Biryani spices
-
‘బిర్యానీలో వాడే మసాలాలు తింటే లైంగిక కోరికలు తగ్గుతాయి’.. షాపులు బంద్!
బిర్యానీ.. ఈ పేరు వింటనే భోజనప్రియులు పేట్లకు పేట్లు లాగించేస్తారు. అలాంటిది బిర్యానీలో వాడే మసాలాలు.. పురుషుల్లో లైంగిక కోరికలను తగ్గిస్తాయంటే నమ్ముతారా?. తాజాగా ఇదే కారణాన్ని చూపిస్తూ ఓ బిర్యానీ సెంటర్‌ను బంద్ చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్, కుచ్‌బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గుతున్నాయని కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని కారణంగా చూపుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ బిర్యానీ షాపును మూసివేయించారు. కాగా, రవీంద్రనాథ్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ఘోష్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో కోల్‌కతా బిర్యానీ షాపులకు పోటీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొందరు వ్యాపారులు అక్రమంగా బిర్యానీ సెంటర్లను నడుపుతున్నారు. లైసెన్సులు లేకుండానే బిర్యానీ షాపులను నిర్వహిస్తున్నారు. వారు చేసే బిర్యానీలను తినడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే, వారి షాపులను మూసివేయిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై బెంగాల్‌కు చెందిన మాజీ మంత్రి మాట్లాడుతూ బిర్యానీల్లో వాడే మసాలాలతో లైంగిక సామర్థ్యం తగ్గుతుందనడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా షాపులను మూసివేయినట్టు తెలిపారు. It is learnt these two shops were adjacent to a Shani Dev temple in the Bhawaniganj market area in Cooch Behar town.#MunsifDigital#UnlicensedOutlets#SellingBiryani#DriveShutinBengal#RabindraNathGhosh https://t.co/Fj15Obm8oH — The Munsif Daily (@munsifdigital) October 24, 2022 -
మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్ !
మొఘల్ కిచెన్‌లో రూపుదిద్దుకుని నాన్ వెజ్ ప్రియులకు ఇప్పుడెంతో ఇష్టమైన ఆహారంగా మారింది బిర్యానీ. ఎప్పడికప్పుడు బిర్యానీలో వెరైటీలు పుట్టుకొస్తున్నా చికెన్ బిర్యానీనే రాజభోగం. అందులో లెగ్పీస్కే అగ్రాసనం. ఇప్పుడా లెగ్పీస్కి ఛాలెంజ్ ఎదురైంది. నగరంలో సరికొత్త ట్రెండ్‌గా నల్లిబిర్యానీకి డిమాండ్ పెరుగుతోంది. ఊరూరా బిర్యానీ ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకం హైదరాబాద్ బిర్యానీ. కానీ దశాబ్ధ కాలంగా బిర్యానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా విస్తరించింది. జిల్లా కేంద్రాలను దాటి మున్సిపాలిటీలకు చేరుకుంది. రోడ్డు పక్కన చిన్న షెడ్డులో కూడా టేక్ ఎవే సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఇంతలా విస్తరిస్తున్నా ఎక్కడా బిర్యానీ క్రేజ్ తగ్గడం లేదు. పైగా కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. ముంబైలో బాగా ఫేమసైన నల్లి బిర్యానీ ఇప్పుడు హైదరాబాద్ రెస్టారెంట్లలో హల్చల్ చేస్తోంది. నల్లి బిర్యానీ బిర్యానీలో రారాజుగా ఉన్న చికెన్ బిర్యానీ పోటీగా ఎదుగుతోంది నల్లి బిర్యాని. మటన్‌లో నల్లి బొక్కలతో ప్రత్యేకంగా ఈ వంటకాన్ని తయారు చేయడంతో దీన్ని నల్లిబిర్యానీగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా బిర్యానీలో బాస్మతి రైస్, చికెన్ లేదా రైస్‌ను కలిపి వండుతారు. అయితే నల్లి బిర్యానీలో రైస్, నల్లి బొక్కలను వేర్వేరుగా వండుతారు. ఆ తర్వాత వీటిని కలిపి నల్లి బిర్యానీగా సర్వ్ చేస్తారు. మటన్‌లో ప్రత్యేక రుచిని కలిగి ఉండే నల్లి ఎముకలకు బిర్యానీ రెసీపీ తోడవడటంతో నల్లి బిర్యానీని లొట్టలెసుకుని తింటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెరిగిన డిమాండ్ హైదరాబాద్ నగరంలో నల్లి బిర్యానీ ట్రెండ్ క్రమంగా విస్తరిస్తోంది. బిర్యానీ ప్రియుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో క్రమంగా నల్లి బిర్యానీ అందిస్తున్న రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య పెరుగుతోంది. ముందుగా బంజార్‌హిల్స్, మసాబ్‌ట్యాంక్ దగ్గర రెస్టారెంట్లలో మొదలైన నల్లి బిర్యానీ ప్రస్థానం క్రమంగా హైదరాబాద్ నలుమూలలకు విస్తరిస్తోంది. సాధారణ బిర్యానీతో పోల్చితే రేటు నల్లి బిర్యానీ రేటు ఎక్కువ. అయినా సరే రేటు కంటే రుచే ముఖ్యం అంటూ నల్లిబిర్యానీకి షిఫ్ట్ అవుతున్నారు. నల్లి బిర్యానీ వండే చెఫ్‌లకు ప్రాముఖ్యత పెరిగిపోతుంది. చదవండి : అఫ్గన్ సంక్షోభం.. ఇలాగైతే బిర్యానీ రేట్లు పెరిగే ఛాన్స్! -
హైదరాబాద్ బిర్యానీపై తాలిబన్ ఎఫెక్ట్!
ఆఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న పరిస్థితులు ఇలాగే మరికొంత కాలం కొనసాగితే బిర్యానీ రేట్లు పెంచక తప్పదంటున్నారు హైదరాబాద్ హోటళ్ల నిర్వాహకులు. తాలిబన్ల వల్ల చెలరేగిన అల్లకల్లోలం త్వరగా సద్దుమణగకపోతే బిర్యానీ భారం కావడం ఖాయం అంటున్నారు. నోరూరించే బిర్యానీ కమ్మని నోరూరించే హైదరాబాద్ బిర్యానీపై తాలిబన్ ప్రభావం పడనుంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే వన్నె తెచ్చిన బిర్యానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. జిల్లా కేంద్రాలతో పాటు ఓ మోస్తరు పట్టణాల్లో సైతం బిర్యానీ సెంటర్లు వెలిశాయి. సెలవు రోజులు వస్తే ఇళ్లలో సైతం బిర్యాణీ ఘుమఘుమలాడుతోంది. అయితే త్వరలో బిర్యానీ ధర పెరగడంతో లేక రుచిలో తేడా కావడంతో తప్పదంటున్నారు హోటల్ నిర్వహాకులు. రుచి కోసం డ్రై ఫ్రూట్స్ బిర్యానీ తయారీలో మాంసం, బాస్మతి రైస్లే ప్రధానమైనా ఆ వంటకు అద్భుతమైన రుచి తేవడంలో డ్రై ఫ్రూట్స్‌ది కీలక పాత్ర. ఎండుద్రాక్ష, ఆల్మండ్, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్‌లో సింహభాగం అఫ్గనిస్తాన్ నుంచే దిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పేరున్న పెద్ద హోటళ్లు బిర్యానీ తయారీలో సగటున యాభై కేజీల వరకు బాదం పప్పును వినియోగిస్తున్నాయి. ఇదే స్థాయిలో మిగిలిన డ్రై ఫ్రూట్స్ అయిన జీడిపప్పు, కిస్మిస్ల వినియోగం కూడా ఉంటోంది. హాట్ న్యూస్ : కొండెక్కిన కోడి ఇప్పటికైతే ఓకే హైదరాబాద్‌లో బిర్యానీకి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొందరు అఫ్గన్ వ్యాపారులు హైదరాబాద్‌లోనే ఉంటూ ఎండు పళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఎండు పళ్లను అఫ్గన్ నుంచి తెప్పించి ఇక్కడి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు డ్రై ఫ్రూట్ నిల్వలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే ప్రస్తుతం ఇక్కడి వ్యాపారులకు అఫ్గన్‌లోని ఎగుమతి దారులతో సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల రాకతో అక్కడ అశాంతి నెలకొంది. రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే డ్రై ఫ్రూట్స్ కొరత ఎదుర్కొక తప్పదని ఎండు పళ్ల వ్యాపారులు అంటున్నారు. పన్నులు పెరిగే ఛాన్స్ ఇప్పటి వరకు ఇండియా, ఆఫ్గన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవని, పన్నులు కూడా తక్కువగా ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. తాలిబన్ల పాలనలోకి వచ్చాక డ్రై ఫ్రూట్స్ ఎగుమతులపై ఆంక్షలు పెట్టినా, పన్నులు పెంచినా ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో ఉన్న బిర్యానీ సెంటర్లకు సైతం డ్రై ఫ్రూట్ ఇబ్బందులు తప్పేలా లేవు. ధర పెంచడమే మార్గం కోవిడ్ ఆంక్షల కారణంగా బిర్యానీ వినియోగం తగ్గిపోయిందని, ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటుండగా ఆఫ్గన్ సంక్షోభం వచ్చిపడందంటున్నారు హోటల్ నిర్వాహకులు. డ్రై ఫ్రూట్ ధరలు పెంచితే బిర్యానీ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఫేమస్ అయిన హోటల్ నిర్వాహకులు పేర్కొంటుండగా... ఎండు పళ్ల వాడకం తగ్గించేస్తామంటున్నారు చిన్న బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు -సాక్షి, వెబ్‌డెస్క్ -
రైస్‌లెస్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసా?
బిర్యానీ నచ్చని భోజన ప్రియులు ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. బిర్యానీని ఎన్ని రకాలుగా తయారు చేసినా లొట్టలేసుకుని మరీ ఆరగిస్తాం. ఇంకా ఎందుకు ఆలస్యం, రైస్‌లెస్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.. కావాల్సిన పదార్థాలు: చికెన్– 300 గ్రాములు; సేమియా– ఒక కప్పు; అల్లం వెల్లుల్లి పేస్టు– ఒక స్పూన్ ; నల్లమిరియాలు– ఒక స్పూన్ ; దాల్చిన చెక్క ముక్క– మీడియం సైజు ఒకటి; యాలకులు– ఆరు; లవంగాలు– రెండు; సోంపు– అర స్పూన్ ; నెయ్యి– రెండు స్పూన్లు; ఆయిల్– ఒక స్పూను; షాజిరా– అరస్పూన్ ; నల్ల జీలకర్ర– అర స్పూన్ ; బిర్యానీ ఆకు–ఒకటి; అనాస పువ్వు– ఒకటి; పచ్చిమిర్చి–మూడు; పుదీన– చిన్న కట్ట; ఉల్లిపాయలు– సన్నగా తరిగిన కప్పు ఉల్లి తరుగు; ఉప్పు– రుచికి సరిపడినంత; పసుపు– పావు స్పూన్ ; దనియాల పొడి– అర స్పూన్ ; కారం– అర స్పూన్ ; టమోట– ఒకటి; నీళ్లు – రెండు కప్పులు. తయారీ విధానం: ► ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కాక మిరియాలు, షాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు, సోంపు వేసి దోరగా వేయించాలి. ఇవి చల్లారక అన్ని మిక్సీలో వేసి పొడిలాగ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ► తరువాత బిరియానీ ఉడికేందుకు సరిపడా మరో పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక సేమియాను వేసి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే పాన్‌లో ఒక స్పూన్ నూనె, మిగిలిన నెయ్యి వేసి కాగిన తరువాత దానిలో నల్ల జీలకర్ర, బిర్యానీ ఆకు, చీలికలుగా కోసిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, ఉల్లిపాయ తరుగు వేసి మగ్గనివ్వాలి. కాసేపయ్యాక ఈ పాన్‌లో చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, దనియాల పొడి, కారం, గ్రైండ్ చేసిపెట్టుకున్న మసాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ► పదినిమిషాలయ్యాక విత్తనాలు తీసేసి సన్నగా తరిగిన టమోట ముక్కలను వేయాలి. టమోటా ముక్కలు మగ్గిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా వేసి రెండు కప్పులు నీళ్లు పోయాలి. రెండు నిమిషాలు మగ్గిన తరువాత రుచికి సరిపడా ఉప్పువేసి మరికాసేపు ఉడకనివ్వాలి. చికెన్ ముక్కలు, సేమియా ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పాన్‌ను ఐదు నిమిషాలపాటు అలాగే స్టవ్ మీద ఉంచాలి. ఐదు నిమిషాలయ్యాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్‌లెస్ చికెన్ బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. చాలా త్వరగా సింపుల్‌గా తయారయ్యే రైస్‌లెస్ చికెన్ బిర్యానీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చదవండి: సుబ్బారావు గ్రేట్.. నారింజ రసం సూపర్ -
పూజారికి పూనకం వచ్చింది!
మేం దేవుడి ముందే నాలిక తిప్పేసే సాహసం చేస్తుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ఓటర్లూ నోళ్లులేని రాళ్లే. ఇదిగో, సంక్రాంతి పండక్కి సన్నబియ్యం, ముద్దపప్పు, నెయ్యి ఇస్తారట. మంచిదే. ఇక్కడేం తక్కువ తింటారా! బిర్యానీ దినుసులు ప్రకటిస్తారు. పారిపోయిన సంవత్సరానికి గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉంది. మోదీని ప్రజలూ, మంగళ్యాన్ని శాస్త్ర వేత్తలూ విజయవంతంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. తెలంగాణ ఉద్యమం ఫలిం చింది. అవశేష ఆంధ్రప్రదేశ్ తాడూ బొంగరం లేకుండా మిగిలింది. తెలంగాణ రాష్ట్రాన్ని బహూకరించానన్న ధీమాతో ఉన్న సోనియాకి చుక్కెదురైంది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో కూడా ఘోర మరణానికి కారణాలు తెలియ రాకపోవడం ఆ పార్టీ పరా జయానికే పరాజయం. ఆ నాయకురాలు ఏ వైఫల్యాల గురించీ అడగను. కానీ, తెలంగాణ ఫలితం గురించి నాకు చెప్పండని గుమ్మంలో కూర్చుని ‘జనపథం’లో వచ్చే పోయే వారందరినీ దీనంగా ప్రశ్నిస్తున్నారు. చేవలు తేలిన ఆ ప్రాంత నేతలు సైతం ఆ తల్లికి జవాబు చెప్పలేక, చాయ్ నమిలి వెళ్లిపోతున్నారు. పారిపోయిన ‘పధ్నా లుగు’ చేతిని మెలితిప్పి మరీ వెళ్లిపోయింది. ‘‘హుద్‌హుద్ తుపాను చంద్రబాబు పేరులో పెట్రో లు పోసింది. అబ్బో! ఏమి పేరు! ఎంత పేరు! నాలుగు జిల్లాల్లో మార్మోగిపోయింది. తుపానుతో మూడు జిల్లా ల్నీ, క్యాపిటల్‌తో రెండు జిల్లాల్నీ వశపరుచుకున్నారు. ఒకటి సొంత జిల్లా. ఫర్వానై. నెల్లూరు మనదే. అంటే ఆధా... ఆధా. గోదావరి జిల్లాలు పుష్కరాలతో దాసో హం అంటాయి. ఎటొచ్చీ మిగిలిన వాటిని కాసుకోవాలి. ఫర్వాలేదు. సమర్థుడే. సాధిస్తాడు’’ ఇది మా గుడి పూజారిగారి వ్యాఖ్య. ఆయన చానల్స్ అంతగా చూడరు. పత్రికలు ఆయనకు చక్రపొంగళ్లు. నాకేస్తారు. ‘‘ఎప్పుడో అంజయ్య సీఎమ్‌గా ఉండగా ఆయనకో యాదగిరి ఉండేది. అది నిత్యం వార్తల్లో ఉండేది. మళ్లీ ఇన్నాళ్లకి పూర్వ వైభవం వచ్చింది తెలంగాణకి. నిజాం మన గొప్పరాజు- అనేసి అందర్నీ వెయ్యేసి సార్లు ఇంపో జిషన్ రాసి చూపించమంటున్నారు హెడ్మాష్టారు. ఒక రాజు, పైగా ప్రపం చంలోనే ధనవంతుడు. తన రాజ్యంలో కోటలు, అంతఃపురాలు, గుర్రప్పా కలు, గజశాలలు, దవా ఖానాలు ఏర్పాటు చేయడాన్ని ఔన్నత్యంగా భావించడం మంజీరా నీటి మహత్తు. ఆనాడు దొరలు కూడా ఓడ రేవులు, రైల్వేలైన్లు, దోపిడీ సొత్తు దోచుకు పోవడానికి రాదారి మార్గాలు నిర్మించారుగా. ఏమిటో, ఈ సంస్కారానికి రెండువైపులా పదునుంది. అయినా నాకేల...’’ అంటూ గర్భాలయం వైపు నడుస్తుంటే నేనూ నడిచాను. క్షణంలో అర్చన ముగించి, గంట కొట్టి బయట పడ్డారు. ఆయనకు శ్రోతలు దొరకరు. ‘‘పధ్నాలుగు యావత్తూ గెంతుళ్లే! ఆ యొక్క కాంగ్రెస్ తటాకం క్రమేపీ ఎండిపోతోంది. ప్రాప్తకాలజ్ఞత, అంటే ముందుచూపు గల జ్ఞాని కప్పలు ఊటగల చెరువు ల్లోకి దాటుకుంటున్నాయి. చెరువు మారాక అది కొత్తగా చేరిన కప్పా, అనాది మండూకమా అనే తేడాలుండవు. ఒక్కోసారి పాతవి బెకబెకలాడుతూ అక్కడే ఉంటాయ్. కొత్తవి చకచకా చెర్లైక్కుతాయ్!’’ అంటూ చిన్నగా నవ్వి ‘‘ఆఁ, ఏవుంది, అంతా అర్చక సాంప్రదాయంలో నడు స్తోంది. అక్కడా ఇక్కడా కూడా ’’ అన్నారు. బోధపడక విస్తరించడన్నట్టు చూశాను. ‘‘ఏముంది! పూజలో ఛత్రా లు, చామరాలు, నాట్యం, వాద్యం, గీతం- ఇలా షోడశో పచారాల కరిష్యే అనేస్తాం. అక్కడేం ఉండవు. ఉత్తుత్తినే. నామ్ కే వాస్తే. ఇలాగే బోలెడు ఉపచారాలని తయా రు చేసి, ఆ జాబితాని ప్రెస్ ముందు అప్పగించి నీళ్లొదలడం, మర్నాడు పేపర్లో హెడ్‌లైన్స్ చదువుకోవడం... అదే నడుస్తోంది!’’ ‘‘అంతేనంటారా!’’ అన్నాను.‘‘అంతే... అంతే... మేం దేవుడి ముందే నాలిక తిప్పేసే సాహసం చేస్తుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ఓటర్లూ నోళ్లులేని రాళ్లే. ఇదిగో, సం క్రాంతి పండక్కి సన్న బియ్యం, ముద్ద పప్పు, నెయ్యి ఇస్తారట. మంచిదే. ఇక్కడేం తక్కువ తింటారా! బిర్యానీ దినుసులు ప్రకటిస్తారు. అంతేనా. పైసంగతులు కూడా వేస్తారు. పతంగులు, దారబ్బంతులు పంచుతాం. గోల్కొండ, నౌబత్ పహాడ్ల మీంచి రాచకొండ, యాద గిరిగుట్ట మీంచి ఎగిరే గులాబి రంగు పతంగులు విజయ కేతనాలు కావాలి. నేను నా సహచర మంత్రులు స్వయం గా పతంగులు ఎగరేస్తాం’’ పూజారిగారికి పూనకం వచ్చింది. ‘‘స్వామీ! పెకైళ్లిన మీ పతంగులు జనంలోకి కొత్త సంకేతాలు పంపిస్తాయేమో....’’ అన్నాను. ‘‘మీ డౌటు నాకర్థమైంది. రంగు మనది. పతంగి వాళ్లది. ఈ గాలికి అదే బాగు!’’ అన్నారు పూజారిగారు. మహా నివేదనకి వేళైందంటూ కదిలారు. - (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