ఓటీటీకి వచ్చేస్తోన్న ఫుల్‌ యాక్షన్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Mammootty Starrer Malayalam Movie Turbo Streaming On This Date | Sakshi
Sakshi News home page

Mammootty: ఓటీటీకి వచ్చేస్తోన్న టర్బో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Tue, Jul 30 2024 4:38 PM | Last Updated on Tue, Jul 30 2024 5:04 PM

Mammootty Starrer Malayalam Movie Turbo Streaming On This Date

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం టర్బో. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్‌ మూవీగా మలయాళంలో తెరకెక్కించారు. మే 23న మలయాళంలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో మెప్పించారు. 

తాజాగా ఈ  చిత్రం ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.  మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సోనిలివ్ ప్రకటించింది. కాగా.. ఈ చిత్రంలో అంజనా జయ ప్రకాశ్‌, రాజ్‌ బి.శెట్టి, శబరీష్‌ వర్మ, సునీల్‌, కబిర్‌ దుహాన్‌ సింగ్‌లు కీలక పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement