మమ్ముట్టికి డైరెక్టర్ క్షమాపణలు.. ఎందుకంటే? | kollywood Movie Director Apologises To Malayala Star Mammootty | Sakshi
Sakshi News home page

Mammootty: మమ్ముట్టికి డైరెక్టర్ క్షమాపణలు.. ఎందుకంటే?

Published Sun, Jun 2 2024 7:16 AM | Last Updated on Sun, Jun 2 2024 11:29 AM

kollywood Movie Director Apologises To Malayala Star Mammootty

నటుడు విధార్ధ్, వాణి భోజన్‌ జంటగా నటించిన చిత్రం అంజామై. ఈ చిత్రం ద్వారా ఎస్‌వీ.సుబ్బురామన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు మోహన్‌రాజా, లింగుసామి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు.  ప్రముఖ వైద్యుడు, ర చయిత తిరునావుక్కరసు నిర్మాతగా తిరుచిత్రం పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 7వ తేదీన తెరపైకి రానుంది.   ఈ చిత్రం విడుదల హక్కులను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్స్‌ పొందడం విశేషం. ఈ సంస్థ ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

చిత్ర దర్శకుడు సుబ్బురామన్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రం పరిస్థితుల ప్రభావంతోనే రూపొందిందని చెప్పాలన్నారు. ఈ చిత్ర నిర్మాత తిరునావుక్కరసు ఒక వైద్యుడు మాత్రమే కాకుండా, రచయిత, సామాజిక సృహ కలిగిన వ్యక్తి అని చెప్పారు. నిజానికి ఇందులో నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్ర  పోషించాల్సిఉందని.. అందుకు ఆయన ఒప్పుకున్నా, అనివార్య కారణాల వల్ల ఆ పాత్రలో నటుడు రఘమాన్‌ను నటించాల్సి వచ్చిందని చెప్పారు. అందుకు ఈ సందర్భంగా మమ్ముటికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నానన్నారు. 

అయితే ఆ పాత్రలో రఘుమాన్‌ చాలా బాగా నటించారని చెప్పారు. చట్టం చేసే అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కారణంగా ఒక సామాన్యుడు ఎలాంటి బాధలకు గురయ్యారనేదే ఈ చిత్ర కథాంశం అని చెప్పారు. విధార్ద్‌ మంచి నటుడన్నది తెలిందేననీ, అయితే ఆయన నుంచి మరింత నటనను వెలికి తీసినట్లు చెప్పారు. ఇక నటి వాణీభోజన్‌ ఈ చిత్రంలో మరో కోణంలో నటించారని చెప్పారు. నటి వాణిభోజన్‌ మాట్లాడుతూ అంజామై తనకు చాలా స్సెషల్‌ చిత్రం అని పేర్కొన్నారు.    ఈ చిత్రంలో నటుడు రఘుమాన్, కృతిక్‌ మోహన్, బాలచంద్రన్‌ ఐఏఎస్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్‌ ఛాయాగ్రహణం, కళాచరణ్‌ నేపథ్య సంగీతాన్ని అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement