పూజారికి పూనకం వచ్చింది! | The priest had Shivering | Sakshi
Sakshi News home page

పూజారికి పూనకం వచ్చింది!

Published Sat, Jan 3 2015 1:06 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

పూజారికి పూనకం వచ్చింది! - Sakshi

పూజారికి పూనకం వచ్చింది!

మేం దేవుడి ముందే నాలిక తిప్పేసే సాహసం చేస్తుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ఓటర్లూ నోళ్లులేని రాళ్లే. ఇదిగో, సంక్రాంతి పండక్కి సన్నబియ్యం, ముద్దపప్పు, నెయ్యి ఇస్తారట. మంచిదే. ఇక్కడేం తక్కువ తింటారా! బిర్యానీ దినుసులు ప్రకటిస్తారు.
 
 పారిపోయిన సంవత్సరానికి గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉంది. మోదీని ప్రజలూ, మంగళ్‌యాన్‌ని శాస్త్ర వేత్తలూ విజయవంతంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. తెలంగాణ ఉద్యమం ఫలిం చింది. అవశేష ఆంధ్రప్రదేశ్ తాడూ బొంగరం లేకుండా మిగిలింది. తెలంగాణ రాష్ట్రాన్ని బహూకరించానన్న ధీమాతో ఉన్న సోనియాకి చుక్కెదురైంది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో కూడా ఘోర మరణానికి కారణాలు తెలియ రాకపోవడం ఆ పార్టీ పరా జయానికే పరాజయం. ఆ నాయకురాలు ఏ వైఫల్యాల గురించీ అడగను. కానీ, తెలంగాణ ఫలితం గురించి నాకు చెప్పండని గుమ్మంలో కూర్చుని ‘జనపథం’లో వచ్చే పోయే వారందరినీ దీనంగా ప్రశ్నిస్తున్నారు. చేవలు తేలిన ఆ ప్రాంత నేతలు సైతం ఆ తల్లికి జవాబు చెప్పలేక, చాయ్ నమిలి వెళ్లిపోతున్నారు. పారిపోయిన ‘పధ్నా లుగు’ చేతిని మెలితిప్పి మరీ వెళ్లిపోయింది.
 
 ‘‘హుద్‌హుద్ తుపాను చంద్రబాబు పేరులో పెట్రో లు పోసింది. అబ్బో! ఏమి పేరు! ఎంత పేరు! నాలుగు జిల్లాల్లో మార్మోగిపోయింది. తుపానుతో మూడు జిల్లా ల్నీ, క్యాపిటల్‌తో రెండు జిల్లాల్నీ వశపరుచుకున్నారు. ఒకటి సొంత జిల్లా. ఫర్వానై. నెల్లూరు మనదే. అంటే ఆధా... ఆధా.  గోదావరి జిల్లాలు పుష్కరాలతో దాసో హం అంటాయి. ఎటొచ్చీ మిగిలిన వాటిని కాసుకోవాలి. ఫర్వాలేదు. సమర్థుడే. సాధిస్తాడు’’ ఇది మా గుడి పూజారిగారి వ్యాఖ్య. ఆయన చానల్స్ అంతగా చూడరు. పత్రికలు ఆయనకు చక్రపొంగళ్లు. నాకేస్తారు.
 
 ‘‘ఎప్పుడో అంజయ్య సీఎమ్‌గా ఉండగా ఆయనకో యాదగిరి ఉండేది. అది నిత్యం వార్తల్లో ఉండేది. మళ్లీ ఇన్నాళ్లకి పూర్వ వైభవం వచ్చింది తెలంగాణకి. నిజాం మన గొప్పరాజు- అనేసి అందర్నీ వెయ్యేసి సార్లు ఇంపో జిషన్ రాసి చూపించమంటున్నారు హెడ్మాష్టారు. ఒక రాజు, పైగా ప్రపం చంలోనే ధనవంతుడు. తన రాజ్యంలో కోటలు, అంతఃపురాలు, గుర్రప్పా కలు, గజశాలలు, దవా ఖానాలు ఏర్పాటు చేయడాన్ని ఔన్నత్యంగా భావించడం మంజీరా నీటి మహత్తు. ఆనాడు దొరలు కూడా ఓడ రేవులు, రైల్వేలైన్లు, దోపిడీ సొత్తు దోచుకు పోవడానికి రాదారి మార్గాలు నిర్మించారుగా. ఏమిటో, ఈ సంస్కారానికి రెండువైపులా పదునుంది.
 
