
సీఎం సహా అందరూ రాజీనామా చేయాల్సిందే
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయకుండా సమైక్యాంధ్ర ముద్ర వేయించుకుంటామంటే కుదరదని ఆయన అన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తే విభజన ప్రకటన వెనక్కి వెళుతుందని ప్రవీణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తన వైఖరి చెప్పకుండా ఆత్మగౌరవ యాత్రలు చేయటం సిగ్గుచేటు అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు కాంగ్రెస్ పార్టీకి కనిపించటం లేదా అని ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.