టైరు పేలి వాహనం బోల్తా.. ఇద‍్దరు మృతి
చౌటుప‍్పల్(యాదాద్రి జిల్లా): యాదాద్రి జిల్లా చౌటుప‍్పల్ మండలం ధర్మోజిగూడం వద్ద హైదరాబాద్ నుండి సూర్యాపేటకు వెళ‍్తున‍్న టాటా ఏస్ వాహనం టైరు పేలి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది.
శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో ఇద‍్దరు వ‍్యక్తులు అక‍్కడికక‍్కడే మృతిచెందారు. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్‌ను ఆస‍్పత్రిలో చేర్చారు.