Wash Room
-
ఈ బాధలు ఎప్పటికీ తీరేను.. పాలకులు పట్టించుకోరా?
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ టాయిలెట్ దినోత్సవం’ జరుపుకుంటున్నా నేటికీ ప్రపంచంలో 350 కోట్ల ప్రజలకు టాయిలెట్ (మరుగుదొడ్డి) సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. టాయిలెట్ సౌకర్యలేమి కారణంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, బాలికలు... తీవ్రమైన మానసిక, ఆరోగ్య, సామాజిక సమస్యలకు గురవుతున్నారు. అనేక పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర పని ప్రదేశాల్లో సరైన టాయిలెట్ సదుపాయాలు, మంచినీటి సౌకర్యం వంటివి లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 41.9 కోట్లమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారనీ, సుమారు 220 కోట్లమంది ప్రజలకు మంచినీటి సౌకర్యం లేదనీ, 11.5 కోట్లమంది కుంటలూ, చెరువులు, బావులు వంటి వాటిలోని సురక్షితం కాని నీరు తాగుతున్నారనీ గణాంకాలు చెబుతున్నాయి. సరైన మంచినీరు, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడంతో ప్రతిరోజూ వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక మన భారతదేశంలో 2019–21లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం 69.3 శాతం మంది మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేటికీ 19.4 శాతం మంది మనదేశంలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. 2014 అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్‘ ప్రారంభించినా నేటికీ అందరికీ టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు.చదవండి: మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!మనదేశం త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఆవిర్భవించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. కనీసం ప్రజలందరికీ టాయిలెట్ సౌకర్యం కల్పించకుండా ఇది సాధ్యంకాదు. అందుకే ప్రభుత్వాలు ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.– ఐ. ప్రసాదరావు; ఉపాధ్యాయుడు, కాకినాడ (నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం) -
వాష్ రూంకు వెళ్లొస్తానని... పరీక్ష కేంద్రం నుంచి వెళ్లిపోయిన అభ్యర్థి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: పరీక్షా కేంద్రం నుంచి నిర్ణీత సమయం కంటే ముందే పారిపోయిన అభ్యర్థిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి మంగళవారం పరీక్ష జరిగింది. ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షకు మేడ్చల్ మండలంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ సెట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్‌కు చెందిన మహ్మద్ అసర్ హాజరయ్యాడు. బయో సబ్జెక్ట్‌కు విరామం ఇచ్చిన సమయంలో సాయంత్రం 4:15 నిమిషాలకు అసర్ టాయిలెట్ కోసం అనుమతి తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతను పారిపోయినట్లు గుర్తించిన చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌రెడ్డి మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. -
గురక శబ్ధంతో వీడిన వ్యభిచార ముఠా గుట్టు
బెంగళూరు: అప్పట్లో.. రాజులు యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించి చరిత్రలో చదివి ఉంటాం. సాధారణంగా.. ఐటీ రైడింగ్‌లకు భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్ గదుల్లోనూ, వాటర్ ట్యాంక్‌ల్లోనో దాచడం చూస్తుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ చూసి ఉంటాం. కానీ, టాయిలెట్లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ముఠా ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఈమధ్యకాలంలో ఇతర రాష్ట్రాల వ్యభిచార ముఠాల వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిత్రదుర్గలోని ఓ చోట వ్యభిచారం చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకుని స్పెషల్ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో వెతికినా ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలోని బాత్రూమ్ను పరిశీలించగా.. ఒకచోట నుంచి గురక శబ్దం వినిపించింది. శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించిన ఓ అధికారికి.. టైల్స్ నుంచి రావడం వినిపించింది. అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే.. అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది. పోలీసులు గదిని తెరిచి చూడగా.. అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. -
పోలీసులకే టోకరా.. వాష్‌రూమ్ వెళ్తానని చెప్పి..
