బిటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి | B. Tech student praveen kumar reddy suspicious death at choutuppal in nalgonda district | Sakshi
Sakshi News home page

బిటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి

Published Tue, Sep 17 2013 9:32 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

B. Tech student praveen kumar reddy suspicious death at choutuppal in nalgonda district

నల్గొండ జిల్లా చౌటుప్పల్లోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించాడు. మంగళవారం ఉదయం అటుగా వచ్చిన స్థానికులు మృతదేహన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు భూదాన్పోచంపల్లి మండలంలోని దోతిగూడెం గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్ రెడ్డిగా ప్రాధమిక సాక్ష్యాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

 

అతడు బిటెక్ విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. ప్రవీణ్కుమార్ రెడ్డిది హత్య, ఆత్మహత్య అనేది దర్యాప్తులో తెలుతుందన్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement