సాక్షి, యాదాద్రి: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్షా ప్రశాంతంగా కొనసాగుతోంది. తొమ్మిదిన్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్ -1 పరీక్ష మొదలవగా పరీక్ష ప్రారంభానికి 15 నిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసేశారు.. 9.45 తర్వాత అభ్యర్థులు ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురిని లోపలికి అనుతించకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.
ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభ్యర్థిని గూగుల్ మ్యాప్ కొంపముంచింది. జిల్లాకు చెందిన శశిధర్ అనే అభ్యర్థికి చౌటుప్పల్‌లోని కృష్ణవేణి స్కూల్‌లో సెంటర్ పడింది. గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణవేణి స్కూల్ లొకేషన్ సెట్ చేసుకోగా.. అది పాత స్కూల్ అడ్రస్ వద్దకు తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాకా పాఠశాలను మరోచోటుకు మర్చారని తెలియండంతో హుటాహుటిన అసలు కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు.
చదవండి: Balagam Ts Group 4 Question: బలగం సినిమాపై గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్న ఇదే
Comments
Please login to add a commentAdd a comment