Malayalam actor Mammootty's mother Fatima Ismail passes away - Sakshi
Sakshi News home page

Mammootty: మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం..!

Published Fri, Apr 21 2023 11:36 AM | Last Updated on Fri, Apr 21 2023 11:47 AM

Malayalam Actor Mammootty mother Fatima Ismail passed Away - Sakshi

మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తల్లి ఇవాళ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫాతిమా ఇస్మాయిల్(93) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. 

 కాగా.. మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగువారికి కూడా సుపరిచితమైన నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ చాలా సినిమాల్లో నటించారు. తనదైన నటనతో టాలీవుడ్‌ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. గతేడాది ఆయన నటించిన చిత్రం రాస్‌చాక్‌‌. ఈ సినిమా మంచి విజయం సాధించింది.ప్రస్తుతం అక్కినేని అఖిల్ మూవీ ఏజెంట్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement