాలు అమీనా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు వెలుగులోకి రావడం కలకలం రేపింది. కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పలు కోణాల్లో ప్రశ్నించారు. పూర్వాపరాలను పరిశీలించి, శనివారం ఆమెను కెన్యాకు బలవంతంగా తిప్పిపంపిన విషయం విదితమే. ఈమెకు సంబంధించిన సమాచారం కేంద్రనిఘా వర్గాలకు రాజస్థాన్‌లో అరెస్ట్ అయిన సిరాజుద్దీన్ ద్వారా తెలిసింది. సిటీ నుంచి మొదలై సిటీకి..: ఐసిస్‌లో చేరేం దుకు దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న హైదరాబాదీ సల్మాన్ మొయినుద్దీన్‌ను ఈ ఏడాది జనవరిలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు. ఇతడి విచారణలోనే తొలిసారిగా నిక్కీ జోసెఫ్ అనే పేరు వెలుగులోకి వచ్చింది. బ్రిటిష్ జాతీయురాలుగా చెప్పుకున్న ఆమె ఫేస్బుక్ ద్వారా పరిచయమైందని, తనతో పాటు అనేక మందిని ఐసిస్ వైపు ఆకర్షించిందని సల్మాన్ వెల్లడించాడు. ఈమె గురించి ఆరా తీయగా.. హైదరాబాద్‌కు చెందిన, దుబాయ్‌లో స్థిరపడిన ఆఫ్షాన్ జబీన్ అని గుర్తించారు. సెప్టెంబర్‌లో దుబాయ్ నుంచి రప్పించి ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు. జబీన్‌తో సంబంధాలు కొనసాగించిన, ఐసిస్ వైపు పలువురిని ఆకర్షిస్తున్న వారి కోసం గాలించిన నిఘా వర్గాలు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మహ్మద్ సిరాజుద్దీన్ కీలకమని గుర్తించాయి. ఇతడిని రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. సిరాజ్ ఫేస్బుక్ పేజ్ ఆధారంగా ఫ్రెండ్స్ లిస్ట్‌లోని హైదరాబాద్‌లో నివసిస్తున్న కెన్యా జాతీయురాలు అమీనా ఐసిస్‌పై ఆసక్తి చూపుతోందని గుర్తించారు. ఈమెను అదుపులోకి తీసుకున్న సిటీ పోలీసులు శనివారం ముంబై మీదుగా కెన్యా పంపేశారు. జైపూర్ చేరిన రాష్ట్ర బృందం..: సిరాజుద్దీన్ వ్యవహారాన్ని రాజస్థాన్ పోలీసులతో పాటు కేంద్ర నిఘా వర్గాలూ లోతుగా ఆరా తీస్తున్నాయి. సోషల్‌మీడియా ద్వారా ఇతడితో సంబంధాలు కొనసాగించిన, ఐసిస్‌పై ఆసక్తిచూపిన వారిలో తెలంగాణకు చెందిన పలువురు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించాయి. వారెవరనేది రూఢీ చేసుకోవడానికి సిరాజ్ ఫేస్బుక్, వాట్సప్, టెలిగ్రామ్ ఖాతాల్లోని అంశాలను విశ్లేషిస్తున్నాయి. ఇతడిని ప్రశ్నించడంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి రాష్ట్ర నిఘా వర్గాలకు చెందిన ఓ బృందం జైపూర్ చేరుకుంది. సిరాజ్‌కు చెందిన సోషల్‌మీడియా అకౌంట్ల నుంచి సేకరించిన సమాచారం దాదాపు 12 వేల పేజీలు ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. వాటిలోని అంశాలు, పోస్ట్ చేసిన, సమాచారం పంపిన వారి వివరాలను కేంద్ర నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయని, అది పూర్తయితేనే తెలంగాణ లింకులు బయటకు వస్తాయని చెప్పారు. అమీనా ఇంకా ఉగ్రవాదబాట పట్టలేదని, కేవలం ఫేస్బుక్ ద్వారా సంప్రదింపులు జరిపిందని వివరించారు.