 అయినా నాకేల...’’ అంటూ గర్భాలయం వైపు నడుస్తుంటే నేనూ నడిచాను. క్షణంలో అర్చన ముగించి, గంట కొట్టి బయట పడ్డారు. ఆయనకు శ్రోతలు దొరకరు.  ‘‘పధ్నాలుగు యావత్తూ గెంతుళ్లే! ఆ యొక్క కాంగ్రెస్ తటాకం క్రమేపీ ఎండిపోతోంది. ప్రాప్తకాలజ్ఞత, అంటే ముందుచూపు గల జ్ఞాని కప్పలు ఊటగల చెరువు ల్లోకి దాటుకుంటున్నాయి. చెరువు మారాక  అది కొత్తగా చేరిన కప్పా, అనాది మండూకమా అనే తేడాలుండవు. ఒక్కోసారి పాతవి బెకబెకలాడుతూ అక్కడే ఉంటాయ్. కొత్తవి చకచకా చెర్లైక్కుతాయ్!’’ అంటూ చిన్నగా నవ్వి ‘‘ఆఁ, ఏవుంది, అంతా అర్చక సాంప్రదాయంలో నడు స్తోంది. అక్కడా ఇక్కడా కూడా ’’ అన్నారు. బోధపడక విస్తరించడన్నట్టు చూశాను. ‘‘ఏముంది! పూజలో ఛత్రా లు, చామరాలు, నాట్యం, వాద్యం, గీతం- ఇలా షోడశో పచారాల కరిష్యే అనేస్తాం. అక్కడేం ఉండవు. ఉత్తుత్తినే. నామ్ కే వాస్తే. ఇలాగే బోలెడు ఉపచారాలని తయా రు చేసి, ఆ జాబితాని ప్రెస్ ముందు అప్పగించి నీళ్లొదలడం, మర్నాడు పేపర్లో హెడ్‌లైన్స్ చదువుకోవడం... అదే నడుస్తోంది!’’
 
  ‘‘అంతేనంటారా!’’ అన్నాను.‘‘అంతే... అంతే... మేం దేవుడి ముందే నాలిక తిప్పేసే సాహసం చేస్తుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ఓటర్లూ నోళ్లులేని రాళ్లే. ఇదిగో, సం క్రాంతి పండక్కి సన్న బియ్యం, ముద్ద పప్పు, నెయ్యి ఇస్తారట. మంచిదే. ఇక్కడేం తక్కువ తింటారా! బిర్యానీ దినుసులు ప్రకటిస్తారు. అంతేనా. పైసంగతులు కూడా వేస్తారు. పతంగులు, దారబ్బంతులు పంచుతాం. గోల్కొండ, నౌబత్ పహాడ్‌ల మీంచి రాచకొండ, యాద గిరిగుట్ట మీంచి ఎగిరే గులాబి రంగు పతంగులు విజయ కేతనాలు కావాలి. నేను నా సహచర మంత్రులు స్వయం గా పతంగులు ఎగరేస్తాం’’ పూజారిగారికి పూనకం వచ్చింది. ‘‘స్వామీ! పెకైళ్లిన మీ పతంగులు జనంలోకి కొత్త సంకేతాలు పంపిస్తాయేమో....’’ అన్నాను. ‘‘మీ డౌటు నాకర్థమైంది. రంగు మనది. పతంగి వాళ్లది. ఈ గాలికి అదే బాగు!’’ అన్నారు పూజారిగారు. మహా నివేదనకి వేళైందంటూ కదిలారు.
 - (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
 శ్రీరమణ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement