నల్గొండ జిల్లా చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వేసవి సెలవులు, వీకెండ్ కావడంతో హైదరాబాద్ నగర వాసులు తమ వాహనాల్లో స్వస్థలాలకు బయలుదేరారు. దీంతో చౌటుప్పల్ టోల్గేట్ వద్ద వాహనాలు అరకిలో మీటరు వరకు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి.