చౌటుప్పల్ : రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని లక్కారం గ్రామం లో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరి గింది. కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా గుత్తి తాలుక బసవకల్యాణ్ గ్రామానికి చెందిన వగుమర్రి కరుణ్ (10) ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అక్కడే పదిరోజుల పాటు ఉన్నాడు. ఈ క్రమంలో లక్కారం గ్రామంలో నివాసముంటూ కూలి పని చేసుకుంటున్న తన బాబాయి సూర్యవంశి నాలుగు రో జులు తమ వద్ద ఉంచుకునేందుకు బాలుడిని తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో ఆటో దిగి రోడ్డు దాటుతున్నాడు. ఈ సమయంలో విజయవాడ వైపు వెళు ్తన్న లారీ బాలుడిని ఢీ కొట్టింది. దీంతో బాలుడు లారీ చక్రాల కిందపడి మృతి చెందాడు. వెంట ఉన్న సూర్యవంశి సురక్షితంగా బయటపడ్డాడు. సీఐ ఎస్. నవీన్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు.