praveen kumar reddy
-
మళ్లీ మళ్లీ.. TDP చీప్ ట్రిక్స్
ఈ ఫొటోలో పచ్చ కండువా కప్పించుకుంటున్న వ్యక్తి కడప బాలాజీనగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ రాజశేఖరరెడ్డి. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి సమక్షంలో తిరిగి టీడీపీలో చేరారు. టీడీపీ నేతగా గత కొంతకాలంగా కడపలో చలామణీ అవుతున్నారు. అంతలోనే చంద్రబాబు వద్ద మరోమారు అదే మాజీ కార్పొరేటర్‌కు టీడీపీ కండువా కప్పించారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరికలంటూ ప్రచారం చేసుకున్నారు. ఇతను ప్రొద్దుటూరు 22వ కౌన్సిలర్ మహమ్మద్‌గౌస్. టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తీసుకెళ్లి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్పించారు. మూడు నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మరోమారు టీడీపీ కండువా కప్పి, తెలుగుదేశం పార్టీ చేరినట్లు ప్రచారం చేపట్టారు.జిల్లా వ్యా ప్తంగా ఇలాంటి చేరికలను టీడీపీ ప్రోత్సహిస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: అంతంత మాత్రమే ఉన్న ప్రజామద్దతు... ఎక్కడికెళ్లిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబి్ధదారుల ప్రతిఘటన. పైగా నాన్ లోకల్ ఎఫెక్ట్.. ఇవన్నీ మరిపించేందుకు తెలుగుదేశం అభ్యర్థులు చీప్‘ట్రిక్స్’కు పాల్పడుతున్నారు. వలసల ఉధృతి అంటూ ప్రచార ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనువుగా ఎల్లోమీడియా ప్రచారం కల్పిస్తోంది. వాస్తవంలో టీడీపీ నాయకులు నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమయ్యారు. ఐదేళ్లుగా ప్రజల చెంతకు చేరకుండా ఉనికి కోసం మమ అన్పిస్తూ కాలక్షేపం చేశారు. ఎన్నికలు సమీపించే కొద్ది చీప్‘ట్రిక్స్’ప్రదర్శిస్తూ ప్రజల్లో చర్చకు ఆస్కారం ఇస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. నాన్ లోకల్ అభ్యర్థిత్వం మరిపించేందుకు.... జిల్లాలో టీడీపీకి స్థానికంగా అభ్యర్థులు కరువయ్యారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులున్నా, డబ్బులున్నవారికే ఆ పార్టీ అధిష్టానం టికెట్లు కట్టబెట్టింది. ఈ కోవలో కడప, రాజంపేట అభ్యర్థులు మాధవీరెడ్డి, సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్లు చెప్పవచ్చు. ఇద్దరు రాయచోటి నియోజకవర్గానికి చెందిన వారు. కడపకు మాధవీరెడ్డి అభ్యర్థిత్వం ఖరారయ్యాక సోషల్ మీడియాలో ఫోకస్ కోసం తాపత్రయం పడుతున్నారు. లేని ఊపును సృష్టించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడో నివాసం ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నా మాధవీరెడ్డి సోషల్ మీడియాలో పొందుతున్న ప్రచారాన్ని పసిగట్టిన టీడీపీ అభ్యర్థులు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో ఈవీ సుధాకర్‌రెడ్డి, ముక్తియార్, కడపలో చలపతి, సత్య లాంటి నేతలకు తాజాగా కండువాలు కప్పడమని పలువురు ఉదహరిస్తున్నారు. మరోవైపు ఐదేళ్లు టీడీపీ కోసం కష్టపడిన వారిని కాదని అభ్యరి్థత్వాలు ఖరారు చేయడం కూడా ఇలాంటి టీప్‘ట్రిక్స్’కు ప్రధాన కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. రాజంపేటలో కూడా ఇలాంటి పరిస్థితే తెరపైకి వచ్చింది. స్థానిక నాయకులను కాదని రాయచోటికి చెందిన సుగవాసి సుబ్రమణ్యం అభ్యరి్థత్వాన్ని ఖరారు చేశారు. ఇంకా ప్రచా రం చేపట్టిన ఆయన ఇలాంటి ఎత్తుగడలతోనే ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీలో జోష్... సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన తర్వాత వైఎస్సార్సీపీ జోష్ మీదున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పైగా నా హయాంలో మీకుటుంబానికి లబ్ధి చేకూరి ఉంటేనే మీ బిడ్డను మరోమారు ఆశీర్వదించండి. తర తమ భేదం లేకుండా పేదలకు మేలు చేసి ఉంటేనే ఓట్లు వేయండని ధైర్యంగా అభ్యరి్థస్తుండడం వైఎస్సార్సీపీకి అదనపు అర్హత అయిందని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. ఈ పరిణామం తెలుగుదేశం పారీ్టకి రుచించడం లేదు. దీంతో టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ‘మేమంతా సిద్ధం’కార్యక్రమం తర్వాత వైఎస్సార్సీపీ ఊపు పెరగడమే అందుకు కారణమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అనేక మంది టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మైదుకూరులో రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కొండారెడ్డి, కమలాపురంలో సాయినాథశర్మ లాంటి నాయకులు వచ్చి చేరడాన్ని పలువురు ఉదహరిస్తుండడం విశేషం. -
ప్రొద్దుటూరు టీడీపీలో గందరగోళం
సాక్షి ప్రతినిధి, కడప: ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొంది. తెలుగుతమ్ముళ్లు తలోదారిలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు క్రమం తప్పకుండా ఒకరి తర్వాత మరొకరు తెరపైకి వస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరికి వారు అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలదన్నట్లు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి మైండ్‌గేమ్ ఆడుతున్నారు. అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయకముందే అభ్యర్థిగా పోస్టర్లు ఒకరు వేయిస్తే, టికెట్ మనదే, పోటీలో ఉండేది మనమే అంటూ మరొకరు వారి వారి నెట్వర్క్ ద్వారా ప్రచారపర్వాన్ని అందుకుంటున్నారు. ‘ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’అన్నట్లుగా ప్రొద్దుటూరు తెలుగుతమ్ముళ్ల పరిస్థితి నెలకొంది. ఓ వైపు టీడీపీ సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేకపోగా, పొత్తుల సమీకరణ పనిలో అధినేత చంద్రబాబు నిమగ్నమ య్యారు. అధినేత ఆ పరిస్థితిలో ఉంటే నాయకులు ప్రొద్దుటూరులో టికెట్ తమదేనని ఎవరికి వారు తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డి, ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు ఇప్పటికే ప్రచారంలో నిమగ్నం కాగా, సోదరులమంతా అధినేతను కలిశాం. తుది జాబితాలో తానే ఉంటానంటూ సురేష్‌నాయుడు తెరచాటు మంత్రాంగం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో సీనియర్ నేత వరదరాజులరెడ్డితో వైరం లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. వరదపై మల్లెల మండిపాటు ఈమారు ఎన్నికల్లో తాను లేదా తన కుమారుడు కొండారెడ్డి పోటీలో ఉంటామని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రచారం కొనసాగిస్తున్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పర్యటిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునే అర్హత వరదరాజులరెడ్డికి లేదని జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి విమర్శిస్తున్నారు. సభ్యత్వమే లేని వరద ఎలా ప్రచారం చేస్తారని మండిపడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాటలు నిజమే అయితే, అధినేత చంద్రబాబు వద్దకెళ్లి వరద కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించే చర్యలు చేపట్టవచ్చు కదా...అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం లేకపోయినా నోరెత్తని లింగారెడ్డి, ఉనికి కోసం ఆరాట పడుతున్నారని వరద వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటుండటంతో ప్రొద్దుటూరు తెలుగుదేశంలో గందరగోళం నెలకొంది. తలోదిక్కుగా తెలుగుతమ్ముళ్లు వ్యవహరిస్తుండటం విశేషం. ప్రవీణ్‌కు వాసు వత్తాసు పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ప్రొద్దుటూరు ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి వత్తాసుగా నిలుస్తున్నారు. ఆయన చర్యలే అందుకు దర్పణంగా నిలుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేరుతో ప్రొద్దుటూరులో పోస్టర్లు వెలిశాయి. నలుగురు ఆశావహులు ఉండటం, అధిష్టానం ప్రకటనతో నిమిత్తం లేకుండా రాత్రికి రాత్రి వాల్ పోస్టర్లు తెరపైకి రావడంతో తక్కిన వారు జీర్ణించుకోలేని పరిస్థితి తలెత్తింది. తాజాగా శ్రీనివాసులరెడ్డి ఏడాది క్రితమే నారా లోకేష్, ప్రవీణ్ నాయకత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తేల్చి చెప్పారు. తాను సైతం పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. రామేశ్వరం రోడ్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పుకొచ్చారు. కాగా, ఆకార్యక్రమానికి స్థానికంగా నివాసం ఉంటున్న జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డిని ఆహ్వానించకపోవడం గమనార్హం. ఇన్చార్జి ప్రవీణ్ చర్యలకు వత్తాసుగా నిల్చే విధంగా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి చర్యలున్నాయని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్ట్
-
పుట్టా...పుత్తాకు ఝలక్... ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికే
సాక్షి ప్రతినిధి, కడప: యువగళం పాదయాత్రలో టీడీపీ సీనియర్లకు నారా లోకేష్ షాక్ ఇస్తున్నారు. ఒకవైపు పార్టీ టికెట్లు ఇచ్చేది చంద్రబాబే అని అంటూనే, పరోక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో ఇన్చార్జిల అభ్యర్థిత్వాలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, మైదుకూరు, కమలాపురం అభ్యర్థిత్వాలపై నర్మగర్భంగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా ఈవినింగ్ వాకింగ్‌ను తలపించేలా యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. నిత్యం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై పరిస్థితి బట్టి రాత్రి 11 గంటల లోపు ముగుస్తోంది. జనంతో మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నారని భావిస్తే, అలాంటి వారు తప్పులో కాలేసినట్లే. యువగళం చెంతకు టీడీపీ కేడర్ మినహా, ప్రజలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు సమీకరించిన కేడర్‌తో ముఖాముఖీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదీ కూడా కులాలు ఆధారంగా చేపడుతూ సాగుతున్నారు. ► పాదయాత్ర అంటే ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకొని ఆయా సమస్యలను ఎక్స్‌ఫోజ్ చేయడం ఆనవాయితీగా చూశాం. నాలుగు దశాబ్దాలుగా ఇలాంటి పాదయాత్రనే ప్రజానీకం గమనించింది. కాగా నారాలోకేష్ పాదయాత్ర అందుకు భిన్నంగా సాగుతోంది. ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి కన్పించడం లేదు. ప్రతిరోజూ ఈవినింగ్ వాకింగ్‌లా సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతోంది. ఈలోపు స్థానికంగా టీడీపీ నాయకులు సమీకరించిన జనాలతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదీకూడా ప్రణాళిక బద్ధంగా కులాలు ఆధారంగా చేపడుతుండడం విశేషం. టీడీపీ కేడర్‌తోనే చిలుక పలుకులు చెప్పించడం, ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిందిస్తూ నారా లోకేష్ ప్రసంగించడం. ముందస్తుగా రచించిన వ్యూహం ప్రకారం యువగళం పాదయాత్ర చేపట్టడం మినహా వాస్తవికత ఆధారంగా చేపట్టడం లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మదనపడుతోన్న సీనియర్లు... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆ పార్టీ సీనియర్లను మదనపెడుతోంది. జిల్లాలో చోటుచేసుకున్న పరిణామం అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. జమ్మలమడుగులోకి ప్రవేశించిన ఆయన ‘లోకేష్–భూపేష్’ జోడి అదిరింది కదూ, అంటూనే అక్కడి కేడర్‌కు భూషేష్ అభ్యర్థిత్వంపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రొద్దుటూరుకు వచ్చే కొద్ది ప్రవీణ్‌కుమార్‌రెడ్డికే టికెట్ అని లోకేశ్ పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ప్రొద్దుటూరు పౌరుషాన్ని నిలబెట్టింది ప్రవీణ్. మీ తరపున పోరాడినందుకు 29 రోజులు జైలుకెళ్లింది ఈ ప్రవీణ్ (అతన్ని చూపుతూ) అంటూ ఆకాశానికెత్తారు. లోకేష్ మాటలతో అదే వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, టీడీపీ నేత పోట్లదుర్తి సురేష్‌నాయుడు మొహాల్లో నెత్తురు చుక్కలేదు. మా సహకారం లేకుండా ఏజెంట్లను కూడా పెట్టుకోలేని ప్రవీణ్‌ను అభ్యర్థిగా ప్రకటించడం ఏమిటి, ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారని వరదరాజులరెడ్డి, లింగారెడ్డిలు సన్నిహితుల వద్ద వాపోతుండడం విశేషం. యువగళం విజయవంతం కోసం.... ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా యువగళం విజయవంతం కోసం టీడీపీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. నారా లోకేష్ కటౌట్లు పెట్టించడం నుంచి పబ్లిక్‌ను చూపించడం వరకూ తంటాలు పడుతున్నారు. ఈపరిస్థితుల్లో బయటి ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లు పెట్టి ప్రజానీకాన్ని కడపకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఆపై పసుపు కండువాలు వారి చేతికి అప్పగించి, నిర్ణయించిన ప్రాంతంలో లోకేష్ పర్యటన కంటే ముందే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు నిర్వహిస్తుండడం విశేషం. పుట్టా...పుత్తాకు ఝలక్ మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో కొనసాగిన యువగళం యాత్రకు అక్కడి ఇన్‌ఛార్జిలు పుట్టా సుధాకర్‌యాదవ్, పుత్తా నరసింహారెడ్డిలు కృషి చేశారు. కాగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరుల్లో లాగా ఇక్కడ కూడా ఆ ఇరువురి నేతల అభ్యర్థిత్వాలపై స్పష్టత ఇస్తారని ఆశించారు. కాగా, పసువు జెండాను గెలిపించాలని లోకేష్ కోరడం మినహా ఇక్కడి అభ్యర్థులుగా ఆ ఇరువుర్ని గెలిపించాలని లోకేష్ పేరు పెట్టి చెప్పకపోవడం, పుట్టా, పుత్తాల వర్గీయులు ఆందోళనలో ఉన్నారు. పైగా అటు పుట్టా సుధాకర్ వ్యతిరేకిస్తున్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిలు నారా లోకేష్ యువగళంలో ప్రత్యక్షం కావడంతో వారు మరింత ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. చెన్నూరు సమీపంలో ఏర్పాటు చేసిన క్యాంపులో నారా లోకేష్‌తో వీరశివారెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం కమలాపురం టీడీపీలో అలజడి రేపుతున్నట్లు తెలుస్తోంది. -
ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం(వైఎస్సార్ జిల్లా) : డ్వాక్రా మహిళలపై దాడి చేసిన కేసులో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ పట్టణాధ్యక్షురాలు బోగాల లక్ష్మీనారాయణమ్మతో కలిసి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పొదుపు ఖాతాల్లో అవినీతి జరగలేదని, ఆడిట్ జరిగి ఒకవేళ అవినీతి జరిగిందని నిర్ధారణ అయితే ఆ డబ్బు తాను చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు తమ డబ్బు ఇవ్వాలని ప్రవీణ్ ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం వేకువజామున ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వీరిపై 147, 148, 323, 324, 307, 386, 509 రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. గురువారం జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇంటి సమీపంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ఘర్షణ : ఏఎస్పీ ప్రేర్ణాకుమార్ టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్లే గొడవ జరిగిందని ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేర్ణాకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 12న లక్ష్మీనారాయణమ్మ అనే మహిళ రూ.40 లక్షల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ డ్వాక్రా మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీనారాయణమ్మ గురువారం ప్రవీణ్ ఇంటి వద్దకు వెళ్లి మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఏదైనా ఉంటే తన ఇంటి వద్దకు రమ్మని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవీణ్ మీడియా సమావేశంలో మాట్లాడారన్నారు. దీంతో డ్వాక్రా మహిళలు ఆయన ఇంటి వద్దకు వెళ్లారని తెలిపారు. ‘ధైర్యం ఉంటే లోపలికి రండి..’ అంటూ ప్రవీణ్ మరోమారు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిందన్నారు. -
ప్రొద్దుటూరు టీడీపీలో రచ్చ రచ్చ.. వెన్నుపోటుకు సిద్ధంగా ఆ వర్గాలు
సాక్షి, కడప: ప్రొద్దుటూరు టీడీపీలో మరోమారు వర్గపోరు రోడ్డెక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ వ్యవహారం ఈ రచ్చకు వేదికగా మారింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనంటూ ప్రస్తుత ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గం పేర్కొంటోంది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. తన ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తనకే అభ్యర్థిగా అవకాశం కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. పార్టీలో వర్గ విబేధాలపైనా చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు ఏం చెప్పారో తెలియదు గానీ ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకే అంటూ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలోని తన అనుయాయులకు సమాచారం అందించారు.ఈ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారని, మనమే పోటీలో ఉంటామంటూ ప్రకటించారు. ప్రవీణ్ సూచనలతో ప్రొద్దుటూరులో ఆయన వర్గం బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకుంది. ఇది జీర్ణించుకోలేని పార్టీ జిల్లా అధ్యక్షులు లింగారెడ్డి, ఆయన వర్గం భగ్గుమంటోంది. నూటికి లక్ష సార్లు నాకే టిక్కెట్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న మల్లెల లింగారెడ్డి పార్టీ అధిష్టానం ప్రొద్దుటూరు టిక్కెట్ ఇంకా ఎవరికీ ఖరారు చేయలేదంటూ నాలుగు రోజుల కిందట హడావుడిగా వీడియో రిలీజ్ చేశారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించలేదని, ఆ మేరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లింగారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ గందరగోళానికి గురి కావద్దని ఆయన తెలిపారు. ప్రొద్దుటూరు అభ్యర్థిత్వం ఖరారుకు చాలా సమయం పడుతుందని, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే అభ్యర్థి ఖరారు ప్రకటన ఉంటుందన్నారు. అంతటితో ఊరుకోకుండా రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు లింగారెడ్డి ప్రెస్‌మీట్ కూడా పెట్టారు. నూటికి లక్ష శాతం పార్టీ తనకే టిక్కెట్ కేటాయిస్తుందని చెప్పకనే చెప్పారు. ఆది నుంచి టీడీపీలో ఉన్నది తానేనన్నారు. తాను, తన కుటుంబం టీడీపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని, తనకు కాకుండా పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తుందని ప్రశ్నించారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, లింగారెడ్డిలు రాబోయే ఎన్నికల్లో టిక్కెట్ తనకేనంటూ ఎవరికి వారు ప్రకటించుకుంటుండడంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది. లింగారెడ్డి ప్రకటనపై ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తనకే టిక్కెట్ అని ప్రకటించుకోవడంపై లింగారెడ్డి వర్గంతోపాటు వరదరాజులురెడ్డికి మద్దతు పలుకుతున్న మరోవర్గం ఆగ్రహంతో ఉంది. ప్రొద్దుటూరు టీడీపీ టిక్కెట్‌ను వీరు ఇద్దరే కాకుండా మాజీ ఎమ్మెల్యే వరద రాజులరెడ్డి, సీఎం సురేష్‌నాయుడు తదితరులు ఆశిస్తున్నారు. ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకరికొకరు మద్దతు పలికే పరిస్థితి లేదు. ఏ ఒక్కరికీ టిక్కెట్ ఖరారు చేసినా మిగిలిన వర్గాలు వెన్నుపోటుకు సిద్ధంగా ఉన్నాయి. మొత్తంగా ప్రొద్దుటూరు టీడీపీలో టిక్కెట్ రచ్చ మరోమారు రోడ్డెక్కింది. -
వీరజవాన్ కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
యాదమరి (చిత్తూరు జిల్లా): ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రకటించిన రూ.50 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల దాడులో అమరుడైన జవాన్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి పరిహారంగా రూ.50 లక్షలను సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిహారానికి సంబంధించిన చెక్‌ను ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబానికి శనివారం అందజేశారు. వారు మాట్లాడుతూ..వీర జవాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రవీణ్‌కుమార్ రెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు. ఈ సందర్భంగా వీరజవాన్ ప్రవీణ్ చిత్రపటానికి మంత్రులు, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్ కుటుంబసభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. -
జవాన్ ప్రవీణ్ కుమార్‌రెడ్డికి ఘన నివాళి
-
నేడు మిలటరీ లాంఛనాలతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు
-
శోకసంద్రమైన రెడ్డివారిపల్లె..
సాక్షి, చిత్తూరు(యాదమరి) : ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాను ప్రవీణ్‌కుమార్ రెడ్డి భౌతికకాయం మంగళవారం అర్ధరాత్రి అనంతరం ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చేరింది. ఆదివారం జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అమరుడైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరజవాను భౌతికకా యం కోసం బంధువులు, గ్రామస్తులు, అధికారులు నిరీక్షించారు. మంగళవారం అర్ధరాత్రి అనంతరం భౌతికకాయం స్వగ్రామానికి చేరడంతో నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్న గ్రామం ఒక్కసారిగా దుఃఖ సాగరమైంది. ప్రవీణ్ మృతదేహాన్ని చూడగానే భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, బంధువులే కాకుండా ఇరుగుపొరుగు గ్రామాల వారు సైతం తీవ్రభావోద్వేగంతో కదలిపోయారు. మిలటరీ అధికారులు వారి ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రవీణ్ జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. చదవండి: (ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం) వాతావరణం సరిగా లేక.. ఉగ్రదాడిలో పాట్నాకు చెందిన కెప్టెన్ ఆశుతోష్, తెలంగాణకు చెందిన రెడ్యా మహేష్, ఆంధ్రాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అమరులైన విషయం తెలిసిందే. వీరి భౌతికకాయాలను జమ్ముకాశ్మీర్ నుంచి ఢిల్లీలోని మిలటరీ కార్యాలయానికి తరలించారు. భౌతిక కాయాలపై కల్నల్ సుధీరా, లెఫ్టినెంట్ కల్నల్ అశ్విన్ పుష్పగుచ్ఛాలు ఉంచి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడి నుంచి మిలిటరీ వాహనంలో రెడ్డివారిపల్లెకు తరలించారు. అప్పటికి సమయం అర్ధరాత్రికి పైగా దాటింది. మృతదేహంతో పాటు నాసిక్ యూనిట్ నుంచి 31 మంది ఆర్మీ సిబ్బంది ప్రత్యేక విమానంలో వచ్చారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మృతదేహం తరలింపులో ఆలస్యం చోటు చేసుకుందని, విమానం సాయంత్రం ఆరు గంటల తర్వాత బయలుదేరిందని మిలటరీ అధికారులు తెలిపారు. చదవండి: (ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు) నేడు దహనక్రియలు వీరజవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భౌతికకాయానికి బుధవారం దహనక్రియలు జరుగనున్నాయి. మిలటరీ సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించనున్నారు. బెంగళూరు నుంచి వచ్చే జెపీఎఫ్–9 మేజర్ నిర్బయ్ బండాకర్, మిలటరీ అధికారులు పకృద్ధీన్, హేమాద్రి గౌరవ వందనం అనంతరం దహనక్రియలు చేయనున్నట్లు మిలటరీ అధికారులు చెప్పారు. -
వీరుడొకడు అమరుడయ్యాడు
‘అమరుడు’ అనిపించుకునే అదృష్టం అందరి నుదుటునా రాసి ఉండదు. కోట్ల జనులు శాల్యూట్ చేసే ఘనత అందరికీ దొరకదు. చరిత్ర పుటల్లో సగర్వంగా తలుచుకునే పేరుగా నిలవడం అందరి వశం కాదు. ప్రవీణ్ కుమార్ వంటి సైనికుడికే ఆ గౌరవం సాధ్యం. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల పోరులో చిత్తూరు జిల్లా పరాక్రమవంతుడు ప్రవీణ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. వారితో సీమ పులిలా పోరాడి ప్రాణాలర్పించాడు. తెలుగుజాతితో పాటు దేశ ప్రజలూ అతణ్ణి గుర్తు పెట్టుకుంటారు. ప్రవీణ్ కుటుంబ నేపథ్యం.... చిత్తూరు జిల్లా ఐరాలమండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన చీకల ప్రతాప్‌రెడ్డి, సుగుణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (37). మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రవీణ్ 2009లో అదే మండలంలోని ఐలవారిపల్లి గ్రామానికి చెందిన దగ్గరి బంధువు రామచంద్రారెడ్డి (రిటైర్ట్ఆర్మీ) కుమార్తె రజితతో పెళ్లి జరిగింది. వీరికి రోహిత, లీలేష్లు కుమార్తె కుమారుడు. కుమార్తె రోహిత రెండవ తరగతి. దేశ సేవచేస్తానని పట్టుబట్టి పద్దెనిమిదవ ఏటే మిలటరీలో చేరాడు. దేశం కోసం ప్రాణాలు విడిచి పెట్టడానికి కూడా వెనకాడేదిలేదని చెప్పేవాడు. చివరికి మాట నిలబెట్టుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. ప్రాణాలు కోల్పోయాడని బాధగా ఉన్నా దేశం కోసం అశువులు బాసినందుకు గర్వంగా ఉంది. నాలుగు రోజుల క్రితమే ఫోన్ చేశాడు. ‘నాన్నా.. అమ్మ జాగ్రత్త. కరోనా వ్యాప్తి చెందుతోంది. ఇంట్లో ఎవరూ బయటకు వెళ్లొద్దు. సంక్రాంతికి వస్తున్నా. అందరం కలుద్దాం’ అని చెప్పాడు. తను చెప్పినట్టే సంక్రాంతికి వస్తున్నాడు కదా అని సంబరపడ్డాను. దేశంలో ఎక్కడ ఉన్నా సంక్రాంతికి మాత్రం గుమ్మం ముందు ఉండేవాడు...’’ దుఃఖంతో పూడుకుపోయింది ఆ తండ్రి గొంతు. జమ్ము కాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి తండ్రి సాక్షికి చెప్పిన మాటలివి. తన కుమారుడి గురించి ఆయన మాటల్లో... ‘నా కొడుకు ప్రవీణ్‌కుమార్ రెడ్డికి చిన్నతనం నుంచి పట్టుదల ఎక్కువ. రెడ్డివారిపల్లెలో బడికి పోయేటప్పుడు ఎవ్వరినీ ఏమీ అనేవాడు కాడు. ఐరాలలో ఇంటర్ వరకు చదివాడు. ఆ తరువాత నాకు చేదోడు వాదోడుగా సేద్యం పనులు చేసేవాడు. మిలటరీలో పనిచేస్తున్న బంధువులను చూసి దేశానికి సేవచేయాలని పట్టుబట్టాడు. ఆర్మీలో చేరేందుకు కబురొచ్చింది. 2002 ఊటీలో జరిగిన ఆర్మీ సెలక్షన్స్‌లో పాల్గొన్నాడు. ఊటీలోనే సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకున్నాడు. డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌లోని కప్పూర్తలాలో విధుల్లో చేరాడు. రెండేళ్లు పని చేశాక అస్సాంకు వెళ్లాడు. ఆ సమయంలో కర్ణాటకలోని బెల్గామ్‌లో ఆరు నెలలపాటు కమాండెంట్‌గా శిక్షణ పొందాడు. 2012–2016 వరకు ఢిల్లీలోని నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్(ఎన్ఎస్ఎఫ్)లో విధులు నిర్వహించాడు. అక్కడినుంచి మళ్లీ 2017–18వరకు జమ్మూలోని మీరాన్ సాహెబ్ ప్రదేశంలో పనిచేశాడు. 2019 సంవత్సరంలో పాకిస్థాన్ సరిహద్దులో అడుగుపెట్టి ఒక సైనికుడు చేరవలసిన అసలైన చోటుకు చేరానని గర్వపడ్డాడు. దేశ సరిహద్దు ఎప్పుడూ మంచు దుప్పటితో కప్పబడి ఉండటంతో శత్రువుకు అవకాశం ఇవ్వకూడదని కేవలం నాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారట. కంటిపై రెప్ప వాలనివ్వకుండా దేశరక్షణకు కాపలా కాశానని చెప్పేవాడు. చివరకు జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఆదివారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందటంతో ముందు మాకు నోటమాట రాలేదు. ఎంత దిగమింగుదామనుకున్నా కన్నీళ్లు ఆగడం లేదు. అమర సైనికుడికి కడసారి వీడ్కోలు పలకటం కోసం కుటుంబ సభ్యులమైన మేము, గ్రామస్తులు, అతడి స్నేహితులు కన్నీటితో ఎదురు చూస్తున్నాం’ అన్నాడాయన. – బాలసుందరం, సాక్షి చిత్తూరు రూరల్ -
ప్రవీణ్ కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ సీహెచ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. దేశం కోసం ప్రవీణ్‌కుమార్ చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. వీర జవాన్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ, వారికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు సీఎం సోమవారం ఒక లేఖను రాస్తూ ఈ సహాయం స్వీకరించాలని కోరారు. ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సోమవారం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, ముఖ్యమంత్రి రాసిన లేఖను వారికి అందజేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్ 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ–కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన మాచిల్ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో వీర మరణం పొందారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దేశ రక్షణ కోసం సిపాయి ప్రవీణ్ కుమార్‌రెడ్డి బలిదానం చేశారని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపాలెంకు చెందిన చీకాల ప్రవీణ్ కుమార్‌రెడ్డి మృతిపట్ల గవర్నర్ సోమవారం ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు
సాక్షి, అమరావతి: జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురు కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్ సీహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వీర మరణం పొందారు. (చదవండి : ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం) దేశం కోసం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. వీర జవాన్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మరోవైపు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి వర్గం సందర్శించి పరామర్శించింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి రెడ్డెప్ప స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు లు రెడ్డివారిపల్లి కి వెళ్లి ప్రవీణ్ కుటుంబీకును పరామర్శించారు. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి ప్రవీణ్ కుటుంబీకులకు 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సీఎం ఆదేశాల మేరకు మేము వచ్చామన్నారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ బిశ్వ భూషణ్ చిత్తూరు జిల్లా, ఐరాల మండలం, రెడ్డివారిపల్లెకు చెందిన సైనిక దళాల సిపాయి చీకాల ప్రవీణ్ కుమార్ రెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రితం మద్రాస్ రెజిమెంట్ -18లో భారత సైన్యంలో చేరిన ప్రవీణ్ కుమార్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ లో దేశ సరిహద్దులకు కాపలాగా ఉండి, బలిదానం పొందారన్నారు. కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపిన గవర్నర్ ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. -
చిత్తూరు: ఉగ్రవాదుల కాల్పుల్లో భారత్ జవాను మృతి
-
ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం
ఆయన మారుమూల గ్రామంలో పుట్టి పెరిగాడు. దేశ భక్తి మెండుగా ఉండడంతో మాతృభూమి సేవలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం సైన్యంలో చేరాడు. విధుల్లో చురుగ్గా ఉంటూ ఉన్నతాధికారుల మన్నలు పొందాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్‌లోని మాచెల్ నాలా పోస్టు వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అమరుడయ్యాడు. సాక్షి, చిత్తూరు : ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకలప్రతాప్ రెడ్డి, సుగణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్ రెడ్డి (37) డిగ్రీ వరకు చదివాడు. గ్రామానికి చెందిన చాలామంది సైన్యంలో పనిచేస్తుండడం చూసి తాను దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజ్మెంట్–18లో చేరారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విధుల్లో చురుగ్గా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్ లోని మాచెల్ నాలా పోస్టు వద్ద దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించే ఆపరేషన్‌లో 15 మంది బృందంలో ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆరుగురు ఉగ్రవా దులు జరిపిన దాడుల్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు భారత్ సైనికులు మృతిచెందారు. సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రవీణ్ కుమార్‌రెడ్డికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతి సమాచారం అందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి వచ్చినప్పుడల్లా అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాడని, సైన్యం వీరోచితగాథల గురించి తమకు స్ఫూర్తిదాయకంగా చెప్పేవాడని పలువురు యువకులు చెప్పారు. అలాంటి వ్యక్తి కాల్పుల్లో మృతిచెందడం బాధగా ఉందని యువత, స్నేహితులు, బంధువులు అతడి జ్ఞాపకాలతో విచలితులయ్యారు. దేశసేవ చేయాలని యువతకు చెప్పేవారు సెలవుల్లో గ్రామానికి వస్తే యువకులతో మాట్లాడేవారు. ప్రతి ఒక్కరూ సైన్యంలో చేరి దేశసేవ చేయాలని చెప్పేవారు. గ్రామానికి పండుగకు వస్తే అందరితోనూ కలిసిపోయేవారు. హుషారుగా ఉండే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతిచెందడం గ్రామానికి తీరని లోటు. – రవి, గ్రామస్తుడు చాలా చురుకైన వ్యక్తి ప్రవీణ్ కుమార్ సైన్యంలో చురుకైన వ్యక్తి. జమ్మూకాశ్మీర్‌లో కుష్వారా సెక్టార్లో కమాండోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద నేను సీహెచ్ఎంగా ఉన్నాను. అలర్ట్‌గా ఉండేవారు. నేను సెలవుల్లో వచ్చాను. నా స్నేహితుడు వీరమరణం పొందాడని తెలియగానే షాక్ గురయ్యా. –హేమాద్రి, వెదుర్లవారిపల్లె చాలా మంచివాడు ప్రవీణ్ చాలా మంచివాడు, సైన్యం నుంచి ఇంటికి ఎప్పుడు వచ్చినా గ్రామం గురించి ఆలోచించేవాడు. అందరూ కలిసిమెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించేవాడు. అలాంటి వ్యక్తి చనిపోయాడనే విషయం తెలియగానే షాక్‌కు గురయ్యాం. –బాబురెడ్డి, మృతుడి బాబాయి, రెడ్డివారిపల్లె -
మాజీ ఎమ్మెల్యేకి చెక్ పెట్టిన టీడీపీ
సాక్షి, ప్రొద్దుటూరు : టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డికి పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చిన ఈ పరిస్థితుల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రభావం కారణంగా టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించగా ఆ తర్వాత 1, 2 ఏళ్లకు మల్లేల లింగారెడ్డి పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. 2009లో జిల్లాకంతటికీ టీడీపీ శాసనసభ్యునిగా లింగారెడ్డి మాత్రమే ఎన్నికయ్యారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్షునిగా, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా పనిచేయగా, ఆయన సతీమణి మల్లేల లక్ష్మీప్రసన్న కూడా మహిళా విభాగంలో కీలక బాధ్యతలు వ్యవహరించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు వచ్చే సమయంలో టీడీపీ ఏదో రకమైన కొత్తమెలిక పెడుతోంది. చాలా ఎన్నికల్లో నామినేషన్లు వేసే వరకు శాసనసభ అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు లేవు. 2014 శాసనసభ ఎన్నికల్లో సైతం అప్పటికప్పుడు పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి టికెట్ ఇవ్వడం, ఓడిపోయిన తర్వాత ఆయనే చాలా రోజుల వరకు ఇన్చార్జిగా ఉండటం జరిగింది. చదవండి: జేసీ బ్రదర్స్ కాళ్లబేరం! స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సమన్వయకర్తగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించడం జరిగింది. వాస్తవానికి ఇప్పటి వరకు ఈయన పార్టీలో లేరు. 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని నియమించారని ప్రచారం ఊపందుకోవడంతో లింగారెడ్డి సోమవారం స్వయంగా సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో కార్యకర్తలకు ప్రచారం చేసుకున్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కేవలం 20 రోజులపాటు ఎన్నికల సమన్వయకర్తగా మాత్రమే పనిచేస్తారని, పార్టీ ఇన్చార్జితో అతనికి సంబంధం లేదని అన్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. -
ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య
-
హాస్టల్ గదిలో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నల్లకుంటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ప్రవీణ్‌కుమార్ రెడ్డి శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. బాగ్ అంబర్‌పేటలోని ఆ కళాశాలకు చెందిన హాస్టల్ గదిలో ప్రణీత్ కమార్ రెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్‌కు చేరుకుని విద్యార్థి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా ప్రణీత్ కమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి ప్రణీత్ కమార్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అని పోలీసులు వెల్లడించారు. ప్రణీత్ మృతిపై అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెప్పారు. -
`2014 ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు`
తిరుపతి: రానున్న 2014 ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ 50 శాతం ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారని, కానీ ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీని 18 శాతం ఓట్లతో దివాలా దిశకు తీసుకెళ్లారని వారు విమర్శించారు. రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాల వ్యవస్థాపకుడు చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఒక విధానం అంటూ లేదని వారు చెప్పారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని చంద్రబాబు టార్గెట్ చేశారని అన్నారు. అప్పటినుంచి టీడీపీ పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
వైఎస్ఆర్ సీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో సాక్షి వేదిక
-
బిటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించాడు. మంగళవారం ఉదయం అటుగా వచ్చిన స్థానికులు మృతదేహన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు భూదాన్‌పోచంపల్లి మండలంలోని దోతిగూడెం గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డిగా ప్రాధమిక సాక్ష్యాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడు బిటెక్ విద్యను అభ్యసిస్తున్నట్లు చెప్పారు. ప్రవీణ్‌కుమార్ రెడ్డిది హత్య, ఆత్మహత్య అనేది దర్యాప్తులో తెలుతుందన్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
సీఎం సహా అందరూ రాజీనామా చేయాల్సిందే
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయకుండా సమైక్యాంధ్ర ముద్ర వేయించుకుంటామంటే కుదరదని ఆయన అన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తే విభజన ప్రకటన వెనక్కి వెళుతుందని ప్రవీణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తన వైఖరి చెప్పకుండా ఆత్మగౌరవ యాత్రలు చేయటం సిగ్గుచేటు అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు కాంగ్రెస్ పార్టీకి కనిపించటం లేదా అని ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. -
పార్టీలు తోడైతేనే ఉద్యమానికి ఊపు!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర సమైక్యత కోసం సాహసోపేతంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ప్రజా సంఘాలను కచ్చితంగా అభినందిచాల్సిందే. ఈ సమస్యకు అంతిమ పరిష్కారం రాజకీయ ప్రక్రియే. కాబట్టి రాజకీయ పార్టీలు తమ నిర్ణయాలను మార్చుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తేనే రాష్ట్రం సమైక్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా సమైక్యవాదంపై నిలబడి పోరాడుతున్న రాజకీయ పార్టీలను కలుపుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి శ్రమకు రాజకీయ పార్టీలు తోడైతే ఉద్యమం విజయవంతమవుతుంది’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉధృతంగా సాగుతున్న సమైక్య ఉద్యమం మరింత బలోపేతం కావాలంటే రాజకీయ పార్టీల భాగస్వామ్యం కచ్చితంగా అవసరమన్నారు. టీఆర్ఎస్ ఇదే వ్యూహాన్ని అమలు పరిచిందన్నారు. సమైక్య ఉద్యమంపై శనివారం ‘సాక్షి టీవీ’ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ప్రవీణ్ మాట్లాడారు. రాష్ట్ర సమైక్యత కోసం ఏపీఎన్జీవోలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే అత్యంత అరుదైనదన్నారు. అయితే, రాజకీయ పార్టీల విధానాలు, సిద్ధాంతాల్లో మార్పు తేకుండా ఎన్ని ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఏపీఎన్జీవోల సభ పార్టీలపై ఒత్తిడి తెచ్చే దిశగా సాగుతుందని తాను భావించానన్నారు. కానీ, ఈ మహాసభలో ఆ ప్రయత్నం జరగలేదన్నారు. ఇప్పటికైనా సమైక్య ఉద్యమం మరింత ముందుకెళ్లాలంటే రాజకీయ పార్టీలన్నింటిపైనా ఆ దిశగా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే సమైక్య గళాన్ని గట్టిగా వినిపిస్తున్న పార్టీలను కలుపుకెళ్లాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఉంటుందన్నారు. ఉద్యమాలు ఎంతవరకూ చేయాలి.. ఎంతవరకూ రాజకీయంగా ముందుకెళ్లాలనే దానిపై టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిందని ప్రవీణ్ వివరించారు. బొత్సది బాధ్యతారాహిత్యం సమ్మె 30 రోజులేంటి, 365 రోజులు జరపడానికి సిద్ధంగా ఉండాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మాట్లాడటం అతని బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ప్రవీణ్ దుయ్యబట్టారు. విభజన నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం కనుక.. ప్రజల ఆకాంక్ష మేరకు కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన ఆ పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు ఆ పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు, అధికారంలో ఉన్న నేతలు రాజీనామా చేస్తే జాతీయ స్థాయిలో స్పందన రావడమే కాక విభజన ప్రక్రియ ఆగుతుందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా మంత్రులంతా రాజీనామా చేయాలని సూచించారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో నియోజకవర్గాల్లో అడుగుపెట్టే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. బావోద్వేగాల ప్రాతిపదికగానే విభజించాలనుకుంటే ఇప్పటికే పంజాబ్ ప్రత్యేక దేశంగా మారేదని, ఎల్టీటీఈ కోరినట్లు శ్రీలంక ఎప్పుడో రెండుగా చీలిపోయేదని గుర్తుచేశారు. అవాస్తవ పునాదుల మీద తెలంగాణ ఉద్యమం నిర్మితమైందన్నారు. కేసీఆర్ అవాస్తవాలతో యువతను, తెలంగాణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించారని ప్రవీణ్ విమర్శించారు. -
రాష్ట్ర సమైక్యతకు గుర్తు వైఎస్ఆర్: ప్రవీణ్ కుమార్
-
రాష్ట్ర సమైక్యతకు గుర్తు వైఎస్ఆర్: ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్ర సమైక్యతకు గుర్తు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలను అందించి, ఉద్యమాలు రాకుండా వైఎస్ చూశారన్నారు. ఈ రోజు రాష్ట్రం సమైక్యంగా ఉందంటే దానికి ప్రధాన కారణం వైఎస్ఆరే అని అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అరాచకాలతోనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చమని ఆరుసార్లు అడిగిన బాబు వైఎస్ రాజశేఖర రెడ్డిపై అబాండాలు వేస్తున్నారన్నారు. ఆనాడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రాష్ట్రాన్ని విభజించమని ఒక లేఖ ఇచ్చారు. ఆ తరువాత మరో లేఖ ఇచ్చారు. 2012లో ఎవరూ అడగకపోయినా రాష్ట్రాన్ని విడగొట్టమని అడిగారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా సోనియాతో బాబు భాగస్వాములైన మాట వాస్తవం కాదా? అని అడిగారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్ర పేరుతో ప్రజలలోకి వెళుతున్నారని ప్రశ్నించారు. తెలుగు జాతిని నిట్టనిలువునా నరకమని చెప్పింది చంద్రబాబు అని మండిపడ్డారు. తెలుగుజాతి విధ్వంసం యాత్ర చేయాలి, తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన యాత్ర చేయాలన్నారు. తెలుగు జాతికి క్షమాపణలు చెప్పడానికి ఆయన బస్సుయాత్ర చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అప్పుడే టిడిపి వారు రాజీనామాలు చేయకుండా, ఇప్పుడు నాటకాలు అడుతున్నారని విమర్శించారు. చెట్టును నరికినవారికి ఉరిశిక్ష విధించాలని నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, తెలుగు జాతిని అడ్డంగా నరకడానికి ప్రయత్నిస్తున్న సోనియా గాంధీకి ఏ శిక్ష విధించాలో సిఎం చెప్పాలన్నారు. -
ప్యాకేజీలతో ఆకాంక్షలను కొనలేరు: ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోట్లాది మంది ప్రజల బలమైన ఆకాంక్షలను ప్యాకేజీలతో కొనలేరని వైఎస్సార్సీపీ నేత ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రూ.4 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తే సరిపోతుందంటూ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘సమైక్య రాష్ట్ర పరి రక్షణ సమితి’ ఆధ్వర్యంలో ఏపీఎన్జీవో కార్యాలయంలో ఆదివారం జరిగిన ‘సమైక్యవాదుల సమ్మేళనం’లో ఆయన మాట్లాడారు. సమైక్యవాదులది వెలకట్టలేని ఆకాంక్ష అని, ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీలు వ్యవహరించాలన్నది దిగ్విజయ్‌సింగ్‌తోసహా కాంగ్రెస్ పెద్దలు గ్రహించాలని హితవు పలికారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇందిరాగాంధీ బాధపడతారన్నారు. విదేశీ శక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఆమె ఎప్పుడూ చెప్పేవారని, కానీ ఆమె ఇంట్లోనే ఇటలీ శక్తి తిష్టవేసిందన్నారు. ఒక విభజన మరిన్ని రాష్ట్రాల విభజనలకు దారితీస్తుందని, తర్వాత దేశ విభజనకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి మాట్లాడుతూ.. ఆంటోనీ కమిటీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కమిటీకి ఉండే అధికారం ఏమిటని ప్రశ్నించారు. తెలుగు మాట్లాడేవారందరిదీ ఒకే రాష్ట్రమని అర్థం వచ్చేలా తెలుగునాడు అనో, మహా తెలంగాణ అనో పెట్టి ఉంటే బాగుండేదన్నారు. విభజన వల్ల ఒకతరం పూర్తిగా నష్టపోతుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విభజనకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనలు, సమ్మెల వల్ల జరిగే నష్టంతో పోలిస్తే.. విభజన వల్ల జరిగే నష్టమే ఎక్కువని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో విభజనను అడ్డుకుంటామన్నారు. ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 15 తర్వాత హైదరాబాద్‌లో సభ పెడతామని, విజయవంతం చేయడానికి గట్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జన చైతన్య వేదిక చైర్మన్ లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ‘సమైక్య’ అమరవీరులకు సభలో నివాళులు అర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తమవంతు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. -
హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి మృతి
హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి (83) ఆదివారం మృతి చెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హైకోర్టులో పలు కీలక కేసులను ఆయన వాదించారు. పద్మనాభరెడ్డి క్రిమినల్ న్యాయశాస్త్రంలో నిష్ణాడుతుడిగా పేరు గడించాడు. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన న్యాయ సేవలందించారు. ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం హైకోర్టుకు జడ్జిగా వ్యవరిస్తున్నారు.