సాక్షి, వికారాబాద్: దొంగల ముఠాలోని ఒక సభ్యుడు ఏకంగా పోలీసులనే మోసం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది. దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగల గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. వారిలో ప్రధాన నిందితుడు మహమ్మద్ వాష్‌రూమ్‌కు వెళ్లాలని పోలీసులను కోరాడు. దీంతో వారు.. అతడిని వదిలిపెట్టారు. ఎంత సమయం గడిచిన నిందితుడు రాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి వెళ్లి చూశారు. అక్కడ నిందితుడు లేడు. దీంతో షాకైన పోలీసులు.. తప్పించుకున్న నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు. చదవండి: రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు.. -
వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసు: జువైనల్ హోంకు బాలుడి తరలింపు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని ఓ ఫుడ్కోర్ట్ బాత్రూమ్లో సెల్‌ఫోన్ కెమెరా ఆన్ చేసి ఉంచి వీడియో రికార్డు చేసిన ఘటనలో నిందితుడైన మైనర్ బాలుడి(17)ని జువైనల్ హోమ్‌కు పంపించగా మేనేజర్ శ్రీకాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజులుగా ఇక్కడ హౌజ్ కీపింగ్ బాయ్ ఓ బాత్రూమ్లో కెమెరా ఏర్పాటు చేయగా ఓ యువతి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు 20 మంది యువతుల నగ్న దృశ్యాలు ఉన్నట్లు గుర్తించారు. మొబైల్లో మొత్తం 5 గంటల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: Jubilee Hills:వాష్‌రూమ్‌లో స్పై కెమెరా: వన్ డ్రైవ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు -
వన్ డ్రైవ్ రెస్టారెంట్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని వన్ డ్రైవ్ రెస్టారెంట్ వాష్‌రూమ్‌లో మొబైల్ అమర్చిన కేసులో నిందితుడైన మైనర్ బాలుడిని జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఫుడ్ కోర్టు సీసీ ఫుటేజీని మొత్తం స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చైతన్య ఇంటిలో సోదాలు జరుపుతున్నారు. విచారణలో మైనర్ బాలుడు బెనర్జీ పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడని, అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు . అయితే ఈ కేసులో కేశవ్ పాత్రపై ఇంకా పోలీసులకు క్లారిటీ రాలేదు. కాగా వన్ డ్రైవ్ రెస్టారెంట్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ ప్లేస్‌లో మొబైల్ అమర్చిన ఈనెల 22వ తేదిన ఓ యువతి ఫిర్యాదు చేసిందని జూబ్లీహిల్స్ ఎస్ఐ నవీన్ రెడ్డి తెలిపారు. నిందితుడు మైనర్ బాలుడు అరు నెలలుగా ఈ హోటల్లో పని చేస్తున్నడని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్నారనే విషయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫుడ్‌కోర్టుకు తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువతి రెస్ట్రూమ్కు వెళ్లింది. అక్కడి బాత్రూమ్లో కెమెరా ఆన్‌చేసిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్ పర్సనల్ పని కోసం యువతి బాత్ రూం వెళ్ళినప్పుడు సీక్రెట్ ప్లేస్‌లో యువతి స్పై కెమెరా గమనించిందన్నారు. వెంటనే మేనేజ్మెంట్ దృష్టికి ఆ తర్వాత పోలీసుల దృష్టికి తీసుకు వచ్చిందని చెప్పారు. మైనర్ బాలుడు వారం రోజుల క్రితమే ఆ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడని, వాష్ రూమ్‌లో వీడియో చిత్రీకరించే సమయంలో ఫోన్లో సిమ్ కార్డ్ లేదని వెల్లడించారు. 14 వేలకు ఫోన్ కొన్నాడని, తన ఫోన్ నుంచి ఎవరికీ ఆ వీడియోలు పంపినట్లు తాము కనుగొనలేదని వెల్లడించారు. (చదవండి: ఓయో రూమ్‌కు వస్తే ఉద్యోగం ఇస్తా..) నిందితుడిది సైకో మనస్తత్వం హోటల్ యజమాని చైతన్యను పీఎస్‌కు పిలిపించి విచారించాము. హోటల్లో ఉన్న అక్కడి సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నాం. తమ ఫుటేజ్ ఉందా అని పోలీస్ స్టేషన్‌కు ఎవరూ రాలేదు. కేశవ్ వ్యక్తి అక్కడ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉన్నాడు. అతని ప్రమేయం ఏముందో తెలియాలి. కేశవ్ అనే వ్యక్తి గురుంచి మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. నిందితుడిది సైకో మనస్తత్వం. మానసిక స్థితి సరిగాలేదు. కేసులో ప్రమేయం వున్న వారందరిని విచారిస్తాం. ఒక్కడే ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. మైనర్ బాలునిపై ఐపీసీ 354, 506 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. వన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు హోటల్ పై కేసు నమోదు చేశాం’ అని పోలీసులు తెలిపారు. స్పై కెమెరా పెట్టింది అతనే కాగా తమ హోటల్లో స్పై కెమెరా పెట్టింది హౌజ్ కీపింగ్ బాయ్ బెనర్జీనే అని, అతడికి యాజమాన్యం సహకరించింది లేదని వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టు యజమాని చైతన్య తెలిపారు. ఈ వ్యవహారంపై ఫుడ్ కోర్టు యజమాని చైతన్య స్పందించాడు. చైతన్య మాట్లాడుతూ.. ‘‘మా హోటల్లో స్పై కెమెరా పెట్టింది హౌజ్ కీపింగ్ బాయ్ బెనర్జీనే. అతనికి హోటల్ యాజమన్యం సహకరించింది లేదు. నిందితుడు ఫోన్ కొని నాలుగు రోజులే అవుతుంది. ఫోన్ వాష్ రూంలో పెట్టిన రోజే గుర్తించారు. ఆరు నెలల నుంచి ఫోన్ పెట్టలేదు. ఆ వార్తలు అవాస్తవం. పోలీసులకు నేను సహకరిస్తున్నాను. ఎవరూ ఆందోళన చెందవద్దు’’ అని కోరాడు. -
సిటీకి స్మార్ట్ వాష్‌రూమ్స్
సాక్షి, సిటీబ్యూరో : ఉచిత వైఫై, ఏటీఎం సెంటర్, సోలార్ రూఫింగ్, బయో డైజెస్టర్, ఇన్సినరేటర్లు, శానిటరీ నాప్కిన్ల విక్రయ కౌంటర్ వంటి సదుపాయాలతో ‘స్మార్ట్ వాష్‌రూమ్స్’ రానున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ఇప్పటికే పలు స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ.. నగరంలోని 25 ప్రాంతాల్లో స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ వాష్‌రూమ్స్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్‌లో ఈ సంవత్సరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన ఇండోర్‌తో పాటు వివిధ నగరాల్లోని స్వచ్ఛ కార్యక్రమాల అమలును పరిశీలించి వచ్చిన అధికారులు ఈ స్మార్ట్ వాష్‌రూమ్స్ ఏర్పాటు చేయాలని భావించారు. తొలిదశలో ఐటీ సంస్థలు, నిపుణులు ఎక్కువగా ఉన్న శేరిలింగంపల్లి జోన్ (పాత వెస్ట్‌జోన్)లో వీటిని ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతో ఆ దిశగా గ్రేటర్ అధికారులు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ)లో భాగంగా వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థల కోసం బిడ్లు ఆహ్వానించనున్నారు. ఉచిత సేవలందించే ఈ స్మార్ట్ వాష్‌రూమ్‌లు పురుషులకు, మహిళలకు, దివ్యాంగులకు వేర్వేరుగా ఉంటాయి. వీటిని ఏర్పాటు చేసే సంస్థలు వాటిపై ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందడంతో పాటు, జీహెచ్ఎంసీకి కూడా కొంతమేర చెల్లించాల్సి ఉంటుంది. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థల నుంచి ఓపెన్ బిడ్లు ఆహ్వానించేందుకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే వాటి నుంచి ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) స్వీకరించి ఏజెన్సీలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే శిల్పారామం ఎదుట ఇటీవల లగ్జరీ వాష్‌రూమ్స్ అందుబాటులోకి తేవడం తెలిసిందే. -
ట్రాన్స్‌జెండర్‌పై విరుచుకుపడ్డ రాజకీయనాయకురాలు
-
లేడీస్ టాయిలెట్ ఉపయోగించిందని..
లాస్ ఏంజెలెస్: ట్రాన్స్‌జెండర్ లేడీస్ టాయిలెట్ ఉపయోగించిందని ఆమెపై విరుచుకుపడిందో రాజకీయనాయకురాలు. ఆ దృశ్యాలను స్వయంగా వీడియో తీసిన ఆమె సోషల్ మీడియాలో ఉంచింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రిపబ్లికన్ కాంగ్రేషనల్ పార్టీకి చెందిన జజ్మినా సావేండ్ర అనే రాజకీయనాయకురాలు లాస్ ఏంజెలెస్ డెన్నీస్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ ట్రాన్స్‌జెండర్ లేడీస్ టాయిలెట్‌ను ఉపయోగించటం ఆమె గమనించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన జజ్మినా ట్రాన్స్‌జెండర్‌పై విరుచుకుపడంది. ట్రాన్స్‌జెండర్‌ను అవమానిస్తూ తీవ్ర దుర్భాషలాడింది. ఈ తతంగాన్నంతా స్వయంగా వీడియో తీసిన జజ్మినా దాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. ఇలా ఓ ట్రాన్స్‌జెండర్‌ను తిట్టడంపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో ఘాటుగా స్పందించారు. దీంతో వెనక్కు తగ్గిన జజ్మినా తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు సరికదా ఎదురు దాడి మరింత పెరిగింది. -
నాలుగేళ్లుగా మరుగుదొడ్డే ఆ కుటుంబం నివాసం
-
విమానం వాష్‌రూమ్‌లో బంగారుకొండ!
పణాజి: ఒక వేళ మీరుగానీ ఆ విమానంలో ప్రయాణించి ఉంటే.. అందులోని వాష్ రూమ్ లోకి వెళ్లుంటే.. ఆ మూలన ఉన్న చిన్నపాటి బంగారుకొండను చూసి అదిరిపోయేవారు. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా ఏడు కేజీల బంగారమది. ఓనరంటూ ఎవ్వరూలేని, ఓ నలుపు రంగు బ్యాగ్ లో దాగున్న ఆ బంగారాన్ని గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్ వేస్ విమానం వాష్ రూమ్ లో లభించిన బంగారం ఎక్కడ్నుంచి వచ్చిందో ప్రస్తుతానికి ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. విమానం సిబ్బందేమో 'మాకు తెలియదంటే మాకు తెలియదు' అని తడుముకోకుండా చెబుతున్నారు. ఏదైనా విమానం ల్యాండ్ అయ్యాక, మళ్లీ టేకాఫ్ అయ్యే ముందు దానిని క్షుణ్నంగా తనిఖీ చేయడం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ రోజూ జరిగేదే. అలా బుధవారం ఖతార్ నుంచి వచ్చిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా టాయిలెట్ లో ఒక మూలన బంగారు ఆభరణాలతో నిండిన బ్యాగ్ దొరికింది అధికారులకు. బయటికి తీసుకొచ్చి తూస్తే వాటి బరువు 7.12 కిలోలుఉంది. విలువ ఎంతుందనేది లెక్కలుకట్టాక చెబుతామని, ఆలోపు ఈ బ్యాగ్ ఎవరిదో కనిపెడతామని చెప్పారు గోవా డివిజన్ కస్టమ్స్ కమిషనర్ అన్పజఖన్. -
డోర్ నాబ్స్‌తో జర జాగ్రత్త!
జెర్మ్స్‌తో హార్మ్స్ మనం ఆఫీసుల్లో పనిచేసే సమయంలో ఇతరుల క్యాబిన్స్లోకి ప్రవేశించే ముందు, వాష్రూమ్లలోకి వెళ్లే ముందు ఆ డోర్ నాబ్ పొడిగా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ పొడిగా లేకపోతే కొన్ని పేపర్ న్యాప్కిన్స్ను ఎప్పుడూ దగ్గర పెట్టుకొని, ఆ న్యాప్కిన్ను నాబ్ చుట్టూ చుట్టి తెరవండి. ఎందుకంటే మీ కొలీగ్స్‌లో ఎవరికైనా జలుబు వంటి అనారోగ్యాలు ఉంటే అవి డోర్ నాబ్స్ ద్వారా ఇతరులకు తేలిగ్గా సంక్రమిస్తాయని ‘ఇంటర్సైన్స్ కాన్ఫరెన్స్ ఆన్ యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ అండ్ కీమోథెరపీ’ అనే సదస్సులో పాల్గొన్న నిపుణులు తెలిపారు. ఈ విషయాన్ని నిరూపించడం కోసం వారు ఒక ప్రయోగం చేశారు. కొన్ని డోర్నాబ్స్కు ఏమాత్రం హాని చేయని సూక్ష్మజీవి అయిన ‘బ్యాక్టీరియోఫేజ్ ఎమ్మెస్-2’ను పూశారు. ఆ తర్వాత పరీక్షిస్తే అక్కడి 60% మంది చేతులకు ఈ సూక్ష్మజీవి అంటుకుని ఉంది. తద్వారా తేలిన విషయం ఏమిటంటే... ఒకవేళ హాని చేయని ఈ సూక్ష్మజీవికి బదులుగా హాని చేసే హ్యూమన్ నోరోవైరస్ వంటి వ్యాధికలిగించేది ఏదైనా ‘బ్యాక్టీరియోఫేజ్ ఎమ్మెస్-2’ స్థానంలో ఉంటే... ఆ 60% మందీ నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి దుష్పరిణామాలతో బాధపడేవారు.