
సాక్షి, మేడ్చల్ జిల్లా: పరీక్షా కేంద్రం నుంచి నిర్ణీత సమయం కంటే ముందే పారిపోయిన అభ్యర్థిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖలో అకౌంటెంట్ పోస్టుల భర్తీకి మంగళవారం పరీక్ష జరిగింది. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు మేడ్చల్ మండలంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ సెట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్‌కు చెందిన మహ్మద్ అసర్ హాజరయ్యాడు. బయో సబ్జెక్ట్‌కు విరామం ఇచ్చిన సమయంలో సాయంత్రం 4:15 నిమిషాలకు అసర్ టాయిలెట్ కోసం అనుమతి తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతను పారిపోయినట్లు గుర్తించిన చీఫ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌రెడ్డి మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment