డోర్ నాబ్స్‌తో జర జాగ్రత్త!
జెర్మ్స్‌తో హార్మ్స్
మనం ఆఫీసుల్లో పనిచేసే సమయంలో ఇతరుల క్యాబిన్స్‌లోకి ప్రవేశించే ముందు, వాష్‌రూమ్‌లలోకి వెళ్లే ముందు ఆ డోర్ నాబ్ పొడిగా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ పొడిగా లేకపోతే కొన్ని పేపర్ న్యాప్‌కిన్స్‌ను ఎప్పుడూ దగ్గర పెట్టుకొని, ఆ న్యాప్‌కిన్‌ను నాబ్ చుట్టూ చుట్టి తెరవండి. ఎందుకంటే మీ కొలీగ్స్‌లో ఎవరికైనా జలుబు వంటి అనారోగ్యాలు ఉంటే అవి డోర్ నాబ్స్ ద్వారా ఇతరులకు తేలిగ్గా సంక్రమిస్తాయని ‘ఇంటర్‌సైన్స్ కాన్ఫరెన్స్ ఆన్ యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ అండ్ కీమోథెరపీ’ అనే సదస్సులో పాల్గొన్న నిపుణులు తెలిపారు. ఈ విషయాన్ని నిరూపించడం కోసం వారు ఒక ప్రయోగం చేశారు.
కొన్ని డోర్‌నాబ్స్‌కు ఏమాత్రం హాని చేయని సూక్ష్మజీవి అయిన ‘బ్యాక్టీరియోఫేజ్ ఎమ్మెస్-2’ను పూశారు. ఆ తర్వాత పరీక్షిస్తే అక్కడి 60% మంది చేతులకు ఈ సూక్ష్మజీవి అంటుకుని ఉంది. తద్వారా తేలిన విషయం ఏమిటంటే... ఒకవేళ హాని చేయని ఈ సూక్ష్మజీవికి బదులుగా హాని చేసే హ్యూమన్ నోరోవైరస్ వంటి వ్యాధికలిగించేది ఏదైనా ‘బ్యాక్టీరియోఫేజ్ ఎమ్మెస్-2’ స్థానంలో ఉంటే... ఆ 60% మందీ నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి దుష్పరిణామాలతో బాధపడేవారు.