Post-mortem report
-
లాస్య నందిత పోస్టుమార్టం నివేదిక.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే..
హైదరాబాద్, సాక్షి: కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం యావత్ రాష్ట్రాన్ని నివ్వెరపోయేలా చేసింది. పటాన్ చెరు ఓఆర్ఆర్పై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఆమె మృతదేహానికి జరిగిన పోస్టుమార్టం నివేదిక(ప్రాథమిక) బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడి అయ్యాయి. లాస్య తలకు బలమైన గాయాలు కావడంతోనే ఆమె స్పాట్లోనే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తేల్చింది. ‘‘తలకు బలమైన గాయాలు కావడం వల్లే అక్కడికక్కడే ఆమె చనిపోయారు. లాస్య నందిత శరీరంలోని ఎముకలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. తై బోన్, రిబ్స్ ఫ్రాక్ఛర్ అయ్యాయి. ఆరు దంతాలు ఊడిపోయాయి. ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది. మొత్తంగా.. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఆమె మరణించారు’’ అని పోస్టుమార్టం నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రావాల్సిన స్పష్టత లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులు గురువారం రాత్రి సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వచ్చారు. కాసేపటికే ఆకాష్‌తో పాటు లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12.30 గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి.. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌కు లాస్య కుటుంబం పయనం అయ్యింది. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య బయల్దేరిందని చెప్తున్నారు. అయితే.. పటాన్ చెరు వైపు ఎందుకు ఆమె వాహనం వెళ్లింది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు పూర్తిస్థాయి విచారణ తర్వాతే.. సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది. ఘటనాస్థలాన్ని సంగారెడ్డి ఏఎస్పీ సంజీవ రావు, ఆర్టీఏ రామారావు పరిశీలించారు. ఏఎస్పీ సంజీవరావు మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం 5:30 గంటలకు ప్రమాదం జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. కారు శకలాలు 100 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. అక్కడిక్కడే ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. మరో వ్యక్తి ఆకాష్ మియపూర్ లో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తాం అని అన్నారాయన. -
దమ్మాయిగూడ బాలిక మృతి కేసు.. పోస్టుమార్టం నివేదికలో కీలకాంశాలు
సాక్షి, మేడ్చల్: దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన చిన్నారి ఇందు మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్‌తో పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేశారు. నాలుగు పేజీల పంచనామాలో అధికారులు వివరాలు రికార్డ్ చేశారు. కాగా ఇందు పోస్టుమార్టం నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు గుర్తించిన వైద్యులు.. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తేల్చారు. చెరువులో పడి నీరు మింగి చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే చెరువులో ఎవరైనా తోసేశారా..? తనే ఆడుకుంటూ పడిందా అనేది తేలాల్సి ఉంది. దమ్మాయిగూడలో ఉద్రిక్తత దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలిక మృతదేహంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పోస్టుమార్టం రిపోర్టు తమకు ఇవ్వాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందు మృతిపై స్పఫ్టత ఇవ్వాలని, చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలిక ఇందు గురువారం ఉదయం కనిపించకుండా పోయింది. గురువారం ఉదయం తండ్రితో పాటు స్కూల్‌కు వచ్చిన బాలిక తన బ్యాగును అక్కడే విడిచిపెట్టి పార్కుకు వెళ్లినట్లుగా మిగిలిన పిల్లలు చెప్పారని హెడ్మాస్టర్ తెలిపారు. బాలిక వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో స్కూల్ హెడ్మాస్టర్, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్స్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి గాలించారు. పాఠశాల ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేవు. దమ్మాయిగూడ చౌరస్త వద్ద ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో మాత్రమే బాలిక కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనే విషయం తెలియరాలేదు. డాగ్ స్వ్కాడ్స్ చెరువు వద్దకు వెళ్లి ఆగిపోయాయి. దీంతో గజ ఈతగాళ్లతో గాలించగా.. శుక్రవారం ఉదయం చెరువులో మృతదేహం లభ్యమైంది. -
ఎంపీ ఆత్మహత్య: 15 పేజీల లేఖ, వైరలవుతోన్న వీడియో
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నివేదిక ఎంపీ మోహన్‌ది ఆత్మహత్యగా నిర్ధారించింది. అంతేకాక ఘటనా స్థలం నుంచి పోలీసులు 15 పేజీల సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక లెటర్‌హెడ్ మీద గుజరాతీలో ఉన్న ఈ లేఖలో ఎంపీ ఆత్మహత్యకు గల కారణాలను వివరించినట్లు సమాచారం. లేఖలో ఉన్న విషయాల గురించి పోలీసులు బయటకు వెల్లడించడం లేదు. సోమవారం ఉదయం సౌత్ ముంబైలోని ఓ హోటల్లో మోహన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం డ్రైవర్ వచ్చి హోటల్ రూమ్ తలుపు కొట్టాడు. అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అతడు ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు హోటల్ సిబ్బందికి విషయం చెప్పమని సూచించడంతో.. డ్రైవర్ హోటల్ స్టాఫ్‌కి విషయం చెప్పాడు. ఆ తర్వాత అతడు బల్కానీలో నుంచి గది లోపలికి ప్రవేశించి చూడగా.. అక్కడ సీలింగ్ ఫ్యాన్‌కు మోహన్ ఉరి వేసుకుని ఉండటం కనిపించింది. దాంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం పోలీసులు మోహన్ దేల్కర్ డ్రైవర్, బాడీగార్డును విచారిస్తున్నారు. ఇక మోహన్ మృతి చెందిన తర్వాత గతేడాది అతడు లోక్‌సభలో ప్రసంగించిన ఓ వీడియో తెగ వైరలయ్యింది. దీనిలో అతడు.. ‘‘గత నాలుగు నెలలుగా కొందరు అధికారులు నన్ను అవమానించాలని.. నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. మహమ్మారి సమయంలో, కొంతమంది అధికారులు నన్ను తప్పుడు కేసులలో బుక్ చేయడానికి ప్రయత్నించారు. నా విధులను నిర్వర్తించడానికి నన్ను అనుమతించలేదు. అందువల్ల నేను ప్రజలకు సహాయం చేయలేకపోయాను. కేంద్ర పాలిత దాద్రా, నగర్ హవేలీల ముక్తి దివాస్ సందర్భంగా నన్ను అవమానించారు. 35 సంవత్సరాలుగా వస్తోన్న సంప్రదాయం ప్రకారం దాద్రానగర్ హవేలీ ప్రజలను ఉద్దేశించి నేను ప్రసంగించకుండా అడ్డుకున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి నన్ను ఎందుకు అనుమతించలేదని నేను అడిగినప్పుడు, డిప్యూటీ కలెక్టర్, ఈవెంట్ నిర్వాహకులు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. వారు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు.. ఇది నాపై జరుగుతున్న కుట్ర" అని మోహన్ ఈ వీడియోలో వెల్లడించారు. -
సుశాంత్ కేసు : ‘ఆ విషయాన్ని ప్రస్తావించలేదు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తులో భాగంగా అతడి మాజీ మేనేజర్ దిశ సలియన్ పోస్ట్‌మార్టం నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇందులో దిశ మృతికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిపోర్టులో తన తలకు బలమైన గాయాలయ్యాయని, శరీరంపై అనేక చోట్ల సహజ గాయాలైనట్లు పోస్టుమార్టంలో వైద్యులు వెల్లడించారు. అవి 14 అంతస్తుపై నుంచి దూకడం వల్లే గాయలైనట్లు వైద్యులు రిపోర్టులో వెల్లడించారు. కానీ తన ప్రైవేటు భాగాలపై కూడా గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. రిపోర్టులో మాత్రం దీనిపై వైద్యులు ప్రస్తావించకపోవడం గమనార్హం. వివరాలు.. దిశ ముంబైలోని ఓ అపార్టుమెంటులో14వ అంతస్తులో నివసించేదని, ఈ క్రమంలో జూన్ 9న(సుశాంత్ ఆత్మహత్య నాలుగు రోజుల ముందు) రాత్రి 2 గంటల సమయంలో తన అపార్టుమెంటు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ మాజీ మేనేజర్ మృతి : దర్యాప్తు ముమ్మరం) అయితే ఆ సమయంలో దిశ తన బాయ్ ఫ్రెండ్ రోహన్ రాయ్ ఇంట్లో ఉన్నట్లు ఓ ఇంగ్లీష్ ఛానల్ పేర్కొంది. మహరాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నారాయణ్ రాణే దిశ మరణంపై ఇటీవల అనుమానం వ్యక్తం చేశారు. దిశది ముమ్మాటికి అత్యాచారం, హత్యేనని ఆయన ఆరోపించారు. తన తలకు తీవ్రమైన గాయమైందని, ఇతర శరీర భాగాలపై సహజ గాయాలైనట్లు మాత్రమే వైద్యులు పోస్టుమార్టం రిపోర్టులో ధృవికరించారన్నారు. కానీ ఆమె ప్రైవేటు భాగాలపై కూడా గాయాలు ఉన్నాయని వాటిపై రిపోర్టులో వైద్యులు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. అంతేగాక దిశ జూన్ 9న ఆత్మహత్య చేసుకుని మరణిస్తే జూన్ 11న తన మృతదేహానికి పోస్టుమార్టం జరిపారని, రెండు రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. (చదవండి: సుశాంత్ కేసు: ప్రెస్ నోట్ విడుదల) సుశాంత్ ఆత్మహత్య అనంతరం తన మాజీ మేనేజరైన దిశ ఆత్మహత్యపై కూడా పలువురు అనుమానం వ్యక్తం చేశారు. దిశ మరణించిన వారం వ్యవధిలోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో వీరిద్దరి మృతి ముడిపడి ఉంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా సుశాంత్ కేసు దర్యాప్తును సుప్రీం కోర్టు సీబీఐకి ఆదేశించడంతో ముంబై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దిశ మృతిపై కూడా ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో దిషా ఆత్మహత్యపై ఆధారాలు తెలిసిన వారు తమని సంప్రదించాలని పోలీసులు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. -
సిమి ఉగ్రవాదుల పోస్టుమార్టం నివేదిక వెల్లడి
-
ఊపిరి ఆడకే ప్రత్యూష మృతి
ముంబై : 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా ఆనందిగా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రత్యూష బెనర్జీ(24) పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతమయింది. ఆమెది ఆత్మహత్యేనని పోస్టుమార్టంలో వెల్లడైంది. ఊపిరి ఆడని స్థితిలో ఉక్కిరిబిక్కిరై ఆమె మరణించినట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యూష తన సొంత ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌తో ఉన్న అనుబంధం దెబ్బతినడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని, ఆమె మృతికి ప్రియుడు రాహులే కారణమని పలు కథనాలు వినిపిస్తున్నాయి. ముంబై పోలీసులు రాహుల్‌ని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. తమ కుమార్తె ప్రేమ వ్యవహారం తమకు తెలుసని, ఆమె మృతి విషయమై రాహుల్ తప్పక సమాధానం చెప్పాల్సి ఉందని ప్రత్యూష తల్లి వాపోతున్నారు. ఆమె కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మరోపక్క ప్రియుడు రాహుల్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యూషను ఆసుపత్రికి తీసికెళ్లాక.. ఆమె మృతి చెందిందని నిర్థారణ అయిన తరువాత రాహుల్ ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడని చెబుతున్నారు. అలాగే శుక్రవారం ఇరువురు ఓ మాల్లో గొడవ పడ్డారని, ఆ సమయంలో రాహుల్ ప్రత్యూషపై చేయి చేసుకున్నాడని.. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె విగత జీవిగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ చిన్న వయసులో ప్రత్యూష ఈ పరిస్థితుల్లో మరణానికి చేరువవడం పలువురిని కలచివేసింది. ప్రేమ కారణంగా అర్థాంతరంగా తనువు చాలించిన తారలను గుర్తుచేసింది. వెలుగు జిలుగుల జీవితాలను చీకటిగా మార్చేసిన 'ప్రేమ' మరోసారి వార్తల్లోకెక్కింది. అశ్రు నయనాల మధ్య ప్రత్యూష కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. -
సీతామహలక్ష్మిది హత్యే!
పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు సీఐ బాలసూర్యారావు సాగర్‌నగర్ (ఆరిలోవ) : ఒకటోవార్డు పరిధి పైనాపిల్ కాలనీలో బుధవారం మృతిచెందిన సీతామహలక్ష్మిది హత్యగా పోలీసులు ధ్రువీకరించారు. గోపాలపట్నం సీఐ బాలసూర్యారావు కథనం మేరకు వివరాలిలావున్నాయి. మంగళవారం రాత్రి సీతామహలక్ష్మి ఆమె భర్త సూర్యనారాయణ గొడవపడ్డారు. దీనిలో భాగంగా సూర్యనారాయణ సీతామహలక్ష్మిని కడుపులో బలంగా గుద్దడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు బుధవారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం ఆమె మృతదేహానికి గురువారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై వచ్చిన నివేదిక ఆధారంగా హత్యగా కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితుడు సూర్యనారాయణను అదుపులోకి తీసుకుంటామని ఆయన వివరించారు. -
పూజారికి పూనకం వచ్చింది!
మేం దేవుడి ముందే నాలిక తిప్పేసే సాహసం చేస్తుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ఓటర్లూ నోళ్లులేని రాళ్లే. ఇదిగో, సంక్రాంతి పండక్కి సన్నబియ్యం, ముద్దపప్పు, నెయ్యి ఇస్తారట. మంచిదే. ఇక్కడేం తక్కువ తింటారా! బిర్యానీ దినుసులు ప్రకటిస్తారు. పారిపోయిన సంవత్సరానికి గొప్ప చారిత్రక ప్రాధాన్యం ఉంది. మోదీని ప్రజలూ, మంగళ్యాన్ని శాస్త్ర వేత్తలూ విజయవంతంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. తెలంగాణ ఉద్యమం ఫలిం చింది. అవశేష ఆంధ్రప్రదేశ్ తాడూ బొంగరం లేకుండా మిగిలింది. తెలంగాణ రాష్ట్రాన్ని బహూకరించానన్న ధీమాతో ఉన్న సోనియాకి చుక్కెదురైంది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో కూడా ఘోర మరణానికి కారణాలు తెలియ రాకపోవడం ఆ పార్టీ పరా జయానికే పరాజయం. ఆ నాయకురాలు ఏ వైఫల్యాల గురించీ అడగను. కానీ, తెలంగాణ ఫలితం గురించి నాకు చెప్పండని గుమ్మంలో కూర్చుని ‘జనపథం’లో వచ్చే పోయే వారందరినీ దీనంగా ప్రశ్నిస్తున్నారు. చేవలు తేలిన ఆ ప్రాంత నేతలు సైతం ఆ తల్లికి జవాబు చెప్పలేక, చాయ్ నమిలి వెళ్లిపోతున్నారు. పారిపోయిన ‘పధ్నా లుగు’ చేతిని మెలితిప్పి మరీ వెళ్లిపోయింది. ‘‘హుద్‌హుద్ తుపాను చంద్రబాబు పేరులో పెట్రో లు పోసింది. అబ్బో! ఏమి పేరు! ఎంత పేరు! నాలుగు జిల్లాల్లో మార్మోగిపోయింది. తుపానుతో మూడు జిల్లా ల్నీ, క్యాపిటల్‌తో రెండు జిల్లాల్నీ వశపరుచుకున్నారు. ఒకటి సొంత జిల్లా. ఫర్వానై. నెల్లూరు మనదే. అంటే ఆధా... ఆధా. గోదావరి జిల్లాలు పుష్కరాలతో దాసో హం అంటాయి. ఎటొచ్చీ మిగిలిన వాటిని కాసుకోవాలి. ఫర్వాలేదు. సమర్థుడే. సాధిస్తాడు’’ ఇది మా గుడి పూజారిగారి వ్యాఖ్య. ఆయన చానల్స్ అంతగా చూడరు. పత్రికలు ఆయనకు చక్రపొంగళ్లు. నాకేస్తారు. ‘‘ఎప్పుడో అంజయ్య సీఎమ్‌గా ఉండగా ఆయనకో యాదగిరి ఉండేది. అది నిత్యం వార్తల్లో ఉండేది. మళ్లీ ఇన్నాళ్లకి పూర్వ వైభవం వచ్చింది తెలంగాణకి. నిజాం మన గొప్పరాజు- అనేసి అందర్నీ వెయ్యేసి సార్లు ఇంపో జిషన్ రాసి చూపించమంటున్నారు హెడ్మాష్టారు. ఒక రాజు, పైగా ప్రపం చంలోనే ధనవంతుడు. తన రాజ్యంలో కోటలు, అంతఃపురాలు, గుర్రప్పా కలు, గజశాలలు, దవా ఖానాలు ఏర్పాటు చేయడాన్ని ఔన్నత్యంగా భావించడం మంజీరా నీటి మహత్తు. ఆనాడు దొరలు కూడా ఓడ రేవులు, రైల్వేలైన్లు, దోపిడీ సొత్తు దోచుకు పోవడానికి రాదారి మార్గాలు నిర్మించారుగా. ఏమిటో, ఈ సంస్కారానికి రెండువైపులా పదునుంది. అయినా నాకేల...’’ అంటూ గర్భాలయం వైపు నడుస్తుంటే నేనూ నడిచాను. క్షణంలో అర్చన ముగించి, గంట కొట్టి బయట పడ్డారు. ఆయనకు శ్రోతలు దొరకరు. ‘‘పధ్నాలుగు యావత్తూ గెంతుళ్లే! ఆ యొక్క కాంగ్రెస్ తటాకం క్రమేపీ ఎండిపోతోంది. ప్రాప్తకాలజ్ఞత, అంటే ముందుచూపు గల జ్ఞాని కప్పలు ఊటగల చెరువు ల్లోకి దాటుకుంటున్నాయి. చెరువు మారాక అది కొత్తగా చేరిన కప్పా, అనాది మండూకమా అనే తేడాలుండవు. ఒక్కోసారి పాతవి బెకబెకలాడుతూ అక్కడే ఉంటాయ్. కొత్తవి చకచకా చెర్లైక్కుతాయ్!’’ అంటూ చిన్నగా నవ్వి ‘‘ఆఁ, ఏవుంది, అంతా అర్చక సాంప్రదాయంలో నడు స్తోంది. అక్కడా ఇక్కడా కూడా ’’ అన్నారు. బోధపడక విస్తరించడన్నట్టు చూశాను. ‘‘ఏముంది! పూజలో ఛత్రా లు, చామరాలు, నాట్యం, వాద్యం, గీతం- ఇలా షోడశో పచారాల కరిష్యే అనేస్తాం. అక్కడేం ఉండవు. ఉత్తుత్తినే. నామ్ కే వాస్తే. ఇలాగే బోలెడు ఉపచారాలని తయా రు చేసి, ఆ జాబితాని ప్రెస్ ముందు అప్పగించి నీళ్లొదలడం, మర్నాడు పేపర్లో హెడ్‌లైన్స్ చదువుకోవడం... అదే నడుస్తోంది!’’ ‘‘అంతేనంటారా!’’ అన్నాను.‘‘అంతే... అంతే... మేం దేవుడి ముందే నాలిక తిప్పేసే సాహసం చేస్తుంటే ఇదేం పెద్ద విషయం కాదు. ఓటర్లూ నోళ్లులేని రాళ్లే. ఇదిగో, సం క్రాంతి పండక్కి సన్న బియ్యం, ముద్ద పప్పు, నెయ్యి ఇస్తారట. మంచిదే. ఇక్కడేం తక్కువ తింటారా! బిర్యానీ దినుసులు ప్రకటిస్తారు. అంతేనా. పైసంగతులు కూడా వేస్తారు. పతంగులు, దారబ్బంతులు పంచుతాం. గోల్కొండ, నౌబత్ పహాడ్ల మీంచి రాచకొండ, యాద గిరిగుట్ట మీంచి ఎగిరే గులాబి రంగు పతంగులు విజయ కేతనాలు కావాలి. నేను నా సహచర మంత్రులు స్వయం గా పతంగులు ఎగరేస్తాం’’ పూజారిగారికి పూనకం వచ్చింది. ‘‘స్వామీ! పెకైళ్లిన మీ పతంగులు జనంలోకి కొత్త సంకేతాలు పంపిస్తాయేమో....’’ అన్నాను. ‘‘మీ డౌటు నాకర్థమైంది. రంగు మనది. పతంగి వాళ్లది. ఈ గాలికి అదే బాగు!’’ అన్నారు పూజారిగారు. మహా నివేదనకి వేళైందంటూ కదిలారు. - (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
తొమ్మిది మంది పోలీసులపై ఎఫ్ఐఆర్
ముంబై: దోపిడీ కేసులో అరెస్టయిన యువకుడి కస్టడీ మృతిపై బాంబే హైకోర్టు మంగళవారం తీవ్రంగా స్పందించింది. ఇందుకు పోలీసులే బాధ్యులని నిరూపించడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు తొమ్మిది మంది పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇదే కేసుల్లో పట్టుబడ్డ ముగ్గురిని పోలీసులు లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని న్యాయమూర్తులు వీఎం కనడే, పీడీ కోడే డీజీపీని ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ 18న పోలీసు కస్టడీలో మరణించిన 24 ఏళ్ల ఆగ్నెలో వల్డారిస్ పోస్టుమార్టం నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. అతని వైద్యనివేదికలు, ఆస్పత్రి రిజిస్టర్‌ను కుటుంబ సభ్యులకు అందజేయాలని స్పష్టం చేశారు. వల్డారిస్ తండ్రి జేవియర్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు పైఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో జేవియర్ కూడా అరెస్టయ్యాడు. తనతోపాటు మరో ఇద్దరిని పోలీసులు లైంగికంగా వేధించారని ఆయన కోర్టుకు ఫిర్యాదు చేశారు. బాగా కొట్టడం వల్లే తన కొడుకు మరణించాడని స్పష్టీకరించారు. తమ కస్టడీ నుంచి తప్పించుకోబోయే ప్రయత్నంలో వల్డారిస్ రైలు కింద పడి మరణించాడని వడాలా పోలీసులు కోర్టుకు వివరణ ఇచ్చారు. జేవియర్ న్యాయవాది స్పందిస్తూ ఈ వాదన అబద్ధమని, ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదాపడింది.