సీతామహలక్ష్మిది హత్యే! | Sita Mahalakshmi murder | Sakshi
Sakshi News home page

సీతామహలక్ష్మిది హత్యే!

Published Fri, Jan 30 2015 2:47 AM | Last Updated on Mon, Aug 13 2018 2:57 PM

Sita Mahalakshmi murder

పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు నమోదు
సీఐ బాలసూర్యారావు


సాగర్‌నగర్ (ఆరిలోవ) : ఒకటోవార్డు పరిధి పైనాపిల్ కాలనీలో బుధవారం మృతిచెందిన సీతామహలక్ష్మిది హత్యగా పోలీసులు ధ్రువీకరించారు. గోపాలపట్నం సీఐ బాలసూర్యారావు కథనం మేరకు వివరాలిలావున్నాయి. మంగళవారం రాత్రి సీతామహలక్ష్మి ఆమె భర్త సూర్యనారాయణ గొడవపడ్డారు.

దీనిలో భాగంగా సూర్యనారాయణ సీతామహలక్ష్మిని కడుపులో బలంగా గుద్దడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందింది. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు బుధవారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం ఆమె మృతదేహానికి గురువారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై వచ్చిన నివేదిక ఆధారంగా హత్యగా కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితుడు సూర్యనారాయణను అదుపులోకి తీసుకుంటామని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement