choutuppal
-
చారిత్రక దారి.. 300 ఏళ్ల మెట్లబావి
నాటి చారిత్రక కట్టడాలు నేటి తరానికి గొప్ప సంపద. గతాన్ని చూడని ఇప్పటి జనానికి అలనాటి నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. దశాబ్దాల కాలం నాటి నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటం అప్పటి సాంకేతికతకు నిదర్శనం. యంత్రాలు, ఇతర నిర్మాణ పనిముట్ల గురించి తెలియని సమయంలో కేవలం మానవుల తెలివితో చేపట్టిన నిర్మాణాలు నేటి సాంకేతికత కంటే చాలా పటిష్టంగా ఉన్నా యి. అలాంటి వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా గుర్తించి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.రాజధానికి 52 కి.మీ. దూరంలో..హైదరాబాద్‌కు (Hyderabad) సరిగ్గా 52 కి.మీ. దూరంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడ (Vijayawda) మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం (Lingojigudem) గ్రామం ఉంది. ఈ గ్రామంలో జాతీయ రహదారి వెంట ప్రస్తుతం ఉన్న సాయిబాబా దేవాలయాన్ని గతంలో గోసాయిమఠంగా పిలిచేవారు. దశాబ్దాల కిందట ఈ మఠాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దేవాలయం వెనుక భాగాన దిగుడుబావి (మెట్లబావి) ఉంది. ఆ దిగుడు బావిని 300 ఏళ్ల కిందట అప్పటి రాజులు నిర్మించారు. ఎంతో గొప్ప సాంకేతికతతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటంతో కొంత మేరకు నిర్మాణాలు దెబ్బతిన్నాయే తప్పిస్తే మిగతా కట్టడాలన్నీ యథావిధిగా ఉన్నాయి. రాజుల కాలంలో దిగుడుబావి నిర్మాణందిగుడుబావి (మెట్లబావి) గొప్ప చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడ విశ్రాంత మందిరాన్ని నిర్మించుకున్నారని, ఆ విశ్రాంత మందిరానికి అనుసంధానంగా అన్ని రకాల సౌకర్యాలతో ఈ దిగుడుబావిని నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దిగుడుబావి పరిసరాల్లోని రాజు భూములు కాలక్రమేణా స్థానికులకు వచ్చాయి. పూర్తిగా రాళ్లతోనే..ఈ దిగుడుబావిని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. తూర్పున 6 అడుగుల వెడల్పు, దిగువకు 20 అడుగులు, ఉత్తరంలో 10 అడుగుల వెడల్పు ప్రకారం మొత్తంగా దిగువకు 60 అడుగుల మేర మెట్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గాన్ని గ్రానైట్ రాళ్లతో అందంగా తీర్చిదిద్దారు. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో ఈ బావిని నిర్మించారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన బావిలో ప్రత్యేకంగా ఆర్చీలతో మూడు గదులు ఏర్పాటు చేశారు. బావిలో స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఈ గదులను నిర్మించారు. ఆ గదులు ప్రత్యేకంగా మహిళలు (నాటి రాణులు) వినియోగించేవిగా తెలుస్తోంది. పొలాలకు సాగునీరు, స్థానిక ప్రజానీకానికి తాగు నీరు అందించడంతో పాటు ప్రజలు స్నానాలు చేసేందుకు అనువుగా బావిని నిర్మించారు. గోసాయి మఠంగా ప్రత్యేక గుర్తింపుచౌటుప్పల్ పట్టణ కేంద్రానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగోజిగూడెం గ్రామం ఒకప్పుడు గోసాయిమఠంగానే గుర్తింపు పొందింది. కొన్నేళ్ల కిందట గోసాయిదొర అనే వ్యక్తి హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ప్రస్తుతం సాయిబాబా దేవాలయం ప్రాంతంలో మఠాన్ని ఏర్పాటు చేశాడు. పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేసే బాటసారులు అలసిపోయిన సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడంతోపాటు అక్కడే విడిది చేసేందుకు అనువుగా అందులో వసతులు ఉండేవని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఆర్టీసీ బస్సులు కూడా గోసాయిమఠం స్టేజీ అంటేనే ఆగేవంటే ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి ప్రస్తుతం రెండు ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది.మెట్లబావి పరిరక్షణకు ముందుకొచ్చిన హెచ్ఎండీఏశతాబ్దాల కాలంనాటి మెట్లబావి గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అందుకు సంబంధించి 2022, ఫిబ్రవరి 14న ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ స్పందించారు. వెంటనే మెట్లబావి విషయాన్ని తెలుసుకుని మరమ్మతులు చేయాలని హెచ్ఎండీఏ (HMDA) అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలా ఈ మెట్లబావిని సుందరీకరించారు. అనంతరం ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ మెట్లబావి బాధ్యతలు హెచ్ఎండీఏ చూసుకుంటోంది. అయితే ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.ఇదీ చదవండి: రాజాబావి.. రాజసం ఏదీ?కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తాం పురాతన మెట్లబావి అభివృద్ధి అంశాన్ని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్తాం. పర్యాటక ప్రాంతంగా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పురాతన కట్టడాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మూడొందల ఏళ్ల కిందట నిర్మించిన మెట్లబావి మా గ్రామంలో ఉండటం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వం, మున్సిపల్ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి. – రమనగోని శంకర్, మాజీ సర్పంచ్, లింగోజిగూడెం -
గ్రూప్-4 ఎగ్జామ్: అభ్యర్థి కొంపముంచిన గూగుల్ మ్యాప్
సాక్షి, యాదాద్రి: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-4 పరీక్షా ప్రశాంతంగా కొనసాగుతోంది. తొమ్మిదిన్నర లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్ -1 పరీక్ష మొదలవగా పరీక్ష ప్రారంభానికి 15 నిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసేశారు.. 9.45 తర్వాత అభ్యర్థులు ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన పలువురిని లోపలికి అనుతించకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభ్యర్థిని గూగుల్ మ్యాప్ కొంపముంచింది. జిల్లాకు చెందిన శశిధర్ అనే అభ్యర్థికి చౌటుప్పల్‌లోని కృష్ణవేణి స్కూల్లో సెంటర్ పడింది. గూగుల్ మ్యాప్ ద్వారా కృష్ణవేణి స్కూల్ లొకేషన్ సెట్ చేసుకోగా.. అది పాత స్కూల్ అడ్రస్ వద్దకు తీసుకెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాకా పాఠశాలను మరోచోటుకు మర్చారని తెలియండంతో హుటాహుటిన అసలు కేంద్రం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు ఎగ్జామ్ రాసేందుకు అనుమతించలేదు. చదవండి: Balagam Ts Group 4 Question: బలగం సినిమాపై గ్రూప్-4 పరీక్షలో అడిగిన ప్రశ్న ఇదే -
డీసీఎంను రీ డిజైన్ చేసి గంజాయి సరఫరా
నాగోలు: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఏడుగురు నిందితుల్లో నలుగురిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.కోటిన్నర విలువ చేసే 400 కేజీల గంజాయి, కారు, డీసీఎం, 5 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శనివారం ఎల్బీనగర్లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన భానోత్ వీరన్న, శ్రీశైలానికి చెందిన కర్రే శ్రీశైలం, హైదరాబాద్‌కు చెందిన కేతావత్ శంకర్‌నాయక్, వరంగల్ జిల్లాకు చెందిన పంజా సురయ్యతో పాటు మురో ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గంజాయిని డీసీఎంలో తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. డీసీఎం వాహనాన్ని రీ–డిజైన్ చేసి దాని కింద గంజాయిని దాచిపెట్టి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో ముఠా సభ్యులు పలుమార్లు ఇతర ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేశారు. ఈ క్రమంలో ఏపీలో కృష్ణదేవి పేట నుంచి డీసీఎంలో 400 కిలోల గంజాయి లోడ్ చేసుకుని అక్కడ నుంచి బయలు దేరారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి డీసీఎం ముందు కారులో ఇద్దరు వ్యక్తులు పైలట్ చేసుకుంటూ వస్తున్నారు. ఏపీ నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమలగిరి, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పక్కా సమాచారంతో చౌటుప్పల్ పోలీసులు శనివారం ఉదయం డికాయ్ ఆపరేషన్ నిర్వహించారు. వలిగొండ–చౌటుప్పల్ చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 400 కిలోల గంజాయిని, కారు, లారీ, సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు. సమావేశంలో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, సీఐలు మల్లికార్జున్‌రెడ్డి, మహేష్, మోతీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో రోడ్డు ప్రమాదం
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీ.. విజయవాడ హైవేపై ప్రమాదం
సాక్షి, యాదాద్రి భువనగిరి: జిల్లాలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులు ఒకదానిని మరొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్-65 పై ఈ ఘటన జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులు మైత్రి ట్రావెల్స్, ఆరంజ్ ట్రావెల్స్ బస్సులుగా నిర్ధారణ అయ్యింది. ఓవర్ టేక్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారని ప్రాథమిక విచారణ ద్వారా పోలీసులు వెల్లడించారు. పదహారు మందికి స్వల్ప గాయాలు కాగా, మరో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలై విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. -
తెలంగాణ వైద్య విద్య దేశానికే ఆదర్శం
చౌటుప్పల్: తెలంగాణలోని వైద్యవిద్య దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సమైక్య పాలనలో వైద్యవిద్యను అభ్యసించాలంటే విద్యార్థులు చైనా, రష్యా, ఉక్రెయిన్ దేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రస్తుతం వైద్యం, వైద్య విద్య గ్రామీణ ప్రాంతాలకే వచ్చిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను మంగళవారం విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 107 కళాశా లలు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సమైక్య పాలనలో తెలంగాణలో ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రుల్లో మాత్రమే కిడ్నీ డయాలసిస్ సెంటర్లు ఉండేవని, వీటిని 102కు పెంచామన్నారు. ప్రతి ఏడాది డయాలసిస్ సెంటర్లకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, కిడ్నీ బాధితులపై ఒక్క పైసాకూడా భారం పడకుండా సేవలు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామంటే బీబీనగర్‌లోని రూ.500 కోట్ల విలువ చేసే భూమి, భవనాలను కేంద్రానికి అప్పగించా మని, నాలుగేళ్లలో అక్కడ తట్టెడు మట్టికూడా పోయలేదని ధ్వజమెత్తారు. -
గీతకార్మికుడి నరకయాతన
నల్గొండ: తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారడంతో గీతకార్మికుడు చెట్టుపైనే తలకిందులుగా వేలాడుతూ నరకాన్ని చూశాడు. ఈ సంఘటన మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లి గ్రామానికి చెందిన ఇట్టగోని ముత్యాలు కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజుమాదిరిగా మంగళవారం గ్రామ సమీపంలో తాటిచెట్టు ఎక్కుతుండగా ఒక్కసారిగా మోకు జారడంతో చెట్టుపైనే తలకిందులుగా వేలాడాడు. కొంతసేపటి తర్వాత స్థానికులు గమనించి హుటాహుటిన గ్రామం నుంచి నిచ్చెనలు తీసుకొచ్చి ముత్యాలును కిందికి దింపి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. -
చౌటుప్పల్‌లో అనుకున్న మెజార్జీ రాలేదు
-
మునుగోడు ఉప ఎన్నిక: ఎంత పనైపాయే.. అయ్యో కళ్యాణ్!
సాక్షి, నల్గొండ: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన యువకుడు కుడుముల కళ్యాణ్‌రెడ్డి తనకు తొలిసారిగా వచ్చిన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాడు. పోలింగ్ సమయం దగ్గర పడిన క్రమంలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. అప్పటికే సమయం 6.08 గంటలు అయ్యింది. ఓటర్ స్లిప్పుతో పోలింగ్ కేంద్రంలోని వెళ్తుండగా అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, అధికారులు అనుమంతిచలేదు. సమయం ముగిసినందున ఓటు వేయడం కుదరదని తేల్చిచెప్పారు. తనకు మొదటిసారి ఓటు వచ్చిందని అవకాశం ఇవ్వాలని కోరినా అనుమతించలేదు. దీంతో ఆ యువకుడు నిరాశతో వెనుదిరిగాడు. ఒక్కరికి రెండు ఓట్లు! మునుగోడు : అధికారుల తప్పిదాల వల్ల ఒక్క ఓటరుకు రెండు చోట్ల ఓటు హక్కు వచ్చింది. దీంతో వారు ఓటు వేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. మునుగోడులోని పలు బూత్‌లలో ఒకే ఓటరుకు రెండు ఓట్లు ఉన్నట్లు ఓటరు లిస్టులో ముద్రించారు. మునుగోడులోని బూత్ నంబర్ 155లో క్రమ సంఖ్య 902లో కట్ట పవిత్రకు ఓటు హక్కు ఉన్నట్లు ఓటరు లిస్టులో ఉంది. అదే ఓటరు పేరు తిరిగి 903 క్రమ సంఖ్యలో కూడా ఉండటంతో ఆ యువతి ఓటు వేసేందుకు అభ్యంతరం వ్యక్తమైంది. చివరికి ఎన్నికల సిబ్బంది, పోలింగ్ బూత్ ఏజెంట్లతో మాట్లాడి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. అదే గ్రామంలోని పందుల పవన్‌కు 155 బూత్‌లోని 927 క్రమ సంఖ్యలో ఓటు హక్కు ఉంది. అదే యువకుడికి బూత్ నంబర్ 152లో కూడా ఉండటంతో అతడు ఏ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాలో అర్థంకాక ఇబ్బంది పడ్డాడు. -
రేకులుగా మార్చి.. లోదుస్తుల్లో దాచి..
చౌటుప్పల్ రూరల్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద మూడున్నర కేజీల బంగారం పట్టుబడింది. రూ.1.90కోట్ల విలువైన బంగారాన్ని ఆది వారం తెల్లవారుజామున ఎస్ఎస్టీ(స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీం) అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన హర్షద్, షరీఫ్, జావేద్, సుల్తానా దుబాయ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మూడున్నర కిలోల బంగారాన్ని ద్రవరూపంలోకి మార్చి సన్నని రేకులుగా ప్యాక్ చేసి అండర్వేర్లలో ఉంచుకొని విమానంలో ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఎర్టిగా కారులో హైదరాబాద్‌కు వస్తుండగా, పంతంగి టోల్గేట్ చెక్‌పో స్టు వద్ద పోలీసులకు తనిఖీలో పట్టుబడ్డారు. వారి నుంచి బంగారం, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యా ప్తు నిమిత్తం డీఆర్ఐ అధికారులకు అప్పగించారు. కాగా, పోలీసులు వీరిని బంగారం స్మగ్లింగ్ ముఠా గా అనుమానిస్తున్నారు. వీరు దుబాయ్ ఎలా వెళ్లా రు, బంగారం ఎవరిచ్చారు, ఎయిర్ పోర్టులను దా టుకుంటూ ఇక్కడి వరకు ఎలా వచ్చారు, లేదంటే గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎవరైనా బంగారం ఇచ్చారా అనేది ఆరా తీస్తున్నారు. -
తక్షణమే బకాయిలు విడుదల చేయాలి
చౌటుప్పల్/చౌటుప్పల్ రూరల్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.33,545 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు ఇస్తున్నామని కేంద్ర నాయకులు గొప్పలు చెబుతున్నారని, అయితే ఆ నిధులన్నీ తమకు హక్కుగా వస్తున్న విషయా న్ని గమనించాలని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలో బుధవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.817 కోట్లు, విభజన చట్టంలో భాగంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రావాల్సిన రూ.1,350 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రాంట్ల రూపంలో రూ.723 కోట్లు, పౌష్టికాహారం కింద రూ.175 కోట్లు, స్టేట్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్ కింద ప్రతిపాదించిన రూ.3,024 కోట్లు, తెలంగాణకు బదులు పొరపాటున ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన రూ.497 కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక వేళ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. కృష్ణానది జలాల్లో వాటా తేల్చకుండా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు కేంద్రం అన్యా యం చేస్తోందన్నారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ చౌటుప్పల్ మండలం పంతంగిలో బుధవారం రాత్రి మంత్రి రోడ్ షో నిర్వహించారు. -
గుజరాత్ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి
సాక్షి, యాదాద్రి: ‘‘ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అవి గుజరాత్ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి. అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించండి’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. గతంలో మునుగోడు ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపించారని.. రాజగోపాల్‌రెడ్డి గెలిచిన నాటి నుంచీ బీజేపీ జపం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ప్రజా సమస్యలను ఏనాడూ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని, ఇప్పుడు అనవసరంగా ఉప ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డబ్బు అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. శుక్రవారం రాత్రి చౌటుప్పల్ పట్టణంలో జరిగిన రోడ్‌షోలో ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఆ డబ్బంతా రాజగోపాల్‌రెడ్డి ఖాతాలోకే.. ‘‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనది చిన్న కంపెనీగా చెప్పుకొని రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఎలా తెచ్చుకున్నారు? ఇచ్చిన పెద్దలు ఎవరు, గుజరాత్ గద్దలు ఎవరు? పేద ప్రజల జన్‌ధన్ ఖాతాల్లో 15 లక్షల చొప్పున పడాల్సిన డబ్బులన్నీ కోమటిరెడ్డి ఖాతాలో పడ్డాయి. ఇందుకోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారు. రాజగోపాల్‌రెడ్డి ఇచ్చే పైసలన్నీ గుజరాత్ దొంగల పైసలు. దబాయించి తీసుకోండి. కానీ కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి. శివలింగం వస్తే మాది, శవం వస్తే మీది అంటూ బేకార్ మాటలు మాట్లాడే చిల్లర నాయళ్లకు బుద్ధిచెప్పాలి. మోదీవన్నీ పకోడీ మాటలు 2016లో కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న జేపీ నడ్డా మర్రిగూడకు వచ్చి 300 పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తానని చెప్పారు. ఇన్నేళ్లయినా తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేదో, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదో బీజేపీ నేతలు చెప్పాలి. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని మోదీ ఇడ్లీ బండి, పకోడీ బండి పెట్టుకోవాలని యువతకు సూచిస్తున్నారు. మోదీవన్నీ పకోడీ మాటలే. నల్లధనం తెస్తానని చెప్పి తెల్లమొఖం వేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ వేశారు. రైతులకు రుణమాఫీ చేయకుండా కార్పొరేట్లకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేశారు. నాడు రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.1,200కు చేరింది. ఓటు వేసేటప్పుడు మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రైతు బాంధవుడు కేసీఆర్.. గత 75 ఏళ్లలో ఎందరో ముఖ్యమంత్రులు ఆకుపచ్చ తలపాగాలు ధరించి రైతులను మోసం చేశారు. సీఎం కేసీఆర్ మాత్రం రైతు బంధు, రైతుబీమా వంటి ఉత్తమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ రైతు పథకాలను అటుఇటు మార్చి అమలు చేస్తున్నాయి. నేను మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నా. ఫలానాది కావాలని అడగకుండానే చేసి చూపిస్తా. మునుగోడు నియోజకవర్గంలో 79 వేల మందికి రైతుబంధు, 48 వేల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, రైతు బీమా వంటి పథకాలు అమలవుతున్నాయి. ఇక్కడి దండుమల్కాపురంలో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడను నిర్మించాం. 200 కంపెనీలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తులు ప్రారంభించనున్నాయి. మిషన్ భగీరథ పథకం కోసం రూ. 19వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచిస్తే.. 19 పైసలు కూడా ఇవ్వలేదు. చర్లగూడెం, శివన్నగూడెం ప్రాజెక్టులను సగం పూర్తి చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే పూర్తి చేయిస్తాం. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్. దేశంలో అత్యధికంగా వరి పండించే జిల్లాగా నల్లగొండ జిల్లా మారింది. గత 65 ఏళ్లలో పరిష్కారం కాని ఫ్లోరోసిస్ సమస్యను కేసీఆర్ ప్రభుత్వం రూపుమాపింది..’’ అని కేటీఆర్ చెప్పారు. చౌటుప్పల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోడ్‌షోలో మంత్రి జగదీశ్‌రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడు ఉపఎన్నికల వేళ కలకలం
సాక్షి, చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనాకేంద్రం ప్రతిపాదిత స్థలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట గుర్తు తెలియని వ్యక్తులు సమాధి కట్టడం కలకలం రేపింది. బుధవారంరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మట్టితో సమాధిని కట్టి, పూలదండలు వేసి, జేపీ నడ్డా ఫొటో పెట్టి, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం అంటూ ఫ్లెక్సీ పెట్టారు. గురువారం ఉదయం పోలీసులు దీనిని తొలగించారు. ఈ ఉదంతంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకులు సంఘటనాస్థలానికి వెళ్లి ఇది అధికార పార్టీ పనేనని మండిపడ్డారు. పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఫ్లోరైడ్ బాధితులే ఈ పనిచేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నా, ప్రత్యర్థి పార్టీలే ఈ పని చేసి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, కొన్నేళ్ల క్రితం జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో మర్రిగూడ మండలంలో పర్యటిస్తూ ఫ్లోరైడ్ బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. తదనంతర పరిణామాల్లో ఈ కేంద్రం పశ్చిమబెంగాల్‌కు తరలిపోయింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నడ్డా పేరిట సమాధి కట్టడం గమనార్హం. -
సీసాలు, మూటలు వస్తున్నయ్
చౌటుప్పల్ రూరల్: ‘నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి అయితదని చెప్పి రాజీనామా చేసినవు. సీసాలు వస్తున్నయ్.. మూటలు వస్తున్నయ్.. కానీ అభివృద్ది ఏది?’ అని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి.. రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పాల్వాయి స్రవంతిలతో కలిసి చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం, డి.నాగారం, పీపల్‌పహాడ్, ఎస్.లింగోటం, నేలపట్ల, జైకేసారం గ్రామాల్లో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్, బీజేపీలు నోట్ల మూటలతో మునుగోడును గెలవాలని చూస్తున్నాయ్. మందు సీసలు ఇస్తరట. ఓటుకు రూ.30వేలు ఇస్తరట తీసుకోండి. ఓటు మాత్రం చెయ్యి గుర్తుకు వేయండి’ అని అభ్యర్థించారు. ‘ఇందిరమ్మ ఇండ్లు అగ్గిపెట్టెలెక్క ఉన్నయంటివి. బిడ్డొస్తే, అల్లుడొస్తే ఏడ పండుకోవాలంటివి. కోడుకు, కోడలు ఏడ ఉండాలంటివి. బర్రె, గొర్రె ఏడ కట్టెయ్యాలంటివి. అధికారం చేపట్టి ఎనిమిదేండ్లాయె, మరి డబుల్ బెడ్రూం ఇండ్లు ఏవి?’ అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. దళితులకు ఇస్తామన్నా 3ఎకరాల భూమి ఎటుపోయిందని రేవంత్ నిలదీశారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్‌లలో టీఆర్ఎస్ను, దుబ్బాక, హుజూరాబాద్‌లలో బీజేపీని గెలిపించినా ఏ మార్పూ రాలేదన్నారు. మునుగోడులోనూ టీఆర్ఎస్ను గెలిపించినా, బీజేపీని గెలిపించినా వచ్చేదేమీ లేదని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజాస్వామ్యం బ్రతుకుతుందని రేవంత్ స్పష్టం చేశారు. -
ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’
చౌటుప్పల్ రూరల్: మునుగోడు ఉప ఎన్నిక కోసమే సీఎం కేసీఆర్ గిరిజన బంధు పథకాన్ని తెస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గిరిజనులపై అంత ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీ బిడ్డ ముర్ముకు ఎందుకు ఓటేయలేదని, అగ్రవర్ణానికి చెందిన యశ్వంత్ సిన్హాకు ఎందుకు మద్దతిచ్చారని ఆయన ప్రశ్నించారు. ప్రవీణ్‌కుమార్ చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్ర గురవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుఫ్రాన్‌పేట, మల్కాపురం, ఖైతాపురం, ఎనగంటితండా, పీపల్‌పహాడ్, డి.నాగారం గ్రామాల్లో కొనసాగింది. -
అమిత్ షా వచ్చే రూట్లో వినూత్న నిరసనకు ప్లాన్
-
సాక్షి కథనానికి స్పందన.. 300 ఏళ్ల నాటి మెట్ల బావి.. మెరిసింది చూడు...
సాక్షి, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గోసాయిమఠం వద్ద ఉన్న 300 ఏళ్లనాటి మెట్లబావి చిత్రాలివి. పిచ్చి మొక్కలు, చెట్లు, చెత్తా చెదారంతో నామరూపాల్లేకుండా పోయిన ఈ బావి (మొదటి చిత్రం) దుస్థితిపై ‘గతమెంతో ఘనచరిత్ర’ శీర్షికన ఫిబ్రవరి 14న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ దీనిపై స్పందించి బావి పునరుద్ధరణ పనులు చేయించడంతో ఎంతో సుందరంగా (రెండో చిత్రం) మారింది. మరమ్మతులకు ముందు, తర్వాత తీసిన ఈ బావి ఫొటోలను అరవింద్‌కుమార్ బుధవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ప్రత్యేకతలు ఎన్నో.. మూడు వందల ఏళ్ల కింద.. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో పూర్తిగా రాళ్లతో నిర్మించిన ఈ దిగుడు బావి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. దీనికి తూర్పున, ఉత్తరంలో మెట్లను ఏర్పాటు చేశారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన ఆర్చీలతో మూడు గదులు నిర్మించారు. ఈ మెట్లబావిని పునరుద్ధరించడంపై మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌లకు పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దీనిని పర్యాటక ప్రాంతంగా మార్చాలని కోరారు. చదవండి: రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా!.. ఇకపై ఇట్టే దొరికిపోతారు -
ఘోర రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్
సాక్షి, చౌటుప్పల్ రూరల్ (నల్గొండ): దైవదర్శనానికి వెళ్లొస్తున్న ఓ కుటుంబానికి మార్గమధ్యలో అనుకోని ఆపద ఎదురైంది. ఆపి ఉన్న డీసీఎంను బైక్‌ను ఢీకొనడంతో తండ్రీకుమారుడు మృత్యువాతపడగా, తల్లీ కొడుకు అంపశయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన డాకోజీ రామకృష్ణ(45)ది రెక్కాడితేగాని డొక్కాడని బీదకుటుంబం. లక్కారం స్టేజీ వద్ద చిన్న హేర్ సెలూన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య లక్ష్మి(40), ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు మణిచరణ్(13) పెద్ద అంబర్‌పేటలో 8వ తరగతి చదువుతున్నాడు. చిన్న కొడుకు ఈశ్వర్‌సాయి(11). ఇతడి మానసిక స్థితి సరిగా లేదు. ఇంటి వద్దే ఉంటున్నాడు. రామకృష్ణ అయ్యప్ప భక్తుడు. 18ఏళ్లుగా అయ్యప్ప దీక్ష చేపడుతున్నాడు. చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి అన్నా కూడా ఎనలేని భక్తి. ఈ నెల 12న శబరికీ వెళ్లాడు. అయ్యప్పను దర్శనం చేసుకొని ఈ నెల18న తిరిగొచ్చాడు. శబరికి వెళ్తూ చెర్వుగట్టుకు వెళ్లి దర్శనం చేసుకొని వెళ్లాడు. శుక్రవారం ఉదయం భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి పల్సర్ బైక్‌పై నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టుకు వెళ్లాడు. దైవ దర్శనం పూర్తి చేసుకొని మధ్యాహ్నం తర్వాత వెనుదిరిగారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దాటాక, ఆరెగూడెం క్రాస్‌రోడ్డు సమీపంలో ఓ డీసీఎం ఎక్సెల్ ఇరిగిపోవడంతో డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి హైదరాబాద్‌కు వెళ్లాడు. చదవండి: (అన్నా.. అని వేడినా కనికరించలేదు.. సోదరిని, తల్లిని సైతం వీడియో తీసి..) రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను రామకృష్ణ తన బైకుతో వెనుక నుంచి బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రామకృష్ణ తల చిట్లి పోయి అక్కడికక్కడే మృతిచెందాడు. బైకుపై ముందు కూర్చున్న చిన్నబాబు తలకు, భార్య తలకు, ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. మధ్యన కూర్చున్న పెద్దబాబు కడుపునకు తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్సులో రామకృష్ణ, పెదబాబు మణిచరణ్లను చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామకృష్ణ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించడంతో పోస్టుమార్టం నిమిత్తం అక్కడే ఉన్న మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన మణిచరణ్‌ను హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. లక్కారంలో విషాద ఛాయలు చౌటుప్పల్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో తండ్రీకొడుకులు చనిపోవడం, తల్లీ కొడుకులు చా వుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండడంతో ల క్కారం గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నా యి. విషయం తెలుసుకొని గ్రామస్తులు, బంధువులు తండోపతండాలుగా చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రి కి తరలివచ్చారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం మారుమ్రోగింది. కామినేని ఆస్పత్రిలో మృతి చెందిన ఈశ్వర్‌సాయి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ నివాస్, ఎస్ఐ అనిల్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను డాక్టర్ వర్షిత్‌రెడ్డి కారులో ఎక్కిస్తున్న స్థానికులు క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్ వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి కుమారుడు వర్షిత్‌రెడ్డి నార్కట్‌పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే సమయంలో తన కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. రోడ్డు ప్రమాదం చూసి ఆగాడు. అంబులెన్సులోని రెండు స్ట్రెచర్ల మీద తండ్రి, పెద్ద కొడుకులను తరలించారు. తల్లి, చిన్న కొడుకుల నాడి పట్టి చూశాడు. తీవ్రగాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. సకాలంలో ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలను కాపాడొచ్చని, వారిద్దరినీ తనకారులో వేసుకొని హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లి, జాయిన్ చేశాడు. అక్కడ చిన్న బాబు చనిపోయాడు. తల్లి చికిత్స పొందుతోంది. యువ డాక్టర్ ఔదార్యం పట్ల అందరూ అభినందిస్తున్నారు. ‘గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రిలో చేర్చితే ప్రాణాలను కాపాడొచ్చని యువడాక్టర్గా చలించా. అంబులెన్సులో పంపుదామంటే స్ట్రెచర్లు లేవు, ప్లేస్ లేదు. ఇంకో అంబులెన్సు కోసం వేచి చూసి సమయం వృథా చేయలేక నా కారులోనే హైదరాబాద్‌కు తీసుకొచ్చా’ అని వర్షిత్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అయినా బాబు చనిపోవడం బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు. -
ఒకే స్పాట్లో మూడు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
సాక్షి, నల్గొండ: ఒకే స్పాట్లో మూడు ప్రమాదాలు చోటు చేసుకోవటంతో ఐదుగురు మృతి చెందారు. చౌటుప్పల్‌లోని దివిస్ ల్యాబ్ సెంటర్ మృత్యుదారిగా మారింది. గంటల వ్యవధితో మూడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బైక్‌పై వెళ్తున్న తండ్రి కొడుకులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, కొడుకుకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఘటనలో బైక్‌ను టిప్పర్ లారీ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ధర్మోజీగూడెం దగ్గర కారును బస్సు ఢీకొట్దింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. -
చౌటుప్పల్‌లో హైవేపై వాహనాల బారులు
చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వెళ్లిన కార్లు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి క్యూ కట్టాయి. హైవేపై నిత్యం 30వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, గురువారం మరో 10వేల వాహనాలు అదనంగా వెళ్లినట్టు టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు. భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి టోల్‌ప్లాజాను గురువారం మధ్యాహ్నం సందర్శించి, వాహనాల రద్దీని పరిశీలించారు. గూడూరు టోల్‌ప్లాజా దగ్గరా... బీబీనగర్: హైదరాబాద్–వరంగల్ హైవేపై బీబీనగర్ మండలంలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద కూడా గురువారం పండుగ రద్దీ కనిపించింది. నగరం నుంచి భారీగా ప్రజలు పండుగకు గ్రామాలకు వెళ్తుండడంతో టోల్గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. -
Nalgonda: ఘోర రోడ్డు ప్రమాదం
నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం గ్రామ శివారులో ఒక ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, బస్సు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, బస్సు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్ బస్సుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి
సాక్షి, రామంతాపూర్: నగర శివారులోని చౌటుప్పల్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణానికి గురయ్యారు. వారంతా రామంతాపూర్ నెహ్రూనగర్‌లోని ఎలక్ట్రికల్ గృహోపకరణాల అధీకృత సర్వీస్ సెంటర్లో ఏసీ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న యువకులు కావడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకుకున్నాయి. వివరాలివీ... హరీష్(25), సల్మాన్(24), ఆసీఫ్(24)లు శుక్రవారం రాత్రి హరీష్ స్వగ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో బైక్‌పై నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలో చౌటుప్పల్ ధర్మాజిగూడెం వే బ్రిడ్జి వద్ద ఓ లారీ రివర్స్ చేస్తూ వారి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సర్వీస్ సెంటర్ పై అంతస్తులో నివసిస్తూ పనిచేసుకుంటున్న హరీష్ స్వగ్రామం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి. సల్మాన్‌ది గజ్వేల్. మేడ్చల్ జిల్లా గౌరవరంకు చెందిన ఆసీఫ్ సర్వీస్ సెంటర్ యజమాని సలీంకు సమీప బంధువు కావడంతో రామంతాపూర్‌లోని భరత్‌నగర్‌లోని ఆయన గృహంలోనే ఉంటున్నాడు. ఆసీఫ్ అంత్యక్రియలు రామంతాపూర్‌లో నిర్వహించారు. చదవండి: బైక్ పై వెళ్తున్న దంపతులపై అకస్మాత్తుగా దూసుకెళ్లిన గేదె -
మరణంలోనూ నీవెంటే: భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
చౌటుప్పల్: ఐదు దశాబ్దాల సంసార జీవితంలో ఎలాంటి కలతలు లేకుండా అన్యోన్యంగా గడిపారు ఆ దంపతులు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి బతుకుదెరువు చూపించారు. బరువు బాధ్యతలన్నీ ముగించుకున్న తరుణంలో భార్య అనారోగ్యంపాలైంది. అంతకంతకూ పెరుగుతున్న తన అనారోగ్య సమస్యలతో భర్త ఇబ్బంది పడకూడదని అగ్నికి ఆహుతైంది. అది కళ్లారా చూసి కలత చెందిన ఆమె భర్త కూడా నీ తోడై వస్తానంటూ.. ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మరణం అందరినీ కలచివేసింది. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన పిసాటి మారారెడ్డి(70), మల్లమ్మ(63) దంపతులకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. మారారెడ్డి గ్రామంలోనే వ్యయసాయం చేసుకుంటున్నాడు. కాగా, కొంత కాలంగా మల్లమ్మ అనారోగ్య సమస్యలతో అవస్థ పడుతోంది. వైద్యం చేయించుకున్నా సమస్య తగ్గకపోగా ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైంది. తన సమస్యతో భర్త, కుటుంబ సభ్యులను బాధపెట్టడం ఇష్టం లేని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లోనే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన భర్త మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడిన మల్లమ్మ మృతిచెందింది. కళ్లెదుటే భార్య అగ్నికి ఆహుతైపోవడాన్ని మారారెడ్డి జీర్ణించుకోలేకపోయాడు. అదే రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దంపతుల మృతదేహాలకు చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. దంపతులిద్దరూ ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పెద్ద కుమారుడు బాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అమ్మ ఫొటోకు ముద్దులు: చచ్చిపోయారుగా వాళ్లు రారు
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని రాంనగర్‌కాలనీ ఇంకా విషాదంలోనే ఉంది. ముగ్గురు బిడ్డలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికుల కళ్లెదుటే కన్పిస్తోంది. బాధ్యత మరిచి తిరుగుతూ మద్యానికి బానిసైన కుటుంబ పెద్ద వేధింపుల కారణంగా కుటుంబం బలైంది. ఎక్కడ నలుగురు కలిసినా ఇదే ఘటనపై చర్చించుకుంటున్నారు. ఉమారాణి, హర్షిణీ, లాస్య మృతదేహాలకు గురువారం రోజు సాయంత్రమే అంత్యక్రియలు జరిగాయి. ఘటనకు బాధ్యుడైన తొర్పునూరి వెంకటేశం తన భార్యతో పాటు కుమార్తెలకు అంత్యక్రియలు నిర్వహించాడు. ముగ్గురిని ఒకే చితిపై పడుకోబెట్టి దహనసంస్కారాలు చేశారు. ఈ దృశ్యం కుటుంబ సభ్యులు, బంధువులతో పెద్ద సంఖ్యలో వచ్చిన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. వెంకటేశం అరెస్ట్ .. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు షరతులపై విడుదల భార్యతో పాటు ఇద్దరు కుమార్తెల మృతికి కారణమైన వెంకటేశంను స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు ఉమారాణి అన్న సందగళ్ల మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. కాగా, తమకు కొంత సమయం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు. ముగ్గురి అంత్యక్రియలు తనే నిర్వహించాడని, అనంతరం జరిగే కార్యక్రమాలు ముగిశాక అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఫిర్యాదుదారుడి సమ్మతితో పోలీసులు గడువుకు అంగీకరించారు. అనంతరం అతన్ని కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. కన్నీళ్లు పెట్టించిన చిన్నారి మాటలు తల్లితో పాటు ఇద్దరు అక్కలను కోల్పోయిన మూడేళ్ల చిన్నారి శైనీ చెప్పే మాటలు కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను కన్నీళ్లుపెట్టిస్తున్నాయి. పెద్దనాన్నలు, పెద్దమ్మలు, అక్కలు, అన్నలతో రోజువారీ మాదిరిగానే కలివిడిగా ఉంటోంది. మమ్మి, అక్కలు గుర్తుకు రానంతవరకు బాగానే ఆడుకుంటుంది. కుటుంబ సభ్యుల వద్ద సెల్‌ఫోన్ తీసుకొని అందులోని తల్లి, అక్కల ఫొటోలను చూసుకుంటుంది. తల్లి ఉమారాణి ఫొటోకు ముద్దులు పెట్టిన దృశ్యం అక్కడివారిని కంటతడిపెట్టించింది. మమ్మీ, అక్కలు ఎటువెళ్లారని అడిగితే ఊయల ఊగి ఊరికి వెళ్లారని చెప్పింది. ఊరికి వెళ్లి మళ్లీ వస్తారా అని అడిగితే చచ్చిపోయారుగా అందుకే వాళ్లు రారు అంటూ అమాయకంగా చెప్పింది. ఆ అమాయకపు మాటలు విన్న కుటుంబీకులు ఘొళ్లుమంటు విలపించారు. -
ఆర్ఆర్ఆర్: భూసేకరణ కోసం ప్రత్యేక వ్యవస్థ!
హైదరాబాద్: ప్రతిష్టాత్మక రీజినల్ రింగు రోడ్డు నిర్మాణ దిశగా యంత్రాంగం కదులుతోంది. రింగులో సగానికి కేంద్రం ఇప్పటికే పచ్చజెండా ఊపిన క్రమంలో, తుది అలైన్‌మెంటు ఖరారుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు 158 కి.మీ. తొలి సగభాగానికి భూసేకరణ చేపట్టేందుకూ సమాంతర ఏర్పాట్లు మొదలయ్యాయి.ఈ తొలి సగభాగానికి రూ.9,500 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఇటు భూసేకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. జిల్లాకు ఓ యూనిట్ చొప్పున ఏర్పాటు కానుంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఓ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆధ్వ ర్యంలో ఒక్కో యూనిట్ పనిచేయనుంది. ఒక్కో జిల్లాకు ఒక్కో యూనిట్ భూసేకరణ వ్యవహారం చూస్తుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భువనగిరి జిల్లాలకు సంబంధించి ఇవి పనిచేస్తాయి. పదిరోజుల్లో ఫీల్డ్‌కు.. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రానికి పంపే సమయంలో గూగుల్ మ్యాప్ ఆధారంగా రోడ్డు అలైన్ మెంటును రూపొందించారు. ఇందులో ఏయే ఊళ్ల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుందో అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ప్రతిపాదిత అలైన్మెం టును ఖరారు చేశారు. కానీ, ఫీల్డ్ సర్వే నిర్వహిం చలేదు. ఈ ప్రాజెక్టుకు కన్సల్టెన్సీ బాధ్యతలు చూసే ఫీడ్‌బ్యాక్ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీస్ సంస్థ వారం, పది రోజుల్లో ఫీల్డ్ సర్వే ప్రారంభించనుంది. గ్రామాల నక్షాలు, సర్వేనంబర్ల ఆధారంగా మార్కింగ్ చేయనుంది. మూడు వారాల్లో తుది అలైన్‌మెంటు ఖరారవుతుంది. వీలైనంత వరకు గుట్టలు, జలాశయాలను తప్పించి అలైన్‌మెంటు ఖరారు చేయనున్నారు. అంతా గోప్యం.. ఇప్పటికే రీజినల్ రింగురోడ్డు ప్రతిపాదన ఆధా రంగా రియల్ ఎస్టేట్ సంస్థలు వేగం పెంచాయి. ఎలాంటి అలైన్మెంట్ రూపొందకుండానే ఫలానా సర్వే నంబర్ల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుం దంటూ బోగస్ మ్యాపులు సృష్టించి రైతుల్లో భయాందోళనలు రేకెత్తించి తక్కువ ధరకే భూము లను తన్నుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తుందని భావిస్తున్న భూముల్లో సాగు దాదాపు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వారి ఆగడాలకు కళ్లెం వేసేలా అధికారులు ఏ విషయాన్నీ బయటకు పొక్కనీయటం లేదు. పక్కాగా సర్వే జరిగి తుది అలైన్‌మెంటు సిద్ధమయ్యాకనే అధికారికంగా దాన్ని ప్రకటిస్తామని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. రెండో భాగంపై ట్రాఫిక్ స్టడీ.. రీజినల్ రింగురోడ్డులో మొదటిదశకు సంబంధించి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి అనుమతించిన కేంద్రం, రెండోదశకు సంబంధించి ఇప్పటివరకు గెజిట్ విడుదల చేయలేదు. ఈ ప్రాజెక్టు దాదాపు రూ.18 వేల కోట్ల వ్యయంతో కూడుకున్నది కావటం విశేషం. దీంతో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే అనుమతి ఇచ్చిన మొదటి సగంలో సంగారెడ్డి నుంచి భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఓ రోడ్డు కొనసాగుతోంది. ఆయా పట్టణాల మీదుగా ఉన్న ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలు భారీగా ఉండటంతో ఇది పూర్తిస్థాయి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి యోగ్యమైందని కేంద్రం ఇప్పటికే నిర్ధారించింది. రెండో సగంలో వాహనాల రాకపోకలు లేవని కేంద్రం గుర్తించింది. కానీ, రోడ్డు నిర్మాణంతో భారీగా వాహనాల రాకపోకలుంటాయని అధికారులు కేంద్రం దృష్టికి తెచ్చారు. అధికారులు టోల్‌ప్లాజాలు, ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్టడీ నిర్వహిస్తున్నారు. ఈ వివరాలు పరిశీలించాక కేంద్రం అనుమతి మంజూరు చేయనుందని సమాచారం. త్వరలో దానికి కూడా పచ్చజెండా ఊపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గగుర్పాటు గొలిపే ఘోర ప్రమాదం
సాక్షి, భువనగిరి: హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి వరుసగా రెండు బైకులు, రెండు కార్లని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా... ఓ స్కూటీ పూర్తిగా దగ్దమయ్యి౦ది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. అందులో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్ది సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రేమ పెళ్లికని వెళ్తుండగా.. మృతుడు నాగరాజు హయత్‌నగర్ చెందిన వాడిగా తెలిసింది. శ్రీలత అనే యువతితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నాగరాజు.. ఆమెను ప్రేమ పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఈక్రమంలో ప్రేమికులిద్దరు చెరువుగట్టు వద్ద వివాహం చేసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురై అనూహ్యంగా ప్రాణాలు విడిచారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుదామనుకున్న శ్రీలత, నాగరాజు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. (చదవండి: అనుమానం: భార్యతోపాటు మరో మహిళ దారుణ హత్య) (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
బాబు కాన్వాయ్‌కు ప్రమాదం
చౌటుప్పల్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడు వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. కాన్వాయ్‌లో ముందు మూడు, వెనుక మూడు వాహనాలు ఉండగా మధ్యలో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చంద్రబాబు ఉన్నారు. ఈ క్రమంలో దండుమల్కాపురం గ్రామం వద్దకు రాగానే.. ఓ ఆవు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చింది. వేగంగా వస్తున్న కాన్వాయ్‌లోని మొదటి వాహనం డ్రైవర్ ఆవును గమనించి సడన్ బ్రేక్ వేశాడు. ఆ వెంటనే రెండో వాహనం డ్రైవర్ సైతం బ్రేక్ వేశాడు. మూడో వాహనం ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. అదే సమయంలో ప్రమాదాన్ని పసిగట్టిన చంద్రబాబు కూర్చున్న వాహనం డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి తన వాహనాన్ని పక్కకు తప్పించాడు. దీంతో ప్రమాదం తప్పింది. ముందున్న వాహనాలు ఢీకొనడంతో కొద్ది నిమిషాల పాటు కాన్వాయ్‌ని సెక్యూరిటీ సిబ్బంది రోడ్డు పక్కన ఆపారు. దెబ్బతిన్న వాహనాన్ని అక్కడే వదిలి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లిపోయారు. కారులో కూర్చొని ఉన్న చంద్రబాబు -
పెళ్లాడిన యువకుడు చిక్కకపోవడంతో..
సాక్షి, చౌటుప్పల్ : ప్రేమ వివాహాన్ని యువతి కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. దీంతో పెళ్లి చేసుకున్న యువకుడి కుటుంబాన్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఆ యువకుడి తండ్రిని పథకం ప్రకారం మాటేసి మట్టుబెట్టారు. సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాంలో ఈ నెల 5వ తేదీన వెలుగుచూసిన వ్యక్తి దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయమున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. సంస్థాన్‌నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన గడ్డం నవనీత అదే గ్రామానికి చెందిన గొండిగళ్ల గాలయ్య కుమారుడు బాబును ప్రేమించింది. ఈ విషయం పెద్దలకు తెలిసింది. ఆ క్రమంలో గతేడాది అక్టోబర్ నెలలో ప్రేమికులిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటున్నారు. అప్పటి నుంచి నవనీత కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. ఆ కుటుంబాన్ని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేస్తామని నమ్మించి.. ప్రేమించిన యువకుడితోనే పెళ్లి చేస్తామని నమ్మించిన నవనీత కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. ఆ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వేరే యువకుడితో పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఫిబ్రవరి 15న నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ నవనీత ప్రేమ వ్యవహారం తెలిసిపోవడంతో మగ పెళ్లివారు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఆ క్రమంలో అదే నెల 22న నవనీత తాను ప్రేమించిన బాబుతో కలిసి వెళ్లిపోయి కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుంది. కక్ష పెంచుకుని హత్యకు పన్నాగం గ్రామానికి చెందిన గొండిగళ్ల బాబు తన కూతురు నవనీతను పెళ్లిచేసుకోవడాన్ని తల్లిదండ్రులు భరించలేకపోయారు. అదే సమయంలో నవనీత అన్నలు మరింత కక్ష పెంచుకున్నారు. బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను చంపాలనుకున్నారు. అందుకోసం ఇదే మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన తమ సమీప బంధువైన లౌలేష్తో చర్చించారు. అంతా కలిసి హత్యకు పథకాన్ని రూపొందించారు. ఊర్లోనే మాటు వేసి .. బాబు తండ్రి గొండిగళ్ల గాలయ్య ఈనెల 5న బ్యాంకులో పని నిమిత్తం నారాయణపురం మండల కేంద్రానికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. ఆ సమయంలో నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన గడ్డం గాలయ్య, అతని కుమారులు గడ్డం సురేష్, గడ్డం వెంకటేశ్, గడ్డం రమేష్, సోదరుడి కుమారులు గడ్డం స్వామి, గడ్డం రాజు గ్రామ శివారులో ఉన్న ప్రాథమిక పాఠశాల వద్ద ఉండి గమనించారు. సాయంత్రంలోపు గొండిగళ్ల గాలయ్య తిరిగి స్వగ్రామానికి వస్తాడని భావించి అక్కడే మాటు వేశారు. గొండిగళ్ల గాలయ్య గ్రామానికి వస్తున్న క్రమంలో స్కూల్ వద్ద మాటు వేసి ఉన్న నవనీత అన్న సురేష్ తన వెంట తెచ్చుకున్న ముంజ కొడవలితో నరికి చంపాడు. ఆరుగురు నిందితులు గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద ఉండగా, మరో నిందితుడు దాసరి లౌలేష్‌ను పుట్టపాక గ్రామంలో అరెస్ట్ చేసినట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద కత్తి, స్కూటీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రిమాండ్ నిమిత్తం నల్లగొండ కోర్టుకు తరలించారు. సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య, సీఐ శ్రీనివాస్, ఎస్సై నాగరాజు ఉన్నారు. -
ప్రభుత్వ భూమికి ఎసరు..!
చౌటుప్పల్ (మునుగోడు) : మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీపార్క్ స్థలంపై అక్రమార్కుల కన్నుపడింది. పట్టణ నడిబొడ్డున అత్యంత విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కుట్రలు ప్రారంభమయ్యాయి. గ్రామానికి చెందిన దొరవారు పంతంగి శ్రీనివాస్‌రావు ఈ భూమిని అప్పట్లో గ్రామ పంచాయతీకి దానంగా ఇచ్చారు. సుమారు 0–35 ఎకరాల వరకు ఉన్న ఈ స్థలం మొన్నటి వరకు కంపచెట్లు, చెత్తాచెదరంతో ఉన్నప్పటికీ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గాంధీపార్క్‌ను పూర్తిగా శుభ్రం చేశారు. ఫిబ్రవరి 27 నుంచి 29వ తేదీ వరకు పనులు జరిగాయి. పదేళ్ల క్రితం వరకు ఆక్రమణలు జరిగినప్పటికీ అప్పటి నుండి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. హద్దురాళ్లు నాటిన గుర్తు తెలియని వ్యక్తులు కానీ, సోమవారం తెల్లవారే వరకు గాంధీపార్క్ స్థలంలో హద్దురాళ్లు వెలిశాయి. ఊర కృష్ణమూర్తి ఇంటి పక్క నుంచి ప్రధాన మురికి కాల్వ వైపునకు రూ.3కోట్లకు పైనే విలువ చేసే 500 గజాల స్థలానికి రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు నాటారు. ఉదయం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ మందడి రామదుర్గారెడ్డిని సంప్రదించగా హద్దు రాళ్లు నాటిన విషయం తమ దృష్టికి వచ్చిందని, తొలగిస్తామని తెలిపారు. హద్దురాళ్లు నాటిన వ్యక్తుల వివరాలు తెలియలేదన్నారు. -
ఉద్రిక్తత.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్టు..!
సాక్షి, యాదాద్రి భువనగిరి : చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇక్కడ హంగ్ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపాలిటీ కేంద్రం రణరంగాన్ని తలపించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీపీఎం కార్యకర్తలను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. 20 వార్డులున్న చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3, స్వతంత్రులు ఒక చోట విజయం సాధించారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం ఆరుకు చేరింది. ఇక టీఆర్ఎస్, సీపీఎం మధ్య పొత్తు కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో ద్వంద్వ విధానాల సీపీఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. -
గందరగోళంగా మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక
-
ఓడిన సర్పంచ్‌లు, సర్పంచ్ల భర్తలు
సాక్షి, చౌటుప్పల్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు సైతం ఓటమి పాలయ్యారు. నామమాత్రపు రాజకీయ అనుభవం ఉన్న అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. మున్సిపాలిటీ ఏర్పాటుకు ముందు చౌటుప్పల్, తంగడపల్లి, లింగోజిగూడెం, లక్కారం, గ్రామాలకు సర్పంచ్‌లుగా, సర్పంచ్ల భర్తలుగా రాజకీయ తిప్పిన వ్యక్తులు సైతం ఓడిపోవాల్సి వచ్చింది. చౌటుప్పల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పని చేసిన బొంగు లావణ్య భర్త మాజీ వైస్ ఎంపీపీ బొంగు జంగయ్య(టీఆర్ఎస్) 19వ వార్డు నుంచి, లింగోజిగూడెం తాజా మాజీ సర్పంచ్ రమనగోని దీపిక భర్త అదే గ్రామ మాజీ సర్పంచ్ రమనగోని శంకర్(బీజేపీ), తంగడపల్లి తాజా మాజీ సర్పంచ్ ముటుకుల్లోజు దయాకరాచారి(టీఆర్ఎస్), లక్కారం తాజా మాజీ సర్పంచ్ కానుగు యాదమ్మ భర్త కానుగు బాలరాజు(టీఆర్ఎస్), లింగోజిగూడెం మాజీ సర్పంచ్ ఊదరి నర్సింహ్మ(టీఆర్ఎస్) పరాజయం పాలయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలోనే కాకుండా ఎంతో కాలంగా వీరు గెలుస్తారన్న ప్రచారం ఉన్నప్పటికీ అనూహ్య పరిణామాల కారణంగా ఓడిపోయారు. విశేష రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఓటరు తీర్పును అంగీకరించాల్సి వచ్చింది. మోత్కూరు: మోత్కూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి బొల్లెపల్లి వెంకటయ్య నూతనంగా ఏర్పడిన మోత్కూరు మున్సిపాలిటీలో అదే పార్టీనుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన గెలుపొందాడు. 8వ వార్డునుంచి అవిశెట్టి అవిలిమల్లు (కాంగ్రెస్)పై వెంకటయ్య 39 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి సానుభూతి ఆయనకు కలిసొచ్చిందంటున్నారు. నాడు ఎంపీటీసీగా ఓడి.. మండల పరిషత్ ఎన్నికల్లో మోత్కూరు –2 ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసిన గుర్రం కవిత ఓటమి పాలయ్యారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి పసల విజ యపై 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ కవితను ప్రకటించగా ఫలితాల్లో టీఆర్ఎస్ అధిక స్థానాలు గెలువడంతో కవిత కౌన్సిలర్‌గా గెలిచినా ఫలితం లేకుండా పోయింది. నాడు వార్డు మెంబర్‌గా.. నేడు కౌన్సిలర్‌గా విజయం మోత్కూరు గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించి నేడు మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు కౌన్సిలర్‌గా కారుపోతుల శిరీష (కాంగ్రెస్) గెలుపొందారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో కూడా విజయం సాధించడంతో ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. అన్న గెలుపు.. తమ్ముళ్ల ఓటమి చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కౌన్సిలర్లుగా పోటీ చేశారు. వారిలో ఇద్దరు ఓటమి పాలవ్వగా ఒకరు విజయం సాధించారు. పట్టణ కేంద్రానికి చెందిన సీపీఎం పట్టణ మాజీ కార్యదర్శి బత్తుల శ్రీశైలం అదే పార్టీ నుంచి 19వ వార్డులో పోటీ చేశాడు. తన బాబాయి కుమారులైన బత్తుల వెంకటేశం బీజేపీ తరఫున 20వవార్డు, విప్లవ్‌కుమార్ 16వ వార్డులో సీపీఎం తరుఫున పోటీ చేశారు. కానీ శ్రీశైలం 19వవార్డులో బీజేపీపై విజయం సాధించగా, వెంకటేశం, విప్లవ్‌కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. చండూరు: చండూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ఎంపీపీ తొకల వెంకన్నతో పాటు అతని భార్య చంద్రకళ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. వెంకన్న 8వ వార్డు నుంచి బరిలో నిలవగా అయనపై టీఆర్ఎస్ అభ్యర్థి బూతరాజు దశరథ పోటీ చేశారు. దశరథపై తోకల వెంకన్న 49 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అలాగే అతని భార్య చంద్రకళ 10వ వార్డు నుంచి బరిలో నిలువగా ఆమెపై టీఆర్ఎస్ అభ్యర్థి తేలుకుంట్ల రాజకుమారి పోటీ చేసింది. రాజకుమారిపై చంద్రకళ 240 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఓడిన దంపతులు 1వ వార్డునుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కోడి గిరిబాబు బరిలో నిలిచాడు. టీఆర్ఎస్నుంచి పోటీ చేసిన తన సోదరుడు కోడి వెంకన్నపై గిరిబాబు 223 ఓట్లతో ఓటమిపాలయ్యాడు. అదే విధంగా తన భార్యను చైర్మన్ చేయాలని కోడి గిరిబాబు 7వ వార్డునుంచి భార్య విజయలక్షి్మని కాంగ్రెస్ తరఫున పోటీలో నిలిపాడు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి చిలుకూరి రాధికపై విజయలక్ష్మి 148 ఓట్లతో పరాజయం పాలైంది. ఓడిన తాజా మాజీ కౌన్సిలర్లు, చైర్మన్లు భువనగిరి : గత మున్సిపాలిటీ కాలంలో కౌన్సిలర్లుగా పనిచేసి తిరిగి ఈ నెల 22న జరిగిన ఎన్నికల బరిలో నిలిచి కొందరు ఓటమి పాలయ్యారు. ఇందులో 6వ వార్డు నుంచి కుక్కదూవు లతశ్రీ, 10వ వార్డు నుంచి బట్టుపల్లి అనురాధ, ఇదే వార్డు నుంచి పడమటి జగన్మోహన్రెడ్డి, 20వ వార్డు నుంచి చిట్టిప్రోలు సువర్ణ, 21వ వార్డు నుంచి ఫతే మహ్మద్, 30వ వార్డు నుంచి లయిఖ్ అహ్మద్, ఇదే వార్డు నుంచి షఫిక్ అహ్మద్ ఉన్నారు. ఓడిన మాజీ చైర్మన్లు వివిధ పాలకవర్గాల్లో చైర్మన్లుగా ఎన్నికై ప్రస్తుతం కౌన్సిర్లుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇందులో 35వ వార్డు నుంచి నువ్వుల ప్రసన్న, 8వ వార్డునుంచి బర్రె జహంగీర్, 25వ వార్డునుంచి కొల్పుల కమలాకర్, 28వ వార్డు నుంచి సుర్వి లావణ్య, 9వ వార్డు నుంచి దోనకొండ వనిత ఉన్నారు. -
కారులు.. బారులు
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న వారితో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాల రద్దీ కొనసాగింది. ఇక్కడ 16 కౌం టర్లకు గాను విజయవాడ వైపు 5 ఫాస్టాగ్‌కు, 4 నగదు చెల్లింపులకు కేటాయించారు. హైదరాబాద్ మార్గంలో 4 ఫాస్టాగ్‌కు, నగదు చెల్లింపునకు 3 మార్గాలు కేటాయించారు. ఫాస్టాగ్ లేని వాహనాలు కూడా ఆయా మార్గాల్లోకి వెళ్లడంతో మరింత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. – చౌటుప్పల్/బీబీనగర్/కేతేపల్లి -
జాడలేని ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం
సాక్షి, నల్లగొండ: దక్షిణ భారతదేశంలోని ఫ్లోరోసిస్ బాధితుల ఆరోగ్యం కోసం 2008–09లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతీయ పరిశోధన కేంద్రం కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం 8 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. కానీ, ఈ ఏడాది జూన్ 26వ తేదీన ‘ఫ్లోరోసిస్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం మా పరిధిలోకి రాదు అందుకే నిధులు కేటాయించలేదు..’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చేసింది. మరి ఇప్పటి దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, రాష్ట్ర ప్రభుత్వం 2014లో చౌటుప్పల్‌లో కేటాయించిన 8 ఎకరాల స్థలం దేనికోసం, ఎవరికోసమన్న ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో కేంద్రం ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూపుతోందన్న విమర్శలకు బలం చేకూరుతోంది. దక్షిణభారత రాష్ట్రాలకు ఉద్దేశించిన ప్రాంతీయ ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. అయినా ఇప్పటి వరకు రీసెర్చ్ సెంటర్ శంకుస్థాపనకు నోచుకోలేదు. నిరాశేనా ! తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో ఫ్లోరోసిస్ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు గతంలోనే కేంద్రం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పాండిచ్చేరి, గోవా, అస్సాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల కోసం నల్లగొండలో రూ.100 కోట్లతో ‘రీజనల్ ఫ్లోరోసిస్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ (ఆర్.ఎఫ్.ఎం.ఆర్.సి) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. సరికదా తాజాగా, అసలు ఆ కేంద్రం తమ పరిధిలోకి రాదని, అందుకే బడ్జెట్ ఇవ్వలేమని కేంద్ర ఆరోగ్య శాఖ బాంబు పేల్చింది. ఉమ్మడి రాష్ట్రంలోనే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సహకారంతో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురంలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును 100 నుంచి 250 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రంలో భాగంగా తొలుత 20 పడకలతో ఆసుపత్రి నిర్మిచాల్సి ఉంది. కాగా, ఇప్పటికీ చౌటుప్పల్‌లో ఈ కేంద్రం ఏర్పాటు అతీగతీ లేదు. జిల్లాలో రమారమి 2 లక్షల మంది దాకా ఉన్న ఫ్లోరోసిస్ బాధితులకు ఈ కేంద్రం వల్ల ప్రయోజనం చేకూరుతుందేమోనని ఆశపడినా.. వారికి నిరాశే మిగిలింది. మంజూరైతే చేసింది కానీ, కేంద్ర ప్రభుత్వానికి మొదటి నుంచి ఈ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఇక, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇతర సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఫ్లోరైడ్ సమస్య దూరమవుతుందన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పరిశోధన కేంద్రంపై దృష్టిపెట్టలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయాలు పక్కన పెట్టండి గత ప్రభుత్వంలో కేంద్ర ఆరోగ్యమంత్రి హో దాలో జె.పి.నడ్డా ఇస్తామన్న ఫ్లోరోసిస్ భాదితుల ప్రత్యేక దవాఖాన, తెస్తామన్న ఫ్లోరోసిస్ రిసేర్చ్ సెంటర్ మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్టీఐ కింద వివరాలు అడిగితే ‘మా పరిధి లోని అంశం కాదు అందుకే నిధులు కేటాయించట్లేదు‘ అని తెలిపింది. తెలంగాణలో అత్యంత ముఖ్యమైన ఫ్లోరోసిస్ బాధితుల సంక్షేమం మీద రాజకీయాలు పక్కకు పెట్టి కేంద్రం ఆలోచించాలి. హాస్పిటల్, రిసెర్చ్ సెంటర్ వెంటనే ఏర్పా టు చేయాలి. – సుధీర్, అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ -
కోరలు చాస్తున్న కాలుష్య భూతం
సాక్షి, చౌటుప్పల్ : ఒకప్పుడు పచ్చటి పంటలతో కళకళలాడిన చౌటుప్పల్ మండలం కాలుష్య కాసారంగా మారుతోంది. ప్రస్తుతం మండల భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఇప్పటికే వ్యవసాయం నాశనం అయ్యింది. పశు సంపద మృత్యువాత పడుతోంది. కులవృత్తులన్నీ కుదేలయ్యాయి. ప్రజలంతా జీవనోపాధికి దూరమవుతున్నారు. జీవితాలన్ని అగమ్యగోచరంగా మారుతుండడంతో బతుకు జీవుడా అనుకుంటూ కుటుంబాలన్నీ వలసలు వెళ్తున్నాయి. కొందరి కాసుల కక్కుర్తితో ఇంతటి ఘోరం జరుగుతుంది. తమ స్వలాభాలే తప్పిస్తే ప్రజల క్షేమాన్ని పట్టించుకోని రసాయన పరిశ్రమల నిర్వాకమే ఈ భయానక పరిస్థితులకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. స్థానికులకు ఉపాధి కల్పిస్తామంటూ నమ్మబలికిన పరిశ్రమల యాజమాన్యాలు ఆ తర్వాత మాత్రం ఉపాధి చూపకపోగా ప్రాణాలనే హరించేవరకు వచ్చాయి. భారీ స్థాయిలో విడుదల చేస్తున్న వ్యర్థరసాయనాలతో సర్వం నాశనమే అ య్యింది. ఇదేమని అడగాల్సిన ప్రభుత్వ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ఉండే రాజకీయ పార్టీల నాయకులు మాత్రం పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చే తాయిళాలకు తలొగ్గి వారికి సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారు. ఫలితంగా రానున్న కొద్ది రోజులకే మండలంలోని ఈ ఊరు... ఆఊరు అని కాకుండా ప్రతి ఊర్లోని ప్రజలంతా ఇళ్లు వదులుకుని వలసలు వెళ్లాల్సిన భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చౌటుప్పల్ మండలంలో సుమారు 25 సంవత్సరాల క్రితం పదిలోపే కంపెనీలు ఉండేవి. ఉన్న కంపెనీలు కూడా కాలుష్యం వెదజల్లని పరిశ్రమలే. కానీ 1993 సంవత్సరం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారింది. స్థానికంగా యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన ఆంధ్రా పారిశ్రామికవేత్తలు తెలివిగా స్థానికంగా పరిశ్రమలను స్థాపించారు. ఒక్కొక్కరుగా గ్రామాల్లో స్థిరపడ్డారు. అలా వచ్చిన అన్ని రకాల కంపనీలు ప్రస్తుతం సుమారుగా 80 వరకు ఉన్నాయి. వీటిలో మూడొంతులకుపైగా రసాయన పరిశ్రమలే కావడం విశేషం. ప్రారంభంలో ఎన్నో రకాల మాయమాటలతో జనాలను ఆకర్షించే యాజమాన్యాలు నేడు దగ్గరకు సైతం రానివ్వడంలేదంటే ఎంతటి దౌర్భాగ్యంగా మారిందో మండల దుస్థితి అర్థం చేసుకోవచ్చు. విచ్చలవిడిగా పరిశ్రమల కాలుష్యం ప్రస్తుతం మండలంలో రసాయన పరిశ్రమల కాలుష్యం విచ్చలవిడిగా తయారైంది. మండలంలో లింగోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, ఆరెగూడెం, ఎస్.లింగోటం, మందోళ్లగూడెం, జైకేసారం, నేలపట్ల, తంగడపల్లి, చౌటుప్పల్, దేవలమ్మనాగారం, మల్కాపురం, కొయ్యలగూడెం, ఎల్లగిరి, ధర్మోజిగూడెం, తూప్రాన్‌పేట గ్రామాల్లో రకరకాల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పరిశ్రమలు వదులుతున్న కాలుష్యానికి హద్దే లేకుండాపోయింది. పరిశ్రమల కారణంగా మండలంలో ఉన్న 26 గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీలో ఉన్న 5 గ్రామాలు పూర్తిగా కలుషితమై ఘోస తీస్తున్నాయి. కాలుష్యం కారణంగా ఎలాంటి పరిశ్రమలు లేని గ్రామాలు సైతం ప్రభావితమయ్యాయి. ప్రభుత్వ నిబంధనలు, పద్ధతులు ఏమీ లేకుండా ఆయా పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. కలుషితమైన భూగర్భజలాలు.. పరిశ్రమల కాలుష్యం కారణంగా మండలంలోని అనేక గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఎర్రగా, నల్లగా, పసుపుగా రంగుమారి వస్తున్నాయి. కాలుష్యం ప్రభావంతో బావులు, బోర్లల్లోని నీరు నురగలు కక్కుతుంది. చేతులతో పట్టుకుంటే చర్మం చిమచిమలాడుతుంది. ఇలాంటి జలాలతో పంటలు సాగు చేయలేని పరిస్థితి ఉంది. దీంతో చాలా గ్రామాల్లో పంట పొలాలన్నీ పడావుగా మారాయి. తరి పంటలు కాకుండా వర్షాధార పంటలను సాగు చేద్దామని ప్రయత్నించినా పంట ఎదుగుదల రాని పరిస్థితి. ఓ వైపు భూగర్భ జలాలు కలుషి తమై, మరోవైపు పంట పొలాలన్నీ నాశనమవ్వడంతో రైతాంగం, కుల వృత్తులపై ఆధారపడే కుటుంబీకులు జీవనోపాధికి అల్లాడుతున్నారు. అదేవిధంగా ప్రజలు, పశుసంపద పూర్తిగా ప్ర మాదకరమైన చర్మ వ్యాధులబారిన పడుతుంది. ప్రమాదకరమైన రసాయనాలన్నీ భూగర్భంలోకే.. పరిశ్రమల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడుతున్నాయి. తమకు కాసులే ముఖ్యమనుకుని ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని గాలికి వదులుతున్నాయి. తమ పరిశ్రమల్లో వెలువడే ప్రమాదకరమైన వ్యర్థ రసాయనాలను ట్రీట్మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేయాల్సి ఉంది. ట్రీట్మెంట్ ప్లాంట్లను తమతమ పరిశ్రమల్లోనే ఏర్పా టు చేసుకోవాలి. కానీ కొందరు ఏర్పాటు చేసుకోగా మరికొందరు మాత్రం ఇప్పటికీ ఆ ఆలో చనే చేయడంలేదు. ట్రీట్మెంట్ ప్లాంట్లల్లో వ్యర్థాలను శుద్ధి చేస్తే భారీగా ఖర్చు అవుతుందని గ్ర హించిన పరిశ్రమల యాజమాన్యాలు తమ పరి శ్రమల ప్రాంగణాల్లో భూమిలోకి కొన్ని వేల ఫీట్ల లోతు వరకు బోర్లు వేస్తున్నారు. అనంతరం వ్య ర్థాలను ఆ బోరు గుంతల్లోకి వదులుతున్నారు. ఈ వ్యవహారం బయటకు తెలియకపోతుండడంతో వారికి ఖర్చులు తప్పడంతోపాటు బదనాం నుంచి మినహాయింపు పొందుతున్నారు. వ్యర్థాల తరలింపు మాఫియా ఏజెంట్లు స్థానికులే.. ప్రతి సందర్భంలోనూ కంపెనీల్లోని బోర్లలోకి వ్యర్థాలను వదిలితే స్థానికంగా భూగర్భ జలాలన్నీ కలుషితమవుతాయి. దీంతో యాజమాన్యాలు తమ చేతులకు మట్టి అంటకుండానే పని ముగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా స్థానికంగా ఉన్న కొంతమందిని ఏజెంట్లుగా నియమించుకొని వారి ద్వారా ట్యాంకర్లతో వ్యర్థాలను బయటకు తరలిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు 80వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లిస్తున్నారు. ఇలా పరిశ్రమ సామర్థ్యం మేరకు ప్రతి నెలలో 3–5ట్యాంకర్ల వ్యర్థాలు వెలువడనున్నాయి. వ్యర్థాలను తరలించేందుకు నియమితులైన స్థానికులు లక్షల రూపాయలు ఆర్జిస్తూ రసాయన పరిశ్రమలకు వత్తాసు పలుకుతుంటారు. ప్రమాదకరమైన వ్యర్థాలను ట్యాంకర్లతో రాత్రి వేళల్లోనే బయటకు తీసుకువచ్చి నీటి కాలువల్లో లేదంటే నిర్మాణుష్యమైన ప్రాంతాల్లో పారబోస్తున్నారు. వ్యర్ధాలు తరలించే వ్యక్తులు పెద్ద మాఫియాగా మారారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు రసాయన పరిశ్రమల దుర్మార్గాలపై స్థానికులు, రైతులు ఇప్పటికే అనేక రకాలుగా ఫిర్యాదులు చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులందరికీ ఫిర్యాదు చేసినా ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. ఫిర్యాదులు వచ్చిన సమయంలోనే కొద్దిపాటి హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత మాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత కలిగిన అన్ని శాఖల అధికారులకు సంబంధిత పరిశ్రమల నుంచి ఏదో ఒక రూపంలో మామూళ్లు అందుతాయి. అందుకే వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులకు తోడుగా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు సైతం కంపనీల మామూళ్లకు అలవాటు పడి గ్రామాలను నాశనం చేసేందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బడా కంపెనీల జోలికే వెళ్లడం లేదు మండలంలో రసాయన పరి శ్రమల మూలంగా వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. పరి శ్రమల కాలుష్యంపై సంబం ధిత అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. అత్యంత ప్రమాదకర పరిశ్రమలను విడిచిపెట్టి చిన్న చిన్న కంపెనీలపై అధికారులు దాడులు చేస్తున్నారు. కాలుష్య కంపెనీలపై ఇటీవల మెంబర్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాం. కాలుష్య నియంత్రణ అధికారులు కంపెనీల మత్తులో తరిస్తున్నారు. – పీఎల్ఎన్రావు, పర్యావరణ సామాజిక కార్యకర్త, లింగోజిగూడెం కఠిన చర్యలు తీసుకుంటాం పరిశ్రమల వ్యర్థ రసాయనాలు ఇష్టానుసారంగా పారబోస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి వేళల్లో వ్యర్థ రసాయనాల సరఫరాపై నిఘా ఉంచాం. సిమెంట్ పరిశ్రమల పేరిట తీసుకెళ్తున్నారు. ఎంతో ప్రమాదకరమైన వ్యర్థాల పారబోతను సహించబోం. – వెంకటేశ్వర్లు, సీఐ -
ఓట్ల పండుగకు.. పయనం..
సాక్షి, చౌటుప్పల్ (మునుగోడు): హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి బుధవారం జనజాతరను తలపించింది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజానీకం పెద్దఎత్తున తమ స్వగ్రామాలకు తరలివెళ్తోంది. దీంతో హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది. రాత్రికి అనూహ్యంగా రెండింతలకు పెరిగింది. టోల్‌ప్లాజా నుంచి కిలోమీటరున్నర దూరంలో ఉన్న జిల్లేడుచెలుక గ్రామం వరకు వాహనాలు స్తంభించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ మినహా.. మిగతా 9 జిల్లాల ప్రజానీకం ఈ రహదారి మీదుగానే వెళ్తుంటారు. వేలాది వాహనాలు ఒక్కసారిగా వస్తుండడంతో చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై విజయవాడ మార్గంలో ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారికి అనుసం«ధానంగా నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి సైతం ఉండడంతో రద్దీ భారీగా ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా పరిసరాలు వాహనాలతో కిక్కిరిసాయి. ఇరువైపులా 16ద్వారాలు ఉండగా విజయవాడ వైపు 11 గేట్లు తెరిచా రు. వాహనాలు ఎక్కువసేపు నిలిచి ఉండడంతో.. వాహనదారులు, టోల్ సిబ్బంది నడుమ ఘర్షణ తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్దుమనిగింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పడే రద్దీతో పోలిస్తే ప్రస్తుతం ఏర్పడిన రద్దీ ఎక్కువే అని చెప్పవచ్చు. హైవేపై వాహనాల రద్దీ కేతేపల్లి (నకిరేకల్) : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు వెళ్లవారి వాహనాలతో 65 నంబరు జాతీయ రహదారిపై బుధవారం రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ప్రారంభమైన వాహనాల రద్దీ రాత్రికి పెరిగింది. కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ఫీజు చెల్లించేందుకు వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌ప్లాజా నిర్వహకులు విజయవాడ వైపు కౌంటర్లు పెంచారు. దీంతో టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి ట్రాఫిక్‌జామ్‌కు ఆస్కారం లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లాయి. మాడ్గులపల్లి వద్ద ట్రాఫిక్ జామ్ మాడుగులపల్లి (నల్లగొండ) : ఈనెల 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు హైదరబాద్‌లో నివాసవుంటున్న ఆంధ్ర ప్రజలు బుధవారం సొంతూళ్లకు ప్రయాణా కావడంతో.. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
లారీ ఎక్కిన హెలికాప్టర్
సాక్షి, చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం హెలికాప్టర్‌ను తరలిస్తున్న ఓ లారీ ఆగింది. అమెరికాలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ హెలికాప్టర్‌ను షిప్లో ఆంధ్రప్రదేశ్‌ని విశాఖపట్నం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి లారీలో ముంబాయికి తీసుకెళ్తున్నారు. విశ్రాంతి కోసం డ్రైవర్ లారీని అక్కడ ఆపాడు. దీనిని చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. పలువురు హెలికాప్టర్‌తో సెల్ఫీలు దిగారు. -
మునుగోడును అభివృద్ధి చేస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, సంస్థాన్ నారాయణపురం : మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ, రోడ్‌షో మండలంలోని గుడిమల్కాపురం, సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక గ్రామాల మీదుగా మునుగోడు మండలం వరకు సాగింది. అంతకు ముందు స్థానిక ప్రాచీన శివాలయంలో రాజగోపాల్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు అభివృద్ధిని 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తానన్నారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ గడ్డం మురళీ«ధర్‌రెడ్డి, నయీంషరీఫ్, కె.లింగయ్య, బుజ్జి, వెలిజాల రామచంద్రం, ఏపూర్ సతీష్, మందుగుల బాలకృష్ణ, బచ్చనగోని గాలయ్య, కుందారపు యాదయ్య, శంకర్, శంకర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, గడ్డం యాదయ్య, వంగూరు సత్తయ్య, యాదయ్య, రఘు, వెంకన్న తదితరులున్నారు. సర్వేల్లో ఉద్రిక్తత.. సర్వేల్ గ్రామంలో రాజగోపాల్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తల ర్యాలీ అక్కడికి చేరుకుంది. ప్రజాకూటమి, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురెదురు పడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎస్ఐ మల్లీశ్వరి, తన సిబ్బందితో జోక్యం చేసుకొని ర్యాలీని అక్కడి నుంచి పంపించారు. గుజ్జలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంపీగా నువ్వు ఏం అభివృద్ధి చేశావు అంటూ రాజగోపాల్‌రెడ్డిని ప్రశ్నించారు. దీంతో కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రికంగా మారుతుండటంతో పోలీస్‌లు జోక్యం చేసుకొని టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించడంతో ఉద్రికత్త సద్దుమణింది. అనంతరం రాజగోపాల్‌రెడ్డి ప్రచారం కొనసాగింది. మరిన్ని వార్తాలు... -
ఒక్కసారి అవకాశం ఇవ్వండి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్కు పలుమార్లు అవకాశం ఇచ్చారు.. కానీ, వారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. సమగ్రంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలం తంగడిపల్లిలో బుధవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. నల్లగొండ జిల్లా వాసులు నేటికీ ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారని.. ప్రజల కోసం ఏం చేశావో చెప్పాలి కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. సాక్షి, సంస్థాన్ నారాయణపురం/చౌటుప్పల్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, టీఆర్ఎస్లకు పలుమార్లు అవకాశం ఇచ్చినా వారు చేసిన అభివృద్ధి ఏమి లేదని బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థి డాక్టర్ గంగడి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండలం తంగడిపల్లిలోని ముసుకు మధుసూదన్‌రెడ్డి స్టేడియంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘మార్పు కోసం బీజేపీ’ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి’’ నెలకొన్న పవిత్ర క్షేత్రంలో రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ నమస్కరిస్తున్నానన్నారు. బీజేపీ నాయకుడు గుండగాని మైసయ్య గౌడ్ ఊరికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించానని తెలిపారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఫ్లోరైడ్‌తో అనారోగ్యం పాలవుతున్న ప్రజల కోసం కేసీఆర్ ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. చౌటుప్పల్‌లోని మందుల కంపెనీలతో లాలూచీ పడి ఆ కంపెనీల నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం పాడైపోతున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంట్రాక్టర్ల కమీషన్లతో నక్కలగండి ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. నక్కలగండి ప్రాజెక్ట్ బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. నాలుగు సంవత్సరాల పాలనలో నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కాలేజ్ స్థాపించ లేదని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గంగడి మనోహర్‌రెడ్డి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి చౌటుప్పల్‌ను నేషనల్ రూర్బన్ పథకంలో చేర్చారన్నారు. మనోహర్‌రెడ్డి గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కార్యకర్తలు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. అనంతరం రాజస్థాన్ జలవనరుల సలహాదారు శ్రీరామ్ మాట్లాడుతూ ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వచ్చారన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతా సాంబమూర్తి మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కో సం టీఆర్ఎస్ ఓవైసీతో జట్టు కట్టిందని ఆరోపించారు. నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి కాసర్ల లింగయ్య మాట్లాడుతూ అవకాశం ఇస్తే సేవ చేస్తానని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందని అన్నారు. సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీనే.. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని మునుగోడు బీజేపీ అభ్యర్థి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి విమర్శించారు. ఫ్లోరోసిస్ నీళ్లకు, బీడు బీములకు, విద్యా, వైద్య సదుపాయాలు లేని నియోజవర్గానికి చిరునామాగా మునుగోడు మారిందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చండూరు సభలో చర్లగూడెం ప్రాజెక్ట్‌ను కుర్చి వేసుకుని పూర్తి చేస్తానని చెప్పి నిన్న అదే చండూరు సభలో వచ్చే ఏడాదిన్నరలో పూర్తి చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. చర్లగూడెం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడ నుంచి తీసుకు వస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గట్టుప్పల్ మండలాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు.మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లలేని అసమర్థుడు అని విమర్శించారు. 2009 నుంచి ఎంపీ, ఎమ్మెల్సీగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో త నను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీదర్ ఎమ్మెల్సీ రఘునాథరావు, బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి, నల్లగొండ అభ్యర్థి శ్రీరా మోజు షణ్ముఖ, జిట్టా బాలకృష్ణారెడ్డి, దోనూరి వీరారెడ్డి, సాగర్ల లింగయ్య, కాయితి రమేష్, దూడల భిక్షం, దాసాజు వెంకటాచారి, బాస్కర్ నర్సింహ, గుజ్జల సురేందర్‌రెడ్డి, పాలకుర్ల జంగయ్య, తడక సురేఖ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
చౌటుప్పల్ గురుకులానికి మిస్ వరల్డ్ అమెరికా
చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని బాలికల గురుకుల పాఠశాలను సోమవారం మిస్ వరల్డ్ అమెరికా–2017 క్లారిసా బోవర్ సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యంతో బాధపడే చిన్నారుల కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. అందులో భాగంగా చౌటుప్పల్ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో కలసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా చిన్నారులకు సేవ చేస్తానని తెలిపారు. అలాగే యుద్ధాల్లో గాయపడ్డ సైనికులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. -
చౌటుప్పల్‌లో లక్ష్మణ్‌కు ఘన స్వాగతం
చౌటుప్పల్ : బీజేపీ ఆద్వర్యంలో 14 రోజులపా టు నిర్వహించిన మార్పుకోసం జన చైతన్య యా త్రను ముగించుకొని హైదరాబాద్‌కు తిరుగు పయనమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మ ణ్‌కు శుక్రవారం రాత్రి చౌటుప్పల్‌లో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి, మునుగోడు ఇన్చార్జి గంగిడి మ నోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు, అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర ప్రదానకార్యదర్శి ఆచారి, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనూరి వీరారెడ్డి, దూడల భిక్షం, కర్నాటి ధనుంజయ్య, పోతంశెట్టి రవీందర్, కడగంచి రమేష్.. దాసోజు భిక్షమాచారి, కాయితి రమేష్, మన్నె ప్రతాపరెడ్డి, పాలకూర్ల జంగయ్య, కంచర్ల గోవర్దన్‌రెడ్డి, వనం ధనుంజయ్య,బాతరాజు సత్యం, బత్తుల జంగయ్య,ఉబ్బు భిక్షపతి, కైరంకొండ అశోక్, కట్ట కృష్ణ, తడక సురేఖ, గోశిక నీరజ,పురుషోత్తం, బ డుగు కృష్ణ, దిండు భాస్కర్, చింతకింది కిషోర్,చీకూరి వెకంటేశం,నూనె సహదేవ్, భాస్కర్‌చారి, కనకా చారి, కె.పాండు, వెంకటాచారి పాల్గొన్నారు. -
కోదండరాంకు తప్పిన ప్రమాదం
నల్లగొండ రూరల్/చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం కోదండరాంకు తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఇన్నోవా వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. వెలిమినేడు గ్రామ శివారు పిట్టంపల్లి క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే రోడ్డు దాటుతున్న బైక్‌ను ఇన్నోవా ఢీకొట్టి డివైడర్‌ను ఎక్కి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కోదండరాంకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరో వాహనంలో ఆయన హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన లడే మహేశ్, చిల్లూరి మధుకు గాయాలయ్యాయి. -
ప్రొఫెసర్ కోదండరామ్ కారుకు ప్రమాదం
-
యాదాద్రిలో మిస్ ఆస్ట్రేలియా వరల్డ్-2017
యాదాద్రి భువనగిరి జిల్లా : చౌటుప్పల్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను ఆస్ట్రేలియా మిస్ వరల్డ్-2017 ఎస్మా వోలోడేర్ సోమవారం సందర్శించారు. అనంతరం పాఠశాలలో జరిగిన డాన్స్ పోటీలలో బాలికలతో కలసి డాన్స్ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణ కాలేజీలో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్మా హాజరయ్యారు. గురుకుల పాఠశాల అధికారుల విజ్ఞప్తి మేరకు చౌటుప్పల్‌లోని గురుకుల పాఠశాలకు వచ్చారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం చూపారు. -
టైరు పేలి వాహనం బోల్తా.. ఇద్దరు మృతి
చౌటుప్పల్(యాదాద్రి జిల్లా): యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడం వద్ద హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ్తున్న టాటా ఏస్ వాహనం టైరు పేలి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్‌ను ఆస్పత్రిలో చేర్చారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం
చౌటుప్పల్ : రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని లక్కారం గ్రామం లో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరి గింది. కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా గుత్తి తాలుక బసవకల్యాణ్ గ్రామానికి చెందిన వగుమర్రి కరుణ్ (10) ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అక్కడే పదిరోజుల పాటు ఉన్నాడు. ఈ క్రమంలో లక్కారం గ్రామంలో నివాసముంటూ కూలి పని చేసుకుంటున్న తన బాబాయి సూర్యవంశి నాలుగు రో జులు తమ వద్ద ఉంచుకునేందుకు బాలుడిని తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో ఆటో దిగి రోడ్డు దాటుతున్నాడు. ఈ సమయంలో విజయవాడ వైపు వెళు ్తన్న లారీ బాలుడిని ఢీ కొట్టింది. దీంతో బాలుడు లారీ చక్రాల కిందపడి మృతి చెందాడు. వెంట ఉన్న సూర్యవంశి సురక్షితంగా బయటపడ్డాడు. సీఐ ఎస్. నవీన్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. -
ఔషధ వనం
⇒ ‘దివిస్’లో 109 రకాల ఔషధ మొక్కల పెంపకం ⇒ హిమాలయాల్లో మాత్రమే పెరిగే మెుక్కలు సైతం లభ్యం ⇒ కశ్మీర్ ప్రాంతంలో లభించే రుద్రాక్ష చెట్లు కూడా.. ⇒ సంరక్షణ, వాటి ప్రత్యేకతలు వివరించడానికి ప్రత్యేక నిపుణులు హిమాలయాల్లో మాత్రమే పెరిగే మెుక్కలు.. కశ్మీర్ ప్రాంతంలోనే లభించే రుద్రాక్షలు.. భద్రాద్రి రాముడు, శివుడికి ఇష్టమైన పుష్పం.. సుగంధద్రవ్యాల తయారీకి వినియోగించే అరుదైన ప్లాంట్స్.. ఇలా 109 రకాల ఔషధ మెుక్కలు. ఇవన్నీ లభించేది మరెక్కడో కాదు.. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ లాబోరేటరీస్ కంపెనీలో. పరిశ్రమకు చెందిన 5 ఎకరాల్లో 109 రకాల ఔషధ మెుక్కలు పెంచుతున్నారు. ‘జగదేకవీరుడు.. అతిలోకసుందరి’ సినిమా చూసే ఉంటారు. ఓ చిన్నారి కాలిలో చలనం పోతుంది. బాలికను పరీక్షించిన ఓ ఋషి హిమాలయాల్లో మాత్రమే లభించే ఓ అరుదైన మొక్కను తెచ్చి, దాని పత్రాల నుంచి రసం తీసి రాస్తే ఫలితం ఉంటుందని చెబుతాడు. దీంతో హీరో అక్కడికి వెళ్లడం.. ఆకు తేవడం.. పసరు తీసి రాయడం.. ఆ తర్వాత బాలిక యథాస్థితికి రావడం తెలిసిందే. అటువంటి అరుదైన మొక్క కావాలంటే ఇప్పుడు ఏ హిమాయాలకు వెళ్లనక్కర్లేదు. చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ లేబోరేటరీస్లోని ఔషధ వనానికి పోతే అలాంటి మెుక్క లభిస్తుంది. హిమాలయాల్లో మాత్రమే పెరిగే మొక్క ఒక్కటే కాదు.. అలాంటి అరుదైన 109 రకాల మొక్కలకు దివీ ఔషధ వనంలో జీవం పోస్తున్నారు. చౌటుప్పల్: ఆయుర్వేదం దివ్య ఔషధం. మన సాంప్రదాయ వైద్యంలో ఆయుర్వేదానికి ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని రకాల చెట్లు, మొక్కలు, ఆకులు, కాయలు, పండ్లు, బెరడు, కాండం ఇలా ప్రతి భాగం ఒక్కో రకమైన ఔషధ విలువలను కలిగి ఉంటాయి. వాటిని వినియోగించి రోగాల నుంచి విముక్తి పొందడమే ‘ఆయుర్వేద’ వైద్యం. వాటిని కొన్ని రసాయనిక పదార్థాలతో మేళవించి, ప్రత్యేక పదార్థాలను తయారు చేసే, వినియోగించడమే ‘అల్లోపతి’ వైద్యం. అటువంటి వివిధ రకాల ఔషధాలు, సుగంధద్రవ్యాల తయారీకి వినియోగించే అరుదైన మొక్కలను చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ లాబోరేటరీస్ కంపెనీలో పెంచుతున్నారు. కంపెనీ 500ఎకరాల్లో ఉండగా, ఇందులో 250ఎకరాల్లో చెట్లను పెంచుతున్నారు. ఇందులో రావి, యూకలిప్టస్, కానుగ, ఫిల్టోఫామ్, ఉసిరి, నేరేడు, గుల్మోహర్, బాదం, వేప, సుబాబుల్, గన్నేరు, పూల మొక్కలు పెంచుతున్నారు. 5 ఎకరాల్లో... కంపెనీ ఆవరణలోని 5ఎకరాల్లో దివి ఔషధ వనం పేరుతో 109రకాల ఔషధ మొక్కలను గత రెండున్నరేళ్లుగా పెంచుతున్నారు. ప్రస్తుతం 300లకుపైగా ఔషధ మొక్కలు వనంలో జీవం పోసుకుంటున్నాయి. దేశం నలుమూలల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, మొక్కలను కొనుగోలు చేసి తెచ్చి ఇక్కడ పెంచుతున్నారు. మొక్కల సంరక్షణకు, వాటి పేర్లు, పండ్లు, ఆకుల ప్రత్యేకతలను వివరించడానికి ఔషధ మొక్కలపై అవగాహన ఉన్న నిపుణులను కూడా నియమించారు. ఇందులో హిమాలయాల్లో మాత్రమే లభించే 9రకాల సుగంధ ద్రవ్యాల మొక్కలతో పాటు, కశ్మీర్ ప్రాంతంలో మాత్రమే లభించే రుద్రాక్ష చెట్లను కూడా ఇక్కడ పెంచుతున్నారు. కృష్ణతులసి, జమ్మి, బిలంబి, లవంగ, కర్పూర, సబ్జతులసి, రుద్రజడ, మెంతి వంటి అరుదైన రకాలతో పాటు కూరల్లో వినియోగించే బిర్యాని ఆకు, లవంగ ఆకువంటి మొక్కలను కూడా పెంచుతున్నారు. -
చౌటుప్పల్‌లో ఐటీ దాడులు
అర్ధరాత్రి వరకు కొనసాగిన సోదాలు వ్యాపార వర్గాల్లో హడల్ చౌటుప్పల్: చౌటుప్పల్‌లో మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఐటీ(ఇన్‌కమ్‌టాక్స్) అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా దాడులు సంచలనం రేకెత్తించాయి. వ్యాపారుల గుండెల్లో రైళ్లను పరుగెత్తించాయి. చౌటుప్పల్‌కు చెందిన వ్యాపారులు చంద్రారెడ్డి, నర్సిరెడ్డిలకు చెందిన ఇళ్లల్లో, సునీల్ ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ గోదాంలో, సునీల్ బేకరీలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీలు పూర్తయ్యాక వివరాలను వెళ్లడిస్తామని ఐటీ అధికారులు తెలిపారు. -
హైదరాబాద్-అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు!
చౌటుప్పల్: తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఇంకా నిర్మించని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిల మధ్య హైస్పీడ్ రైలు సర్వీసు నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జోరందుకున్నాయి. సోమవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లో విలేకరులతో మాట్లాడిన భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ ఏర్పాటుకు సన్నాహాలు జురుగుతున్నాయని, దానితోపాటే 65వ నంబర్ జాతీయ రహదారిని ఆరులేన్లుగా అభివృద్ధి చేసేందుకు వచ్చే కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించనున్నారని ఎంపీ తెలిపారు. వచ్చే వారం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ 65వ నెంబర్ జాతీయ రహదారిని పరిశీలించేందుకు రానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జంటనగరాల నుంచి విజయవాడకు సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లే తప్ప హైస్పీడ్ రైళ్లేవీ అందుబాటులో లేని సంగతి తెలిసిందే. కొత్త నెట్ వర్క్ ఏర్పాటుతో ఆ లోటు పూడే అవకాశం ఉంది. -
ఫార్మా పరిశ్రమలో భారీ ప్రమాదం
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి చెందిన శ్రీని ఫార్మాస్యూటికల్స్‌లో సోమవారం సాయంత్రం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ పట్టణ శివారులో ఉన్న ఈ కంపెనీ ప్రొడక్షన్ బ్లాక్‌లో రియాక్టర్ పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో పొగ దట్టంగా వ్యాపించింది. ఈ పొగతో సమీపంలోని ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ప్రాథమికంగా ఎవరికీ ప్రాణ ప్రమాదం లేదంటున్నారు. మంటలు అదుపులోకి వస్తేగానీ ప్రాణ, ఆస్తి నష్టం స్పష్టంగా తెలిసే అవకాశం లేదు. -
బాధ్యతారాహిత్యానికి నిండు ప్రాణం బలి
అటు వైద్యులు.. ఇటు పోలీసులు.. రెండు శాఖల అధికారుల బాధ్యతారాహిత్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ రోగిని 4రోజుల క్రితం పోలీసులు చేర్పించారు. రోగికి సహాయకులు ఎవరూ లేరని వైద్యులు నిర్లక్ష్యం చేశారు. చివరకు అతను చనిపోవడంతో, మా తప్పు లేదంటే, మా తప్పు కాదంటూ బుకాయిస్తున్నారు. - చౌటుప్పల్ చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 21న సాయంత్రం 4గంటల సమయంలో 1033అంబులెన్సు సిబ్బంది, హైవే పెట్రోలింగ్ పోలీసులు సుమారు 50సంవత్సరాల వయస్సు గల ఓ వ్యక్తిని చేర్పించారు. హైవేపై తుఫ్రాన్‌పేట స్టేజీ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఇతడిని స్థానికులు గుర్తించి సమాచారమిచ్చారు. 21న ఉదయం ఇతను రోడ్డు ప్రమాదానికి గురై ఉంటాడని, చేతికి గాయం ఉందని, అంబులెన్సు సిబ్బంది చెబుతున్నారు. రోగికి సహాయకులు ఎవరూ లేకపోవడంతో వైద్యులు నిర్లక్ష్యం చేశారు. వార్డులో వేసి గ్లూకోజ్ పెట్టారు. కే-షీట్ కూడా రాయలేదు. వైద్య సిబ్బంది కూడా పట్టించుకోలేదు. చివరకు శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆ వృద్ధుడు మృతిచెందాడు. విషయం వెలుగులోకి వచ్చిందిలా.. సంస్థాన్ నారాయనపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసేందుకు, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపేందుకు సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి ఆసుపత్రికి వచ్చారు. శవాన్ని చూసిన అనంతరం, వార్డులోకి వెళ్లగా, ఈ వృద్ధుడు ఓ మంచంపై కొన ఊపిరితో, జీవచ్ఛవంలా ఉన్నాడు. ఇది చూసి వైద్యులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించాడు. రోగికి సహాయకులు ఎవరూ లేరని, మేమేం చేస్తామని, పోలీసులకు సమాచామిచ్చినా రాలేదని సమాధానమిచ్చారు. నంద్యాల వెళ్లిపోయిన కొద్దిసేపటికే, వృద్ధుడు మృతిచెందాడు. దీంతో సీపీఎం నాయకులు డాక్టర్లను నిలదీశారు. రోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ వాగ్వాదానికి దిగారు. రోగికి డాక్టర్లు కే-షీట్ కూడా రాయకపోవడం పట్ల ఆశ్చర్యానికి గురయ్యారు. ఆసుపత్రి వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేస్తున్నారని వైద్యులు పోలీసులకు సమాచారమివ్వడంతో, ఎస్ఐ మల్లీశ్వరి పోలీసులతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. ఆస్పత్రి ఎదుట సీపీఎం ఆందోళన.. రోగి మృతికి కారణమైనై వైద్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సీపీఎం నాయకులు చింతల భూపాల్‌రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, రొడ్డ అంజయ్య, చీరిక సంజీవరెడ్డి, అరుణ్ తదితరులు ఆస్పత్రి ఎదుట ఆందోళకు దిగారు. డాక్టర్లపై పోలీసు కేసునమోదు చేయాలన్నారు. రోగికి కేవలం ఒక గ్లూకోజ్ ఇచ్చి వదిలేశారని, అందుకే చనిపోయాడన్నారు. అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ, గ్లూకోజులు ఎక్కించి ఉంటే బతికే వాడన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని, రోగికి కే-షీట్ రాయకపోవడం చూస్తే, వైద్యుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుందన్నారు. అసలు ప్రమాదం జరిగిందెప్పుడు..? చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన గుర్తుతెలియని వ్యక్తి మృతిపై పోలీసులు వీఆర్ఏ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. ఈ నెల 21వ తేదీన, ఖైతాపురం శివారులో మధ్యాహ్నం 12గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని పోలీసులు కేసునమోదు చేయగా, ఆసుపత్రి వైద్యులేమో, 3రోజుల క్రితం అనగా 22వ తేదీ మధ్యాహ్నం 4గంటలకు ఆసుపత్రిలో క్షతగాత్రుడిని చేర్పించారని చెబుతున్నారు. తప్పు మాది కాదంటే.. మాది కాదు.. ! రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సహాయకులు ఎవరూ లేకపోతే, పోలీసులే సహాయకులుగా ఉండాలి. ఇదే విషయమై, ఆస్పత్రికి వచ్చిన ఎస్ఐ మల్లీశ్వరిని వైద్యులు సమాచారం ఇచ్చినా ఎందుకు రాలేదని, రోగిని ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. అసలు నాకు సమాచారం ఎవరూ ఇవ్వలేదని, సీపీఎం నాయకులు ఆందోళన చేస్తున్నారంటే, ఇక్కడికి వచ్చానని ఎస్ఐ చెప్పారు. లేదు శుక్రవారం ఉదయం 11.30గంటలకు ఫోన్ చేశానని డాక్టర్ వీరన్న చెప్పడంతో, ఎస్ఐ మల్లీశ్వరి అంగీకరించారు. దీంతో మల్లీశ్వరి మాట్లాడుతూ అవును నాకు రోగి మంచంపైనే మలమూత్రాలు విసర్జిస్తున్నాడని, ఏదైనా చేయమని చెప్పారని, హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పలేదని చెప్పుకొచ్చారు. అసలు మేం రోగినే చేర్పించలేదని ఎస్ఐ అంటే, మీవాళ్లే చేర్పించారని డాక్టర్లు, చేర్పిస్తే నాకు సమాచారమిస్తారని ఎస్ఐ, పెట్రోలింగ్ పోలీసులే తీసుకొచ్చారని డాక్టర్లు, ఇలా ఒకరిపై ఒకరు తప్పును నెట్టివేసుకుంటూ వాదనలకు దిగారు. -
'గుర్తుతెలియని వ్యక్తయితే వైద్యం చేయరా?'
చౌటుప్పల్: మానవత్వం చాటుకోవడానికి మనిషి పేరు, వివరాలు తెలియాల్సిన అవసరం ఉంటుందా? బాధితుడి చిరునామా తెలిస్తే తప్ప బాధ్యత నిర్వర్తించరా? గుర్తు తెలియని వ్యక్తయినంత మాత్రాన చికిత్స అందించకుండా చంపేస్తారా?.. ఇవీ చౌటుప్పల్ ప్రభుత్వ వైద్యశాల సిబ్బందిని ప్రజలు అడిగిన ప్రశ్నలు. వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల కిందట చౌటుప్పల్ ప్రధాన రహదారిపై అపస్మారక స్థితితో పడిఉన్న ఓ వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వైద్యులుగానీ, సిబ్బందిగానీ అతడ్ని పట్టించుకున్న పాపాపపోలేదు. గుర్తుతెలియని వ్యక్తికదా, అతడి గురించి మాకేంటనే నిర్లక్ష్యంతో అతడివైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అతను శుక్రవారం మృతిచెందాడు. ఈ తతంగాన్ని గమనించిన తొటి రోగులు విషయాన్ని స్థానిక సీపీఎం నాయకులకు చేరవేశారు. ఆసుపత్రికి చేరుకున్న సీసీఎం నాయకులు వైద్యులను ప్రశ్నించగా.. గుర్తుతెలియని వ్యక్తిని గురించి పోలీసులకు సమాచారం అందించినా స్పందించలేదని, వివరాలు తెలుసుకోకుండా చికిత్స అందించలేమని సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన సీపీఎం నేతలు.. వైద్యుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. మరోవైపు ఆసుపత్రిలోని రోగులు కూడా వైద్యసిబ్బంది తీరుపట్ల అనేక ఆరోపణలు చేశారు. చికిత్స అందించే అవకాశం ఉండికూడా చిన్నచిన్న రోగాలకు సైతం హైదరాబాద్ కు వెళ్లాలంటున్నారన్నారు. -
సాక్షి ఎఫెక్ట్: ప్రిన్సిపాల్ పై కేసు నమోదు
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ గణేష్ విద్యార్థినిపై వెకిలిచేష్టలకు పాల్పడిన ఘటనకు సంబంధించి 'సాక్షి' కథనంపై పోలీసులు స్పందించారు. స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ గా ఉన్న గణేష్ పై కేసు నమోదు చేశారు. సెక్షణ్ 364 ఏ, నిర్భయ చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ గణేష్ 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో వెకిలిగా ప్రవర్తించాడు. సదరు బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలిపింది. వారు ఆగ్రహం చెంది గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్కూలు వద్దకు చేరుకుని, గణేష్‌తో వాగ్వాదానికి దిగారు. అతనికి దేహశుద్ధి చేయటంతోపాటు పాఠశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థినితో ప్రిన్సిపాల్ వెకిలిచేష్టలు
చౌటుప్పల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ ఓ విద్యార్థినితో వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పాఠశాలపై దాడిచేసి, సదరు ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గణేష్ అనే వ్యక్తి చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్, కరస్పాండెంట్‌గా పని చేస్తున్నాడు. కాగా అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినితో గణేష్ వెకిలిగా ప్రవర్తించాడు. సదరు బాలిక తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దాంతో వారు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్కూలు వద్దకు చేరుకుని గణేష్‌తో వాగ్వాదానికి దిగారు. అతనికి దేహశుద్ధి చేయటంతోపాటు పాఠశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. -
వీఆర్ఓల బదిలీలు షురూ..!
జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారు(వీఆర్ఓ)ల బదిలీలకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది.ఏడేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారంతా బదిలీలకు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో లేని విధంగా, పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుత బదిలీల్లో సొంత మండలాలను, ప్రస్తుతం పనిచేస్తున్న నియోజకవర్గం దాటి బదిలీ చేయాలని నిర్ణయించింది. చౌటుప్పల్ : జిల్లాలో 830వీఆర్వో పోస్టులుండగా 733మంది పనిచేస్తున్నారు. మొత్తం 97పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2008లో బదిలీ అయిన వారు ఇప్పటి వరకు ఏడేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 231మంది ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం వీరందరినీ బదిలీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఏడేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్ఓల జాబితాను, ఖాళీగా ఉన్న జాబితాను విడుదల చేసింది. వీరంతా ఈ నెల 10వ తేదీలోగా బదిలీకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 7ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు ఆలేరు నియోజకవర్గంలో 23మంది, భువనగిరి-19, మునుగోడు-19, దేవరకొండ-14, తుంగతుర్తి-31, సూర్యాపేట-24, నకిరేకల్-32, కోదాడ-11, మిర్యాలగూడ-7, హుజూర్నగర్-11, నల్లగొండ-14, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 26మంది ఉన్నారు. వీరంతా తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. సొంత మండలానికి బదిలీ ఉండదు.. చాలా మండలాల్లో వీఆర్ఏలుగా పనిచేసి, వీఆర్ఓలుగా ఉద్యోగోన్నతి పొంది, సొంత మండలాల్లోనే పనిచేస్తున్నారు. కొంత మంది వీఆర్ఓలు కూడా తమ సొంత మండలాల్లోనే తిష్ట వేశారు. వీరికి ఉద్యోగిగా సరైన గౌరవం దక్కకపోవడంతో పాటు, పాత రికార్డుల మార్పిడి, రాజకీయ సంబంధాలతో జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మా రారు. దీంతో సొంత మండలాల నుంచి పంపించాలని, బదిలీల్లోనూ సొంత మండలాలకు బదిలీ చేయొద్దని నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న నియోజకవర్గం దాటి బదిలీ చేయాలనే ఆలోచనకు వచ్చారంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్లు దాటితే రిక్వెస్ట్ బదిలీ.. ఒకే క్లస్టర్లో ఏడేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలనుకుంటున్న జిల్లా యంత్రాంగం, మూడేళ్లు దాటిన వారు కూడా బదిలీ కోరితే చేయాలని నిర్ణయించింది. ఈ విషయమై గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు గురువారం కలెక్టర్ సత్యనారాయణరెడ్డిని కలిసి విన్నవించారు. అందుకు కలెక్టర్ ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆలేరు నియోజకవర్గంలో 9, భువనగిరి-6, మునుగోడు-8, దేవరకొండ-14, తుంగతుర్తి-4, సూర్యాపేట-5, నకిరేకల్-9, కోదాడ-13, మిర్యాలగూడ-4, హుజూర్నగర్-16, నల్లగొండ-4, సాగర్ నియోజకవర్గంలో 11చొప్పున వీఆర్ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
ఇద్దరిని బలిగొన్న ఈత సరదా
చౌటుప్పల్: ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలిగొంది. అప్పటి వరకు తమకళ్ల ఎదుట ఉన్న బాలురు అంతలోనే విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వివరాలు.. చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన పోలబోయిన బుచ్చయ్య కుమారుడు మనోజ్(13), రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌కు చెందిన దుర్గం బాబు కుమారుడు ప్రేమ్‌సాగర్(12), గుండెబోయిన జంగయ్య కుమారులు నవీన్, కిశోర్‌లు బుధవారం మధ్యాహ్నం పెద్దకొండూరు సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లారు. ప్రేమ్‌సాగర్, మనోజ్‌లు నీటిలో ఆడసాగారు. మిగతా ఇద్దరు పిల్లలు ఒడ్డున ఉన్నారు. ఈక్రమంలో మనోజ్ నీళ్లలోకి దిగాడు. అతడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండగా, అతడిని రక్షించేందుకు ప్రేమ్‌సాగర్ కూడా నీళ్లలోకి దిగాడు. ఇతడికీ ఈత రాకపోవడంతో, ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న నవీన్ తన తమ్ముడు కిశోర్‌ను అక్కడే ఉంచి గ్రామంలోకి పరుగులు తీసి విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. గ్రామస్తులు వచ్చి చూసేసరికి మనోజ్, ప్రేమ్‌సాగర్ మృతిచెందారు. కాగా, ఈ నలుగురు పిల్లలు దగ్గరి బంధుత్వం గల అక్కాచెల్లెళ్ల పిల్లలు. ప్రేమ్‌సాగర్ వేసవి సెలవులు కావడంతో ఇక్కడికి వచ్చాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ భూపతి గట్టుమల్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ షేక్‌అహ్మద్ సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. అప్పుడే నూరేళ్లు నిండాయారా.. బోడుప్పల్‌కు చెందిన దుర్గం బాబు, వాణి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెద్దకొండూరుకు చెందిన పోలబోయిన బుచ్చయ్య, లింగమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. రెండు కుటుంబాల్లోని ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో, తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అప్పుడే నూరేళ్ల నిండాయా కొడుకా.. అంటూ వారు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. కాగా, ప్రేమ్‌సాగర్ బోడుప్పల్లో 5వ తరగతి చదువుతుండగా, మనోజ్ పెద్దకొండూరులో చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేశాడు. వీరిద్దరినీ ఈ ఏడాది నకిరేకల్‌లోని హాస్టల్లో చేర్పించాలనుకున్నారు వారి తల్లిదండ్రులు. ఈనెల 12నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో, ప్రేమ్‌సాగర్ బుధవారం సాయంత్రం బోడుప్పల్‌కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే విద్యార్థులు ఈతకని వెళ్లడంతో మృత్యురూపంలో చెరువు గుంత కబళించింది. దీంతో పెద్దకొండూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటుక బట్టీల మట్టి కోసం తీసిన గుంతల వల్లే.. పెద్దకొండూరు చెరువు పక్కనే పెద్ద ఎత్తున ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇటుక బట్టీలకు అవసరమైన మట్టిని బట్టీల యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీబీలతో పెద్ద ఎత్తున మట్టిని తోడారు. దీంతో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల చెరువును పిలాయిపల్లి కాలువ ద్వారా మూసీ జలాలతో నింపారు. ఈ పెద్ద గుంతలు నీటితో నిండిపోయాయి. అంతకుముందు కూడా ఈతకు వెళ్లిన పిల్లలు చిన్న గుంతల్లో స్నానం చేసి ఇంటికి వచ్చారు. బుధవారం ఈతకు వెళ్లిన పిల్లలు గుంతల లోతు తెలియక అందులో మునిగి మృత్యువాతపడ్డారు. -
ప్రారంభం.. ప్రేమ.. పౌరుషం
జిల్లాలో మరోమారు సీఎం పర్యటన పూర్తి ఆవిష్కరణలు, శంకుస్థాపనల తో ప్రారంభం బహిరంగసభలో జిల్లా ప్రజలపై ఉన్న ప్రేమను చెప్పిన కేసీఆర్ నల్లగొండ బాధ... నా గుండె లోతుల్లో ఉందని వ్యాఖ్య అదే సభలో చంద్రబాబుపై పౌరుషాన్ని చూపిన సీఎం దామరచర్లలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చౌటుప్పల్‌లో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ ఎన్జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభలో ప్రసంగం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఆవిష్కరణలతో సోమవారం ప్రారంభమైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన ప్రేమతో సాగి పౌరుషంతో ముగిసింది. చౌటుప్పల్‌లో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణతోపాటు దామరచర్లలో నాలుగువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం సోమవారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో జిల్లాపై, ఇక్కడి ప్రజలపై తన వాత్సల్యాన్ని కనబరిచారు. నల్లగొండ బాధ.. తన గుండె లోతుల్లో ఉందని చెప్పిన సీఎం.. జిల్లా ప్రజలకు కృష్ణా, గోదావరి నదీ జలాలను అందించి తీరుతానని శపథం చేశారు. నల్లగొండకు నీళ్లు తెచ్చి చూపిస్తా అని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత అదే సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఆయన నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు వ్యవహారం నుంచి చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని, ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తొలుత హెలికాప్టర్లో చౌటుప్పల్ వచ్చిన ఆయన అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించి నేరుగా దామరచర్ల మండలం వీర్లపాలెం వెళ్లా రు. అక్కడ పవర్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసి హెలికాప్టర్లోనే నల్లగొండకు వచ్చారు. పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌కుమార్ నివాసంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన ఎన్జీ కళాశాల బహిరంగ సభలో ప్రసంగించి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. వరాల జల్లు.. తన పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు. జిల్లా నలుమూలలా రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని చెప్పి, ఇందుకోసం రూపొందిస్తున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతమైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు 6వేల కోట్ల రూపాయల వ్యయంతో శ్రీశైలం నుంచి నీటిని తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, ఈ ప్రాజెక్టుకు ఈనెల 12న శంకుస్థాపన చేస్తానని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి రేపో, యెల్లుండో ఉత్తర్వులు జారీ చేస్తానన్నారు. అదే విధంగా ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు మెదక్ జిల్లాలో నిర్మించే కాళేశ్వరం (కొమరెల్లి మల్లన్న) ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామని, ఎస్సెల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేయడం ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో కృష్ణా, గోదావరి నీళ్లను తీసుకువచ్చి నల్లగొండ జిల్లా ప్రజల పాదాలు కడుగుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దొడ్డుదొడ్డోళ్లు నీళ్లు తేలే జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా సీఎం కేసీఆర్ చురకలంటించారు.‘ ఈ జిల్లాలో నాకన్న నాలుగింతలు దొడ్డోళ్లు, పొడుగోళ్లున్నరు. ఈ దొడ్డుగున్నోళ్లకు పదవిలో ఉన్నన్ని రోజులు దోచుకోవడమే సరిపోయింది. వారు తినేందుకే సరిపోలేదు. మా జగదీశ్ పొట్టిగ, సన్నగ ఉం టడు. దొడ్డోళ్లు రెండో పంటకు సాగర్‌నీళ్లు తెచ్చిండ్రా... మా జగదీశ్ తెచ్చిండు. మా ఎమ్మెల్యేలు సన్నగుంటరు కాబట్టే హాస్టళ్లలో సన్నబియ్యం పథకం తెచ్చినం.’ అని చమత్కరిం చారు. సాయి సంసారి... లచ్చి దొంగ అన్నట్టు అధికారంలో ఉన్నన్నాళ్లు ఎలాంటి ఆలోచన చేయకుండా, ప్రజలను ఎలా దోచుకుందామా అని ఆలోచించిన నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ70 ఫీట్ల స్థూపం.. నల్లగొండ కీర్తిపతాకం తెలంగాణ ప్రాంతమంతటికీ నల్లా నీళ్లు అం దించే వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో నిర్మించాలని పట్టుబట్టి చేశామని కేసీఆర్ చెప్పారు. ‘ ఆ 70 ఫీట్ల స్థూపం... నల్లగొండ కీర్తిపతాకను రెపరెపలాడించాలి.’ అని సీఎం అన్నారు. జగదీశ్ తన కుడిభుజమని చెప్పిన కేసీఆర్ ఆయనకు ఉద్యమ సోయి ఉంది కాబట్టే అహోరాత్రులు శ్రమించి తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంటు ఇస్తున్నాడని అభినందించారు. నల్లగొండ బాధ తాను గుండెల్లో పెట్టుకుని ఉద్యమ సందర్భంగా తెలంగాణ మూలమూలన చెప్పుకొచ్చానని, ఆ బాధ తనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని కేసీఆర్ అన్నారు. ఇక నుంచి తెలంగాణలో కరెంటు కోతలుండవని ఆంధ్రోళ్లు, కాంగ్రెసోళ్ల పవర్‌కట్ అయినంక, తెలంగాణ ప్రజలకు పవర్‌ఫుల్లుగా వస్తోందని అన్నారు. ‘ ఇక బేఫికర్, కరెంటు కోతలుండవు. తెలంగాణకు పట్టిన అరిష్టాలన్నీ తొలగిపోయాయి.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారు స్వయంప్రకటిత నాయకులు బహిరంగసభలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి మాట్లాడారు. 30 ఏళ్లు అధికారంలో ఉన్నోళ్లు, ముఖ్యమంత్రులు అవుతామని చెప్పుకున్న స్వయం ప్రకటిత నాయకులు జిల్లాకు ఏం ఒరగబెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎవరూ కలకనని, ఊహించని పథకాలను టీఆర్ఎస ప్రభుత్వం అమలుచేస్తోందని, దామరచర్లలో పవర్‌ప్లాంటు పెట్టాలని కాంగ్రెసోళ్లు పొరపాటున వెయ్యేళ్లు బతికినా ఆలోచన చేయలేరని అన్నారు. బహిరంగసభకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా, రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్, బాల్కసుమన్, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, పూల రవీందర్, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్, మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నేతలు దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య, తేరా చిన్నపురెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, వి. చందర్రావు, అమరేందర్‌రెడ్డి, కాసోజు శంకరమ్మ, లాలూ నాయక్, బడుగుల లింగయ్యయాదవ్, చాడా కిషన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బుర్రి శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, మాలె శరణ్యారెడ్డి లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం జిల్లా పర్యటన సమయ సూచిక ప్రదేశం సీఎం వచ్చిన సమయం వెళ్లిన సమయం చౌటుప్పుల్ 4 :45 గంటలు 5 :5గంటలు దామరచర్ల 5:45 గంటలు 6 :10 గంటలు నల్లగొండ 7 :40 గంటలు 8 :40గంటలు నల్లగొండలో బహిరంగ సభ జరిగే ప్రదేశానికి సీఎం7.36 గంటలకు చేరుకోగా..వేదిక మీదకు 7.38 గంటలకు చేరుకున్నారు. -
చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
నల్గొండ : నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వేసవి సెలవులు, వీకెండ్ కావడంతో హైదరాబాద్ నగర వాసులు తమ వాహనాల్లో స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో చౌటుప్పల్ టోల్గేట్ వద్ద వాహనాలు అరకిలో మీటరు వరకు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. -
చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
-
‘మావో’ల పోస్టర్ల కలకలం
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలంలో బుధవారం రాత్రి మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. చౌటుప్పల్-వలిగొండ రోడ్డుపై, మండలంలోని తాళ్లసింగారం గ్రామ ఎక్స్‌రోడ్ వద్ద ఉన్న గ్రామ సూచిక బోర్డుకు ఒకటి, హైవేపై లింగోజిగూడెం స్టేజీ వద్ద మరో రెండు పోస్టర్లు వెలిశాయి. గురువారం తెల్లవారుజామునే పోస్టర్లను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు హుటాహుటీనా వెళ్లి, పోస్టర్లను తొలగించారు. పోస్టర్లపై పీఎల్జీఏ వారోత్సవాలను జయప్రదంచేయాలి, మావోయిస్టులు వర్థిల్లాలి, కేసీఆర్‌ది నియంతృత్వ పాలన, రైతులు, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడాలి, అమరుల ఆశయాలను సాధిస్తాం, అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం అని మావోయిస్టు పార్టీ పేరు రాసి ఉంది. కాగా, ఇటీవలి కాలంలో సంస్థాన్ నారాయణపురం, దేవిరెడ్డి బంగ్లా, చండూరు మండలం గట్టుప్పల్ లో, రెండు రోజుల క్రితం గుర్రంపోడు మండలంలో వరుసగా పోస్టర్లు వెలుస్తుండడంతో మావోల కదలికలపై అనుమానం రే కెత్తుతోంది. పోలీసులు ఆకతాయిల పనేనని పైకి కొట్టిపారేస్తున్నా, లోలోన మాత్రం మదనపడుతున్నారు. చౌటుప్పల్‌లో వెలిసిన పోస్టర్లు నకిలీల పనేనని పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు కొట్టిపారేశారు. -
'కేసీఆర్ పాలనను అంతం చేయాలి'
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ శివారులో వెలసిన మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపాయి. కేసీఆర్ పాలనను అంతం చేయాలని, మావోయిస్టు వారోత్సవాలను జయప్రదం చేయాలని పోస్టర్లలో పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుని వారి ఆశయాలను సాధించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ లోని లింగోజిగూడెం, వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద ఈ పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు పోస్టర్ల కలకలం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అసలు మావోయిస్టులే లేరని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి బుధవారం వ్యాఖ్యానించారు. -
మహిళ దారుణ హత్య
చౌటుప్పల్ : గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామశివారులో ఆలస్యంగా శనివారం ఉదయం వెలుగుచూసింది. స్థాని కులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 35సంవత్సరాల వయస్సు గల మహిళను దుండగులు వలిగొండ-చౌటుప్పల్ రోడ్డు పక్కన గల, ఎస్.లింగోటం శివారులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చాడు.పత్తిచేలో పెనుగులాట జరిగింది. మొదట గొంతు నులిమి,బండరాయిని తలపై మోది చంపేశాడు.బండరాయిని అలాగే తలపై ఎత్తేసి వెళ్లాడు. రెండు రోజులు సద్దుల బతుకమ్మ, విజయదశమి కావడంతో పత్తిచేను వైపు ఎవరూ వెళ్లలేదు. శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. శనివారం ఉదయం అటు వైపు వెళ్లిన పశువుల కాపరి చూసి, పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు పోలీసులతో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం పోలీసులను రప్పించి, ఆనవాళ్లను సేకరించారు. పోలీస్ డాగ్‌స్క్వాడ్‌ను రప్పించినా ఫలితం లేకపోయింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పోస్టుమార్టం చేశారు. సుమారు 50గంటల క్రితమే చనిపోయినట్టు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్న పౌల్ట్రీఫామ్, పరిశ్రమల్లో పనిచేసే మహిళగా భావించి, విచారించినప్పటికీ ఫలితం లేకపోయింది. వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. గత 3రోజుల క్రితం ఎక్కడైనా మహిళ అదృశ్యమైతే, 9440795612నెంబరుకు సంప్రదించాలని పోలీస్ ఇన్స్పెక్టర్ కోరారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం
చౌటుప్పల్ :స్కూల్‌కు వెళ్లలేదని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది, కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కుంట్లగూడెంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోగ సత్యనారాయణ చేనేత కార్మికుడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. కుమార్తె బోగ పూజ(13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఓ గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకొని, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు చూసి, మంటలను ఆర్పి వేశారు.అప్పటికే బాగా కాలిపోయింది. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసు ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జమ్మాపురంలో.. జమ్మాపురం (భువనగిరి అర్బన్) : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని జమ్మాపురంలో గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నాబత్తిని రవికుమార్(30)కు మూడు సంవత్సరాల క్రితం మూటకొండూరు గ్రామంలోని సికిందర్‌నగర్‌కు చెందిన స్వాతితో వివాహం జరిగింది. రెండు సంవత్సరాల క్రితం తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చి కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి రవికుమార్ ఒంటరిగానే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతను మద్యం డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించసాగాడు.నెల రోజుల నుంచి ఇంట్లో తగాదాలు ఎక్కువ య్యాయి. రవికుమార్ మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అతడిని భువనగిరి పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్ని దర్యాప్తు చేస్తున ట్లు రూరల్ ఏఎస్ఐ నర్సింగరావు తెలిపారు. రైలుకిందపడి.. యాదగిరిగుట్ట : రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని రామాజీపేట రైల్వేగేటు సమీపంలో జరిగింది. భువనగిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాలాగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్‌కు చెందిన కళ్యాణ్‌కుమార్ (27 )అదే ప్రాంతంలో ఓ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడికి నాలుగు నెలల క్రితం వివాహమైంది. పుట్టుకతోనే మూగవాడు. పెళ్లి జరిగిన తర్వాత కంపెనీలో పనికి సరిగ్గా వెళ్లడం లేదు. దీంతో పెద్దలు మందలించారు. దీంతో అతడు మనస్తాపానికి గురై సోమవారం తెల్లవారుజామున రామాజీపేట రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ మేరకు భువనగిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాలాగౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం
చౌటుప్పల్ రూరల్ : అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలోని లక్కారం మోడల్ స్కూల్‌ను సోమవారం ఆయన సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం అధ్వానంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ స్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం బాగా లేదని, భోజన ఏజెన్సీపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మందోళ్లగూడెం పంచాయతీ పరిధిలోని సింగరాయిచెర్వు సబ్‌స్టేషన్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులు పిలాయిపల్లి కాలువ, సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌స్టేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చే యిస్తానన్నారు. పిలాయిపల్లి కాలువ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్లే నీళ్లు సరిగ్గా రావడం లేదన్నారు. 6నెలల్లోగా అసంపూర్తి పనులను పూర్తి చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్‌లు రిక్కల సుధాకర్‌రెడ్డి, ముటుకుల్లోజు దయాకరాచారి, కానుగు యాదమ్మ, బక్క శంకరయ్య, ఎంపీటీసీ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, బొబ్బిళ్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
దొరకని అఖిల్ జాడ
చౌటుప్పల్ :హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతయ్యాడు. మూడు రోజు లుగా రెస్క్యూ టీం గాలిస్తున్నా అతని జాడ దొరకలేదు. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన మాచర్ల సుదర్శన్-సబిత దంపతులకు ఇద్దరు కుమారులు. 15సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వెళ్లి దిల్‌సుఖ్‌నగర్‌లో స్థిరపడ్డారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనేది వీరి కోరిక. పెద్దకుమారుడు విశాల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగరీత్యా ముంబైలో శిక్షణ పొందుతున్నాడు. చిన్నకుమారుడు అఖిల్(20) బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్టడీటూర్‌లో భాగంగా ఈ నెల 3న కళాశాల ఆధ్వర్యంలో స్నేహితులతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. బియాస్ నదిలో గల్లంతైన 24మంది విద్యార్థులలో ఈయన కూడా ఉన్నాడు. ఈయన గల్లంతైన విషయం తెలియగానే తల్లిదండ్రులు హిమాచల్‌ప్రదేశ్‌కు హుటాహుటిన తరలివెళ్లారు. కొడుకు కడసారి చూపైనా దక్కుతుందా, లేదా అని కన్నీరుమున్నీరవుతున్నారు. మూడు రోజులుగా రెస్క్యూ టీం, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాల కోసం గాలిస్తున్నా ఎక్కడా అఖిల్ జాడ దొరకలేదు. -
నేటి నుంచి పోలింగ్ స్లిప్‌ల పంపిణీ
చౌటుప్పల్/కలెక్టరేట్, న్యూస్‌లైన్,మొదటి విడతలో ప్రాదేశిక ఎన్నికలు జరిగే మండలాల్లో గురువారం నుంచి పోలింగ్ స్లిప్‌లను పంపిణీ చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు బూత్‌లెవల్ సిబ్బందిని ఆదేశించారు. మొదటి విడతలో ఎన్నికలు జరిగే మండలాలకు చెందిన జోనల్ అధికారులతో బుధవారం సాయంత్రం చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 33 మండలాల్లో మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయన్నారు. ఇప్పటికే బ్యాలెట్బాక్సులు, బ్యాలెట్ పేపర్లు అన్ని మండలాలకు పంపిణీ చేశామని చెప్పారు. గురువారం ఎన్నికల అధికారులు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను సరిచూసుకోవాలన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే డివిజన్లలో 500 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకమైనవిగా, 800 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు *2కోట్ల వరకు నగదు పట్టుకున్నామని, 8 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేశామని వివరించారు. బుధవారం చౌటుప్పల్‌లో పట్టుబడిన *1.62 కోట్ల విషయాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులకు తెలియజేశామని చెప్పారు. మద్యాన్ని కూడా భారీగా నియంత్రించామని, గత ఏడాది ఏప్రిల్‌లో సరఫరా చేసిన కోటానే ప్రస్తుతం మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, జగన్‌రెడ్డి, శకుంతల, దేవసహాయం, శేషాద్రి, శ్రీనివాస్‌రావుతో పాటు కలెక్టరేట్ నుంచి జేసీ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావు, ఎన్నికల పరిశీలకులు ప్రియదర్శిని, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముందుకు పడని అడుగు
చౌటుప్పల్, న్యూస్‌లైన్ :ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి ముహూర్తం కుదరడం లేదు. ఈ నెల రెండో వారంలో పనులు ప్రారంభిస్తామని స్పీకర్ ప్రకటించినా ఆ దిశగా పనులేమీ జరగడం లేదు. అసలు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 8లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులున్నారు. సమస్యను స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌రావు 17మంది ఎమ్మెల్యేల బృం దంతో కలిసి గత ఏడాది జూలై 7, 8 తేదీల్లో మునుగోడు నియోజకవర్గంలో పర్యటిం చారు. ఫ్లోరోసిస్ బాధితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, చలించిపోయారు. ఫ్లోరైడ్ శాశ్వత నివారణకు పాటుపడాలని తలంచారు. అందుకు ఫ్లోరైడ్పై మరిన్ని పరి శోధనలు అవసరమని భావించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కృషి ఫలిం చింది. జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం మంజూరైంది. దీనిని చౌటుప్పల్ మండలం మల్కాపురంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రం నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు అవసరమయ్యే 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. ఇక్కడే ఫ్లోరోసిస్ బాధితుల కోసం 75పడకల ఆస్పత్రిని కూడా నిర్మించనున్నారు. రెండేళ్ల కాలంలో నిర్మాణాలన్నీ పూర్తయి సేవలు అందుబాటులోకి రావాలి. స్థల వివాదం.. మల్కాపురం శివారులోని సర్వే నంబర్ 486లో 10ఎకరాల ప్రభుత్వ భూమిని వాహనాల సామర్థ్య కేంద్రానికి, దీని పక్కనే మరో 5ఎకరాల భూమిని జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి కేటాయించారు. సర్వేనంబరు 486, 399లలో 8క్రషర్ మిల్లులకు 88ఎకరాల భూమిని మైనింగ్ కోసం ప్రభుత్వం లీజుకిచ్చింది. మైనింగ్ నిబంధన ప్రకారం.. మిల్లులకు లీజుకు ఇచ్చిన భూమికి 500మీటర్ల లోపు ఎటువంటి నిర్మాణాలకూ అనుమతించకూడదు. కాగా, ఓ క్రషర్ మిల్లుకు, వాహన సామర్థ్య కేంద్రానికి కేటాయించిన భూమి 500మీటర్ల లోపు ఉండడంతో ఆ క్రషర్ యజమాని రెండు నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు వెహికిల్ ఫిట్నెస్ సెంటర్ పనులను నిలిపివేసింది. భూమి కేటాయింపుపై పునఃపరిశీలన చేస్తూ, నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రానికి కేటాయించిన భూమి కూడా 500మీటర్ల లోపే ఉండడంతో పనులు ప్రారంభిస్తే క్రషర్ యజమానులు అభ్యంతరం చెప్పే అవకాశం ఉన్నందున అధికారులు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. జిల్లా అధికారులు వేరే స్థలాన్ని కేటాయించాలని చూస్తున్నట్టు సమాచారం. రెండు నెలలవుతున్నా స్థల వివాదం పరిష్కారం కాకపోవడంతో ఈ నెల రెండో వారంలోనే ప్రారంభం కావాల్సి ఉన్న ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పనులు ప్రశ్నార్థకంగా మారాయి. స్పీకరు గారూ.. మీరే పట్టించుకోవాలి 70 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌రావు కృషితో జిల్లాలో జాతీయ ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం ఏర్పాటవుతోంది. సమాజ ప్రయోజనాల దృష్ట్యా ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం అత్యంత అవసరం. రెండు నెలలుగా స్థల వివాదం నెలకొన్నా, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన స్పీకర్ ప్రత్యేక చొరవ తీసుకొని స్థల వివాదాన్ని పరిష్కరింపజేయాలని ప్రజలు కోరుతున్నారు.. -
భవనం కూలి ఒకరి మృతి
చౌటుప్పల్, న్యూస్‌లైన్ : చౌటుప్పల్‌లో శనివారం భవనం కూలి ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నా రాయణపురం మండలం కడపగండితండాకు చెందిన కరంటోతు శంకర్(20) చౌటుప్పల్‌లోని శరత్ హోటల్లో సప్లయిర్‌గా ఏడాది కాలంగా పనిచేస్తున్నాడు. హోటల్ పైఅంతస్తులోని గదిలో నివాసముంటున్నాడు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హోటల్ భవనంలో ముందు భాగాన్ని కొన్నిరోజుల క్రితం కూల్చివేశారు. దీని పక్క నుంచే కొత్త భవనాన్ని నిర్మించారు. దీనికి మెట్లు నిర్మించలేదు. కూల్చివేయగా, భవనానికి మిగిలిన మెట్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి శంకర్ గదికి వెళ్లి పడుకున్నాడు. శనివారం ఉదయం 10గంటలకు పనిలోకి వచ్చేందుకు మెట్ల మీది నుంచి కిందికి దిగుతుండగా ఆకస్మాత్తుగా భవనం కూలిపోయింది. శంకర్ శిథిలాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పో లీసులు వచ్చి శిథిలాలను తొలగించి మృ తదేహాన్ని బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ కె.జగన్నాథరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
చౌటుప్పల్‌లో కుప్పకూలిన హోటల్
నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా ఉన్న హోటల్ ఈ రోజు తెల్లవారుజామున కుప్పకూలింది. దాంతో పోలీసులతోపాటు స్థానికులు సహయక చర్యలు చేపట్టారు. ఆ హోటల్ శిథిలాల కింద ఒకరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఘటన తెల్లవారుజామున జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు. కాగా శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తి మృతి చెందాడా లేక బతికి ఉన్నాడా అనే విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు. -
బిటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించాడు. మంగళవారం ఉదయం అటుగా వచ్చిన స్థానికులు మృతదేహన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు భూదాన్‌పోచంపల్లి మండలంలోని దోతిగూడెం గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డిగా ప్రాధమిక సాక్ష్యాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు బిటెక్ విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. ప్రవీణ్‌కుమార్ రెడ్డిది హత్య, ఆత్మహత్య అనేది దర్యాప్తులో తెలుతుందన్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
చౌటుప్పల్, న్యూస్‌లైన్ : చౌటుప్పల్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా నగరి మండలం దమరపాకం గ్రామానికి చెందిన వేపాటి రాంబాబు(32) చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. చౌటుప్పల్‌లో నివాసముంటున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై, మరో ఉద్యోగి శ్రీరాములుతో కలిసి ఇంటికి వస్తూ, రోడ్డు తిరిగేందుకు (దాటేందుకు) బస్టాండ్ వద్ద రోడ్డు క్రాస్ అవుతున్నారు. వీరి వెనకాలే వచ్చిన మినీగూడ్స్ వాహనం, వీరు రోడ్డును తిరుగుతుండడంతో, నెమ్మదిగా ఆపుకుంటున్నాడు. దీని వెనకాలే అతివేగంగా వచ్చిన ఇండికా కారు మినీగూడ్స్ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో మినీగూడ్స్ వాహనం వెళ్లి ముందున్న బైకును ఢీ కొట్టింది. దీంతో బైకుపైనున్న రాంబాబు, శ్రీరాములులు ఎగిరి రోడ్డుపై దూరంగా పడ్డారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ రాంబాబు మీది నుంచి దూసుకెళ్లడంతో, తల చిద్రమై, అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఉద్యోగి శ్రీరాములుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన మినీగూడ్స్ వాహనం డ్రైవర్ మూసిపేట కిరణ్‌కుమార్(22) తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మినీగూడ్స్ వాహనంలోని వెంకటేష్ కూడా గాయపడ్డాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ కె.జగన్నాథరెడ్డి కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నారాయణ దంపతుల సంతాపం.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వేంపాటి రాంబాబు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణకు దగ్గరి బంధువు. నారాయణ భార్య వసుమతితో కలిసి బుధవారం ఆసుపత్రికి వచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావుతో కలిసి రాంబాబు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటన పూర్వపరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కారు ఢీకొని మహిళ.. దామరచర్ల : కారు ఢీకొని మహిళ మృతిచెందిన సంఘటన బుధవారం మండల పరిధిలోని కొండ్రపోల్ గ్రామ శివారు రాళ్లవాగు తండా వద్ద అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై జరి గింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లవాగుతండాకు చెందిన లావూడి లింగి(50) కూరగాయలు కొనేందుకు రోడ్డు దాటుతుండ గా మిర్యాగూడ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన లింగి అక్కడికక్కడే మృతిచెందిం ది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మన్మథకుమార్ తెలిపారు.