'కిరణ్, బాబు మోసాన్ని ప్రజలకు వివరిస్తాం'
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఉద్ఘాటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు అవలంబిస్తున్న మోసపూరిత వైఖరిని ప్రజలకు వివరిస్తామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉద్ఘాటించారు. రాష్ట్ర విభజన బిల్లులోని దశలన్నీ వారికి తెలిసినప్పటికీ.. ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, పినిపె విశ్వరూప్, శోభా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తెల్లం బాలరాజు, కాపు రామచంద్రారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావు, ధ ర్మాన కృష్ణదాస్, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కాటసాని రామిరెడి ్డ, ఎం.సుచరిత, కొరుముట్ల శ్రీనివాసులు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. సీఎం కిరణ్, చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఆక్షేపించారు.
‘3 రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మా నం చేసి పంపాకే విభజన జరిగింది. సీఎంకు ఆ విషయం తెలియదా? తెలిసినా మోసపు మాటలు చెపుతూ టీ-బిల్లుకు అన్నివిధాలా సహకరిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌లు చర్చకు డెరైక్షన్ ఇవ్వలేదని చెప్తున్న సీఎం ప్రభుత్వం తరఫున వారికి ఏం సూచనలిచ్చారో స్పష్టం చేయాలి. అసెంబ్లీలో సమైక్య తీర్మా నం చేశాకే విభజన బిల్లుపై చర్చించాలి’ అని డిమాండ్ చేశారు. ‘3 నెలలపాటు కేబినెట్ సమావేశం పెట ్టని సీఎం ఆ భేటీ నిర్వహించి టీ-బిల్లుకోసం అసెంబ్లీని సమావేశపర్చారు. ఈ విధానాలపై ఇంటింటికెళ్లి ప్రజల్ని చైతన్యపరుస్తాం. రాజకీయంగా నష్టపోయిన పర్లేదు కానీ సమైక్యాంధ్రకోసం పోరాడుతాం’ అని అన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కాదు సమైక్యాంధ్రకోసం నోరు మెదపని బాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.