'కేసీఆర్ పాలనను అంతం చేయాలి' | maoist call end for kcr rule in telangana | Sakshi

'కేసీఆర్ పాలనను అంతం చేయాలి'

Published Thu, Dec 4 2014 8:46 AM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM

'కేసీఆర్ పాలనను అంతం చేయాలి' - Sakshi

'కేసీఆర్ పాలనను అంతం చేయాలి'

నల్లగొండ జిల్లా చౌటుప్పల్ శివారులో వెలసిన మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపాయి.

చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ శివారులో వెలసిన మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపాయి. కేసీఆర్ పాలనను అంతం చేయాలని, మావోయిస్టు వారోత్సవాలను జయప్రదం చేయాలని పోస్టర్లలో పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుని వారి ఆశయాలను సాధించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ లోని లింగోజిగూడెం, వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద ఈ పోస్టర్లు వెలిశాయి.

మావోయిస్టు పోస్టర్ల కలకలం నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అసలు మావోయిస్టులే లేరని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి బుధవారం వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement