చౌటుప్పల్, న్యూస్‌లైన్ : చౌటుప్పల్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా నగరి మండలం దమరపాకం గ్రామానికి చెందిన వేపాటి రాంబాబు(32) చౌటుప్పల్ మండలం లింగోజిగూడెంలోని దివీస్ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.
చౌటుప్పల్‌లో నివాసముంటున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై, మరో ఉద్యోగి శ్రీరాములుతో కలిసి ఇంటికి వస్తూ, రోడ్డు తిరిగేందుకు (దాటేందుకు) బస్టాండ్ వద్ద రోడ్డు క్రాస్ అవుతున్నారు. వీరి వెనకాలే వచ్చిన మినీగూడ్స్ వాహనం, వీరు రోడ్డును తిరుగుతుండడంతో, నెమ్మదిగా ఆపుకుంటున్నాడు. దీని వెనకాలే అతివేగంగా వచ్చిన ఇండికా కారు మినీగూడ్స్ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో మినీగూడ్స్ వాహనం వెళ్లి ముందున్న బైకును ఢీ కొట్టింది.
దీంతో బైకుపైనున్న రాంబాబు, శ్రీరాములులు ఎగిరి రోడ్డుపై దూరంగా పడ్డారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ రాంబాబు మీది నుంచి దూసుకెళ్లడంతో, తల చిద్రమై, అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఉద్యోగి శ్రీరాములుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన మినీగూడ్స్ వాహనం డ్రైవర్ మూసిపేట కిరణ్‌కుమార్(22) తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మినీగూడ్స్ వాహనంలోని వెంకటేష్ కూడా గాయపడ్డాడు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ కె.జగన్నాథరెడ్డి కేసునమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
నారాయణ దంపతుల సంతాపం..
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వేంపాటి రాంబాబు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణకు దగ్గరి బంధువు. నారాయణ భార్య వసుమతితో కలిసి బుధవారం ఆసుపత్రికి వచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావుతో కలిసి రాంబాబు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటన పూర్వపరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
కారు ఢీకొని మహిళ..
దామరచర్ల : కారు ఢీకొని మహిళ మృతిచెందిన సంఘటన బుధవారం మండల పరిధిలోని కొండ్రపోల్ గ్రామ శివారు రాళ్లవాగు తండా వద్ద అద్దంకి- నార్కట్‌పల్లి రహదారిపై జరి గింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లవాగుతండాకు చెందిన లావూడి లింగి(50) కూరగాయలు కొనేందుకు రోడ్డు దాటుతుండ గా మిర్యాగూడ నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన లింగి అక్కడికక్కడే మృతిచెందిం ది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ మన్మథకుమార్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
Published Thu, Aug 15 2013 3:30 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement