జజ్మినా సావేండ్ర
లాస్ ఏంజెలెస్: ట్రాన్స్‌జెండర్ లేడీస్ టాయిలెట్ ఉపయోగించిందని ఆమెపై విరుచుకుపడిందో రాజకీయనాయకురాలు. ఆ దృశ్యాలను స్వయంగా వీడియో తీసిన ఆమె సోషల్ మీడియాలో ఉంచింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రిపబ్లికన్ కాంగ్రేషనల్ పార్టీకి చెందిన జజ్మినా సావేండ్ర అనే రాజకీయనాయకురాలు లాస్ ఏంజెలెస్ డెన్నీస్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ ట్రాన్స్‌జెండర్ లేడీస్ టాయిలెట్‌ను ఉపయోగించటం ఆమె గమనించారు.
దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన జజ్మినా ట్రాన్స్‌జెండర్‌పై విరుచుకుపడంది. ట్రాన్స్‌జెండర్‌ను అవమానిస్తూ తీవ్ర దుర్భాషలాడింది. ఈ తతంగాన్నంతా స్వయంగా వీడియో తీసిన జజ్మినా దాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. ఇలా ఓ ట్రాన్స్‌జెండర్‌ను తిట్టడంపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో ఘాటుగా స్పందించారు. దీంతో వెనక్కు తగ్గిన జజ్మినా తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు సరికదా ఎదురు దాడి మరింత పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment