ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. శోకసంద్రంలో మమ్ముట్టి కుటుంబం! | Malayalam Legendary Actor Mammootty Sister Ameena Passes Away At Age Of 70 - Sakshi
Sakshi News home page

Mammootty: మమ్ముట్టి ఇంట్లో మరో విషాదం.. ఆ బాధను మరవకముందే!

Sep 12 2023 12:57 PM | Updated on Sep 12 2023 1:07 PM

Malayalam Actor Mammootty sister Ameena passes away at 70 - Sakshi

ప్రముఖ సీనియర్ నటుడు, మలయాళం స్టార్ మమ్ముట్టి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి అమీనా(70) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుకూ తుదిశ్వాస విడిచారు. కాగా.. అమీనాకు  జిబిన్ సలీం, జూలీ, జూబీ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. బుధవారం (సెప్టెంబర్ 13) ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇటీవలే మమ్ముట్టి తన 72వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: Balayya : నేను ముందుంటా, టిడిపిని నడిపిస్తా : బాలకృష్ణ)

అయితే ఈ ఏడాదిలోనే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే. వరుస విషాదాలతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అమీనా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ, మమ్ముట్టి అభిమానులు సంతాపం ప్రకటించారు. కాగా.. ప్రస్తుతం మమ్ముట్టి 'బ్రహ్మయుగం' అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 7 ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 

(ఇది చదవండి: ఆ రెండు చిత్రాలనే నమ్ముకున్న రకుల్‌.. ఈసారైన కలిసొచ్చేనా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement