‘బిర్యానీలో వాడే మసాలాలు తింటే లైంగిక కోరికలు తగ్గుతాయి’.. షాపులు బంద్‌! | TMC Leader Forces Biryani Shops To Shut Down In Bengal | Sakshi
Sakshi News home page

‘బిర్యానీలో వాడే మసాలాల తింటే పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గుతాయి’.. రెస్టారెంట్‌ బంద్‌!

Published Mon, Oct 24 2022 4:31 PM | Last Updated on Mon, Oct 24 2022 4:32 PM

TMC Leader Forces Biryani Shops To Shut Down In Bengal - Sakshi

బిర్యానీ.. ఈ పేరు వింటనే భోజనప్రియులు పేట్లకు పేట్లు లాగించేస్తారు. అలాంటిది బిర్యానీలో వాడే మసాలాలు.. పురుషుల్లో​ లైంగిక కోరికలను తగ్గిస్తాయంటే నమ్ముతారా?. తాజాగా ఇదే కారణాన్ని చూపిస్తూ ఓ బిర్యానీ సెంటర్‌ను బంద్‌ చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్‌, కుచ్‌బెహార్‌ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్‌ ఘోష్‌ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గుతున్నాయని కామెంట్స్‌ చేశారు. ఈ విషయాన్ని కారణంగా చూపుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ బిర్యానీ షాపును మూసివేయించారు. కాగా, రవీంద్రనాథ్‌ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 

ఈ సందర్భంగా ఘోష్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో కోల్‌కతా బిర్యానీ షాపులకు పోటీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొందరు వ్యాపారులు అక్రమంగా బిర్యానీ సెంటర్లను నడుపుతున్నారు. లైసెన్సులు లేకుండానే బిర్యానీ షాపులను నిర్వహిస్తున్నారు. వారు చేసే బిర్యానీలను తినడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే, వారి షాపులను మూసివేయిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బెంగాల్‌కు చెందిన మాజీ మంత్రి మాట్లాడుతూ బిర్యానీల్లో వాడే మసాలాలతో లైంగిక సామర్థ్యం తగ్గుతుందనడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా షాపులను మూసివేయినట్టు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement