ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Police Crime Thriller Movie Thalavan will be streaming from this Date | Sakshi
Sakshi News home page

Thalavan Ott Release: ఓటీటీకి వస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Sun, Aug 11 2024 2:37 PM | Last Updated on Sun, Aug 11 2024 2:57 PM

Police Crime Thriller Movie Thalavan will be streaming from this Date

బిజు మీనన్‌, ఆసీఫ్‌ అలీ నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ 'తలవన్‌'. ఈ సినిమాను జిస్‌ జాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కించరు. ఈ ఏడాది మే నెలలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ ప్రేక్షకులను మెప్పించింది. పోలీస్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మలయాళంలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ పోలీస్ క్రైమ్ థ్రిల్లర్‌ సెప్టెంబర్ 12 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడతో సహా మొత్తం ఏడు భాషల్లో  స్ట్రీమింగ్‌ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పోలీస్ అధికారి ఓ కేసును ఎలా చేధించాడనేది ఈ సినిమాలో చూపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement