restaurent
-
ఇది డబుల్ డెక్కర్ బస్సు.. అలాగే రెస్టారెంట్ కూడా!
నగర సంచారం చేస్తూ, నోరూరించే రుచులను ఆస్వాదించే అనుభవాన్ని ప్రయాణికులకు అందిచాలనే ఉద్దేశంతో డబుల్ డెక్కర్ బస్సును రెస్టారెంట్‌గా మార్చేశారు. ‘బస్ట్రోనోమ్’ పేరుతో ప్రారంభించిన ఈ రెస్టారంట్ బస్సులు లండన్, పారిస్ నగరాల్లో పర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫ్రాన్స్‌కు చెందిన జీన్ క్రిస్టోఫ్ ఫార్నీర్, బెర్ట్రాండ్ మాథ్యూ అనే మిత్రులు 2013లో బస్సులో రెస్టారంట్‌ను ప్రారంభించాలని తలపెట్టారు. సరికొత్త డబుల్ డెక్కర్ బస్సును కొనుగోలు చేసి, దానిని పూర్తి స్థాయి రెస్టారెంట్లా మార్చారు. బస్సు కింది భాగంలో వంట గది, వంట సామగ్రి, సిబ్బంది ఉండటానికి వీలుగా తయారు చేసి, పైభాగాన్ని రెస్టారంట్గా తీర్చిదిద్దారు.ఇందులో 38 మంది కూర్చుని, విందు భోజనాలు ఆరగిస్తూ, పరిసరాలను పరిశీలిస్తూ నగర సంచారం చేయవచ్చు. తొలుత ‘బస్ట్రోనోమ్’ సేవలను పారిస్‌లో ప్రారంభించారు. పర్యాటకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఇటీవల లండన్‌లో కూడా మరో బస్సును రెస్టారంట్గా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. -
Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
‘రెస్టారెంట్ మేనేజ్మెంట్’ అంటే రెస్టారెంట్‌కు వెళ్లి ఇష్టమైన ఫుడ్ తిన్నంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు వేడి వేడిగా ఎదురవుతుంటాయి. చల్లని ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమిస్తేనే విజయం చేతికి అందుతుంది. ‘యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూర్’గా తనను తాను పరిచయం చేసుకునే అదితి దుగర్‌కు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా రెస్టారెంట్ బిజినెస్‌లోకి వచ్చింది. అయితే ఆమె ‘జీరో’ దగ్గరే ఉండిపోలేదు. కాలంతోపాటు ఎన్నోపాఠాలు నేర్చుకొని ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయ ఢంకా మోగించింది. ముంబైలో అదితి నిర్వహిస్తున్న ‘మాస్క్’ వరల్డ్స్ 50 బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సాధించింది. మనదేశంలో నంబర్‌వన్ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది.కొన్ని సంవత్సరాల క్రితం...ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ‘మాస్క్’ పేరుతో అదితి దుగర్ ఫైన్–డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించింది. అయితే ఈ రెస్టారెంట్ వ్యవహారం ఆమె మామగారికి బొత్తిగా నచ్చలేదు. సంప్రదాయ నిబద్ధుడైన ఆయన రెస్టారెంట్లోకి అడుగు కూడా పెట్టలేదు. అలాంటి మామగారు కాస్తా ‘మాస్క్’ రెస్టారెంట్ తక్కువ సమయంలోనే బాగాపాపులర్ కావడం గురించి విని సంతోషించడమే కాదు రెస్టారెంట్‌కి వచ్చి భోజనం చేశాడు. తన స్నేహితులను కూడా రెస్టారెంట్‌కు తీసుకు వస్తుంటాడు.తన కోడలు గురించి ఆయన ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలను పరిచయం చేయడంతో ‘మాస్క్’ దూసుకుపోయింది. మోస్ట్ ఫార్వర్డ్ – థింకింగ్ ఫైన్–డైనింగ్ రెస్టారెంట్‌గా పేరు తెచ్చుకుంది. ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన అదితి ఎన్నో వంటకాల రుచుల గురించి పెద్దల మాటట్లో విన్నది. అలా వంటలపై తనకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. ఇద్దరు పిల్లల తల్లిగా నాలుగు సంవత్సరాలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత కేటరింగ్‌పై దృష్టి పెట్టింది.ఇంటి నుంచే మొదలుపెట్టిన కేటరింగ్ వెంచర్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది అదితి. ఆహా ఏమి రుచి అనిపించేలా వంటకాల్లో దిట్ట అయిన తల్లి ఎన్నో సలహాలు ఇచ్చేది. ఒకవైపు తల్లి నుంచి సలహాలు తీసుకుంటూనే మరోవైపు ΄్యాకేజింగ్ నుంచి మార్కెటింగ్ వరకు ఎన్నో విషయాల్లో తీరిక లేకుండా గడిపేది అదితి.క్యాటరింగ్ అసైన్మెంట్స్లో భాగంగా అదితి ఒక బ్రిటిష్ హోం చెఫ్‌తో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇది తన తల్లిదండ్రులు, అత్తమామలకు ఎంతమాత్రం నచ్చలేదు. దీనికి కారణం అతడు నాన్–వెజ్ చెఫ్ కావడమే. అయితే ఆ సమయంలో భర్త ఆదిత్య అదితికి అండగా నిలబడ్డాడు. అత్తమామలు, తల్లిదండ్రులకు నచ్చచెప్పాడు. ఒకవేళ అదిత్య కూడా అసంతృప్తి బృందంలో ఉండి ఉంటే అదితి ప్రయాణం ముందుకు వెళ్లేది కాదు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘ఆ సమయంలో ఆదిత్య నాకు అండగా నిలబడకుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు’ అంటుంది అదితి.‘అదితి విషయంలో నేను ఎప్పుడూ నో చెప్పలేదు. ఎందుకంటే ఆమె తప్పు చేయదు అనే బలమైన నమ్మకం ఉంది. ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తుంది. ఆమె ఆలోచనల్లో పరిణతి ఉంది’ అంటాడు మెచ్చుకోలుగా ఆదిత్య. ‘కొత్తగా ఆలోచించేవాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి అడిగినవి సమకూర్చితే అద్భుతమైన ఫలితాలు చూపించగలరు’ అనే ఆదిత్య మాటను అక్షరాలా నిజం చేసింది అదితి. ఫ్యామిలీ హాలిడే ట్రిప్‌లో స్పెయిన్‌లో ఉన్న అదితికి ‘మాస్క్’ ఐడియా తట్టింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత తన కలకు శ్రీకారం చుట్టింది. ‘ఫలానా దేశంలో ఫలానా వంటకం అద్భుతంగా ఉంటుంది. ఆ వంటకం మీ రెస్టారెంట్లో అందుబాటులో ఉండే బాగుంటుంది’... ఇలాంటి సలహాలు ఎన్నో కేటరింగ్ క్లయింట్స్ నుంచి వచ్చేవి.ఎంతోమంది సలహాలు, సూచనలతో ‘మాస్క్’ మొదలై విజయం సాధించింది. అయితే ‘మాస్క్’ వేగానికి కోవిడ్ సంక్షోభం అడ్డుపడింది.‘కోవిడ్ సంక్షోభం వల్ల ఆర్థికంగా నష్టం వచ్చినప్పటికీ విలువైనపాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కోవిడ్ అనేది మా వ్యాపారానికి సంబంధించి స్పష్టతను ఇచ్చింది’ అంటుంది అదితి.ఒక్కసారి వెనక్కి వెళితే...‘మాస్క్ పేరుతో డబ్బులు వృథా చేసుకోకండి. మీకు రెస్టారెంట్ బిజినెస్‌లో జీరో అనుభవం ఉంది. వ్యాపారంలో మీకు నష్టం తప్ప ఏమీ మిగలదు’ అన్నారు చాలామంది. ‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. అదితి దుగర్ విజయం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. – అదితి దుగర్ -
సర్వర్ డ్రోన్ సుందరం
కాఫీ హోటల్ ఏదైనా సర్వర్ గారు సుందరమే అయి ఉంటాడని గతంలో అనుకునేవారు. ఎందుకంటే టిఫిన్ హోటల్స్ తమిళులే నడిపేవారు కాబట్టి. ఇప్పుడు సర్వర్ గారి అడ్రస్ గల్లంతయ్యేలా ఉంది. మనుషులకు జీతాలు ఇవ్వడం కంటే ఒక డ్రోన్‌తో మేనేజ్ చేయొచ్చని కోల్‌కతా రెస్టరెంట్ డిసైడ్ అయ్యింది. వాన కోసం ఆకాశం వైపు చూడొచ్చుగాని కాఫీ కోసం కూడా చూడొచ్చా? చూడొచ్చు. ఆకాశం నుంచి కాఫీ ఎగిరొచ్చి చేతికి అందుతుంది. ఇది కోల్‌కతా సాల్ట్‌లేక్ సిటీ ఏరియాలోని ‘కోల్‌కతా 64’ అనే రెస్టరెంట్ వారు తమ కస్టమర్లను ఆకర్షించడానికి వేసిన సాంకేతిక ఎత్తుగడ. ఆకర్షణ. రెస్టరెంట్ లోపల కూచున్న వారికి సర్వర్లు కాఫీ అందించినా బయట తమకు తోచిన చోటులో కూచుని కాఫీని ఆస్వాదించాలంటే డ్రోన్ సుందరం గారే కాఫీని అందిస్తారు. ఈ వీడియో ఇన్‌స్టాలో ప్రత్యేక్షం కాగానే ‘ఇదేదో బాగానే ఉంది’ అని చాలామంది మెచ్చుకుంటున్నారు. అయితే ఈ యంత్రం మనిషిని మాయం చేస్తున్నట్టే. మన దేశంలో మధ్యతరగతి జీవులకు కాఫీ హోటళ్లు, అందులో పని చేసే సర్వర్లు జీవితంలో భాగం. అందుకే సినిమాల్లో, సాహిత్యంలో సర్వర్లు కనపడతారు. కె.బాలచందర్ తీసిన ‘సర్వర్ సుందరం’లో నగేశ్ నటించి పేరు గడించాడు. ‘శుభలేఖ’లో చిరంజీవి కూడా ‘వెయిటర్’ అనబడు ‘సర్వరే’. ఇటీవలి కాలంలో ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ టిఫిన్ సెంటర్ నేపథ్యంలో ఓనర్ కమ్ సర్వర్‌గా హీరో చేసే స్ట్రగుల్‌ను చూపుతుంది. ఏమైనా ఈ డిజిటల్ ఏజ్‌లో ‘మాయమవుతున్నాడమ్మ మనిషి’ అనుకోక తప్పదు. -
మణికేరళం
ఎక్కడి కేరళ? ఎక్కడి మణిపుర్? అయితే మానవత్వానికి భౌగోళిక సరిహద్దులతో పనిలేదు అని నిరూపించే విషయం ఇది. కేరళ కోచిలోని ఆర్సీపీ రెస్టారెంట్లో మణిపుర్‌కు చెందిన సుస్మిత పనిచేస్తుంది. సర్వీస్ స్టాఫ్‌లో ఒకరైన సుస్మిత ఎప్పుడూ చురుగ్గా ఉంటుంది. మూడుసార్లు ‘బెస్ట్ ఎంప్లాయీ’గా అవార్డ్ కూడా అందుకుంది. అలాంటిది... ఓ రోజున సుస్మిత డల్‌గా ఉండడం చూసి ‘ఏమైంది?’ అని అడిగాడు జనరల్ మేనేజర్. తన రాష్ట్రం మణిపుర్లో జరుగుతున్న అల్లర్లు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తల్లి, సోదరి గురించి ప్రస్తావిస్తూ ‘వారికేమైనా అవుతుందేమో’ అంటూ భయపడింది. విషయం తెలిసిన చెఫ్ పిళ్లై, అతని టీమ్ మణిపుర్ నుంచి ఆమె తల్లి, సోదరిలను రప్పించి కోచిలో బస ఏర్పాటు చేశారు. సుస్మిత తల్లి ఇబెంచదేవి, సోదరి సర్ఫిదేవిలకు ‘ఆర్సీపీ కోచి కిచెన్’లో ఉపాధి కల్పించారు. ఈ స్టోరీ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది. -
ఉక్రెయిన్ రెస్టారెంట్‌పై రష్యా క్షిపణి దాడి
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లో పాపులర్ పిజ్జా రెస్టారెంట్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 11 మంది మరణించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో మరో 61 మందికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఇదే పెద్దది. అయితే ఈ క్షిపణి రెస్టారెంట్ వైపు వెళ్లేలా ప్రయోగించడానికి ఉక్రెయిన్‌కు చెందిన ఒక వ్యక్తి రష్యా మిలటరీకి సాయం చేశాడన్న ఆరోపణలపై ఉక్రెయిన్ అధికారులు ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. రష్యాలో ప్రైవేటు సైన్యం వాగ్నర్ సంస్థ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు తర్వాత రాజకీయంగా, మిలటరీ పరంగా అంతర్గత సంక్షోభం ఉన్నప్పటికీ ఆ దేశం ఉక్రెయిన్‌పై ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. -
విదేశీ భోజనంబు.. వింతైన వంటకంబు...
పొరుగింటి పుల్లకూర రుచి అంటారు. ముంబైకి చెందిన హేమ తన బిడ్డలు దియా, ఓజస్వీ శర్మలతో కలిసి ‘చిల్జో’ పుడ్బ్రాండ్ ద్వారా మన పొరుగుదేశాలతో పాటు ఇటలీ, ఆఫ్రికా, అమెరికా, చైనా... మొదలైన దేశాల వంటకాలను రుచి చూపిస్తూ ‘వావ్’ అనిపిస్తోంది... చైనా వంటకాలు చైనాకు వెళ్లే తిననక్కర్లేదు. ఇటలీ వంటకాలకు అక్కడికే వెళ్లనక్కర్లేదు. ముంబైలోని ‘చిల్జో’లోకి అడుగుపెడితే చాలు ఎన్నో దేశాలకు సంబంధించిన నోరూరించే వంటకాలు స్వాగతం పలుకుతాయి. గత సంవత్సరం హేమ తన కూతుళ్లు దియా, ఓజస్వీలతో కలిసి ఈ ఫుడ్రెస్టారెంట్ను ప్రారంభించింది. ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముంబైవాసులు మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడకు రావడం మొదలైంది. ‘ఇతర దేశాల ఆహార సంస్కృతిని అందిపుచ్చుకొని ఆస్వాదించడం మనకేమీ కొత్త కాదు. అయితే అక్కడి రుచిని ఇక్కడికి తీసుకు వచ్చినప్పుడే విజయవంతం అవుతాం’ అంటుంది దియా. చదువు పూర్తయిన తరువాత అమెరికాలోని ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేసింది దియా. ఉద్యోగ కాలంలో ఎన్నో ప్రాంతాలు తిరిగింది. ఆ సమయంలో రకరకాల రుచులతో పరిచయం అయింది. వంటల రుచికి మాత్రమే పరిమితమై పోకుండా ఎందరో చెఫ్‌లు, ఫుడ్ ఇండస్ట్రీలోని ప్రొఫెషనల్స్‌తో మాట్లాడింది. కోవిడ్ కల్లోల కాలంలో స్వదేశానికి తిరిగివచ్చిన దియా ఇంటి నుంచి పనిచేయడం ప్రారంభించింది. లాక్డౌన్ సమయంలో బయటికి వెళ్లి తినే పరిస్థితి లేదు. దాల్, రోటీ తినడం తప్ప మరోదారి లేదు. మరోవైపు రకరకాల వంటకాల రుచులు గుర్తుకొచ్చి నోరూరించేవి. ఆ సమయంలో వివిధ దేశాలకు చెందిన వంటకాల గురించి తెలుసుకునే పనిలో పడింది దియా. ‘ఎన్నో సంవత్సరాలు హాస్టల్ ఫుడ్ తిన్న నాకు కొత్త రుచి కావాలనిపించేది. నేను పాస్తాకు వీరాభిమానిని. దీంతో ఇంట్లో వంటల ప్రయోగాలు మొదలు పెట్టాం. చాలాసార్లు విఫలం అయిన తరువాతగానీ సక్సెస్ కాలేకపోయేవాళ్లం. మేము ప్రొఫెషనల్స్ కాకపోయినా యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ నేర్చుకున్నాం. ఇప్పుడు ‘చాలాబావుంది... అని మాకు అనిపించే వరకు వెనక్కి తగ్గలేదు’ అంటోంది బీటెక్ చదివిన ఓజస్వీ. ప్రయోగాల్లో భాగంగా తాము తయారుచేసిన రెండు వందల సాస్‌లను బంధువులు, స్నేహితులకు పంపిణీ చేశారు. వారి నుంచి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ఈ తల్లీకూతుళ్ల మదిలో ‘చిల్జో’ ఐడియా వచ్చింది. ఒక సంవత్సరం రీసెర్చ్, డెవలప్మెంట్ తరువాత ప్రాజెక్ట్ పట్టాలకెక్కింది. తమ పొదుపు మొత్తాల నుంచి 40 లక్షల రూపాయలు తీశారు. 30 మందికి ఉపాధి కల్పించారు. ‘ఇంట్లో వంటలతో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. డబ్బులతో చేయవద్దు. ఫుడ్ ఇండస్ట్రీలో మీకు ఎలాంటి అనుభవం లేదు. రిస్క్ తీసుకుంటున్నారు’ అన్నవారే ఎక్కువ మంది ఉన్నారు. ‘యూనిట్ మొదలైన తరువాత నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఎన్నో సంవత్సరాలు చేసిన ఉద్యోగానికి దూరం కావడం బాధగా అనిపించినా, సొంత వ్యాపారం మొదలుపెట్టాం అనేది ఉత్సాహాన్ని ఇచ్చింది. ఉత్సాహం అయితే ఉంది కానీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి నేపథ్యం లేని మాకు మార్జిన్స్, రిటైల్, ఎలాంటి డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించాలి అనే విషయాలు తెలియదు. జీటీ–జనరల్ ట్రేడ్, ఎంటీ–మార్కెట్ ట్రేడ్లాంటి పదాలు తెలియవు. సక్సెస్ అవుతామా, లేదా అనేది తెలియదు. అయినా ఉత్సాహంతో ముందుకు వెళ్లాం. మంచి ఫలితాన్ని సాధించాం’ అంటుంది దియా. అయినా సరే... ‘ఏమవుతుందో ఏమో!’ అనే సంశయం ఎక్కువైతే ఉన్నచోటే ఉండిపోతాం. కంఫర్ట్ జోన్‌కు అలవాటు పడిపోతాం. దీంతో విజయానికి దూరం అవుతాం. ‘పెద్ద రిస్క్ ఏమిటంటే ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే’ అనే ప్రసిద్ధ మాటను దృష్టిలో పెట్టుకొని రంగంలోకి దిగాను. ఫుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవం లేకపోయినా మా మీద మేము నమ్మకం కోల్పోలేదు. ఆశావాదంతో ముందుకు వెళ్లాం. అద్భుత ఫలితాన్ని సాధించాం. – హేమ, ఫౌండర్, చిల్జో -
‘బిర్యానీలో వాడే మసాలాలు తింటే లైంగిక కోరికలు తగ్గుతాయి’.. షాపులు బంద్!
బిర్యానీ.. ఈ పేరు వింటనే భోజనప్రియులు పేట్లకు పేట్లు లాగించేస్తారు. అలాంటిది బిర్యానీలో వాడే మసాలాలు.. పురుషుల్లో లైంగిక కోరికలను తగ్గిస్తాయంటే నమ్ముతారా?. తాజాగా ఇదే కారణాన్ని చూపిస్తూ ఓ బిర్యానీ సెంటర్‌ను బంద్ చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్, కుచ్‌బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గుతున్నాయని కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని కారణంగా చూపుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ బిర్యానీ షాపును మూసివేయించారు. కాగా, రవీంద్రనాథ్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఘోష్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో కోల్‌కతా బిర్యానీ షాపులకు పోటీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొందరు వ్యాపారులు అక్రమంగా బిర్యానీ సెంటర్లను నడుపుతున్నారు. లైసెన్సులు లేకుండానే బిర్యానీ షాపులను నిర్వహిస్తున్నారు. వారు చేసే బిర్యానీలను తినడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే, వారి షాపులను మూసివేయిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బెంగాల్‌కు చెందిన మాజీ మంత్రి మాట్లాడుతూ బిర్యానీల్లో వాడే మసాలాలతో లైంగిక సామర్థ్యం తగ్గుతుందనడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా షాపులను మూసివేయినట్టు తెలిపారు. It is learnt these two shops were adjacent to a Shani Dev temple in the Bhawaniganj market area in Cooch Behar town.#MunsifDigital#UnlicensedOutlets#SellingBiryani#DriveShutinBengal#RabindraNathGhosh https://t.co/Fj15Obm8oH — The Munsif Daily (@munsifdigital) October 24, 2022 -
బాయ్‌కాట్ చైనా
న్యూఢిల్లీ: సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్‌లో చైనా ఆహార పదార్థాలను అమ్ముతున్న అన్ని రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే పిలుపునిచ్చారు. చైనాకు చెందిన ఆహారాన్ని బహిష్కరించాలన్నారు. రోజూవారీ కార్యకలాపాల్లో చైనా ఉత్పత్తుల వాడకాన్ని బహిష్కరించాలంటూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా వైఖరిని అందరం చూస్తున్నామని అందుకే చైనా ఉత్పత్తులను వాడరాదని ఆయన అన్నారు. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులకు ఇకపై బీఐఎస్ నాణ్యత ఉండేలా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. చైనా నుంచి అక్రమంగా భారత్‌లోకి వచ్చే ఫర్నీచర్ వంటి వాటిలోనూ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆన్లైన్ ఆర్డర్లకు భారీ డిస్కౌంట్లు ఎలా సాధ్యం?
మారుతున్న కాలానికి అనుగుణంగా మెచ్చిన హోటల్లో నచ్చిన ఫుడ్ ఐటెమ్స్ ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని డోర్ డెలివరీ ఇస్తున్న సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఇటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలతో పాటు హోటళ్ల యజమానులు కూడా భారీ డిస్కౌంట్ల ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే డిస్కౌంట్లతో ఆన్లైన్ ఆర్డర్ల ఫుడ్ నాణ్యతకు హోటళ్ల యజమానులు తిలోదకాలు ఇస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఆహారంలో నాణ్యత లోపం ఉందంటూ ఇటీవల కాలంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. సాక్షి, నెల్లూరు: ఉదయం నుంచి రాత్రి వరకు టిఫిన్స్ నుంచి భోజనాలు వరకు, బిర్యానీల నుంచి బర్గర్ల వరకు ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకుంటున్నారు. చేతిలో సెల్‌ఫోన్.. అందులో యాప్స్ ఉంటే చాలు ఇంట్లో కూర్చొని తమకు కావాల్సిన ఆహార పదార్థాలు డోర్ డెలివరీ ఇవ్వాలంటూ ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ సంస్థలకు ఆర్డర్లు ఇస్తున్నారు. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ఆన్లైన్ ఫుడ్ డోర్ డెలివరీ సంస్థలు, హోటళ్ల యజమానులు ఇస్తున్న డిస్కౌంట్ల వెనుక చాలా మతలబులు ఉన్నాయి. ఆన్లైన్ వినియోగదారుల విషయంలో జిల్లాలో ప్రధాన నగరం, పట్టణాల్లోని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు జిమిక్కులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఆహార నాణ్యత ఒకరకంగా, రెస్టారెంట్‌కు వచ్చే వినియోగదారులకు అందించే నాణ్యత మరో రకంగా ఉంటుంది. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలోని పలు హోటళ్లలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అధికారులు రెండు.. మూడు రోజుల పాటు నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలను గుర్తించి, తీవ్ర స్థాయిలో యజమానులకు హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆన్లైన్, డిస్కౌంట్ ఫుడ్ ఆర్డర్లకు ఇలాంటి నిల్వ ఆహారాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది. తగు జాగ్రత్తలు పాటిస్తే మేలు రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లిన సమయంలో, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో నచ్చిన ఆహారాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రముఖ రెస్టారెంట్లు, ఎప్పుడూ జనసందోహం ఉండే హోటళ్లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆహారం నిల్వ ఉండేందుకు అక్కడ అవకాశం ఉండదు. ముఖ్యంగా నాన్ వెజ్ ఆహారం ఆర్డర్ చేస్తున్న సమయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. కొన్ని హోటళ్లలో డిమాండ్ తగ్గిన సమయంలో మాంసం, తరిగిన కూరగాయలు తదితరాలను నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా మిగిలిపోయిన వాటితో వండిన ఆహారం త్వరగా పాడయ్యే ఆస్కారం ఉంది. భారీ డిస్కౌంట్లు ఎలా సాధ్యం ఆన్లైన్లో ఇస్తున్న ఆర్డర్లకు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. నగరంలో ఓ హోటల్లో ఐటెమ్ విలువ రూ.250 ఉంటుంది. అదే హోటల్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఐటెమ్‌ను రూ.150లకే డెలివరీ ఇస్తున్నారు. ఇదెలా సాధ్యమని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు.. పాలక్ పనీర్ అసలు ధర రూ.200. ఆన్లైన్లో రూ.135కే అందిస్తున్నారు. చికెన్ బిర్యానీ రూ.250. ప్రత్యేక ఆఫర్ కింద రూ.159కే అందిస్తున్నారు. ఈ ఆఫర్ రెండు రోజుల మాత్రమే. నాటు కోడి బిర్యానీ అసలు ధర రూ.300 ఈ రోజు ప్రత్యేక ఆఫర్‌గా రూ.180లకే అందిస్తున్నాం అంటూ 15 శాతం, 20 శాతం, 30 శాతం, 50 శాతం డిస్కౌంట్లతో రకరకాల ఆఫర్లతో ఫుడ్ డెలివరీ సంస్థలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ఆకర్షితులై ధర తక్కువని ఆర్డర్ చేస్తే అందులో నాణ్యత ఉండడం లేదని ఇటీవల కాలంలో పలువురు వినియోగదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలతో పాటు రెస్టారెంట్లలో సంబంధిత శాఖాధికారులు దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్ ఆర్డర్లకు ప్రత్యేక ఆహారమా? రెస్టారెంట్లో వండిన ఆహారానికి, ఆన్లైన్ ద్వారా పొందిన ఆహారానికి చాలా తేడా ఉంటుందని ఫిర్యాదుల ద్వారా అధికారులకు వచ్చిన సమాచారం. ఆన్లైన్ ఆర్డర్‌కు వేరే ఆహారం ఇవ్వాలంటూ హోటళ్ల యజమానులు సిబ్బందిని ఆదేశిస్తున్నట్లు సమాచారం. ఎక్కడో వండిన వంటకాలను రెస్టారెంట్‌కు తీసుకొచ్చి ఆన్లైన్ వినియోగదారులకు అందజేస్తున్నట్లు కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ఇలా వండి పెట్టేందుకు చిన్న హోటళ్ల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. నాణ్యత పాటించకుండా వండిన ఆహారం వినియోగదారులకు చేరే సరికి పూర్తిగా పాడయిపోతున్న సందర్భాలున్నాయి. తాజా నాణ్యమైన ఆహారాన్నే అందించాలి తాజాగా, నాణ్యమైన ఆహారాన్నే వినియోగదారులకు అందించాలి. రంగులు కలపడం, ఒక్కసారి వాడడానికి సిద్ధం చేసిన వాటిని తిరిగి వాడకూడదు. ఎప్పటికప్పుడు కాకుండా రిఫ్రిజిరేటర్లో పెట్టి వాడితే చర్యలు తప్పవు. చికెన్, మటన్, కూరగాయలు తాజాగా ఉన్నవే వండి వడ్డించాలి. రంగులు కల్పడం ద్వారా కేన్సర్ కారకాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్ల యజమానులు ఎవరైనా సరే నాణ్యతకు తిలోదకాలు ఇస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఆహారానికి సంబంధించి ఏవైనా అనుమానం కలిగినా, నాణ్యత ప్రమాణాలు లేకపోయినా 9989990859కు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వెంకటరమణ, ఆరోగ్య అధికారి, నగరపాలక సంస్థ, నెల్లూరు -
యంత్రుడు 2.0
ఒంగోలు: రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేయగానే సర్వెంట్లు వినమ్రంగా తీసుకురావడం ఇప్పటివరకు చూసుంటారు. ఇది రోటీన్..! ట్రెండ్ ఫాలో అయితే ఏముంటుంది.. ట్రెండ్ సెట్ చేస్తేనే కదా అసలు మజా అని భావించారు ఒంగోలు నగరంలోని జీబు రెస్టారెంట్ నిర్వాహకులు. ఒంగోలు నగరవాసులకు సరికొత్త అనుభూతిని కలగజేసేలా రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. ఒంగోలులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జీబు రెస్టారెంట్ విశేషాలు ఒంగోలు నగరంలో సర్వెంట్ రోబో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. భోజన ప్రియులంతా ఆ రోబో గురించే చర్చించుకుంటున్నారు. స్థానిక ట్రంకు రోడ్డులోని పాత ఎల్ఐసీ భవనం మొదటి, రెండో అంతస్తుల్లో ఇటీవల జీబు రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. జీబు అనగానే ‘ఇదేం పేరు’ అనుకోవడం పరిపాటి. అయితే దీనికో చరిత్ర ఉంది. జీబు అనేది బ్రెజిల్ పదం. బ్రెజిల్ పరిభాషలో జీబు అంటే ఒంగోలు గిత్త అని అర్థం. అందుకే జీబు లోగోలో ఒంగోలు గిత్త కనిపించేలా రూపొందించారు. ఫ్లయిట్ థీమ్ విమానంలో కూర్చుని భోజనం చేస్తున్న ఫీలింగ్ కలిగేలా రెస్టారెంట్ మొదటి అంతస్తులో ఫ్లయిట్ థీమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్వెంట్లు ఎయిర్ హోస్టెస్‌ల మాదిరిగా కస్టమర్లను చిరునవ్వుతో పలకరిస్తూ ఆర్డర్ తీసుకుంటున్నారు. వంట గది నుంచి టేబుల్ వరకు నేరుగా రోబోనే ఫుడ్ తీసుకువస్తుంది. రెస్టారెంట్లో ఇలాంటి రోబోలు మూడు ఉన్నాయి. రోబోలను జపాన్‌లో కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా ఫారెస్ట్ సెట్టింగ్ హోటల్ రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ సెట్టింగ్ చూపరులను ఆకట్టుకుంటోంది. వెదురు బొంగులతో ఏర్పాటు చేసిన కుటీరంలో లాంతర్ల వెలుగులో దట్టమైన అడవిలో భోజనానికి కూర్చున్న ఫీలింగ్ కలిగేలా డైనింగ్ హాల్‌ను తీర్చిదిద్దారు. దేశంలో కోయంబత్తూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాల్లో రోబోలతో ఫుడ్ సర్వ్ చేసే హోటళ్లున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఒంగోలు నగరంలో తాము ఏర్పాటు చేశామని రెస్టారెంట్ నిర్వాహకుడు ఆరిగ సాయి తెలిపారు. -
ఆ రెస్టారెంట్లో కుళ్లిన మాంసంతో వంటకాలు!
ఇస్లామాబాద్ : కరాచీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత ఇద్దరు మృతి చెందిన ఘటన పాకిస్తాన్లో కలకలం రేపింది. సదరు అరిజొనా గ్రిల్ రెస్టారెంట్‌పై అధికారులు జరిపిన దాడుల్లో కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2015లోనే గడువుతీరిన ప్యాకేజ్డ్ మాంసాన్ని, పానీయాలను దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్టు పాకిస్తాన్‌కు చెందిన డాన్ న్యూస్ వెల్లడించింది. కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ ప్రాంతంలోని ఈ రెస్టారెంట్ తమ కస్టమర్లకు పాచిపోయిన మాంసాన్ని వడ్డించిందని, అధికారుల దాడుల్లో 80 కిలోల కుళ్లిపోయిన మాంసం బయటపడిందని సింధ్ ఫుడ్ అథారిటీ డైరెక్టర్ అబ్రార్ షేక్ తెలిపారు. హోటల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలని ఇటీవల అధికారులు ఈ రెస్టారెంట్‌కు నోటీసులు జారీ చేసినట్టు డాన్ కథనం వెల్లడించింది. ఈ రెస్టారెంట్లో ఆహారం తీసుకున్న ఇద్దరు మైనర్ల మృతికి కారణం వెల్లడికాకున్నా ఫుడ్ పాయిజన్‌తోనే వీరు మృత్యువాత పడ్డారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు హోటల్‌ను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు. -
ట్రాన్స్‌జెండర్‌పై విరుచుకుపడ్డ రాజకీయనాయకురాలు
-
లేడీస్ టాయిలెట్ ఉపయోగించిందని..
లాస్ ఏంజెలెస్: ట్రాన్స్‌జెండర్ లేడీస్ టాయిలెట్ ఉపయోగించిందని ఆమెపై విరుచుకుపడిందో రాజకీయనాయకురాలు. ఆ దృశ్యాలను స్వయంగా వీడియో తీసిన ఆమె సోషల్ మీడియాలో ఉంచింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రిపబ్లికన్ కాంగ్రేషనల్ పార్టీకి చెందిన జజ్మినా సావేండ్ర అనే రాజకీయనాయకురాలు లాస్ ఏంజెలెస్ డెన్నీస్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ ట్రాన్స్‌జెండర్ లేడీస్ టాయిలెట్‌ను ఉపయోగించటం ఆమె గమనించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన జజ్మినా ట్రాన్స్‌జెండర్‌పై విరుచుకుపడంది. ట్రాన్స్‌జెండర్‌ను అవమానిస్తూ తీవ్ర దుర్భాషలాడింది. ఈ తతంగాన్నంతా స్వయంగా వీడియో తీసిన జజ్మినా దాన్ని సోషల్ మీడియాలో ఉంచారు. ఇలా ఓ ట్రాన్స్‌జెండర్‌ను తిట్టడంపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో ఘాటుగా స్పందించారు. దీంతో వెనక్కు తగ్గిన జజ్మినా తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు సరికదా ఎదురు దాడి మరింత పెరిగింది. -
గర్భిణి ఆకతాయి చర్య.. వైరల్..
బీజింగ్: చిన్న పిల్లలు అన్నాక అపుడప్పుడు అనుకోకుండా తప్పులు చేస్తారు. వారు చేసిన చిన్న చిన్న తప్పులను ఎవరైనా చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం నాలుగేళ్ల బాలుడు చేసిన చిన్న తప్పుకు పగబట్టి గాయలయ్యేలా చేసింది. తన కాలు అడ్డుపెట్టి అతడు కిందపడేలా చేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు నటించింది. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే చైనాలోని రెస్టారెంట్‌కి ఓ మహిళ తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి భోజనానికి వెళ్లింది. ఆ బాలుడు రెస్టారెంట్ ఎంట్రీ డోర్ వద్ద ఆడుతూ..అటు ఇటూ తిరుగుతున్నాడు. ఆ రెస్టారెంట్ డోర్‌కి దగ్గరలో ఉన్న ఓ టేబుల్ వద్ద సదరు 7 నెలల గర్భిణి తన భర్తతో కలిసి భోజనం చేస్తోంది. ఈ క్రమంలో ఆ బాలుడు డోర్ వద్ద నుంచి లోపలికి వెళ్తుండగా.. అక్కడ ఉన్న ప్లాస్టిక్ పరదా ఆ మహిళకి తాకి ప్లేట్లో ఉన్న భోజనం ఆమెపై పడింది. దీంతో కోపానికి గురైన మహిళ..మరోసారి డోర్ వైపు వస్తున్న బాలుడికి కాలు అడ్డం పెట్టింది. అది గమనించని బాలుడు వేగంగా వచ్చి మెట్లపై పడిపోయాడు. అక్కడే ఉన్నఆ జంట బాలుడిని లేపడానికి కూడా ప్రయత్నించలేదు. దూరంలో ఉన్న బాలుడి తల్లి వచ్చి బాబుని ఆస్పత్రిలో చేర్చింది. అయితే ఆ బాలుడు తనంతట తానే కింద పడిపోయాడని తల్లి భావించింది. కానీ బాలుడు కోలుకున్నాక అసలు విషయం చెప్పాడు. వెంటనే ఆమె రెస్టారెంట్‌కి వెళ్లి సీసీ కెమోరా దృశ్యాలు చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఆ నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఆమెకు 1000 యువాన్ల (దాదాపు రూ.10,500) జరిమానా కూడా విధించారు. అయితే ఆమె గర్భిణీ అని తెలుసుకున్న బాలుడి తల్లి కేసు విత్‌డ్రా చేసుకుంది. తనకు పిల్లలు ఉన్నారని మానవత్వంతో వదిలేస్తున్నాని ఆమె చైనా మీడియాకు తెలిపారు. ఆ వీడియో చైనాలో వైరల్ కావడంతో నిందితురాలు సిగ్గుతో తలదించుకుంది. వెంటనే ఆస్పత్రికి వచ్చి బాలుడి వైద్య ఖర్చులు తానే భరిస్తానని చెప్పింది. తాను చేసిన పొరపాటును క్షమించాలని బాలుడి తల్లిదండ్రులను కోరింది. -
బార్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసుల దాడి
ఎల్బీనగర్(హైదరాబాద్): హోలీని పురస్కరించుకుని గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి బార్లు, మద్యం దుకాణాలు మూసి వేయాలన్న ఉత్తర్వులను పట్టించుకోని బార్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసులు దాడి చేశారు. ఎల్బీనగర్లోని కనకదుర్గా రెస్టారెంట్లో విక్రయాలు సాగిస్తుండగా గురువారం రాత్రి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నగదు, మద్యం కూడా పట్టుకున్నారు.